borewell hole
-
బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం
రాజస్థాన్‌లో మరో బోరుబావి దుర్ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో పడిపోయిన చిన్నారి చేతన(3)ను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది 10 రోజుల ప్రయత్నాల అనంతరం ఆ చిన్నారిని విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. ఇటువంటి దుర్ఘటనలు గతంలోనూ అనేకం చోటుచేసుకున్నాయి.ప్రిన్స్ కుమార్ కశ్యప్ (హర్యానా) 2006లో హర్యానాలోని ఒక బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల ప్రిన్స్ కుమార్ కశ్యప్‌ను రక్షించేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. హర్యానాలోని కురుక్షేత్రలోని ఓ గ్రామంలో 55 అడుగుల లోతైన బోరుబావిలో ప్రిన్స్ పడిపోయాడు. దాదాపు 48 గంటల తర్వాత రెస్క్యూ సిబ్బంది ప్రిన్స్‌ను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. నాడు బాధిత బాలుడు సురక్షితంగా బయటపడాలని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా చాలామంది పూజలు, యజ్ఞాలు నిర్వహించారు.మహి(హర్యానా) 2012, జూన్‌లో హర్యానాకు చెందిన ఐదేళ్ల మహి తన స్నేహితులతో ఆడుకుంటూ 60 అడుగుల పాడుబడిన బోరుబావిలో పడిపోయింది. ఐదు రోజుల పాటు సైన్యం, జిల్లా యంత్రాంగం భారీ ప్రయత్నాలు చేసినప్పటికీ బాలికను రక్షించలేకపోయింది. ఒక భారీ రాయి రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా నిలిచింది.సాయి బర్హతే (మహారాష్ట్ర)2017, మే నెలలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్గావ్లో ఏడేళ్ల బాలుడు సాయి బర్హతే బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది పలు ప్రయత్నాలు చేసినప్పటికీ బాలుడిని రక్షించలేకపోయారు.నదీమ్ (హర్యానా)2019, మార్చిలో హిసార్ జిల్లాలోని బల్సామంద్ గ్రామంలో 55 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో ఒకటిన్నర ఏళ్ల బాలుడు నదీమ్ పడిపోయాడు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం విభాగాల 48 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత బాలుడిని రక్షించారు. బోరుబావికి సమాంతర గొయ్యి తవ్వడం కోసం దాదాపు 40 జేసీబీ యంత్రాలను వినియోగించారు. 150 మంది పోలీసులతో పాటు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 100 మంది సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.సీమ (రాజస్థాన్)2019, మే నెలలో జోధ్‌పూర్‌లోని మెలానా గ్రామంలో 440 అడుగుల లోతైన బోరుబావిలో సీమ అనే నాలుగేళ్ల బాలిక పడిపోయింది. 260 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారిని బయటకు తెచ్చేందుకు 14 గంటల ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలిక మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. బాలిక తండ్రి మరమ్మతుల కోసం బోరుబావిని తెరిచి ఉంచిన కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేవీర్ సింగ్ (పంజాబ్)2019, జూన్‌లో రెండేళ్ల ఫతేవీర్ సింగ్ ఆడుకుంటూ 120 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. 109 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, బాలుడిని రక్షించలేకపోయాడు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డిఆర్ఎఫ్ భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. అధికారులు బాధిత చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేయగలిగినప్పటికీ, ఆహారం లేదా నీరు అందించలేకపోయారు.రితేష్ జవాసింగ్ సోలంకి (మహారాష్ట్ర)2021 నవంబర్‌లో ఆరేళ్ల బాలుడు రితేష్ జవాసింగ్ సోలంకి 200 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బందికి 16 గంటల సమయం పట్టింది.గుజరాత్2022 జూన్ 9న, గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సైన్యం, అగ్నిమాపక దళం, పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై బాలుడిని రక్షించగలిగారు.పంజాబ్2022, మే 22న పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో ఆరేళ్ల బాలుడు పడిపోయాడు. తొమ్మిది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనప్పటికీ ఫలితం లేకపోయింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలు2009లో బోరుబావి ప్రమాదాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. 2010లో వీటిని సవరించింది. వీటిలో బోరుబావి నిర్మాణ సమయంలో బావి చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం, బావి అసెంబ్లీపై బోల్ట్‌లతో స్టీల్ ప్లేట్ కవర్లను అమర్చడం, బోరుబావి పాడయినప్పుడు దానిని మూసివేయడం మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా చదవండి: New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్’ -
16 గంటలు శ్రమించినా దక్కని ప్రాణం.. బోరుబావిలో పడిన సుమిత్ మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ జిల్లాలో బోరు బావి ఘటనలో బాలుడు సుమిత్ మీనా (Sumit Meena) విషాదాంతమైంది. శనివారం సాయంత్రం బోరు బావిలో పడిన 10ఏళ్ల బాలుడు సుమిత్ మీనాను రెస్యూ సిబ్బంది రక్షించారు. అయితే, చికిత్స పొందుతూ మరణించడంతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.గుణ జిల్లా (Guna District) రఘోఘర్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని పిప్లియా అనే గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమిత్ మీనా అనే బాలుడు ఆటలాడుకుంటూ 140 అడుగుల బోరుబావిలో పడ్డాడు. 39 అడుగుల లోతులోకి కూరుకుపోయాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ సిబ్బంది బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 16 గంటల పాటు శ్రమించి సుమిత్ మీనాను బోరుబావి (borewell) నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. ఆదివారం ఉదయం 9.30గంటల సమయంలో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయినప్పటికీ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు గుణ జిల్లా వైద్యాదికారి డాక్టర్ రాజ్‌కుమార్ రిషేశ్వర్ తెలిపారు.#WATCH | Guna, Madhya Pradesh: The 10-year-old boy, Sumit who fell into a borewell in the Janjali area of Raghogarh yesterday has been taken out and sent to a hospital. Details awaited. pic.twitter.com/5rSjIsv48j— ANI (@ANI) December 29, 2024 ‘బాలుడు రాత్రంతా చలి వాతావరణంలో బోర్‌వెల్‌లోనే ఉన్నాడు. అతని చేతులు, కాళ్ళు తడిసి వాచిపోయాయి.నోట్లోకి బురద చేరింది.మోతాదుకు మించి (అల్పోష్ణస్థితి) నీరు చేరడం వల్ల బాలుడి అంతర్గత భాగాల పనితీరు స్తంభించి పోయింది. సకాలంలో మెరుగైన వైద్యం అందించినా సమయం మించిపోయినందున బాలుడిని కాపాడుకోలేకపోయాం’అని విచారం వ్యక్తం చేశారు. -
ఈ చిన్నారి మృత్యుంజయుడు!
విజయపుర: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారిని 20 గంటలపాటు శ్రమించి, 16 అడుగుల లోతు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి తాలూకా లచియానా గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నపాటి గాయమైనా కాకుండానే బాలుడిని రక్షించిన సహాయక సిబ్బందిని గ్రామస్తులు ప్రశంసల్లో ముంచెత్తారు. లచ్యాణ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు శంకరప్ప మంగళవారం తన భూమిలో బోరుబావిని తవ్వారు. నీళ్లు పడకపోవడంతో దాన్ని వదిలేసి, మరో బోరు వేశారు. బుధవారం మధ్యాహ్నం శంకరప్ప మనవడు సాతి్వక్ సతీశ్ ముజగోండ్ ఖాళీగా ఉన్న బోరుబావి వద్దకు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. బోరు బావి నుంచి ఏడుపు వినిపించడంతో గ్రామస్తులు సాయంత్రం 6.15 గంటల సమయంలో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్, వైద్య, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది తాడును లోపలికి వేసి, బాలుడి కాలికి గట్టిగా బిగుసుకునేలా చేశారు. బాలుడు మరింత లోతుకు జారిపోకుండా నివారించగలిగారు. పైపు సాయంతో ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. 16 అడుగుల లోతులో చిన్నారి బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. బండరాళ్లు అడ్డురావడంతో నిట్టనిలువుగా, అర్ధరాత్రి దాటాక 2 గంటలకల్లా 21 అడుగుల లోతు మేర గుంత తవా్వరు. 20 గంటల తర్వాత గురువారం మధ్యాహా్ననికి చిన్నారిని బయటికి తెచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు పండుగ చేసుకున్నారు. -
కర్ణాటక: బోరుబావిలో పడ్డ బాలుడిని క్షేమంగా బయటకు తీసిన SDRF
-
గాంధీ జంక్షన్లో.. బల్దియా అధికారుల కాకి లెక్కలు..
కరీంనగర్: 715 ఫీట్లలోతులో బోర్వెల్.. 492 ఫీట్ల మేర కేసింగ్ పైప్.. ఇది నగరంలోని కిసాన్‌నగర్ గాంధీ జంక్షన్ వద్ద వేసిన అధికారులు వేసిన బోర్వెల్ లెక్కలు. జంక్షన్ అభివృద్ధిలో భా గంగా ఇటీవల వేసిన బోర్వెల్కు సంబంధించిన లెక్కలు నగరపాలకసంస్థలో జరుగుతున్న అక్రమాలను తారాస్థాయికి తీసుకుపోయాయి. అవడానికి చిన్నబిల్లు అయినా, వేసిన కేసింగ్ పైప్ లెక్కలు చూసి కాంట్రాక్టర్లు కళ్లు తేలేస్తున్నారు. సింగరేణి మి నహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనే ఇంత లోతులో కేసింగ్ పైప్‌లైన్ వేసిన దాఖలాలు లేవని బోర్వెల్ యజమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 175 ఫీట్లలోతులో బోరు.. నగరంలోని కూడళ్ల ఆధునీకరణలో భాగంగా కిసాన్‌నగర్ గాంధీ జంక్షన్‌ను అభివృద్ధి చేసి నాలు గు నెలల క్రితం ప్రారంభించారు. జంక్షన్ అభివృద్ధిలో భాగంగా అక్కడ బోర్వెల్ వేశారు. ఈ బోర్ వెల్‌కు సంబంధించిన చెల్లింపులే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఎంబీ రికార్డ్ ప్రతులతో ఈ బోర్ 715 ఫీట్లు (218 మీటర్లు) వేసినట్లు, 492 ఫీట్ల (150 మీటర్లు) కేసింగ్పైప్ వేసినట్లు తేలింది. మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో కూడా 50, 60 ఫీట్లకు మించి కేసింగ్ వేయరు. గోదావరిఖని, మంచిర్యాల లాంటి సింగరేణి ప్రాంతాల్లో మాత్రమే కేసింగ్ పైప్‌లు ఎక్కువగా వేస్తారు. కానీ కరీంనగర్ సిటీలో ఈ స్థాయిలో కేసింగ్ పైప్‌లు వేసిన చరిత్ర ఇప్పటివరకు లేదని బోర్వెల్ యజమానులంటున్నారు. తాము ఇప్పటివరకు 492 ఫీట్ల కేసింగ్ పైప్ అనే ముచ్చటే వినలేదని ఆశ్చర్యపోతున్నారు. గ్రానైట్ పనులు నిత్యం నడిచే బావుపేట ప్రాంతంలో కూడా 70, 80 ఫీట్లకు మించి కేసింగ్ వేయలేదంటున్నారు. తన 35ఏళ్ల సీనియార్టీలో వంద ఫీట్ల కేసింగ్ పైప్ ఒక్కసారి కూడా వేయలేదని నగరానికి చెందిన ఓ సీనియర్ బోర్వెల్ యజమాని పేర్కొన్నారు. అవినీ తిలో చరిత్ర సృష్టించే ఘనత వహించిన కొంతమంది అధికారులు ఇష్టారీతిన చేస్తున్న అంచనాలు, బిల్లుల వ్యవహారానికి ఇది సజీవ తార్కాణం. సున్నా జత చేశారా...? చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు సున్నా జత చేశారా అనే చర్చ సాగుతోంది. అక్కడ 15 మీటర్ల మేరనే కేసింగ్ పైప్ వేశారని, దానికి సున్నా జత చేసి 150 మీటర్లుగా రాశారని, అలాగే రూ.9,060 బిల్ అయితే సున్నా కలిపి రూ.90,600 గా మార్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలోనూ ఈ జంక్షన్లో గాంధీ విగ్రహాల కొనుగోలుపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా బోర్వెల్ లెక్కల్లో నమ్మలేని పనులు జరిగినట్లు బిల్లులు సృష్టించడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై సమగ్రవిచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే బోర్వెల్ కేసింగ్ పైప్ వ్యవహారంపై ఇంజినీరింగ్ అధికారులు స్పందించలేదు. ముందుగా తమ పరిధిలోకి రాదంటూ దాటవేశారు. సంబంధిత ఏఈ విషయం విన్న తరువాత స్పందించడం మానేశారు. -
బోరు బావిలో 8 ఏళ్ల బాలుడు.. 15 గంటలుగా మృత్యువుతో పోరాటం
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి ఓ ఎనిమిదేళ్ల బాలుడు 400 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో మంగళవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మండవి గ్రామంలోని ఓ పొలంలో ఇటీవలే బోరు బావి తవ్వారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్న తన్మయ్ దియావర్(8) అనే బాలుడు ఆ బోరులో పడిపోయాడని ఆత్నేర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అనిల్ సోనీ తెలిపారు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. బోరు బావి చుట్టూ తవ్వేందుకు ప్రొక్లెయిన్ వంటి వాహనాలు చేరుకున్నాయని చెప్పారు. బోరు బావిలోని బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. Madhya Pradesh | Operation still underway to rescue the boy who fell into a 55-ft deep borewell in Mandavi village in Betul district yesterday. pic.twitter.com/si8PzNagy9 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 7, 2022 ఇదీ చదవండి: లఖీంపూర్ కేసులో 13 మందిపై అభియోగాలు -
మృత్యుంజయుడు.. ఈ బుడతడు
ఆగ్రా: ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన మూడున్నరేళ్ల బాలుడిని సహాయక బృందాలు విజయవంతంగా కాపాడాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ధరిౖయె గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఉదయం 7.30 గంటల సమయంలో ఆడుకుంటున్న బాలుడు దగ్గర్లో ఉన్న పొలంలోని బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం వెంటనే అధికారులకు తెలియడంతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. 130 అడుగుల లోతున్న బోరుబావిలో 90 అడుగుల వద్ద బాలుడు చిక్కుకున్నాడు. అధికారులు బోరుబావికి సమాంతరంగా భూమిని తవ్వి బాలున్ని సురక్షితంగా బయటకు తీశారు. బాలుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. ఉదయం 8.30కి ప్రారంభమైన ఆపరేషన్ సాయంత్రం 4.35 గంటలకు ముగిసిందని ఆగ్రా ఎస్ఎస్పీ మునిరాజ్ తెలిపారు. తన కుమారున్ని తిరిగి ప్రాణాలతో చూడటం ఆనందంగా ఉందని బాలుడి తండ్రి ఛోటేలాల్ చెప్పారు. ఆరేడేళ్లుగా మూతబడి ఉన్న బోరు బావిని తిరిగి కొత్త బోరు వేసేందుకు తెరవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. చదవండి: Ayodhya: రూ.400 కోట్లతో బస్‌స్టేషన్ -
బోరుబావిలో పడిన బాలుడి మృతి
సాక్షి, మెదక్: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సంజయ్ సాయివర్థన్ ఉదంతం విషాదాంతమైంది. సుమారు 11 గంటల పాటు అధికారులు నిర్విరామంగా కొనసాగించిన సహాయక చర్యలు ఆ పసివాడిని బతికించలేకపోయాయి. మృత్యుంజయుడై తిరిగివస్తాడనుకున్న సంజయ్.. కన్నవారికి తీరని శోకాన్ని మిగిలిస్తూ, కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో అప్పుడే వేసిన బోరుబావిలో మూడేళ్ల బాలుడు సంజయ్ సాయివర్దన్ జారి పడిన విషయం తెలిసిందే. సాయంత్రం 5.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా.. అధికారులు ఆరు గంటలకు సహాయక చర్యలు ప్రారంభించారు. బోరు గుంతకు సమాంతరంగా తవ్వకం చేపట్టారు. కొంత లోతుకు వెళ్లే సరికి బండరాళ్లు వచ్చాయి. వీటిని డ్రిల్లింగ్ చేసి తొలగించారు. చివరకు గురువారం తెల్లవారుజామున 4.32 గంటలకు 17 అడుగుల లోతులో ఉన్న బాలుడిని వెలికితీశారు. వెంటనే ఆక్సిజన్ అందిస్తూ 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, సంజయ్ అంత్యక్రియలు తండ్రి స్వస్థలమైన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారంలో గురువారం సాయంత్రం అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆక్సిజన్ అందకపోవడంతోనే మృత్యువాత! సంజయ్ బోరుగుంతలో పడిన సమయంలో బాలుడి తాత అతడిని రక్షించేందుకు ధోవతి, చీర జత చేసి లోపలికి పంపించారు. అయితే వదులు మట్టి కావడంతో పెల్లలు బాలుడి మీద పడి కూరుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకే ఆక్సిజన్ పైపు బాబు వద్దకు చేరలేదని.. దీంతో శ్వాస అందక చిన్నారి మృతి చెందాడని చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా స్థాయిలో సరైన సాంకేతిక పరి జ్ఞానం అందుబాటులో లేకపోవడం కూడా పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతోంది. -
రోహిత్ నిజంగా మృత్యుంజయుడే...
సాక్షి, బెంగళూరు: బోరుబావిలో పడిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన ఉడుపి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సుమారు 15 అడుగుల లోతులో పడిపోయిన అతడు ఆరు గంటల పాటు బోరుబావిలోనే ఉండిపోయాడు. అయితే సహాయక చర్యల చేపట్టి ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. ఉడుపి జిల్లా బైందూరు తాలూకా మరవంతెకు చెందిన రోహిత్ ఆదివారం ఉదయం బోరుబావి పక్కన మట్టి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మట్టి కుంచించుకుపోగా అతడు బోరుబావిలో చిక్కుకున్నాడు. సుమారు పదిహేను అడుగుల లోతుకు పడిపోయాడు. వెంటనే అగ్నిమాపక, ఆరోగ్య సిబ్బంది వచ్చి జేసీబీ యంత్రాల సాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వి బాధితుడిని క్షేమంగా బయటకు తీసి, వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. -
సుజిత్ మరణవార్తతో కన్నీటి సంద్రం..
రెండేళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండిపోయాయి. నిరుపయోగంగా ఉన్న బోరు బావి ఆ బాలుడిని నిర్ధాక్షిణ్యంగా మింగేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. బోరుబావి నుంచి సుజిత్‌ను ఎలాగైనా ప్రాణాలతో బయటకు తీయాలని ఐదురోజుల పాటూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఆ బాలుడి మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున బయటకు తీశారు. సుజిత్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన తమిళనాడు ప్రజలు బాలుడి మరణవార్తతో తల్లడిల్లిపోయారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నడుకాట్టుపట్టికి చెందిన ఆరోగ్యరాజ్ (40), కళామేరి (35) దంపతులకు పునిత్ రోషన్ (5) సుజిత్ విల్సన్ (02) అనే ఇద్దరు కుమారులున్నారు. తమ ఇంటికి సమీపంలోని పెదనాన్న ఇంటికి తన అన్నతో కలిసి నడిచివెళుతూ ఈనెల 25వ తేదీన సుజిత్ బోరుబావిలోకి జారి పడిపోయాడు. మదురైకి చెందిన పదిమందితో కూడిన ప్రయివేటు బృందం బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైంది. 26 అడుగుల లోతుల్లో ఉండిన బాలుడు ఇంకా మరింత లోతులోకి వెళ్లకుండా ఎయిర్‌లాక్ విధానంలో ప్రకృతి వైపరీత్యాల నివారణ బృందం బాలుడి చేతులను కట్టివేసి పైకి లాగే ప్రయత్నం చేసింది. అయితే అంతలోనే బాలుడు జారిపోయాడు. బాలుడికి శ్వాససంబంధమైన సమస్య తలెత్తకుండా బోరుబావిలోకి ఆక్సిజన్ సరఫరా చేశారు. బోరుబావికి సమాంతరంగా భారీ సొరంగాన్ని తవ్వడం ద్వారా బాలుడిని బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బాలుడు పడిపోయిన నాటి నుంచి అవిశ్రాంతంగా రక్షణ చర్యలు కొనసాగాయి. సొరంగం పనులు వేగవంతం చేసేందుకు సోమవారం భారీ రిగ్గును తెప్పించారు. అయితే సుమారు 50 అడుగుల లోతులో బలమైన సున్నపురాయి అడ్డుతగలడంతో పనులు నిలిచిపోయాయి. అ తరువాత సహాయక బృందంలోని ఒక యువకుడు సొరంగంలోకి వెళ్లి బండరాయిని క్రేన్‌కు కట్టగా బయటకులాగడంతో అడ్డుతొలగింది. దీంతో సోమవారం రాత్రి మరలా సొరంగం పనులు ప్రారంభమైనాయి. ఇంతలో బోరుబావి నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించా. బాలుడు సుజిత్ మరణించినట్లు రెవెన్యూ కార్యదర్శి రాధాకృష్ణన్ మంగళవారం తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో అధికారికంగా ప్రకటించారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో ఆధునిక యంత్రంసాయంతో బోరుబావి నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి ప్రాణాలను హరించివేసిన బోరుబావిని వెంటనే కాంక్రీటుతో మూసివేశారు. మిన్నంటిన రోదనలు.. సుజిత్ మరణించినట్లు ప్రకటన వెలువడగానే ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని బయటకు తీసిన సమయంలో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ ప్రజలు గుండెలవిసేలా రోదించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడు ప్రజలంతా సుజిత్ మరణవార్తతో కదిలిపోయారు. సుజిత్లా మరొకరు ప్రాణాలు కోల్పోకుండా ఇప్పటికైన జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపారు. ఐదురోజులుగా సహాయక చర్యలకు అంకితమైన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ సహా ప్రభుత్వ సిబ్బంది, కృషి చేసిన ఇతర బృందాలు కన్నీటి పర్యంతమయ్యారు. బోరుబావి నుంచి సుజిత్ ఏడుపులు ఇంకా వినిపిస్తున్నాయని మంత్రి విజయభాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోస్టుమార్టం ముగిసిన అనంతరం సుజిత్‌కు అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సుజిత్ చిత్రపటం వద్ద సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నివాళి సీఎం సహా ప్రముఖుల సంతాపం.. సుజిత్ మృతికి సీఎం ఎడపాడి పళనిస్వామి సహా పలువురు సంతాపం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం మనప్పారై చేరుకున్న సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా పలువురు మంత్రులు సుజిత్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్ మరణం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని ఎడపాడి పేర్కొంటూ బాలుడి కుటుంబానికి ప్రభుత్వం తరçఫున రూ.10 లక్షలు, అన్నాడీఎంకే తరఫున రూ.10లక్షలు సహాయం ప్రకటించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా నివాళులర్పించారు.అలాగే డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ సైతం సుజిత్ సమాధి వద్ద నివాళులర్పించి పార్టీ తరపున రూ.10 లక్షలు సహాయం ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం సంతాపం ప్రకటించారు. బోరుబావి వద్ద చిన్నారుల నివాళి స్టాలిన్ విమర్శ–సీఎం ఆగ్రహం: ఇదిలా ఉండగా, రక్షింపు చర్యలను చేపట్టడంలో ప్రభుత్వ మెతకవైఖరి వల్లే సుజిత్ ప్రాణాలు కోల్పోయాడని డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ ఆక్షేపించారు. సుజిత్‌కి ఏర్పడిన కష్టం మరెవ్వరికీ రాకూడదని అన్నారు. మంత్రులు, అధికారులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో చూపిన శ్రద్ధ సహాయక చర్యల్లో చూపలేదని ఎద్దేవా చేశారు. బాలుడు 36 అడుగుల లోతులో ఉన్నపుడే సైనిక సహాయం కోరాల్సిందని అన్నారు. ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఘాటుగా స్పందించిన సీఎం సుజిత్‌ను రక్షించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమిటో ప్రజలకు, ప్రపంచానికి తెలుసని, బాలుడి దారుణ మరణంలో సైతం రాజకీయలబ్ధికి పాకులాడవద్దని సీఎం ఎడపాడి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు హితవుపలికారు. బోరుబావి ప్రమాద సంఘటనల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన ఉదహరించారు. సుజిత్‌ను రక్షించే పనుల్లో అందరూ రేయింబవళ్లూ శ్రమించారు. ఆర్మీని రంగంలోకి దించి ఉండవచ్చుకదాని స్టాలిన్ అంటున్నారు, మరి డీఎంకే హయాంలో జరిగిన ప్రమాద సమయాల్లో ఆర్మీని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ముక్కొంబు ఆనకట్ట కూలిపోయినపుడు కూడా ఇలానే స్టాలిన్ విమర్శించారు. అయితే ముక్కొంబు పునరుద్ధరణ పనులను ఆర్మీనే ప్రశంసించిన సంగతి స్టాలిన్‌కు తెలియదా..? అని నిలదీశారు. తమిళనాడులో అందుబాటులో ఉన్న అన్నిరకాల సాంకేతిక నైపుణ్యాన్ని సుజిత్ రక్షింపు చర్యలకు వాడుకున్నామని సీఎం అన్నారు. ప్రాణాలుపోతేగానీ చట్టాలు గుర్తుకురావా..?– మద్రాసు హైకోర్టు ఆగ్రహం ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతేగానీ చట్టాలు గుర్తుకు రావా..? అని మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుజిత్ ప్రమాదం నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం సహాయకుడు పొన్రాజ్ ప్రజా ప్రయోజనవ్యాజం (పిల్)ను దాఖలు చేయగా, న్యాయమూర్తులు సత్యనారాయణన్, శేషసాయి ఈ పిల్‌ను మంగళవారం అత్యవసర కేసుగా స్వీకరించి విచారణ చేపట్టారు. ప్రతిసారీ ఏదో ఒక విపరీతం జరిగితేగానీ ప్రభుత్వంలో కదలికరాదా..? అని నిలదీశారు. నడిరోడ్డుపై బ్యానర్ కారణంగా ఇటీవల శుభశ్రీ అనే ఇంజినీరు దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. నేడు వినియోగంలో లేని బోరుబావి రెండేళ్ల బాలుడిని బలితీసుకుంది. శుభశ్రీ ఘటనతో బ్యానర్లపై నిషేధం వి«ధించారు, సుజిత్ ప్రమాదం తరువాత బోరుబావుల చట్టంపై దృష్టిపెట్టారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, సుజిత్ మరణంపై న్యాయవిచారణ జరపాలని సుప్రీంకోర్టులో జీఎస్ మణి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. సహాయక యంత్రం కనుగొంటే రూ.5 లక్షలు బహుమతి బోరుబావుల్లో పడిపోయిన చిన్నారులను సురక్షితంగా బయటకు తీసే అత్యాధునిక యంత్రాలను కనుగొన్న వారికి రూ.5 లక్షలు బహుమతిగా అందజేస్తామని రాష్ట్ర ఐటీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంతోష్‌బాబు ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారు. -
బోరుబావిలోనే బాలుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు సుజిత్‌ను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 72 గంటలుగా బోరుబావిలోనే ఉన్న బాలుడు.. ప్రస్తుతం 100 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గుంత తవ్వేందుకు ఆదివారం నుంచి ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఇందుకోసం జర్మన్ నుంచి తెచ్చిన అత్యాధునిక హెవీ డ్రిల్లింగ్ మెషీన్‌ను ఉపయోగిస్తున్నట్లు రెవెన్యూ విభాగంకమిషనర్ రాధాకృష్ణన్ తెలిపారు. కెమెరాల ద్వారా పరిశీలించినప్పుడు బాలుడిపై కొంత మట్టి పడినట్లు ఉందని మరో ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్ (40), కళామేరీ (35) దంపతుల కుమారుడు సుజిత్ శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ‘సుజిత్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలపై సీఎంతో మాట్లాడాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
పగిడేరులో పాతాళగంగ..!
మణుగూరురూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పంచాయతీ పరిధిలోని పరిసర గ్రామాల్లో వస్తున్న వేడి జలపాతాలు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. సింగరేణి బొగ్గు నిక్షేపాల కోసం వేస్తున్న జియోలజికల్ సర్వే బోర్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తుండటంతో ఆ నీరు వృథాగా పోకుండా గ్రామాల రైతులు వ్యవసాయానికి సాగు చేసుకుంటున్నారు. పగిడేరు గ్రామంలో గతంలో కేవలం వర్షాధారంతో ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటల్లో నీటితో కేవలం వర్షాకాలం పంట పండించాలంటేనే కష్టంగా ఉండేది. సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాలను కనుగొనడానికి వేస్తున్న బోర్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తుండటం విశేషం. పట్టుకుంటే కాలిపోయే విధంగా నీరు రావడం మరో విశేషం. ఎటువంటి ఖర్చులేకుండా సాగునీరు అందిస్తున్న బోర్లు పగిడేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 20 బోర్లు వేయగా అందులో కనీసం 10 బోర్ల నుంచి వేడి నీరు వస్తుంది. తొలుత స్పీడుగా నీరు వచ్చిన బోర్లు కొంతకాలం తరువాత తగ్గుతున్నాయి. 20 సంవత్సరాల క్రితం వేసిన బోర్లు ఇంకిపోగా, ఇటీవల వేసిన బోర్ల నుంచి వేడినీరు ఉబికి వస్తుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కొడిశల కుంట గ్రామ సమీపంలో వేసిన రెండు బోర్లలో వేడినీరు ఉబికి వస్తుంది. 5 హెచ్‌పీ మోటార్‌కు వచ్చినంత వేగంగా నీరు బయటకు రావడంతో ఆ నీటిని రైతులు చేరువులోకి మళ్లించి పంటలు సాగుచేసుకుంటున్నారు. అదే విధంగా గొల్లకొత్తూరు గ్రామంలో బోరు వేయడంతో దాని నుంచి వేడి నీరు రావడంతో రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో పగిడేరు పరిసర ప్రాం తాల్లో కేవలం ఈ బోర్లను ఆధారంగా చేసుకొని సుమారు 500ల ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నారు. ఈబోర్ల వలన రెండు పంటలు పండటానికి అనుకూలంగా ఉండటంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఖర్చులు లేకుండా సాగునీరు అందిస్తున్న బోర్లు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు
-
బోరుబావిలో పడిన ఏడాది బాలుడు
పుల్కల్ : మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెంలో ఏడాది బాలుడు బోరుబావిలో పడ్డాడు. రాకేష్ అనే చిన్నారి శనివారం ఉదయం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలుడు ఘటనపై డీఎమ్, హెచ్ఓకు 'సాక్షి' సమాచారం అందించింది. విషయం తెలిసిన అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాలుడిని రక్షించేందుకు చర్యలు అధికారులు వేగవంతం చేశారు. ట్యూబ్ హాయంతో బావిలోకి ఆక్సిజన్ పంపుతున్నారు. జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా పెద్ద గుంత తవ్వుతున్నారు. పుల్కల్ ఎస్ఐ సత్యనారాయణ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా బాలుడి ఇంటి పక్కనే రాములు అనే రైతు బోరు వేయించినట్లు తెలిసింది. బోరు లో నీరు పడక పోవడంతో గుంతపై కనీసం మూతవేయకుండా వదిలేయడం వల్లే ప్రమాదం జరిగింది. బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు గుంతలో పడిపోయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. -
బోరు బావిలో బాలిక, కొనసాగుతున్న రెస్క్యూ..!
-
బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి
-
బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడింది. గిరిజ అనే అమ్మాయి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ బోరుబావిలోకి పడిపోయింది. బాలిక కుటుంబ సభ్యులతో పాటు రెవెన్యూ అధికారులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వితున్నారు. బాలికను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.