
బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడింది. గిరిజ అనే అమ్మాయి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ బోరుబావిలోకి పడిపోయింది.
బాలిక కుటుంబ సభ్యులతో పాటు రెవెన్యూ అధికారులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వితున్నారు. బాలికను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.