సాక్షి, బెంగళూరు: బోరుబావిలో పడిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన ఉడుపి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సుమారు 15 అడుగుల లోతులో పడిపోయిన అతడు ఆరు గంటల పాటు బోరుబావిలోనే ఉండిపోయాడు. అయితే సహాయక చర్యల చేపట్టి ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. ఉడుపి జిల్లా బైందూరు తాలూకా మరవంతెకు చెందిన రోహిత్ ఆదివారం ఉదయం బోరుబావి పక్కన మట్టి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మట్టి కుంచించుకుపోగా అతడు బోరుబావిలో చిక్కుకున్నాడు. సుమారు పదిహేను అడుగుల లోతుకు పడిపోయాడు. వెంటనే అగ్నిమాపక, ఆరోగ్య సిబ్బంది వచ్చి జేసీబీ యంత్రాల సాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వి బాధితుడిని క్షేమంగా బయటకు తీసి, వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment