జైపూర్ : రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గత డిసెంబర్ 23న మధ్యాహ్నం కోట్‌పుత్లీ జిల్లా కిరాత్‌పురా గ్రామానికి చెందిన చేతన ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాల తర్వాత బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బోరుబావిలో పరిశీలించారు. చేతన అందులో పడిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఓవైపు పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తూనే.. మరోవైపు తవ్వకాలు ప్రారంభించారు. ఇలా ఆరుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడు సారి బుధవారం రెస్య్క్యూ సిబ్బంది చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.
ఈ సందర్భంగా చేతన తాత దయారామ్ మాట్లాడుతూ.. చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంత కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్ బోర్‌వెల్‌లను కవర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
बोरवेल में फंसी बच्ची के हाथों में हलचल कैमरे में दिख रही है. #Jaipur https://t.co/7BBzFMGzHk pic.twitter.com/RD66L65NAY
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) December 23, 2024
Comments
Please login to add a commentAdd a comment