rescue well
-
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి చేతన వెలికితీత
జైపూర్ : రాజస్థాన్లోని కోట్పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గత డిసెంబర్ 23న మధ్యాహ్నం కోట్పుత్లీ జిల్లా కిరాత్పురా గ్రామానికి చెందిన చేతన ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాల తర్వాత బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బోరుబావిలో పరిశీలించారు. చేతన అందులో పడిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఓవైపు పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తూనే.. మరోవైపు తవ్వకాలు ప్రారంభించారు. ఇలా ఆరుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడు సారి బుధవారం రెస్య్క్యూ సిబ్బంది చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.ఈ సందర్భంగా చేతన తాత దయారామ్ మాట్లాడుతూ.. చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంత కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్ బోర్వెల్లను కవర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. बोरवेल में फंसी बच्ची के हाथों में हलचल कैमरे में दिख रही है. #Jaipur https://t.co/7BBzFMGzHk pic.twitter.com/RD66L65NAY— Avdhesh Pareek (@Zinda_Avdhesh) December 23, 2024 -
పాపం కదా అని రక్షిస్తే.. దాడి చేసింది
ఘరియాబంద్: పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటే ఇదేనేమో.. బావిలో పడిపోయిన చిరుతపులిని రక్షిస్తే.. అది కాస్తా ఆ అటవీ అధికారిపైనే దాడిచేసిన ఘటన ఛత్తీస్గఢ్ లోని ఘరియాబంద్లో చోటుచేసుకుంది. స్థానిక అటవీ శాఖ అధికారి నరేంద్ర పాండే అందించిన వివరాల ప్రకారం... ఆదివారం రాత్రి గ్రామంలోకి చొరబడ్డ చిరుతపులి ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు దానిని రక్షించడానికి పూనుకున్నారు. గ్రామస్తుల సహకారంతో అటవీ అధికారి ధైర్య సాహసాలు ప్రదరించి (రేంజర్ ఆఫీసర్) ఎట్టకేలకు ఆ క్రూరమృగాన్ని కాపాడారు. దీంతో గ్రామస్తులు సంతోషంతోనూ, భయంతోనూ ఒక్కసారిగా పెద్దగా అరుపులు, కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో బెదిరిపోయిన ఆ చిరుతపులి అటవీ అధికారిపై దాడిచేసింది. అదృష్టవశాత్తూ ఆ అధికారి స్పల్పగాయాలతో బైటపడ్డాడని నరేంద్ర పాండే తెలిపారు. విధినిర్వహణలో భాగంగా సాహసంతో అటవీ జంతువును కాపాడిన అధికారి మాత్రం బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు.