విజయపుర: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారిని 20 గంటలపాటు శ్రమించి, 16 అడుగుల లోతు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి తాలూకా లచియానా గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నపాటి గాయమైనా కాకుండానే బాలుడిని రక్షించిన సహాయక సిబ్బందిని గ్రామస్తులు ప్రశంసల్లో ముంచెత్తారు. లచ్యాణ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
గ్రామానికి చెందిన రైతు శంకరప్ప మంగళవారం తన భూమిలో బోరుబావిని తవ్వారు. నీళ్లు పడకపోవడంతో దాన్ని వదిలేసి, మరో బోరు వేశారు. బుధవారం మధ్యాహ్నం శంకరప్ప మనవడు సాతి్వక్ సతీశ్ ముజగోండ్ ఖాళీగా ఉన్న బోరుబావి వద్దకు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. బోరు బావి నుంచి ఏడుపు వినిపించడంతో గ్రామస్తులు సాయంత్రం 6.15 గంటల సమయంలో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
పోలీసులు, ఫైర్, వైద్య, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఫైర్ సిబ్బంది తాడును లోపలికి వేసి, బాలుడి కాలికి గట్టిగా బిగుసుకునేలా చేశారు. బాలుడు మరింత లోతుకు జారిపోకుండా నివారించగలిగారు. పైపు సాయంతో ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. 16 అడుగుల లోతులో చిన్నారి బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. బండరాళ్లు అడ్డురావడంతో నిట్టనిలువుగా, అర్ధరాత్రి దాటాక 2 గంటలకల్లా 21 అడుగుల లోతు మేర గుంత తవా్వరు. 20 గంటల తర్వాత గురువారం మధ్యాహా్ననికి చిన్నారిని బయటికి తెచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు పండుగ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment