two year kid
-
ఈ చిన్నారి మృత్యుంజయుడు!
విజయపుర: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారిని 20 గంటలపాటు శ్రమించి, 16 అడుగుల లోతు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి తాలూకా లచియానా గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నపాటి గాయమైనా కాకుండానే బాలుడిని రక్షించిన సహాయక సిబ్బందిని గ్రామస్తులు ప్రశంసల్లో ముంచెత్తారు. లచ్యాణ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు శంకరప్ప మంగళవారం తన భూమిలో బోరుబావిని తవ్వారు. నీళ్లు పడకపోవడంతో దాన్ని వదిలేసి, మరో బోరు వేశారు. బుధవారం మధ్యాహ్నం శంకరప్ప మనవడు సాతి్వక్ సతీశ్ ముజగోండ్ ఖాళీగా ఉన్న బోరుబావి వద్దకు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. బోరు బావి నుంచి ఏడుపు వినిపించడంతో గ్రామస్తులు సాయంత్రం 6.15 గంటల సమయంలో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్, వైద్య, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది తాడును లోపలికి వేసి, బాలుడి కాలికి గట్టిగా బిగుసుకునేలా చేశారు. బాలుడు మరింత లోతుకు జారిపోకుండా నివారించగలిగారు. పైపు సాయంతో ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. 16 అడుగుల లోతులో చిన్నారి బండరాళ్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. బండరాళ్లు అడ్డురావడంతో నిట్టనిలువుగా, అర్ధరాత్రి దాటాక 2 గంటలకల్లా 21 అడుగుల లోతు మేర గుంత తవా్వరు. 20 గంటల తర్వాత గురువారం మధ్యాహా్ననికి చిన్నారిని బయటికి తెచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు పండుగ చేసుకున్నారు. -
స్కూల్ బస్ కిందపడి రెండేళ్ల పాప మృతి
హైదరాబాద్: హబ్సిగూడలో దారుణం జరిగింది. హబ్సిగూడ రవీంద్రనగర్ లో జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది. విరరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. తండ్రి దగ్గరకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో కదులుతున్న బస్ కింద పడింది. దీంతో పాప అక్కడిక్కడే మృతి చెందింది . సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
వయసు రెండేళ్లు, బరువు 45 కిలోలు, దీంతో...
న్యూఢిల్లీ: ఆ పాప వయసు కేవలం రెండు సంవత్సరాలు. కానీ బరువు మాత్రం ఏకంగా 45 కేజీలు. సాధారణంగా, ఆ వయస్సు పిల్లల బరువు 12-15 కిలోలు. కానీ ఖ్యాతి వర్షిణి ఊబకాయంతో తీవ్రంగా బాధపడుతూ, అడుగులు వేయలేకపోయేది. సరిగ్గా పడుకోవడమూ కష్టమైపోయింది. దీంతో ఆ పాపకి ఒంట్లోంచి కొవ్వుని బయటకు తీసే అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని పత్పర్గంజ్లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ఈ శస్త్ర చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. బేరియాట్రిక్ సర్జరీతో ఆకలి మందగించి తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. ‘‘ఖ్యాతి వర్షిణి పుట్టినప్పుడు సాధారణంగానే రెండున్నర కేజీల బరువుంది.. కానీ ఆ తర్వాత చాలా త్వరగా బరువు పెరిగిపోయింది. 6 నెలలు వచ్చేసరికి 14 కేజీలు ఉన్న ఆ పాప రెండేళ్లకి 45 కేజీలకు చేరుకుంది. అధిక బరువు కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుండడంతో రిస్క్ తీసుకొని సర్జరీ చేయాల్సి వచ్చింది’’అని పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ మన్ ప్రీత్ సేథి వివరించారు. దేశంలో బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న అతి పిన్నవయస్కురాలు ఖ్యాతియేనని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స జరిగిన ఐదు రోజుల తర్వాత, ఖ్యాతి పరిస్థితి బాగా మెరుగు పడిందని, ప్రధాన లక్షణాలలో ఒకటైన గురక పూర్తిగా ఆగిపోయిందని మత్తుమందు నిపుణుడు డాక్టర్ అరుణ్ పురి చెప్పారు. అలాగే ఊబకాయంతో బాధపడుతున్నఇతర పిల్లలకు భవిష్యత్తులో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి మార్గం మరింత సుగమమైందని \చెప్పారు. -
బంగ్లాదేశీ బుడ్డోడి ఆటకు ఐసీసీ ఫిదా
-
కిరోసిన్ తాగి రేండేళ్ల బాలుడు మృతి
కోవెలకుంట్ల: అభం...శుభం తెలియని బాలుడు మంచి నీళ్లనుకుని కిరోసిన్ తాగి మృతి చెందాడు. ఈ ఘటన కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. పండిటి నాగార్జున, మేరమ్మ దంపతులు నిరుపేద కుటుంబం కావడంతో కూలీ పనికి వెళుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒకటో తరగతి చదువుతున్న మల్లిక, అంగన్వాడీ కేంద్రానికి వెళుతున్న లత, ప్రభాస్ సంతానం. ఒక్కగానొక్కకుమారుడు కావడంతో ప్రభాస్‌ను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆదివారం నాగార్జున పనివెళ్లాడు. ఆడపిల్లలు వీధిలో ఆడుకుంటుండగా మేరమ్మ ఇంట్లో మిషన్ కుట్టుకుంటోంది. ఇంట్లో ఆడుకుంటున్న ప్రభాస్ బయటకు వచ్చి వంట వండుకుంటున్న ప్రదేశంలో క్వాటర్ బాటిల్లో ఉన్న కిరోసిన్‌ను మంచినీళ్లని భావించి తాగుతుండగా పక్కింటికి చెందిన మహిళ గమనించింది. హుటాహుటిన అక్కడకు చేరుకుని బాటిల్‌ను లాక్కుని చికిత్స నిమిత్తం బాలుడిని కోవెలకుంట్లలో ప్రాథమిక కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నంద్యాల, కర్నూలు ఆసుపత్రులకు తరలించగా కోలుకోలేక సోమవారం ఉదయం మృత్యువాత పడ్డాడు.