
హైదరాబాద్: హబ్సిగూడలో దారుణం జరిగింది. హబ్సిగూడ రవీంద్రనగర్ లో జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది. విరరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. తండ్రి దగ్గరకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో కదులుతున్న బస్ కింద పడింది. దీంతో పాప అక్కడిక్కడే మృతి చెందింది . సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment