school bus
-
పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం జరిగింది. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్‌ను డ్రైవర్ రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్పల్లి మండల పరిధిలోని ఎన్సీడీ రాయల్ పెవిలియన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్‌పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్‌కు చెందిన క్లాస్మేట్ హర్షనందన్(19)ను తీసుకుని ఫ్రెషప్ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ సమీపంలో కొండకల్ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వాట్సాప్‌లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
తప్పిన పెను ప్రమాదం
కీసర: ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొడుతూ వెళ్లి ముందున్న చెట్టు కు ఢీకొని నిలిచిపోయింది. విప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చీర్యాల చౌరస్తాలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు రోజు మాదిరిగానే కీసర, కీసరదాయర, రాంపల్లి దాయర, గోధుమకుంట, కుందన్పల్లిల నుంచిద్యార్థులను తీసుకుని వస్తోంది. ఈక్రమంలో కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచి్చన కారును తప్పించడానికి డ్రైవర్ బస్సును పక్కకు తిప్పాడు. వేగంతో బస్సు అదుపు తప్పి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని కొట్టింది. స్తంభం విరిగి కింద పడిపోయింది. ఆ ధాటికి మరో రెండు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. కరెంటు తీగలు బస్సుపై పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సు అదే వేగంతో చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కాగా.. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బస్సు ఢీకొని ఉంటే పెను ప్రమాదమే సంభవించేది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ రాజు బస్సును అక్కడే వదిలేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానికంగా ఉన్న ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు విద్యార్థులను బస్సులోంచి బయటకు దింపారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను వాహనాల్లో ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
స్కూల్ బస్సుకు మంటలు..
బ్యాంకాక్: విహార యాత్రకు పాఠశాల విద్యార్థులు, టీచర్లతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ విషాద ఘటనలో 20 మంది విద్యార్థులు సహా 23 మంది సజీవ దహనమయ్యారు. థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సెంట్రల్ ఉథ్థాయ్ థని ప్రావిన్స్‌కు చెందిన స్కూల్ విద్యార్థులు, టీచర్లు కలిపి మొత్తం 44 మందితో అయుథ్థయ, నొంతబురి ప్రావిన్స్‌ల్లో విహారయాత్రకు బస్సులో బయలుదేరారు.నొంతబురి వైపు వెళ్తుండగా బస్సు ముందు టైరు పగిలి, అదుపుతప్పి రోడ్డుపక్క రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని 20 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ఆహుతయ్యారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఘటనపై దర్యాప్తు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. -
స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థుల మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం బ్యాంకాక్‌లో విద్యార్థుల బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదలో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు స్వల్పంగా గాయాలు అయినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మృతదేహాలను కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.Thailand School bus Fire Update-Initially...there were 10 fatalities.! and many injured. #Bangkok #โหนกระแส #ไฟไหม้ #ไฟไหม้รถบัส #Thailand #Schoolbus #Fire #ประเทศไทย #รถดับเพลิง pic.twitter.com/lVgc9LZdLy— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024 ట్రల్ ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్తున్న సమయంలో బ్యాంకాక్ ఉత్తర శివారు ప్రాంతమైన పాతుమ్ థాని ప్రావిన్స్ వద్ద మధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయని రవాణా మంత్రి సూర్యా జుంగ్రుంగ్రూంగ్కిట్ తెలిపారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించటం పూర్తి చేయనందున మరణాల సంఖ్యను ఇంకా ధృవీకరించలేకపోయారని మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ మీడియాకు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు.School bus after fire. #ไฟไหม้รถบัสที่วิภาวดี #ไฟไหม้รถบัส #ไฟไหม้ #รถบัสไฟไหม้ #รถบัส #โหนกระแส #Thailand #Schoolbus #ประเทศไทย https://t.co/UdnhJSiPCb— Chaudhary Parvez (@ChaudharyParvez) October 1, 2024ఈ ఘటనపై ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా ఎక్స్‌లో స్పందించారు. ‘ఈ ప్రమాదంలో గాయపడినవారికి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తాం’’ అని అన్నారు. విద్యార్థుల వయస్సు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్సు టైర్లలో ఒకటి పేలడంతో అదుపుతప్పి.. మంటలు చెలరేగాయని సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు పోలీసులకు తెలిపారు.చదవండి: హిజ్బుల్లా నస్రల్లా హత్య ప్లాన్.. బంకర్లోకి విషవాయువులు! -
శంషాబాద్-బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం
-
శంషాబాద్‌లో స్కూల్ బస్సు బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ బెంగుళూరు హైవే పై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది.గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుతో పాటు డ్రైవర్ ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: బస్సు డ్రైవర్‌కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని కాపాడి
తమిళనాడు పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యాన్ డ్రైవర్ తను మరణిస్తూ.. 20 మంది పిల్లల ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్ సాహాసాలను మెచ్చిన సీఎం స్టాలిన్ అతడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తిరూప్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..వివరాలు.. వెల్లకోయిల్లో బుధవారం సెమలయ్యప్పన్ అనే 49 ఏళ్ల బస్సు డ్రైవర్ ఓ ప్రైవేటు పాఠశాలకు నుంచి విద్యార్ధులను వాళ్ల ఇంటి వద్ద దింపడానికి బయల్దేరాడు. దారి మధ్యలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రాడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అతని భార్య కూడా అదే స్కూల్లో హెల్పర్‌గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.బస్సు రోడ్డు పక్కన ఆగిన కాసేపటికే అతడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అతడు మరణించే ముందు సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము’. అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే మంత్రి ఎంపీ సామినాథన్ మృతుల కుటుంబాలకు చెక్కును అందజేశారు. -
భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు
-
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నెల్లూరు జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తాబస్సు క్లీనర్ మృతి పలువురు విద్యార్థులకు గాయాలు.హుటాహుటిన గాయపడిన విద్యార్థులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాదానికిగల కారణాలు పూర్తి… pic.twitter.com/x5CKlHCjen— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024 -
తెలంగాణలో మోగిన బడి గంట.. ఆర్టీఏ అలర్ట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గవర్నమెంట్, ప్రైవేట్ బడులన్నీ తెరుచుకున్నాయి. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఉదయం నుంచి అన్ని స్కూల్స్, కాలేజీల బస్సుల ఫిట్నెస్లను పరిశీలిస్తున్నారు. ఫిట్‌గా లేని బస్సులు, వ్యాన్లను సీజ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇవాళ్టి నుంచి బడులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. నిన్ననే స్పెషల్ డ్రైవ్ పేరిట చెకప్ లిస్ట్ పంపించారు అధికారులు. అయినా కొన్ని విద్యా సంస్థలు బస్సులు, వ్యాన్లను ఆర్టీఏ కార్యాలయాలకు ఫిట్నెస్ టెస్టులకు పంపలేదు. దీంతో అధికారులే రంగంలోకి దిగి దాడులు నిర్వహిస్తున్నారు. ఇక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. -
స్కూలు బస్సు బోల్తా... ఎనిమిదిమంది చిన్నారులు దుర్మరణం!
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా- దాద్రి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బస్సు అతి వేగంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందినది. విద్యార్థులతో వెళుతున్న ఈ బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది విద్యార్థులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి తరలించారు. ఈద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పలు ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. ఇదే కోవలో జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు కూడా సెలవు ఇవ్వలేదు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం నుంచి ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన రాలేదు. -
బడి బస్సులే యమపాశాలై!
హైదరాబాద్: చిన్నారుల పాలిట స్కూల్ బస్సులు యమదూతల్లా మారాయి. అభం శుభం తెలియని బాలలను బలిగొంటున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు మృత్యవాతపడుతున్నారు. డ్రైవింగ్‌లో అనుభవం, నైపుణ్యం లేకుండానే స్కూల్ బస్సులను నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డుపై పాదచారులను, చిన్నారులను గమనించకుండానే వాహనాలను నడపడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హబ్సిగూడలో గురువారం నాటి ఘటనే ఇందుకు ఉదాహరణ. బస్సు ఆగినప్పుడు, తిరిగి బయలుదేరే సమయంలో విధిగా ముందూ వెనకా గమనించాలి. బస్సులో ఉండే సహాయకులు కిందకు దిగి అన్నివైపులా చూసి డ్రైవర్‌కు సంకేతం ఇవ్వాలి. కానీ.. ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలను కూడా పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు పిల్లలను బస్సెక్కించేటప్పుడు, దిగిన తర్వాత తిరిగి ఇళ్లకు తీసుకెళ్లే సమయంలో తమ వెంట ఉండే చిన్నారులను గమనించకపోవడంతోనూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తనిఖీలు తూతూమంత్రం రహదారి భద్రతలో భాగంగా బడి బస్సుల నిర్వహణపై రవాణాశాఖ ప్రత్యేక శ్రద్ధ వహించడంలేదు. కొంతకాలంగా అధికారుల ఉదాసీనత, డ్రైవర్లపై కొరవడిన నియంత్రణ ప్రమాదాలకు దారితీస్తోంది. ఏటా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకొనే సమయానికి అన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాలకు చెందిన తనిఖీ అధికారులు విధిగా బస్సులను తనిఖీలు చేసి వాటి సామర్థ్యాన్ని నిర్ధారించాలి. డ్రైవర్ల అనుభవంపైనా అధికారులకు కచ్చితమైన అవగాహన ఉండాలి. విద్యాసంస్థల యజమానులు డ్రైవర్లను నియమించుకొనే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలి. కానీ.. రవాణా అధికారులు ఏడాదికి ఒకసారి మొక్కుబడి తనిఖీలకు మాత్రమే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్కూల్ బస్సుల నిర్వహణలో విద్యాసంస్థల వైఫల్యం కూడా ఉంది. రూ.లక్షల్లో ఫీజులు తీసుకొనే కార్పొరేట్ స్కూళ్లు బస్సుల నిర్వహణలో దారుణంగా వ్యవహరిస్తున్నాయి. డ్రైవర్ల నియామకం, సహాయకుల ఏర్పాటుపై అశ్రద్ధ చూపుతున్నాయి. లారీలు, గూడ్స్ వాహనా లను నడిపేవారికి పిల్లల బస్సులను అప్పగించడంతో ర్యాష్ డ్రైవింగ్, ఓవర్‌స్పీడ్‌కు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం బాధ్యులే.. పెద్ద పిల్లలను స్కూల్ బస్సెక్కించే సమయంలో వారితో పాటు చిన్నారులను బయటకు తీసుకురావడం ఒక నిర్లక్ష్యపు అలవాటుగా మారింది. బయటకు వచ్చిన తర్వాత తమ వెంట మరో పాప, లేదా బాబు ఉన్నారనే విషయాన్ని మరిచి.. పెద్ద పిల్లలను బస్సెక్కించడంలోనే నిమగ్నమవుతున్నారు. చాలాసార్లు ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటిసమయాల్లో చిన్నవారిని ఇంటి నుంచి బయటకు రానివ్వకపోవడమే మంచిది. ఒకవేళ బయటకు తీసుకొచ్చినా ఒక చేత్తో పట్టుకొని ఉండడం మరిచిపోవద్దు. మరోవైపు స్కూల్ బస్సు నడిపే డ్రైవర్‌కు రవాణా అధికారులు ఆమోదించిన లైసెన్స్, అనుభవం వంటి అంశాలను కూడా పరిశీలించాలి. పేరెంట్స్ కమిటీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. డ్రైవర్లకు రిఫ్రెషర్ శిక్షణ అవసరం.. ► బస్సులను నడిపే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై పాఠశాల యాజమాన్యం డ్రైవర్లు, అటెండర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ► రవాణా అధికారుల పర్యవేక్షణలో డ్రైవర్లకు తప్పనిసరిగా రిఫ్రెషర్ శిక్షణ కోర్సులను నిర్వహించాలి. ► సాధారణంగా రోజూ నడిపే డ్రైవర్ లేని సమయంలో కొత్త వారికి బస్సులను అప్పగిస్తారు. ఇలా ప్రత్యామ్నాయ డ్రైవర్‌ను ఎంపిక చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. ► నిలిపి ఉంచిన స్కూల్ బస్సుల వద్దకు పిల్లలు వెళ్లకుండా జాగత్తలు పాటించాలి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ప్రమాదాలిలా.. ► గత జూలైలో ఆదిభట్లలో ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ► ఆగస్ట్‌లో బాచుపల్లిలో ఓ స్కూల్ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో రెండో తరగతి చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. ఇదే నెల 28న సునీత అనే పారిశుద్ధ్య కార్మికురాలిని ఒక మెడికల్ కాలేజీ బస్సు ఢీకొట్టడంతో ఆమె కన్నుమూశారు. ► సెప్టెంబర్‌లో ఇబ్రహీంపట్నం వద్ద ఓ స్కూ ల్ బస్సు ఇద్దరు చిన్నారులను ఢీకొంది. ► నవంబర్ 2న సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ తండ్రితో కలిసి రోడ్డు దాటుతున్న మూడేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు. ► నవంబర్ 19న ఆనంద్‌నగర్‌లో రెండున్నరేళ్ల చిన్నారి స్కూల్ బస్సు.. ముందు చక్రాల కింద నలిగిపోయింది. ► డిసెంబర్ 15న బీఎన్‌రెడ్డినగర్‌లో నాలుగేళ్ల చిన్నారిని స్కూల్ బస్సు ఢీకొట్టింది. ► జనవరి 4వ తేదీన హబ్సిగూడలో ఏడాదిన్నర చిన్నారి స్కూల్ బస్సు చక్రాల కిందపడి అసువులు బాసింది. -
స్కూల్ బస్ కిందపడి రెండేళ్ల పాప మృతి
హైదరాబాద్: హబ్సిగూడలో దారుణం జరిగింది. హబ్సిగూడ రవీంద్రనగర్ లో జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల పాప మృతి చెందింది. విరరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. తండ్రి దగ్గరకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో కదులుతున్న బస్ కింద పడింది. దీంతో పాప అక్కడిక్కడే మృతి చెందింది . సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
స్కూలు బస్ డ్రైవర్ ఘాతుకం
యశవంతపుర: అభం శుభం తెలియని 8వ తరగతి బాలికను లోబర్చుకున్న సదరు పాఠశాల బస్సు డ్రైవర్.. చివరకు జనం ఏమంటారోనని భయపడి బాలికతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కమగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జిల్లా అజ్జంపుర తాలూకా గిరియాపుర గ్రామంలోని జ్ణానదీప ప్రైవేట్ స్కూల్ ఉంది. అందులో బాలిక (14) 8వ తరగతి చదువుతోంది. ఆమె రోజూ స్కూలు బస్సులో ఇంటికి వచ్చి వెళ్లేది. ఆమెపై తండ్రి వయసున్న బస్సు డ్రైవర్ సంతోష్ (38) కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమ దోమ అంటూ షికార్లకు తీసుకెళ్లాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు దండిస్తారని భయపడిన సంతోష్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తనతో పాటు బాలికను కూడా బలిగొనాలని కుట్ర పన్నాడు. సోమవారం విద్యారి్థని సమీపంలోని రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి అక్కడ ఇద్దరూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్కూలు యాజమాన్యంపై కేసు ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నందున వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. తమ కూతురు కనిపించడం లేదని స్థానిక అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారు స్పందించి ఉంటే ప్రాణాలతో దక్కి ఉండేదని తల్లిదండ్రులు విలపించారు. -
రెండు స్కూల్ బస్సులు ఢీ
జడ్చర్ల టౌన్ (తిమ్మాజిపేట): నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్ సమీపంలో సోమవారం రాత్రి రెండు స్కూల్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. జడ్చర్ల మండలం నాగసాల సమీపంలో ఉన్న ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులను రెండు బస్సులలో సోమవారం బిజినేపల్లి మండలం వట్టెం దేవాలయానికి వెళ్లి అక్కడ పూజలు ముగిశాక పాఠశాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. స్కూల్ బస్సులు రెండు ఒకదాని వెంట మరోటి ప్రయాణిస్తున్నాయి. ఈ సమయంలో మరికల్ సమీపంలో ఎదురుగా ఉన్న కారును తప్పించేందుకు ముందు వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేయటంతో వెనకాలే వస్తున్న మరో బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులకు ఏం జరిగిందో తెలియక కేకలు పెట్టారు. రెండు రెండు బస్సుల్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ముందు సీట్లకు గుద్దుకున్నారు. కొందరు విద్యార్థులకు మూగదెబ్బలు తగలగా నిఖిల్, భాను, చైతన్య, జానకిరాం, విద్వాన్, సాయితేజలకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో జడ్చర్ల పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సుల వెనకాల మరో వాహనం లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. భారీ వాహనం వచ్చిఉంటే ప్రమాద తీవ్రత అధికంగా ఉండేది. ఘటనా స్థలానికి స్కూల్ ప్రతినిధులు చేరుకుని విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తీసుకువెళ్లారు. -
సీఎం జగన్ బర్త్‌డే.. ఉదారత చాటుకున్న దాదాశ్రీ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ('దాదా' అని ప్రేమగా పిలుస్తారు) పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని ఆయన అభిమానుల సంఘం ఎన్జీవో ‘దాదాశ్రీ ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది. ఏపీ ప్రజల సంక్షేమం పట్ల సీఎం నిబద్దత, నాయకత్వాన్ని మెచ్చుకుంటూ కాక కాకడే, ధోకేశ్వర్లోని మాతోశ్రీ గ్లోబల్ స్కూల్ & జూనియర్ కాలేజీకి 54 సీట్ల పాఠశాల బస్సును విరాళంగా అందజేసింది. విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రూ. 33 లక్షల విలువైన ఏసీ బస్సును విరాళంగా అందించి ఓదార్యం చాటుకుంది. బస్సు అందించడంపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ బస్సు గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు చేరవేసేందుకు గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపింది. పాఠశాల విద్యార్ధులు సైతం సీఎం జగన్ ఫోటోతో కృతజ్ఞత తెలిపారు. -
బస్సు చక్రాల కింద నలిగి బాలుడి మృతి
హైదరాబాద్: అప్పటిదాకా అక్క, అన్నయ్యతో సరదాగా ఆడుకుంటూ గడిపిన మూడున్నరేళ్ల బాలుడిని స్కూల్ బస్సు చిదిమేసిన హృదయ విదారక ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. చిరునవ్వులతో తమ వెంట ఉన్న చిన్నారి కళ్లెదుటే క్షణాల్లో అసువులు బాయడంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. శుక్రవారం చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరి«ధిలోని బీఎన్‌రెడ్డినగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి వివరాల ప్రకారం.. బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న నీల మౌనికకు ఇద్దరు కుమారులు హేమంత్ (9), మూడున్నరేళ్ల ప్రణయ్‌తో పాటు కూతురు స్నేహ ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో మౌనిక రెండేళ్లుగా బీఎన్‌రెడ్డి నగర్‌లోని పుట్టింట్లో నివాసం ఉంటోంది. ఇళ్లల్లో పని చేసుకుంటూ పిల్లలను చదివిస్తోంది. శుక్రవారం హేమంత్, స్నేహ స్కూల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు ప్రణయ్‌ను అమ్మమ్మ కనకమ్మ ఇంటి అరుగుపై కూర్చొబెట్టిన తల్లి మౌనిక.. హేమంత్, స్నేహలను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. అదే సమయంలో ప్రణయ్ అరుగు దిగి రోడ్డుపైకి వచ్చాడు. దీనిని గమనించకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ప్రణయ్ ముందు చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి మేనమామ వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హైదరాబాద్: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఘటన జరిగింది.. సోదరుడికి తోడుగా స్కూల్ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్య.. ప్రమాదవశాత్తు రచన గ్రామర్ హైస్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడింది. బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది చిన్నారులు..
సాక్షి, వికారాబాద్: స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మంది పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పడంతో పేరెంట్స్, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. 40 మంది స్కూల్ పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్‌కు చెందిన మినీ బస్సు ప్రమాదానికి గురైంది. సుల్తాన్పూర్ వద్ద ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో నీటిలో ఉన్న బస్సులోకి నుంచి స్థానికులు.. విద్యార్థులను కాపాడారు. ఇక, సదరు బస్సును న్యూ బ్రిలియంట్ స్కూల్‌కు చెందిన వాహనంగా గుర్తించారు. కాగా, బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నివేదిక వచ్చేవరకు జీవో 111కు కట్టుబడి ఉంటాం -
స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. ఎమ్మెల్యే భార్య, విద్యార్థులకు గాయాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. నర్సంపేటలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కమలాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కాగా.. ఆమె కూడా గాయపడ్డారు. అయితే కారులో ఉండే బెలున్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో వెంటనే స్వప్నను వరంగల్ ఆసుపత్రికి తరలించగా.. విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో విద్యార్థులు గాయపడటంతో స్థానికులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భార్యను పోలీసులు సేవ్ చేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల కోసమే ఉన్నారా అని పోలీసులను పేరెంట్స్ నిలదీశారు. ఎమ్మెల్యే వాహనం అతివేగంతో వెళ్ళిన విజువల్స్ అక్కడున్న సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది కూడా చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా -
మహబూబాబాద్ జిల్లా బొడ్లాడ శివారులో స్కూల్ బస్ బోల్తా
-
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి అనంత లోకాలకు చేరు కుంది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించుకుపోయింది. అమ్మా అంటూ ఆ బాలిక చివరి ఆర్తనాదాలు పెట్టింది. ఈ హృదయవిదారక సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం కుర్మల్‌గూడలోని రాజీవ్‌గృహకల్పలో నివ సించే మిర్యాల విజయలక్ష్మి, వేణుగోపాల్ దంపతులు. వారికి ముగ్గురు సంతానం. వారిలో పెద్దపాప హితిషా, చిన్నపాప భావన (6), కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు. మల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. భావన యూకేజీ చదువుతోంది. సోమవారం ఉదయం బడికి వెళ్లిన పిల్లలు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు. భావన ఆడుకోవడానికని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలా పూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు (టీఎస్ 07యుజీ 3293) డ్రైవర్ చూసుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో భావనను ఢీకొట్టాడు. చిన్నారి తలమీద నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అప్పటి వరకు ఆనందంగా ఆడుకుంటున్న బిడ్డ అంతలోనే అనంతలోకాలకు చేరడంతో వారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ప్రమాదానికి కారణమైన బస్సు ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి సర్దిచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి
సాక్షి, తూర్పుగోదావరి: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఈశ్వర్(6) తన తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆల్కాట్ తోట సమీపంలోని ఐఓసి వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. బైక్ నుంచి పక్కకు పడిన బాలుడి తండ్రికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు రాళ్లతో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ కడప: జిల్లాలోని జమ్మలమడుగులో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో నుంచి చిన్నారి సఫినా స్కూల్ బస్సులో పాఠశాలకు బయల్దేరింది. అయితే పాఠశాలకు చేరుకున్నాక బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు వెళ్లనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చదవండి: మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర -
ఫిట్'లెస్' బడి బస్సులు... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన స్కూల్ బస్సులు 224 ఉన్నాయి. ఒక్కో బస్ ఫిట్నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ.5వేలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు రూ.40 వేలు వసూలు చేస్తారు. కానీ జిల్లా వ్యాప్తంగా 85 బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ చేయించుకోకుండా వారి స్వలాభం కోసం అలాగే నడుపుతున్నారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్నెస్ కోసం రూ.5 వేలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి. నిర్మల్‌చైన్‌గేట్: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావస్తున్నా యాజమాన్యాలు ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నెల 12 వరకు అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. అయినా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన బస్సులు 224 ఉండగా ఈ నెల 22 వరకు 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 85 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం జిల్లాలోని 208 ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35 వేలకు పైబడి విద్యార్థులు చదువుతున్నారు. పిల్లల ను పాఠశాలల నుంచి తీసువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రా ణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లాలో 224 బ స్సులు ఉండగా 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందినట్లు సంబంధిత అధికారులు తెలి పారు. పలు ప్రాంతాల్లో కళ్లముందే ప్రమాదాలు కని పిస్తున్నప్పటికీ అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొనసాగుతున్న దళారుల దందా... అమ్మానాన్నలకు బైబై చెప్పి బడికి బయలుదేరుతు న్న చిన్నారులను భద్రంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలది. ఈ బస్సులకు ‘ఫిట్నెస్’ జారీ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) కార్యాలయాల్లో దళా రుల దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వాహనానికి వేలల్లో మామూళ్లు ఇస్తేనే సర్టిఫికెట్ జారీ అవుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాము అధికారులకు కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని దళారులు బాహాటంగానే చెబుతున్నారు. చేతులు తడిపిన యా జమాన్యాల వాహనాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా కరోనా కష్టాల నుంచి ఇంకా కోలుకోని కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఏజెంట్లు అడిగినంత ఇవ్వలేక అవస్థలు పడుతున్నాయి. ఫలితంగా బడులు ప్రారంభమైనా ఇప్పటివరకు 85 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడం గమనార్హం. తనిఖీల జాడేది? విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 11 రోజులు గడుస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడం లేదు. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్నెస్ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతున్నాయి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నీషన్, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండెంట్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి, తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకులంగా 325 మి.మీ ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ● ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి. ● విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్‌కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. ● వాహనం టైర్లు, బ్రేక్‌లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందిందో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉంచాలి. ● పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ● రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి. ఫిట్నెస్ లేకుంటే చర్యలు అనుమతులు లేకుండా పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్‌గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. – అజయ్‌కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి -
రోడ్డుపైనే ఊడిపోయాయి
బొమ్మనహళ్లి: బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. అదృష్టవశాత్తు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. శుక్రవారం సాయంత్రం కేఎ–53–డి–3397 నంబర్‌తో ఉన్న అశోక్ లేల్యాండ్ పాఠశాల బస్సులో సుమారు 20 మందికి పైగా విద్యార్థులను ఎక్కింకుని ఇళ్ల వద్ద డ్రాప్ చేయడానికి బయల్దేరింది. కొంతసేపటికి బస్సు ఎడమవైపు వెనుక భాగంలోని రెండు టైర్లు బయటకు ఊడిపడ్డాయి. బస్సు పెద్ద శబ్ధంతో కుదుపులో లోను కావడంతో డ్రైవర్ నిలిపివేశాడు. ఏం జరిగిందోనని బాలలు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఆగ్రహం 10 నుంచి 15 మంది మాత్రమే కూర్చోగలిగే బస్సులో సుమారు 20 మందికి పైగా చిన్నారులను తీసుకొని వెళ్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలకు ఏమైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. బస్సులు ఫిట్నెస్తో ఉన్నాయా లేదా అని తనిఖీలు కూడా చేయకుండా రోడ్ల మీదకు వదలడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. పాఠశాలల యాజమాన్యం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. గంట తరువాత మరో బస్‌ను పిలిపించి విద్యార్థులను ఇళ్లకు చేర్చారు. ప్రైవేటు స్కూళ్లంటే.. ఒకటో క్లాసు రెండో క్లాసులకు కూడా లక్షల కొద్దీ ఫీజులు కట్టాలి. ఫీజులు ఒక్కరోజు ఆలస్యమైనా సహించరు. పెన్నులు, పుస్తకాలు, షూ అన్నీ అదే స్కూల్లో రెట్టింపు రేట్లకు కొనాలి. నోరెత్తితే నో అడ్మిషన్ అంటారు. కానీ విద్యార్థుల భద్రత, వసతులు, బోధన వంటివి ఎంత నాసిరకంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అటువంటిదే ఈ సంఘటన. -
బడి బస్సులు భద్రమేనా?
తాండూరు టౌన్: పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండానే రయ్రయ్ మంటూ వెళ్తున్నాయి. చిన్నారుల జీవితాలతో ప్రైవేటు స్కూల్ బస్సుల యజమానులు చెలగాటుమాడుతున్నారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. డొక్కు బస్సులతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పటికీ బస్సుల ఫిట్నెస్, పర్మిట్లను రవాణా శాఖాధికారులు తనిఖీలు చేయలేదు. దీంతో పలు బస్సులకు ఫిట్నెస్, పర్మిట్ లేకున్నా రోడ్డెక్కి దర్జాగా స్కూల్ పిల్లలను తరలిస్తున్నాయి. బస్సు పూర్తి స్థాయి కండీషన్లో ఉంటేనే రోడ్లపై తిరగడానికి అర్హత ఉంటుంది. కండీషన్ లేని బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలించినపుడు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం లేని బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 20 శాతం బస్సులకే ఫిట్నెస్ జిల్లా పరిధిలో పలు ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తంగా 191 స్కూల్ బస్సులు ఉన్నాయి. గతేడాది అక్కడక్కడా పలు స్కూల్ బస్సులు విద్యార్థులను తరలిస్తూ ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. 191 బస్సుల్లో ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్న బస్సులు కేవలం 38 మాత్రమే ఉండటం విశేషం. మిగిలిన 153 బస్సులు అంటే 80శాతం బస్సులు ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే విద్యార్థులను తరలిస్తున్నారు. యాజమాన్యాలతో కుమ్మకై ్క అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినపుడు హంగామా చేయకుండా ముందు జాగ్రత్తగా బస్సులను తనిఖీలు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కానరాని సేఫ్టీ పరికరాలు ● ఫిట్నెస్, పర్మిట్లు మాత్రమే కాకుండా ప్రతి స్కూల్ బస్సులో ఆర్టీఏ నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉండాలి. ● చిన్నారులు కిటికీల నుంచి బయటకు తొంగి చూడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. ● ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రాథమిక చికిత్స చేయడానికి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండాలి. ● బస్సులో అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. స్కూల్ బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ర్యాక్స్ ఉండాలి. ● బస్సు బయట రేడియం స్టిక్కర్లు అంటించాలి. ప్రమాదం జరిగినపుడు అద్దాలను పగుల గొట్టేందుకు సుత్తె వంటి పనిముట్లు ఉండాలి. ● అగ్ని ప్రమాదం సంభవించినపుడు మంటలను ఆర్పేందుకు అవసరమైన అగ్ని నిరోధక రసాయన సిలిండర్లు ఉండాలి. అలాగే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు స్కూల్ బస్సులు నడపరాదు. ● ఇలాంటి నిబంధనలతో కూడిన బస్సుల్లో మాత్రమే విద్యార్థులను తరలించేందుకు అనుమతులు ఇస్తారు. నిబంధనల ప్రకారం లేని బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేయాల్సి ఉంటుంది. తనిఖీలు ముమ్మరం చేశాం పాఠశాలలు ప్రారంభం కాకముందే యాజమాన్యం బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. జిల్లాలో కేవలం 38 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. తనిఖీలు ముమ్మరం చేశాం. ఇప్పటికీ రెండు బస్సులను సీజ్ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తప్పవు. – వెంకట్ రెడ్డి, ఆర్టీఓ -
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.. తల్లిదండ్రుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల బస్సులు పూర్తిగా దారి తప్పాయి. విద్యార్థులను భద్రంగా ఇళ్లకు చేర్చేందుకు ఉద్దేశించిన నిబంధనల విషయంలో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. సోమవారం నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికల్లా ఫిట్నెస్ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నా, ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం వాహనాలు మాత్రమే దాన్ని పూర్తిచేసుకున్నాయి. అధికారులు బస్సుల ఫిట్నెస్ పరిశీలించి అవి రోడ్డుపై నడిచేందుకు యోగ్యంగా ఉన్నదీ లేనిదీ తేలుస్తారు. ఆ మేరకు ఫిట్నెస్ రెన్యూవల్ చేస్తారు. ఇప్పుడు ఫిట్నెస్ రెన్యూవల్ లేకుండానే 80 శాతం బస్సులు రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 29 వేల పైచిలుకు విద్యాసంస్థల బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 6 వేల బస్సులు మాత్రమే ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకున్నాయని సమాచారం. విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న వేళ పరిస్థితిని ముందే గుర్తించి హెచ్చరించాల్సిన రవాణాశాఖ పెద్దగా స్పందించలేదు. సోమవారంలోపు రెన్యూవల్ చేయించుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలైనా జారీ చేయలేదు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభం అవుతూనే రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఫిట్నెస్ రెన్యూవల్ లేని బస్సులను గుర్తించి వాటి గుర్తింపు రద్దు చేయటం లాంటివి చేస్తారు. విద్యాసంస్థలకు పెనాల్టీలు విధిస్తుంటారు. కానీ, ముందుగానే హెచ్చరికలు జారీ చేయటం ద్వారా విద్యాసంస్థల్లో భయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ప్రారంభమయ్యాక పట్టుబడితే పెనాల్టీలు విధించటం వరకు సరే, అసలు ఫిట్నెస్ లేక బస్సు ప్రమాదానికి గురైతే విద్యార్థుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శిక్షణ ఏది..? విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోపు విద్యాసంస్థల బస్సులు నడిపే డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలన్న నిబంధన ఉంది. సఫర్ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలుంటాయి. డ్రైవింగ్ నైపుణ్యం, బస్సు నిబంధనలు, విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే తీరు.. ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఆ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదు. విద్యార్థులు ఆ బస్సుల్లో ఎక్కడం ప్రారంభమయ్యేలోపే ఈ శిక్షణ పూర్తి చేస్తే ఉపయోగం ఉంటుంది. తర్వాత ఎప్పటికో శిక్షణ ఇస్తే, ఈలోపు అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే ఏంటన్నది తల్లిదండ్రు ఆందోళన. -
స్కూల్ బస్సుకింద పడి బాలుడి మృతి
కళ్యాణదుర్గం: స్కూల్ బస్సు దూసుకెళ్లడతో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. మండలంలోని చాపిరి గ్రామానికి చెందిన మధు, వాణీ దంపతులకు ఒక్కగానొక్క సంతానం అయిన విçహాన్ (5) కళ్యాణదుర్గం జ్ఞానభారతి పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం విహాన్ పాఠశాల నుంచి బస్సులో చాపిరి గ్రామానికి వచ్చాడు. బస్సుదిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ బస్సు వెనుక చక్రాల కింద పడ్డాడు. స్కూల్ బస్సు డ్రైవర్ గమనించకుండా ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విహాన్ బస్సు టైరు కింద పడి మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు స్కూల్ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లితండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు గా విలపించారు. చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
వేగంగా వెళ్తున్న బస్సులో కుదుపులు.. డోర్ నుంచి కిందపడటంతో..
సాక్షి, భువనగిరి: మమ్మీ బైబై.. అంటూ స్కూల్‌కు వెళ్లిన చిన్నారి కానిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని హైదర్‌పూర్ గ్రామానికి చెందిన వడ్డేమోని శ్రీనివాస్, రాణి దంపతులకు మల్లికార్జున్, అభిలాష్(8) ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె వర్షిత ఉన్నారు. వీరంతా మండల కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నారు. మల్లికార్జున్ 5వ తరగతి, అభిలాష్ ఒకట తరగతి, వర్షిత ఎల్కేజీ చదువుతుంది. ఉదయం అందరూ రెడీ అయి స్కూల్‌కు వెళ్లారు. ఒంటిపూట బడులు కావడంతో స్కూల్ వదిలిన తరువాత తిరిగి స్కూల్ బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి జారి.. స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు.. ఆయా గ్రామాలలో పిల్లలను దింపుతూ చివరగా హైదర్పూర్కు వెళ్తుంది. బస్సులో 10 మంది వరకు విద్యార్థులున్నారు. ఈ క్రమంలో భీమనపల్లి గ్రామం దాటిన తరువాత బస్సు డ్రైవర్ జింకల రాము అతివేగంగా బస్సును నడిపాడు. గ్రామశివారులోని చెరువు దాటిన తరువాత మూలమలుపు వద్ద కుదుపునకు బస్సులో ఉన్న అభిలాష్ కదులుతున్న బస్సులోంచి జారి కింద పడగా, బస్సు వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లింది. విద్యార్థి బస్సులోంచి పడిపోయిన విషయాన్ని డ్రైవర్ కనీసం చూడకుండానే వేగంగా అలానే ముందుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో భీమనపల్లి గ్రామానికి చెందిన ముంత కృష్ణ అనే వ్యక్తి బైక్‌పై వస్తూ విద్యార్థి కిందపడిపోవడాన్ని గమనించి కొద్దిదూరం వెళ్లిన బస్సును ఆపాడు. అందరూ కలిసి అక్కడికి వెళ్లి చూడగా అభిలాష్ రక్తపుమడుగులో విగతజీవిగా మారాడు. బస్సు డోర్‌కు లాక్ ఉండి ఉంటే... స్కూల్ బస్సు డోర్‌కు లాక్ సరిగా లేని కారణంగా బస్సులో ఉన్న వృద్ధురాలైన ఆయా పోశమ్మ డోర్ లాక్ వేయలేదు. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును వేగంగా నడపడం వల్ల నిండుప్రాణం బలైపోయింది. విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసి గుండెవిసేలా రోదించారు. సమాచారం అందుకొన్న ఎస్ఐ సైదిరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ రామును అదుపులోకి తీసుకొన్నారు. అలాగే బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన బస్సు నుంచి అభిలాష్(6) అనే విద్యార్థి కిందిపడి మృతిచెందిన విషయంపై ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు భువనగిరి డీఈవో కె నారాయణరెడ్డి తెలిపారు. -
పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేటలోని విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న మండలంలోని అల్మాస్పూర్, రాజన్నపేట గ్రామాలకు చెందిన 22 మంది విద్యార్థులు స్కూల్‌బస్సులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డిపేట శివారులోని రెండోబైపాస్ మూలమలుపు వద్ద కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు వెనుకభాగం ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ బస్సులోని వెనుకసీట్లో కూర్చున్న విద్యార్థులు విహాన్, ఆదిత్య, దినేశ్, వినయ్, శివ, శివారెడ్డి, శ్రీనివాస్, తనుశ్రీ, మల్లికార్జున్, కావ్య, ధరణి, వర్షిణి, మణిసూదన్, మణిదీప్, సిద్దేశ్తోపాటు బస్సు క్లీనర్ అజయ్‌లు గాయపడ్డారు. రక్తం కారుతుండడంతో పిల్లలు భయాందోళనకు గురై రోదించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిరావడంతో అక్కడ పరిస్థితి రోదనలతో మిన్నంటింది. ఫోన్లో ఆరా తీసిన మంత్రి కేటీఆర్ ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో ఫోన్లో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే డీఈవో రాధాకిషన్‌ను అప్రమత్తం చేశారు. ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి చేరుకున్న డీఈవో రాధాకిషన్ ప్రమాద సంఘటనపై వివరాలు సేకరించి, విద్యార్థులను పరామర్శించారు. -
Viral Video: బస్సులో భారీ కొండచిలువ
-
షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..
భోపాల్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ భిండ్‌లో 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో(కార్డియాక్ అరెస్ట్) ప్రాణాలు కోల్పోయాడు. ఇంత చిన్న వయసులో ఈ కారణంగా చనిపోయిన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు. ఓ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు మనీష్ జాతవ్. గురువారం మధ్యాహ్నం సోదరుడితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశాడు. అనంతరం 2:00 గంటలకు స్కూల్ బస్ ఎక్కాడు. క్షణాల్లోనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. విద్యార్థిని గమనించిన బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అప్రమత్తం చేశాడు.స్పృహకోల్పోయిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే చనిపోయాడని వాళ్లు ప్రకటించారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
స్కూల్ బస్సులో దూరిన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో
ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడి పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్‌లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. రాయ్‌బరేలిలోని ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పాఠశాలకు సెలవు కావడంతో బస్సును డ్రైవర్ తన గ్రామానికి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్క్ చేశాడు. ఆ బస్సు పక్క నుంచి మేకల మంద వెళ్తుంటే బస్సులో నుంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు గమనించారు. బస్సులో ఏదో ఉందనే అనుమానంతో పరిశీలించి చూడగా.. భారీ కొండచిలువ బస్సులో తిష్ట వేసింది. ఇంజిన్ భాగం వద్ద ఓ సీట్ కింద పెద్ద కొండచిలువ దాక్కుంది. చదవండి: వైరల్: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్‌కు జో బైడెన్ సలహా సమాచారం అందుకున్న సిటీ సీఓ వందనా సింగ్, సిటీ మెజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గంటపాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు. పట్టుకున్న కొండచిలువ బరువు 80 కేజీలు, పదకొండున్నర అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. Uttar Pradesh: रायबरेली में स्कूल की बस के इंजन में विशालकाय अजगर फंसा था। कड़ी मशक़्क़त के बाद वन विभाग की टीम ने निकाला बाहर। अजगर को रस्सी के सहारे बाहर निकाला गया। इस अजगर का वजन करीब 80 किलो और उसकी लंबाई साढ़े 11 फीट है। अजगर को सुरक्षित जंगल में छोड़ दिया गया है। #Python pic.twitter.com/TAoq9aq8CP — Tanseem Haider तनसीम हैदर Aajtak (@TanseemHaider) October 16, 2022 అటవీ అధికారులు బస్సులో నుంచి కొండచిలువను తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక అధికారి స్కూలు బస్సు దిగువ నుంచి కొండచిలువను లాగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆదివారం కావడంతో పాఠశాల మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
మీ పిల్లలు బడికి వెళ్తున్నారా.. పేరెంట్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి!
కొన్నిసార్లు మనుషులు చేసే తప్పిదాలు.. తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. క్షణికావేశం, క్షణకాల నిర్లక్ష్యం కారణంగా ఎదుటివారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన జెఫ్ఫర్సన్ పబ్లిక్ స్కూల్ బస్సు నుండి ఓ చిన్నారి(6) కిందకు దిగుతోంది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్.. డోర్ ఓపెన్ చేసింది. కాగా, చిన్నారి పూర్తిగా స్టెప్స్ దిగకముందే.. డోర్ క్లోజ్ కావడంతో ఆమె బ్యాగ్.. డోర్ మధ్యలో చిక్కుకుపోతుంది. దీంతో, బాలిక.. కిందకు దిగకుండా అలాగే నిల్చుడిపోతుంది. అది గమనించని డ్రైవర్.. బస్సును స్టార్ట్ చేసి వెళ్లిపోతుంటాడు. HOLY SHIT. The little girl is miraculously fine, the bus driver has been fired. pic.twitter.com/uuijsrNn2U — Dean Blundell🇨🇦 (@ItsDeanBlundell) September 23, 2022 దీంతో, చిన్నారి బస్సు డోర్‌కు వేలాడుతూనే వస్తుంది. ఇలా దాదాపు 1000 అడుగుల దూరం వచ్చాక.. బస్సులో ఉన్న వారు చిన్నారిని చూసి కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేస్తుంది. ఈ ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడుతుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తారు. ఇక, ఈ ఘటన అనంతరం డ్రైవర్‌ను విధుల నుంచి తొలిగిస్తారు. అలాగే, పాఠశాల యాజమాన్యం చిన్నారి పేరెంట్స్‌కు దాదాపు 5 మిలియన్ల డాలర్లను నష్టపరిహారంగా ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాదం 2015లో జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
వాగు అవతల రైతులు.. వాగు మధ్యలో విద్యార్థులు
తాడ్వాయి/ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సాగు పనులకు వెళ్లిన 170 మంది కూలీలు వాగు అవతల చిక్కుకుపోగా..మరోచోట వరద నీటిలో విద్యార్థులతో కూడిన స్కూలు బస్సు చిక్కుకుపోయింది. ఈ రెండు ఘటనలు బుధవారం కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో చోటుచేసు కున్నాయి. కామారెడ్డి జిల్లా సంతాయిపేటకి చెందిన 170 మంది రైతులు, కూలీలు బుధవారం ఉదయం వ్యవసాయ పనులకు భీమేశ్వర వాగు అవతల ఉన్న పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం మండలంలోని దేమికలాన్, కరడ్‌పల్లి, నందివాడ, ఎండ్రియాల్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల నుంచి చిన్నచిన్న వాగులు పొంగి ప్రవహిస్తూ భీమేశ్వరవాగు లో చేరడంతో ఈ వాగు ఉధృతమైపోయింది. దీంతో కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలు సుకున్న గ్రామస్తులు...వారిని వాగు దాటించేందుకు చేసిన యత్నం విఫలమైంది. దీంతో పోలీసులు, కామా రెడ్డి ఫైర్‌సిబ్బంది వాగు వద్దకు చేరుకుని జేసీబీ సాయంతో కూలీలను ఇవతలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో వారూ చిక్కుకుపోయారు. చివరకు రాత్రి 11–12 గంటల మధ్య సమయంలో కష్టమ్మీద 50 మందిని వాగు దాటించి తీసుకువచ్చారు. మిగతా వారిని వాగు ఇవతలికి చేర్చే యత్నాలు కొనసాగుతున్నాయి. వాగులో చిక్కుకున్న స్కూల్ బస్సు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నశీంపేట వద్ద చివ్వెంల–ముకుందాపురం రహదారిపై లోలెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరదలో బుధవారం స్కూల్ బస్ చిక్కుకుపోయింది. ఉదయం ఆయా గ్రామాల నుంచి పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో నశీంపేట వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రైవర్ ఇదేమీ పట్టించుకోకుండా దాదాపు 24మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును వరదలోకి తీసుకెళ్లాడు. మధ్యలోకి రాగానే బస్సు ఇంజన్ విఫలమై బస్సు కదలకుండా ఆగిపోయింది. ఎంతకూ బస్సు స్టార్ట్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వెంటనే కార్యకర్తలను పురమాయించి స్థానికులతో కలసి బస్సును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాఠశాలల యాజమాన్యాలు, పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. తదనంతరం పోలీసులు ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో వరదల్లో బస్సు.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో, సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. గ్రామాలు, నగరాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో వాహన ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, షాజాపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం 24 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. రోడ్డు మీద వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, స్కూల్ బస్సు వరదల్లో చిక్కుకుపోవడంతో విద్యార్థులు భయంతో కేకలు వేశారు. A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were in the bus, the villagers present on the spot showed agility and pulled the bus out of the water by tying a rope with the help of a tractor.#madhyapradesh pic.twitter.com/ZvfnKVrBLG — Siraj Noorani (@sirajnoorani) July 23, 2022 ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఓ ట్రాక్టర్ సాయంతో బస్సును వరదలో నుంచి బయటకు తీశారు. 24 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. పిల్లలందరూ క్షేమంగా బయటపడటంతో వారి పేరెంట్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. #MadhyaPradesh | School Bus With Over 2 Dozen Children Stuck In Drain Amid Heavy Rain, Pulled Out https://t.co/PTKiaw2fSF pic.twitter.com/56dWF8bFPq — NDTV (@ndtv) July 23, 2022 ఇది కూడా చదవండి: చేపకు వేలంలో రూ. 3 లక్షలు.. స్పెషల్ తెలిస్తే షాక్ అవుతారు -
మహబూబాబాద్ జిల్లా: వరద నీటిలో చిక్కుకున్న ఆర్యభట్ట పాఠశాల బస్సు
-
వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
-
మహబూబ్‌నగర్.. వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి మహబూబ్‌నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళుతున్న భాష్యం టెక్నో స్కూల్‌కు చెందిన బస్సు నీటిలో చిక్కుకుంది. రాంచంద్రపూర్, మాచన్‌పల్లి, సూగురుగడ్డ తాండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది. చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విద్యార్దులంతా క్షేమంగా బయటపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు. అయితే బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి -
విషాదం: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు, కొందరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులు జిల్లా డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ చెప్పారు. సయింజ్ వైపునకు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 ప్రాంతంలో జంగ్లా గ్రామం వద్ద ప్రమాదానికి గురైందని తెలిపారు. జిల్లా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టు గార్గ్ వెల్లడించారు. పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్.. తీరా ఓపెన్ చేసి చూస్తే.. -
ప్రభుత్వం సీరియస్.. ఇకపై బడి బస్సుల్లో అవి తప్పనిసరి
సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు, ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల్లో సీసీ కెమెరాలను ప్రభుత్వం తప్పని సరి చేసింది. అలాగే, నలువైపులా సెన్సార్ పరికరాల్ని అమర్చాలన్న ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. గతంలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సులో ఉన్న రంధ్రం నుంచి కింద పడి ఓ విద్యార్థిని మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో జనంలో ఆగ్రహావేశాల్ని రగల్చడంతో కోర్టు జోక్యం చేసుకుంది. దీంతో విద్యాసంస్థల బస్సులు, విద్యార్థులను తరలించే ప్రైవేటు ఆపరేటర్ల వాహనాలకు సంబంధించిన నిబంధనలు కఠినం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేసి, సర్టిఫికెట్లను మంజూరు చేస్తూ వస్తున్నారు. అయినా, ఏదో ఒక చోట విద్యా సంస్థల బస్సులు, ఇతర ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల కారణంగా విద్యార్థులకు ప్రమాదాలు తప్పడం లేదు. దీంతో మోటారు వెహికల్ చట్టంలో సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వుల జారీ.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఫనీంద్రరెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు లగ్జరీ కార్లు వంటి వాహనాల్లో ఉండే విధంగా విద్యాసంస్థల బస్సులు, వాహనాల్లో ముందు, వెనుక భాగాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు. అలాగే, వాహనాలకు నలువైపులా సెన్సార్ పరికరం అమర్చేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా బస్సు ముందు, వెనుక భాగంలో ఎవరైనా ఉన్నారా..? అని డ్రైవర్ తెలుసుకునేందుకు వీలుందని వివరించారు. అలాగే, సెన్సార్ పరికరం నుంచి వచ్చే సంకేతాల మేరకు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుందని పేర్కొన్నారు. తక్షణం ఆయా బస్సులు, వాహనాల్లో వీటిని అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని, తనిఖీలు చేయాలని ఆర్టీఓ అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. -
విరగ‘బడి’ వసూళ్లు! పీపీకి రూ.22 వేలు? అడిగే దిక్కేది!
నిజామాబాద్‌అర్బన్: కరోనా కల్లోల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తోన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ల్యాబ్, లైబ్రరీ స్పోర్ట్స్, ఇతర ఫీజుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రస్తుతం 456 ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా తర్వాత రెండేళ్లకు తెరుచుకున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. ఆర్మూర్ నిజామాబాద్, బోధన్, భీమ్‌గల్, డిచ్పల్లి వంటి పట్టణాల్లో ఫీజుల దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. పీపీ–1 క్లాస్ పిల్లవాడికి నిజామాబాద్ నగరంలో అన్ని ఫీజులు కలుపుకొని రూ. 50వేల వరకు ఒక కార్పొరేట్ పాఠవాల వసూలు చేస్తోంది. ఆర్మూర్ గ్రామీణ ప్రాంతంలో ఓ కార్పొరేట్ పాఠశాల, బోధన్ రాకాసిపేట్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. సర్కార్ బడి వైపు పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ మాత్రం చేపట్టడం లేదు. చదవండి👉🏻అసలే కానిస్టేబుల్.. ఆపై తులం బంగారమిస్తే డబుల్ ఇచ్చారు.. అక్కాచెళ్లెళ్ల మాదిరి! ఉత్తర్వులు అమలెక్కడ....? విద్యాశాఖలో కొన్నేళ్ల ఫీజుల నియంత్రిణ కోసం జీవో.నం. 1ను మొదట విడుదల చేశారు. 2017 ఫిబ్రవరి ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం జీవో.నం. 1ను అమలు చేస్తూనే ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవచ్చని జీవో నం. 46ను విడుదల చేసింది. కాని పది శాతాన్ని పక్కకు పెట్టు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారి మొదలుకొని ఎంఈవో వరకు ఎవరూ కూడా ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భాలు లేవు. ఫిర్యాదులు వస్తేనే చూస్తామనే ధోరణిలో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలతో మిలాకత్ అయి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎటువంటి అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. జిల్లాలో సగటున ప్రతి ప్రైవేట్ విద్యార్థి నుంచి రూ. 1,000 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. హాస్టల్ వసతి పేరుతో రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చదవండి👉🏻పార్కింగ్ బాధ్యత యజమానులదే: హైకోర్టు ప్రైవేట్‌లో ఫీజుల వివరాలు.. చదువు కంటే బస్సు ఫీజులే ఎక్కువ నగరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బస్సుల ఫీజులు పాఠశాల ఫీజుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆర్మూర్ రోడ్డులో ఉన్న మూడు ప్రైవేట్ పాఠశాలల్లో ఏడాదికి రూ. 32 వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ. 20 వేల వరకు ఉన్నాయి. ఇలా విద్యార్థుల ఫీజుల కంటే బస్సు చార్జీలే ఎక్కువయ్యాయి. భారం మోయలేకపోతున్నాం.. పెరిగిన ఫీజుల భారం మోయలేకపోతున్నాం. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఫీజులు పెంచడం సబబు కాదు. తక్షణమే విద్యాశాఖాధికారులు స్పందించాలి. మధ్యతరగతి, పేదవారికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. అసలే కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ ఫీజులను భరించలేకపోతున్నాము. – మనోజ్, విద్యార్థి తండ్రి గాయత్రి నగర్ నిబంధనల ప్రకారం వసూలు చేయాలి ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారమే ఫీజులు వసులు చేయాలి. విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి. లేదంటే పాఠశాలలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, డీఈవో -
గ్యాస్ బండి.. బాగుందండి..
ఆరిలోవ(విశాఖ తూర్పు): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎన్జీ బస్సులు నడుపుతూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది విశాఖ వ్యాలీ స్కూల్. ఇటీవల పాఠశాల యాజమాన్యం కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ)తో నడిచే ఆరు బస్సులను కొనుగోలు చేసింది. పాఠశాల విద్యార్థుల కోసం ఈ బస్సులను నడుపుతోంది. కొన్నేళ్లుగా నడుస్తున్న బస్సులు మరమ్మతులకు గురి కావడంతో.. వాటి స్థానంలో డీజిల్‌తో నడిచేవి కాకుండా సీఎన్జీ బస్సులు కొనుగోలు చేసింది. డీజిల్‌తో నడిచే బస్సుల కారణంగా అధిక శాతం నల్లని పొగ బయటకు వస్తుంది. దీని వల్ల పర్యావరణానికి చాలా నష్టం. అదే సీఎన్జీ బస్సులతో నగరానికి కాలుష్య ముప్పు తక్కువ. అందులో భాగంగానే విశాఖ వ్యాలీ పాఠశాల యాజమాన్యం సీఎన్జీ బస్సులను కొనుగోలు చేసి.. ప్రైవేట్ పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా డీజిల్‌తో నడిచే బస్సుల కంటే ఈ బస్సులు ఎక్కువ మైలేజీ ఇస్తాయని డ్రైవర్లు చెబుతున్నారు. డీజిల్ బస్సులు లీటర్‌కు 5 నుంచి 6 కిలోమీటర్లు నడుస్తాయి. అదే సీఎన్జీ బస్సులు ఓ కిలో గ్రాము గ్యాస్‌తో 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం నడుస్తాయని చెబుతున్నారు. వీటి వల్ల కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువగా వెలువడుతుంది. వాతావరణం కాలుష్యం కాకుండా తమ వంతు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని ఇక్కడ యాజమాన్యం చెబుతోంది. ఇటీవల కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఈ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులను పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పరిశీలిస్తున్నాయి. ఎక్కువ మైలేజీతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తంగా ఉండటంతో.. వీటిని నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బస్సులో సౌకర్యాలు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఈ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇద్దరు విద్యార్థులకు ఒక సీటు చొప్పున కేటాయించారు. ప్రతి బస్‌లో 40 మంది విద్యార్థులు ప్రయాణించవచ్చు. ఇందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ సిద్ధం చేశారు. బస్ వెనుక భాగం కిందన సీఎన్జీ సిలిండర్ల క్యాబిన్ ఉంటుంది. అన్ని బస్‌లు సీఎన్‌జీవే నడుపుతాం భవిష్యత్‌లో అన్నీ సీఎన్జీ బస్సులు నడపాలనే ఆలోచనలో ఉన్నాం. ఇక్క డ విద్యార్థుల అవసరానికి తగినట్లు 13 బస్సులున్నాయి. వాటిలో ఆరు మరమ్మతులకు గురయ్యాయి. వాటి స్థానంలో సీఎన్జీ బస్సులు కొనుగోలు చేశాం. వీటి వల్ల కాలుష్యం ఉండదు. అతి తక్కువగా కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. పర్యావరణం పరిరక్షణ కోసం మా వంతు కృషి చేస్తున్నాం. – ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపాల్, విశాఖ వ్యాలీ స్కూల్ -
రెండేళ్లుగా రోడ్డెక్కలేదు.. మరి బడి బస్సు భద్రమేనా?
సాక్షి,ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు కొంతకాలంగా ఉన్నచోటు నుంచి కదలకుండా ఉండడంతో మూలనపడ్డాయి. గత విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో బడులు ప్రారంభమైనప్పటికీ పెద్ద స్కూల్లకు సంబంధించిన బడి బస్సులు రోడ్డెక్కాయి. మిగితా పాఠశాలల బస్సులు ఇంకా కదలకుండానే ఉన్నాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న చాలా మంది విద్యార్థులు స్కూల్ బస్సుల్లోనే పాఠశాలకు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో బడి బస్సు భద్రమెంత అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఫిట్నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ పరిధిలో 192 స్కూ ల్ బస్సులు, ఆసిఫాబాద్ జిల్లాలో 102 బస్సులు ఉండగా ఒక్కదానికి కూడా ఫిట్నెస్ లేదు. మంచిర్యాల జిల్లాలో 400 బస్సులకు గానూ నాలుగింటికి, నిర్మల్ జిల్లాలో 270 స్కూల్ బస్సులకు గానూ 20 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,430 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 987 ప్రాథమిక, 186 ప్రాథమికోన్నత, 257 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,32,031 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని 146 ప్రైవేట్ పాఠశాలల్లో 26,039 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సగానికిపైగా విద్యార్థులు స్కూల్ బస్సుల్లోనే ఇంటికి రాకపోకలకు కొనసాగిస్తుంటారు. 146 ప్రైవేట్ పాఠశాలలకు 192 స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిన్నింటికీ ప్రస్తుతం ఫిట్నెస్ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు ఇన్సూరెన్స్ కూడా ముగిసింది. రోజుకు రూ.50 జరిమానా.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించనున్నట్లు రవాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇన్సూరెన్స్, పొల్యూషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు జరిమానా పేరిట ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఫిట్నెస్ సామర్థ్య పరీక్షలకు ఏడాదిన్నర పాటు వెసులుబాటు కల్పించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి వాహనాల సామర్థ్య పరీక్షలు చేయించుకోని వాటికి రోజుకు రూ.50 చొప్పున జరిమానా కట్టించాలన్న నిబంధన విధించింది. బస్సు భద్రమెంత.? కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు ఆర్థికంగా చతికిలపడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్లైన్లోనే తరగతులు కొనసాగాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నేరుగా విద్యాబోధన జరుగుతోంది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తప్పనిసరి బస్సు భద్రత అవసరమేనని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర బస్సు సామగ్రి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేది చూసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. స్కూల్ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించొద్దు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక నమోదు చేసి ఉంచాలి. గతంలో చిన్నచిన్న ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ బస్సు యాజమాన్యాలపై ఉంది. ఈ నిబంధనలు తప్పనిసరి.. ► స్కూల్æబస్సుకు పాఠశాల పేరు, సెల్‌ఫోన్ నంబర్, పూర్తి చిరునామా బస్సు ఎడమ వైపు పూర్తిగా కనిపించేలా ఉండాలి ► డ్రైవర్ వయస్సు 60 సంవత్సరాలకు మించరాదు. తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. ► డ్రైవర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. ► ప్రతీ బస్సుకు ఒక అటెండర్ ఉండాలి. ► బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ► బస్సులో అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలి. ► బస్సులకు తలుపులు అమర్చబడి ఉండాలి. ► కిటికీలకు మధ్య రెండు లోహపు కడ్డీలు అమర్చబడి ఉండాలి. ► విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అటెండెన్స్ తీసుకోవాలి. భద్రత విషయంలో రాజీపడం పాఠశాల బస్సుల భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. డ్రైవర్లు లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలి. బస్సు కండీషన్ ఉంటేనే నడపాలి. నిబంధనలు అతిక్రమించి బస్సు నడిపితే సీజ్ చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆదిలా బాద్, కుమురంభీం జిల్లాల పరిధిలో ఒక్క ప్రైవేట్ స్కూల్ బస్సుకు కూడా ఫిట్నెస్ లేదు. గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తాం. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్ -
అక్కడ బడికి పోతే బస్సెక్కినట్లే.. ఎందుకంటే!
రాయచూరు రూరల్(బెంగళూరు): మస్కి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గదికి చిత్రకారులు బస్సు రూపం తెచ్చారు. బస్సును పోలినవిధంగా వేసిన పెయింటింగ్ విద్యార్థులను ఆకట్టుకుంటోంది. జిల్లా విద్యాశాఖా అదనపు అధికారి సుఖదేవ్ శనివారం పాఠశాలను సందర్శించి పెయింటింగ్‌ను ఆసక్తిగా తిలకించారు. అనంతరం విద్యార్థులతో పలు విషయాలపై చర్చించారు. విద్యార్థుల్లో సృజనను పెంపొందించేందుకు కలికా చేతనను పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయుష్మాన్ భారత్‌తో ప్రజల ఆరోగ్య సంరక్షణ బళ్లారిఅర్బన్: ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్య కర్ణాటక సాధ్యమని మాజీ ఎంపీ శాంత పేర్కొన్నారు. బళ్లారి తాలూకా రూపనగుడి గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మంగళూరు శ్రీనివాస్ ఆస్పత్రి శనివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రూపనగుడి గ్రామంలో మంత్రి శ్రీరాములు ఈ ఆస్పత్రి నిర్మించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు పాటు పడ్డారన్నారు. మంగళూరు శ్రీనివాస్ ఆస్పత్రి వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం బీపీఎల్, ఆధార్ కార్డు ఉన్న వారందరికి జనరల్ చెకప్, గుండె జబ్బులు, శ్వాసకోస, స్త్రీ రోగ, చెవి, గొంతు, ఎముకలు, థైరాయిడ్, గర్భకోశ తదితర వ్యాధులకు 8 మంది వైద్యులు చికిత్సలు చేశారు. స్థానికులతోపాటు అనంతపురం జిల్లానుంచి కూడా రోగులు వచ్చి వైద్యం చేయించుకున్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షులు నాగరాజ్, బీజేపీ ప్రముఖులు ఓబులేష్, గోవిందప్ప, ప్రకాష్, డాక్టర్.వీరేంద్రకుమార్, వైద్యులు ఆదర్శ, నివేదిత, రుచిక్, అభిజిత్, భార్గవి, యశ్వంత్, ప్రియాంక, విఘ్నేశ్ శెట్టి, వినిత్, వినోద్‌కుమార్ పాల్గొన్నారు. చదవండి: ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవరాక్షన్.. డెలివరీ బాయ్ అంటే అంత చులకనా.. వీడియో వైరల్ -
ఏయ్ ఆపు.. నోర్ముయ్: ప్రభుత్వాధికారిణి జులుం!
బిడ్డ పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ తల్లిని ఓదార్చాల్సింది పోయి.. ఆ ప్రభుత్వాధికారిణి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాటి ఆడదానిగా ఆ తల్లి శోకాన్ని అర్థం చేసుకోలేకపోయిందని, అధికారం ఉందని ఎలా పడితే అలా వ్యవహరిస్తుందా? అని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ మోదీనగర్‌లో పదేళ్ల అనురాగ్ భరద్వాజ్ అనే కుర్రాడి మరణం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బుధవారం ఎప్పటిలాగే తన స్కూల్ బస్సులో వెళ్తుండగా.. డ్రైవర్ నిర్లక్ష్యంగా బండి నడపడం, హఠాత్తుగా మలుపులు తిప్పడంతో.. అనురాగ్ తన తల బయట పెట్టి వాంతులు చేసుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ మరోసారి మలుపులు తిప్పడంతో.. ఓ స్తంభానికి తల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో డ్రైవర్, బస్సులో ఉన్న మరో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫిట్నెస్ లేని బస్సును నడిపించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా.. అనురాగ్ తల్లిదండ్రులతో పాటు మరికొందరు పేరెంట్స్ ధర్నాకు దిగారు. అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం మీద ఏప్రిల్ 1వ తేదీనే స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే తన కొడుకు బతికేవాడని రోదిస్తూ నినాదాలు చేసింది అనురాగ్ తల్లి నేహా. ఈ క్రమంలో.. మోదీనగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ శుభాంగి శుక్లా అక్కడికి వచ్చారు. ‘‘ఎందుకు అర్థం చేసుకోవట్లదమ్మా? చెప్తున్నాగా నోరు మూస్కో’’ అని నేహాను గద్దించింది శుభాంగి. ‘చనిపోయింది నీ కొడుకా? నా కొడుకు?’’ అంటూ ఏడుస్తూ బదులిచ్చింది నేహా భరద్వాజ్. దీంతో కోపోద్రిక్తురాలైన శుభాంగి.. ఎన్నిసార్లు చెప్పాలి. అర్థం చేసుకోవా? నేను అర్థం చేసుకున్నా.. నీ కొడుకు చచ్చాడు’’ అంటూ నోరు పారేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. స్కూల్‌యాజమాన్యంపై చర్యలతో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను తక్షణమే స్కూల్ బస్సుల ఫిట్నెస్ను పరిశీలించాలని ఆదేశించాడు. అయితే అధికారిణిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ తరుణంలో.. ఆమెపై వేటు వేయాలని పలువురు పేరెంట్స్ కోరుతున్నారు. అయితే ప్రమాదంలో కుర్రాడి తప్పే ఉందని, వాంతులు వస్తున్న విషయం బస్సులో ఉన్న టీచర్‌కు చెప్పకుండా తల బయటకు పెట్టాడని ఎస్డీఎం శుభాంగి శుక్లా అంటున్నారు. చదవండి: యువకుడ్ని లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే -
మొదటిరోజే.. చివరి రోజైంది..
మానవపాడు: పలకా, బలపంతో పాఠశాలకు వెళ్లిన బాలుడికి మొదటి రోజే స్కూల్ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. మూడేళ్ల ప్రాయంలోనే నూరేళ్లు నిండిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో సోమవారం ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. చంద్రశేఖర్‌నగర్ గ్రామం శ్రీనగర్ కాలనీకి చెందిన మహేశ్, సూర్యబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. మహేశ్ ఏపీలోని కర్నూలులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు కొడుకులు అభి, అజయ్‌కుమార్ (3)లను పాఠశాలలో చేర్పించేందుకు రెండు రోజుల క్రితం వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో రూ.4 వేలు ఫీజు కట్టి వచ్చారు. సోమవారం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపారు. తరగతులు పూర్తయ్యాక బస్సులో అజయ్ ఇంటి వద్దకు వచ్చాడు. బస్సు దిగి రోడ్డుకు ఆవలివైపు ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు వస్తుండగా తల్లి గమనించి ‘బస్సు ముందు బాబు ఉన్నాడు’ ఆపమని కేకలు వేస్తున్నా.. గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో అజయ్ బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా.. న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని తరలించకుండా రాత్రి 8 గంటల వరకు సంఘటనాస్థలంలోనే ఉంచారు. పోలీసులు శాంతింపజేయడంతో మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు 75 శాతం
సాక్షి, అమరావతి: స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) రెన్యువల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో 75 శాతం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. కరోనా పరిస్థితులతో దాదాపు ఏడాదిన్నర తరువాత పాఠశాలలను ఇటీవల పునఃప్రారంభించారు. గత ఏడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా, రెన్యువల్ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. కానీ ఇప్పటికీ చాలా యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్‌పై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కరోనా మూడో వేవ్ వస్తుందా, రాదా అనేదానిపై స్పష్టత వచ్చేవరకు ఈ విషయంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. 6,444 బస్సులకు ఎఫ్‌సీలు రాష్ట్రంలో మొత్తం 25,236 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో సెప్టెంబర్ 30 నాటికి కేవలం 6,444 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించారు. 18,792 బస్సులకు ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయలేదు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన స్కూల్ బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. -
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా?
సాక్షి, హైదరాబాద్: మరో రెండ్రోజుల్లో స్కూళ్లు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. కోవిడ్ దృష్ట్యా మూడునెలలు ఆలస్యంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహించేందుకు యాజమాన్యాలు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు సుదీర్ఘ విరామానంతరం పాఠశాలలకు వెళ్లనున్నారు. కానీ.. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన స్కూల్ బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్ దృష్ట్యా సుమారు రెండేళ్లుగా బడి బస్సులు, ఆటోలు, వ్యాన్లు తదితర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రభుత్వమే స్వయంగా మినహాయింపునిచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఫిట్నెస్ లేని వాహనాలే పిల్లలను తరలించే విషయంలో ఆందోళన కలిగిస్తోంది. బాగుంటేనే అనుమతి... ►సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌లో విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. రవాణా శాఖ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ►మోటారు వాహన తనిఖీ అధికారులు తమ పరిధిలోని అన్ని స్కూల్ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరమే పిల్లలను తీసుకెళ్లేందుకు అనుమతినిస్తారు. ►గ్రేటర్ పరిధిలో సుమారు 10,500 స్కూల్ బస్సులకు ఏడాది ఒకసారి మే నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆటోలు, వ్యాన్లకు సైతం క్రమం తప్పకుండా ఫిట్నెస్ పరీక్షలు జరుగుతాయి. ►పిల్లల భద్రత కోసం స్కూల్ యాజమాన్యాలు, వాహనాలు నడిపే డ్రైవర్లు, పిల్లల తల్లిదండ్రులకు ఆర్టీఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు. ►కరోనా కారణంగా ఇంచుమించు రెండేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఫిట్నెస్ పరీక్షల నుంచి ప్రభుత్వమే మినహాయింపునివ్వడంతో చాలా బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగానే ఉన్నాయి. కొందరు యజమానులు మాత్రం స్వచ్ఛందంగా ఫిట్నెస్ సరి్టఫికెట్లు పొందారు. నిర్వహణలో నిర్లక్ష్యం.. ►స్కూల్ వాహనాల నిర్వహణలో సహజంగానే నిర్లక్ష్యం ఉందనే ఆరోపణ చాలా కాలంగా ఉంది. ప్రతి సంవత్సరం మే నెలలో జరగాల్సిన ఫిట్నెస్ పరీక్షలు జూలై , ఆగస్టు వరకు కొనసాగుతూనే ఉంటాయి, ►మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు బస్సులను స్వయంగా పరిశీలించి, తనిఖీ చేయాల్సి ఉండగా, కిందిస్థాయి సిబ్బంది మొక్కుబడిగా ఆ పని చేస్తున్నారు. స్కూల్ ఆటోలు, వ్యాన్ల నిర్వహణలోనూ అదే నిర్లక్ష్యం నెలకొని ఉంది. ►గ్రేటర్లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. వాటిలో కనీసం 50 వేల ఆటోలు స్కూల్ పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా ఈ ఆటోలన్నీ ప్రస్తుతం ప్రయాణికుల రాకపోకలకు పరిమితమయ్యాయి. ►మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు మారుతీ ఓమ్ని, మెటడోర్ వంటి వాహనాలను స్కూల్ పిల్లలకు వినియోగించడం నేరం. కానీ.. సుమారు 20 వేలకు పైగా వ్యాన్లు పిల్లల తరలింపు కోసం నడుస్తున్నాయి. ప్రస్తుతం వీటి ఫిట్నెస్ పరీక్షలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యం.. ►వాహనాల ఫిట్నెస్ గడువును కేంద్రం సెపె్టంబర్ వరకు పొడిగించింది. కానీ స్కూళ్లు మాత్రం తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఫిట్నెస్ పరీక్షలు అసాధ్యం. ►ఇప్పుడున్న స్థితిలోనే వాహనాలను వినియోగించడం లేదా, తల్లిదండ్రులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవడం ఒక్కటే పరిష్కారం. ఉన్నపళంగా విద్యాసంస్థలు తెరుచుకోనున్న దృష్ట్యా పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే అంశంపై చాలా మంది తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. -
స్కూల్ బస్‌ల ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి
-
కృష్ణ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
-
టాటా చెప్పేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం. తన అక్కకు టాటా చెప్పేందుకు వెళ్లిన చిన్నారిని మృత్యువు బస్సు రూపంలో కబళించగా.. అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన తమ కూతురు ఇక లేదనే చేదు నిజాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుళ్లూ.. గోపురాలు తిరిగితే దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే తీసుకెళ్లాడంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, సంగెం: అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాధ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకా రం.. అక్క స్కూల్‌కు వెళ్తుంటే టాటా చెప్పేం దుకు వెళ్లి చెల్లెలు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాధ సంఘటన ఇది. స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని కాట్రపల్లికి చెందిన కర్ర జ్యోత్స్న, అమరేందర్‌రెడ్డిలకు సమ్మిత, మనస్విత(రెండున్నర సంవత్సరాలు) సంతానం ఉన్నారు. పెద్దకూతురు వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్ క్యాంపులోని పాత్‌ఫైండర్ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతుంది. బుధవారం బస్సు హారన్ విని తల్లి పెద్ద కూతురు సమ్మితను స్కూల్ బస్సు ఎక్కించడానికి చిన్న కూతురును తీసుకుని ఇంటి సమీపంలోని రోడ్డు వరకు వెళ్లింది. రోడ్ అటు వైపు దాటి ఆగిఉన్న బస్సులో పెద్ద కూతురును ఎక్కించింది. చిన్న కూతురును తీసుకుని బస్సు ముందు నుంచి ఇంటికి వస్తుండగా బస్సు డ్రైవర్ కాగితాల లింగమూర్తి ఆజాగ్రత్తగా ముందుకు వెళ్లడంతో బస్సు ముందు టైర్ కిందపడిన చిన్నారి మనస్విత తల పైనుంచి వెళ్లడంతో రోడ్‌పై ఉన్న కర్ర రాజిరెడ్డి, మిలుకూరి రామచంద్రారెడ్డి, మందాటి రాజేశ్వర్‌రెడ్డి చూసి కేకలు వేయడంతో బస్సును నిలిపివేశాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చిన్నారి మృతిచెందింది. చిన్నారి మనస్విత తండ్రి అమరేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కాగా, చిన్నారి మృతిచెందడంతో కుటుంబసభ్యులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. -
బెంగాల్ ‘టీ కప్పులో తుఫాను’
సాక్షి, న్యూఢిల్లీ : ‘టీ కప్పులో తుఫాను’ అంటే ఇదేనేమో! అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్ఫాయిగురి పర్వత ప్రాంతం. గత జూలై ఒకటవ తేదీన చుపార తేయాకు తోటలో వాతావరణం చల్లాగా ఉంది. అప్పుడప్పుడు వర్షం జల్లులు కురుస్తున్నాయి. కార్మికుల కాలనీ ఇళ్ల నుంచి ఒక్కొక్కరుగా వందల మంది విద్యార్థినీ విద్యార్థులు బయటకు వచ్చి తేయాకు తోటంతా నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. తాము స్కూల్‌కు వెళ్లి రావడానికి రెండు బస్సులనైనా నడపాలి లేదా రెండు ట్రిప్పులనైనా నడపాలంటూ వారు నినదించారు. ఆ మరుసటి రోజు 400 మంది విద్యార్థినీ విద్యార్థులు తేయాకు తోటకొచ్చే దారులన్నింటిని దిగ్బంధనం చేశారు. తేయాక తోట యాజమాన్యం బెదిరింపులకు, కార్మిక నాయకుల బుజ్జగింపులకు వారు ఏమాత్రం లొంగలేదు. అలాగే వారం పాటు స్కూల్‌కు పోకుండా, తేయాకు తోటలో పనులు జరగకుండా అడ్డుకున్నారు. 1980లో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వానికి, తేయాకు తోటల యాజమానుల సంఘం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పనిచేసే చోటే కార్మికులకు వసతి కల్పించడంతోపాటు వారి పిల్లలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు స్కూల్ బస్సులను తేయాకు తోటల యాజమాన్యమే సమకూర్చాలి. అయితే చుపార తేయాకు తోటలో 150 మంది విద్యార్థిని విద్యార్థులు ఉండగా, తోట యాజమాన్యం ఒక స్కూల్ బస్సును ఒకే ట్రిప్ నడుపుతోంది. అంత మందికి అందులో ఊపిరాడకుండా ఉండడంతో విద్యార్థినీ విద్యార్థులు విడతల వారీగా స్కూల్ ఎగ్గొడుతూ వచ్చారు. తమ బాధ గురించి వారు తల్లిదండ్రులకు చెప్పుకున్నా ప్రయోజనం లేకపోవడంతో వారే ప్రత్యక్షంగా ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగానే తేయాకు తోట యాజమాన్యం తేయాకు తోటను మూసివేస్తానని, బస్సులను బంద్ చేస్తామని బెదిరించింది. అయినా విద్యార్థులు ఆందోళన విరమించక పోవడంతో యాజమాన్యమే దిగివచ్చి రెండు ట్రిప్పులు బస్సు నడిపేందుకు అంగీకరించింది. 2002, 2007లో మొత్తం 17 తేయాకు తోటలు మూత పడడం వల్ల 1200 మంది కార్మికులు ఆకలితో మరణించారు. కొన్ని వేల మంది కార్మికులు సిక్కిం, భూటాన్, ఢిల్లీ, కేరళ, బెంగళూరు ప్రాంతాలకు వలసపోయారు. ఒప్పందం మేరకు చుపార యాజమాన్యం వారం రోజులకు మించి బస్సును రెండు ట్రిప్పులు నడపలేదు. శాశ్వత కార్మికుల పిల్లల కోసం బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూ తాత్కాలిక కార్మికుల పిల్లలకు బస్సు సౌకర్యాన్ని ఎత్తివేసింది. దుమ్కా, హజారీబాగ్, రాంచీ, చైబాస ప్రాంతాల్లోని తేయాకు తోటల యాజమాన్యాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఆ తేయాకు తోటల్లో నాలుగున్నర లక్షల మంది కార్మికులు పనిచేస్తుండగా, వారిలో 2.62 లక్షల మంది కార్మికులు మాత్రమే శాశ్వత ఉద్యోగులు. తునికాకు ఏరే కార్మికులకు రోజుకు రూ.297 చెల్లిస్తుండగా, తేయాకు తోట కార్మికులకు రోజుకు రూ.176 మాత్రమే చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు 20, 30 కిలోమటర్ల దూరంలో ఉండే పాఠశాలలకు కార్మికులు తమ పిల్లలను ఎలా పంపిస్తారు? స్త్రీ, పురుషులకు సమాన వేతనం చెల్లించాలంటూ భారత పార్లమెంట్ 1976లో చట్టం తీసుకరావడానికి ముందే, అంటే 1974లో బెంగాల్‌లోని ‘సొనాలి గార్డెన్’ తేయాకు తోట యాజమాన్యం స్త్రీ, పురుషులకు సమాన వేతనం చెల్లించడంతోపాటు 1977లో అధిక లాభాలు రావడంతో కార్మికుల వేతనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. అలాంటి సంస్థ కూడా ఇతర తోటల యాజమానుల ఒత్తిడులకు తలొగ్గి వారి బాటనే నడుస్తోంది. ఇప్పుడు ‘టీ కప్పులో తుఫాను’ లాగానే చుపార తేయాకు విద్యార్థుల ఆందోళన పూర్తిగా చల్లబడింది. తోటి విద్యార్థిని విద్యార్థుల్లో సగం మంది బడి మానేసినా వారిలో చలనం లేదు. కార్మిక నాయకులు ఎప్పటిలాగే మౌనం పాటిస్తున్నారు. విద్యార్థులకు తేయాకు తోటల యాజమాన్యం బస్సు సౌకర్యం కల్పించనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమైనా కల్పించాలి. ఎన్నికల నిధుల కోసం తేయాకు తోటల యాజమాన్యాల మీద ఆధారపడే ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచిస్తాయి! -
డివైడర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు
-
మల్లేపల్లి : స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
సాక్షి, దేవరకొండ : కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండాలో ఇస్లావత్ అఖిల్(5) అనే యూకేజీ విద్యార్థి బస్సు కింద పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాలు..తండాలో నివసిస్తున్న ఇస్లావత్ కూమార్, శాంతి దంపతుల కుమారుడు అఖిల్‌ను కొండమల్లేపల్లిలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ చదివిస్తున్నారు. రోజూ స్కూల్ బస్సులో వెళ్లి వస్తుండే అఖిల్,రోజులాగే మంగళవారం కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా, డ్రైవరు చూసుకోకుండా బస్సు కదిలించడంతో వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవరు పరారయ్యాడు. ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోలేని తండావాసులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. -
చెరుకు తోటలోకి దూసుకుపోయిన స్కూల్ బస్సు
-
నారాయణ స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి, విజయనగం : జిల్లాలోని కొమరాడ మండలం అర్థం గ్రామ శివారులో బుధవారం నారాయణ స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవైపు వర్షం పడుతున్నా 32 మంది పిల్లలతో బయల్దేరిన బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి నేరుగా పక్కనే ఉన్న చెరుకు తోటలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలోలో పిల్లలు సురక్షితంగా బయటపడ్డా, డ్రైవర్‌కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బస్సులో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ స్కూల్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మత్తులో డ్రైవర్.. స్కూల్ బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు(డక్కిలి) : మండలంలో జరిగిన శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటగిరి శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన బస్సు ఉదయం 7.30 గంటలకు డక్కిలి మండలంలోని కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయిపాళెం గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని డక్కిలి వైపు వస్తోంది. ఎనిమిది గంటల సమయంలో కుప్పాయిపాళెం దాటిన తర్వాత బస్సు అదుపుతప్పినట్లుగా విద్యార్థులు గుర్తించి కేకలు వేశారు. డ్రైవర్ నవకోటి మద్యం మత్తులో ఉండటం, నిద్రలోకి జారుకోవడంతో బస్సు చెరువు వద్ద గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటనలో నర్రావుల వెంకటేష్ (6వ తరగతి), పోకూరు రోహిత్ (6వ తరగతి), వేముల నాని (6వ తరగతి), తంబిశెట్టి యామిని (5వ తరగతి), పెదనేని చంద్రిక (5వ తరగతి), కొక్కనేటి శ్రీనివాస్‌కుమార్ (9వ తరగతి), వేముల శరణ్య (4వ తరగతి), ఏలేశ్వరం మహేష్ (5వ తరగతి), పత్తిపాటి భానుప్రకాష్ (6వ తరగతి), ఎ.మోహన్ (9వ తరగతి), కుంచెం నిఖిలేస్ (3వ తరగతి), డ్రైవర్ నవకోటిలకు గాయలయ్యాయి. వీరిలో నిఖిలేష్, యామిని, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో డక్కిలి పోలీసుల స్పందన స్కూల్ బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న డక్కిలి ఎస్సై కామినేని గోపి వెంటనే స్పందించి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. భయాందోళనతో కేకలు వేస్తున్న విద్యార్థులను ఎస్సై, పోలీసు సిబ్బంది స్థానికులు సాయంతో బస్సులో నుంచి బయటకు తీశారు. పోలీసు వ్యాన్‌లో డక్కిలి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ విద్యార్థులకు డాక్టర్ సుధీర్‌కుమార్ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెంకటగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. గూడూరు ఆర్డీఓ బాపిరెడ్డి, డక్కిలి తహసీల్దార్ మునిలక్ష్మి లు విద్యార్థులను పరామర్శించారు. వైద్యసేవల గురించి ఆరాతీశారు. తహసీల్దార్ కుప్పాయిపాళెం, డీ వడ్డిపల్లి గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా తెలిపారు. ఈ విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో వెల్లడైందన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్‌ను కూడా నియమించలేదని వాపోయారు. రాత్రంతా నిద్రపోలేదు స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్‌ను కూడా నియమించలేదని వాపోయారు. డ్రైవర్ నిద్రలో ఉన్నాడు : విద్యార్థి కుప్పాయిపాళెం గ్రామం దాటగానే చెరువు వద్ద బస్సు పక్కకు వెళ్లి పోతుండటాన్ని గుర్తించి కేకలు వేశాం. అప్పటికే డ్రైవర్ నిద్రలో ఉన్నాడు. బస్సు అదుపుతప్పి గుంతలో పడిపోగానే మేము గాయపడ్డాం. కేకలు వేయగా చుట్టుపక్కల వారు, పోలీసులు వచ్చి కాపాడారు. -
చిన్నారులను చిదిమేశారు !
సాక్షి, వేములవాడ : తమలాగే తమ పిల్లల బతుకులు మారొద్దనుకున్నారు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే అయినా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలగన్నారు. కానీ విధి వారి జీవితాలతో ఆటాడుకుంది. పిల్లల గురించి ఎన్నోకలలుగన్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిల్చింది. ప్రైవేటు పాఠశాల యజమాన్య నిర్లక్ష్య వైఖరి.. ఫిట్‌నెస్‌లేని స్కూలు వ్యాన్.. డ్రైవర్ ఉన్మాదంతో అతివేగంగా వాహనం నడపడం వెరసి.. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముగ్గురు చిన్నారులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్ శివారులో బుధవారం స్కూల్‌వ్యాన్ బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణంలోని వాగేశ్వరి (శ్రీచైతన్య) హైస్కూల్‌కు పాఠశాల, హాస్టల్ వేర్వేరు చోట్ల ఉన్నాయి. విద్యార్థులు పట్టణ పరిధిలోని తిప్పాపూర్ శివారులో ఉన్న స్కూల్ హాస్టల్లో ఉంటారు. రోజూ పాఠశాల నుంచి స్కూల్ వ్యానులో హాస్టల్‌కు వచ్చి మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ స్కూల్‌కు వెళ్తుంటారు. ఎప్పటిలాగే.. బుధవారం కూడా మధ్యాహ్నం భోజనం కోసం 27 మంది విద్యార్థులు వ్యాన్ (ఏపీ 15 టీబీ 7800)లో హాస్టల్‌కు బయల్దేరారు. వేములవాడ ఆర్టీసీ డిపో ప్రాంతానికి రాగానే.. ఈ స్కూలు వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. వాహనం వేగంగా ఉండడంతో అందులోని విద్యార్థులు కొందరు కిటికీల్లోంచి ఎగిరి బయట పడ్డారు. వీరిపైనే వ్యాన్ కూడా పడింది. దీంతో పదో తరగతి విద్యార్థిని కాసరవేణి మణిచందనారాణి (15), రెండో తరగతి విద్యార్థిని గుగులోతు దీక్షిత (6) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మూడో తరగతి విద్యార్థి రిషి (7) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఠాకూర్ రాకేశ్(15), గుమ్మడి సాయి నిఖిల్ (15), వేర్పుల అజయ్‌కుమార్ (15) మారుపాక రోహిత్ (9), గుండెకర్ల రేవంత్ (7) సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్పందించిన యువత ప్రమాదం సమయంలో అటుగా వెళ్తున్న తిప్పాపూర్ గ్రామానికి చెందిన గణేశ్ మంటప నిర్వాహకులు బోల్తాపడిన స్కూలు వ్యాన్‌ను పైకి లేపారు. తద్వారా కొందరి ప్రాణాలు కాపాడిన వారయ్యారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం కావడంతో ఆగ్రహానికి లోనై.. వ్యాన్ డ్రైవర్ రఫీక్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి మంత్రి, ఎంపీ విద్యార్థుల మృతి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వేర్వేరుగా సంఘటన స్థలాన్ని సందర్శించారు. మంత్రి బస్ డిపో ప్రాంతానికి చేరుకుని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఎంపీ బండి సంజయ్ కూడా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ మల్లేశంతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, జేసీ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఆర్వో ఖీమ్యానాయక్, డీఈవో రాధాకిషన్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఎస్పీ వెంకటరమణ, సీఐ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, రంగు వెంకటేశ్‌గౌడ్ బాసటగా నిలిచారు. కాగా, ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్లో ఆరా తీశారు. కాగా, బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తక్షణ సాయంగా రూ.2లక్షల చెక్కులను అందజేసింది. వ్యాన్‌కు ఫిట్నెస్ లేదు ! వేములవాడలో నిర్వహిస్తున్న వాగేశ్వరి (శ్రీచైతన్య) స్కూల్ వ్యాన్ (ఏపీ 15 టీబీ 7800)కు ఎలాంటి ఫిట్నెస్ లేదని పోలీసులు వెల్లడించారు. 15 సీట్ల సామర్థ్యం కలిగిన వ్యాన్‌లో సామర్థ్యానికి 27 మంది తీసుకెళ్తున్నారు. ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. స్కూల్ హాస్టల్‌కు కూడా ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్నారని డీఈవో రాధాకిషన్ పేర్కొన్నారు. రోజూ చింతల్‌ఠాణా నుంచి వేములవాడకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విద్యార్థులను తరలిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రమాదం ముగ్గురి మృతికి కారణమైంది. కాగా, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారులు ఇంకా షాక్‌నుంచి కోలుకోలేదు. కళ్లముందే జరిగిన ప్రమాదాన్ని తలచుకుని వారు వణికిపోతున్నారు. బస్‌డిపోలో బాధిత కుటుంబాలతో చర్చలు ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఈటల రాజేందర్ బస్‌డిపో ఆవరణలో జిల్లా అధికారులు, బాధిత కుటుంబాలతో సమాలోచనలు చేశా>రు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున అందజేయాలని సూచించినట్లు తెలిసింది. కాగా, వాగేశ్వరి (శ్రీచైతన్య) స్కూల్ అనుమతులను రద్దు చేస్తామని డీఈవో రాధాకిషన్ ప్రకటించారు. హాస్టల్ నిర్వహణకు ఎలాంటి అనుమతులూ లేనప్పటికీ.. యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘించినందుకు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భద్రతపై పోలీసులను అప్రమత్తం చేస్తాం వేములవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటనపై ఎస్పీ రాహుల్ హెగ్డే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో బాధితుల కుటుంబీకులు, అక్కడ గుమిగూడిన యువకులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎస్పీ చొరవతీసుకుని వారిని శాంతింపజేశారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖను సైతం అప్రమత్తం చేసి విద్యార్థుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. - ఎస్పీ రాహుల్ హెగ్డే -
బలవంతంగా స్కూల్‌కి.. బస్సులోంచి దూకేశాడు
సాక్షి, కణేకల్లు: తల్లి బలవంతంతో స్కూలుకు పయనమైన విద్యార్థి బస్సు కదిలి కొంత దూరం వెళ్లాక కిందకు దూకేశాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కణేకల్లు మండలం ఎన్.హనుమాపురం గ్రామానికి చెందిన కురుబ సరోజమ్మ, రాజన్న దంపతుల కుమారుడు కురుబ లాలుమోహన్ ఉరవకొండలోని మహేశ్వరీ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల రాకపోకల కోసం బస్సును ఏర్పాటు చేసింది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఎన్.హనుమాపురానికి బస్సు వచ్చి విద్యార్థులను ఎక్కించుకొని స్కూల్‌కు వెళ్తోంది. అయితే శుక్రవారం కురుబ లాలుమోహన్ స్కూల్‌కెళ్లనని మొండికేశాడు. తల్లి బతిమాలి.. బస్టాప్ వరకెళ్లి కొడుకును బస్సు ఎక్కించింది. బస్సు ఊరు దాటి వేగంగా వెళ్తున్న సమయంలో లాలుమోహన్ బస్సు డోర్ తీసేసి ఒక్కసారిగా కిందకు దూకాడు. ఇది గమనించని డ్రైవర్ ముందుకెళ్లాడు. తోటి విద్యార్థులు గమనించి డ్రైవర్‌కు విషయం తెలపడంతో వెంటనే బస్సును వెనక్కు తీసుకెళ్లాడు. బస్సులోంచి విద్యార్థి కిందకు దూకిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. లాలుమోహన్ చెవిలోంచి రక్తం కారుతండటంతో పాటు తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించారు. స్కూల్ యాజమాన్యంపై మండిపాటు బస్సులో నుంచి విద్యార్థి కిందకు దూకి ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో సదరు స్కూల్ యాజమాన్యంపై ప్రజలు మండిపడుతున్నారు. బస్సులో క్లీనర్ లేదా అటెండర్ ఎవరైనా ఉండి ఉంటే విద్యార్థి డోర్ తీసుకుని దూకేవాడు కాదని అన్నారు. అయితే ఒక క్లీనర్ / అటెండర్‌ను పెట్టడంలో స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసే యాజమాన్యం పిల్లలకు సరైన భద్రత కల్పించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి జరిగిన ఘటనపై విచారణ నిర్వహించి బాధ్యులైన మహేశ్వరీ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఖర్చులు స్కూలు యాజమాన్యమే భరించాలి స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ కుమారుని వైద్యానికయ్యే ఖర్చును వారే భరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కురుబ సరోజమ్మ, రాజన్నతోపాటు వైఎస్సార్సీపీ నాయకు లు, ఎన్.హనుమాపురం మాజీ సర్పంచు పైనేటి తిమ్మప్పచౌదరి డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా బాధిత విద్యార్థి బంధువులు శుక్రవారం మహేశ్వరీ స్కూల్ వద్దకెళ్లి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుకు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని సహాయకునిగా ఎందుకు పెట్టలేదని వారిని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ప్రాణం మీదకు వచ్చిందని మండిపడ్డారు. -
80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
అంతులేని నిర్లక్ష్యం... అతి వేగం కారణంగా 80 మంది విద్యార్థుల ప్రాణాలతో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ చెలగాటమాడాడు. జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తూ రెండు ప్రమాదాలకు కారకుడయ్యాడు. మృత్యు కౌగిలిని అతి చేరువగా చూసి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారులు భయంతో కన్నీటిపర్యంతమయ్యారు. 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఈ ఘటన సంచనలమైంది. వివరాల్లోకి వెళితే.. – కనగానపల్లి సాక్షి, అనంతపురం: కనగానపల్లి మండలం ముక్తాపురం వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ఘటనలో బస్సులో ఉన్న 65 మంది చిన్నారులు స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి... ధర్మవరం పట్టణంలోని ప్రియదర్శిని విద్యామందిర్‌లో కనగానపల్లి మండలంలోని ముక్తాపురంలో 20 మంది, రాంపురంలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం విద్యామందిర్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ బస్సు నడుపుతున్నారు. అయితే బస్సుల నిర్వహణలో పాఠశాల యాజమాన్యం నిబంధనలకు తిలోదకాలిచ్చేసిందన్న ఆరోపణలున్నాయి. అత్యధిక విద్యార్థులు ఉన్న రాంపురం గ్రామానికి ధర్మవరం నుంచి నేరుగా మామిళ్లపల్లి, కనగానపల్లి మీదుగా బస్సు నడపాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా ముక్తాపురం, ధర్మవరం మండలంలోని కామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులను కూడా కలిపారు. మొత్తం 80 మంది విద్యార్థులను ఒకే బస్సులో రోజూ బడికి, తిరిగి ఆయా గ్రామాలకు చేరవేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్కూల్ యాజమాన్యం ఈ విషయంలో మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. నిర్లక్ష్యంతోనే ప్రమాదం? గురువారం సాయంత్రం బడి ముగియగానే 80 మంది విద్యార్థులతో ధర్మవరం నుంచి బస్సు బయలుదేరింది. తొలుత కామిరెడ్డిపల్లికి చేరుకుని 15 మంది విద్యార్థులను అక్కడ డ్రైవర్ దింపేశాడు. అక్కడి నుంచి పల్లెల మీదుగా ముక్తాపురానికి బయలుదేరాడు. సాధారణంగా రోడ్డు దాటుకునే సమయంలో డ్రైవర్లు అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తుంటారు. జాతీయ రహదారిపై మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విషయంలో స్కూల్ బస్సు డ్రైవర్ అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరిచాడు. జాతీయ రహదారిపై ముక్తాపురం క్రాస్ వద్ద వెనుకా ముందు ఆలోచించకుండా బస్సును ఇటువైపు నుంచి అటువైపు రోడ్డులోకి వేగంగా తీసుకెళ్లాడు. అదే సమయంలో బెంగుళూరు నుంచి అనంతపురం దిశగా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారును గమనించి బస్సును రోడ్డు దాటించే ప్రయత్నింలో మరింత వేగాన్ని పెంచాడు. అప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన కారు డ్రైవర్ బలంగా బ్రేక్‌లు వేసినా ఫలితం లేకపోయింది. రోడ్డును రాసుకుంటూ వచ్చిన కారు.. బస్సు వెనుక భాగాన్ని తాకింది. అదే సమయంలో బస్సును డ్రైవర్ రోడ్డు పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూకించాడు. మిన్నంటిన హాహాకారాలు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారిగా రేకుల షెడ్డులోకి బస్సు దూసుకెళ్లడంతో అదుటుకు విద్యార్థులు కిందామీదపడ్డారు. ఏదో జరిగిపోయిందన్న భయంతో ఒక్కసారిగా ఆర్తనాదాలు చేశారు. ఆ పక్కనే ఉన్న కాలనీ వాసులందరూ మూకుమ్మడిగా అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న చిన్నారులందరినీ కిందకు దింపి ఊరడించారు. అప్పటికీ చిన్నారులు స్థిమిత పడలేకపోయారు. వారి శరీరాల్లో వణుకు తగ్గలేదు. కళ్లు నిరంతరంగా వర్షించాయి. తమకు చేరువగా ఉన్న పెద్దలను కౌగిలించుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ముక్తాపురం విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. భయంతో విలవిల్లాడుతున్న చిన్నారులను ఓదార్చడం వారికి సాధ్యపడలేదు. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు బస్సు వెనుక ప్రాంతాన్ని తాకిన కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారు డ్రైవర్ హరినాథరెడ్డికి కాలు విరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న కనగానపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భయంతో బిక్కచచ్చిన విద్యార్థులను మరో బస్సులో సురక్షితంగా ఇళ్లకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కారు డ్రైవర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
-
భాష్యం స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి,చందర్లపాడు : విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో బస్సులో ఉన్న 32మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం విద్యార్థులను అక్కడ నుంచి తరలించారు. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్క్ష్యంగా మితిమీరిన వేగంతో బస్సును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మూల మలుపు వద్ద నెమ్మదిగా వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినా డ్రైవర్ పెడచెవిన పెట్టేవాడని, స్కూల్ యాజమాన్యం డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తమ పిల్లలు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : అందరూ నాలుగేళ్ల నుంచి పదేళ్ల లోపు చిన్నారులే.. అప్పటివరకు సరదాగా గడిపిన వారంతా... ఒక్కసారిగా హాహాకారాలతో భయభ్రాంతులకు గురయ్యారు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు వారంతా షాక్‌లోకి వెళ్లిపోయారు.. తణుకు మండలం తేతలి గ్రామ పరి«ధిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలు బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో 34 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం విద్యార్థులను తరలిస్తున్న ఏపీ 37 టీడీ 8878 నెంబరు కలిగిన బస్సు స్కూలు సమీపంలోని పంట కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులను స్థానికంగా పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు హుటా హుటిన చేరుకుని వారందరినీ బయటకు తీశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పుంత రోడ్డులోనే రాకపోకలు తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలుకు చెందిన బస్సు పెరవలి, కాపవరం, కొత్తపల్లి, తూర్పువిప్పర్రు గ్రా మాల నుంచి 34 మంది విద్యార్థులను ఎక్కించుకుని బయల్దేరింది. వీరంతా ఎల్కేజీ నుంచి ఆరో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. ఏఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ ఆనుకుని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలు నడుస్తోంది. అయితే స్కూలు బస్సులు రాకపోకలకు అత్తిలి కాల్వ ఆనుకుని పుంతరోడ్డునే యాజమాన్యం వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో అత్తిలి కాల్వకు రోడ్డుకు మధ్యలో పంట కాల్వ ప్రవహిస్తోంది. అయితే పుంత రోడ్డు ఇరుకుగా ఉండటంతోపాటు ఇటీవల కురుస్తున్న వర్షాలకు గట్టు తెగిపోయింది. దీనిని గమనించని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్సు పంట కాల్వలోకి దూసుకెళ్లిపోయింది. ఈ సమయంలో విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో రైతులు, కూలీలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మధ్యలో పంట కాల్వ లేకపోతే నేరుగా పెద్ద కాల్వలోకే బస్సు వెళ్లిపోయేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే కారుమూరి ఆరా.. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంఘటనపై ఆరా తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా వెంకటేష్, సరెళ్ల వీరతాతయ్యను తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి స్కూలు యాజమాన్యంతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాయకులు వెంకటేష్, వీరతాతయ్యలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలానికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్‌కుమార్ చేసుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్, యాజమాన్యంపై రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయం వేసింది స్కూలులో తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాను. కాపవరంలో ఉదయం బస్సు ఎక్కాను. అయితే రోజు కంటే ఆలస్యంగా బస్సు వచ్చింది. స్కూలు టైం అయిపోతోందనే ఆందోళనలో ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే స్కూలుకు చేరుకుంటున్నాం అనగా పంట కాల్వలోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో అందరికీ భయం వేసింది. –కట్టికూటి సుబ్రహ్మణ్యం, విద్యార్థి, కాపవరం డ్రైవర్‌ను మార్చారు నా ఇద్దరు పిల్లలు స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలులోనే చదువుకుంటున్నారు. పెరవలి మండలం కాపవరం నుంచి బస్సులో స్కూలుకు వస్తున్నారు. అయితే ఇటీవల స్కూలు బస్సు డ్రైవర్‌ను మార్చారు. దీంతోపాటు రెండేసి ట్రిప్పులు వేస్తుండటంతో వేగంగా విద్యార్థులను తరలిస్తున్నారు. –కాకరపర్తి శ్రీలక్ష్మి, విద్యార్థుల తల్లి, కాపవరం -
పుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
-
బాధ్యత ఎవరిది..?
సాక్షి, సిటీబ్యూరో: మరో విద్యా సంవత్సరం మొదలైంది... పాఠశాలలు పునఃప్రారంభమ య్యాయి... నగరంలో స్కూలు బస్సులకు అనేక రెట్లు ఆటోల్లో విద్యార్థుల రవాణా జరుగుతోంది... వీటిలోనూ ఆరుగురి కంటే ఎక్కువ తరలించరాదంటూ మరి కొన్ని నిబంధనలు విధించిన సర్కారు చేతులు దులుపుకుంది... ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ కూడా చేస్తున్నారు... ఇక్కడి వరకు బాగానే ఉన్నా... కొన్ని కీలకమైన అంశాలను అన్ని విభాగాలు విస్మరిస్తుండటం సమస్యలకు తావిస్తోంది. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 3 వేల స్కూళ్లు..వెయ్యి స్కూల్ బస్సులు నగరంలోని కొన్ని ‘ఖరీదైన’ స్కూళ్లు మినహా మిగిలిన వాటికి సొంత రవాణా వ్యవస్థ లేదు. ప్రముఖ పాఠశాలలు సైతం ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో సొంతంగా రవాణా సౌకర్యాన్ని కల్పించిన కొన్ని స్కూళ్లు ఇప్పుడు దానిని విస్మరించాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం నగరంలో 3 వేలకు పైగా స్కూళ్లు ఉండగా... ఆర్టీఏ లెక్కల ప్రకారం కేవలం వెయ్యి స్కూల్ బస్సులు మాత్రమే ఉన్నాయి. అంటే... స్కూలుకు ఒక బస్సు లెక్కన వేసుకున్నా రెండు వేల స్కూళ్లకు లేవన్నమాట. ఫలితంగా విద్యార్థులను ఆటోలు తదితర వాహనాల్లో స్కూళ్లకు పంపించాల్సి వస్తోంది. ప్రతి స్కూలు తమ విద్యార్థులకు ట్రాన్స్‌ఫోర్స్ ఫెసిలిటీ కల్పించాలన్నది కచ్చితం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. తల్లిదండ్రులు తదితరులు సొంతంగా తీసుకువచ్చి దింపే విద్యార్థులు మినహా మిగిలిన వారు స్కూలు బస్సుల్లోనే ప్రయాణించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని ఆరోపిస్తున్నారు. ఆటోల వీర బాదుడు... దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల చేతిలో మోసపోకూడదని భావిస్తున్న ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రీ పెయిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడో ఒకసారి నగరానికి వచ్చే వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న వారు అనునిత్యం ఆటోవాలాల చేత దోపిడీకి గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్కూలు పిల్లలను తరలించే ఆటోల డ్రైవర్లు దూరంతో నిమిత్తం లేకుండా భారీగా దండుకుంటున్నారు. సెలవులతో తమకు సంబంధం లేదని, మొత్తం 11 నెలలకూ చెల్లించాల్సిందేనంటూ వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూలు ఆటోలకు ఫేర్స్ (చార్జీలు) నిర్ణయించాల్సిన అవసరం కనిపిస్తోందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆటో సేఫ్టీ గాలిలోనే... స్కూలు బస్సుల ఫిట్నెస్, డ్రైవర్లకు అర్హతలు అంటూ గొంతు చించుకుంటున్న ఆర్టీఏ, ఆటోల్లో ఆరుగురే అంటూ విరుచుకుపడుతున్న ట్రాఫిక్ అధికారులు ఆటోల ఫిట్నెస్ ను విస్మరిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి భారీగా వసూలు చేస్తూ పసి వాళ్లకు తరలించే ఆటోలకు సైడ్ డోర్స్, సేఫ్టీ మెష్‌లు మచ్చుకైనా కనిపించవు. వీటిలో అనేక ఆటోలు ఫిట్‌నెస్‌కు ఆమడ దూరంలో ఉంటున్నాయి. వీటి డ్రైవర్లూ ఆర్టీఏ నిర్ధేశించిన ప్రకారం ఉండట్లేదు. మరోపక్క తమ స్కూలుకు విద్యార్థులను తరలిస్తున్న ఆటోల వివరాలు, వాటి డ్రైవర్ల వ్యవహారం యాజమాన్యాలకు అసలే పట్టదు. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల మాదిరి స్కూలు ఆటోలకూ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆటోలకు నిబంధలు అవసరం లేదా? స్కూలు బస్సుల విషయంలో నిబంధనలు వల్లెవేసే ఆర్టీఏ అధికారులు స్కూలు ఆటోల విషయంలో మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. సదరు ఆటోలు విద్యార్థులను తరలిస్తున్న సమయంలోనైనా దాన్ని సూచిస్తూ ముందు వెనుక చిన్న బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాల్సి ఉంది. మాఫియాపై ఎవరిని ఆశ్రయించాలి? ఎవరైనా ప్రయాణికుడు ఓ ఆటోను ఫలానా చోటుకు రమ్మని పిలిస్తే కచ్చితంగా వెళ్లాల్సిందే. అలా కాని పక్షంలో సదరు ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆటో రిఫ్యూజల్ కింద జరిమానా విధిస్తారు. అయితే స్కూలు ఆటోల డ్రైవర్లు సాగిస్తున్న ‘మాఫియా’ వ్యవహారాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై స్పష్టత లేదు. ఓ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్లు మాఫియాగా మారుతున్నారు. అక్కడున్న విద్యార్థిని ముందు ఓ ఆటోలో పంపించి... భద్రత నేపథ్యంలోనో, మరో కారణంగానో వేరే ఆటోకు మార్చాలని భావిస్తే అది గగనమే. దీనికి పాత ఆటో డ్రైవర్ అంగీకరించడు. కొత్తగా వస్తున్న వ్యక్తిని బెదిరించి మరీ తన కస్టమర్‌ను ‘కాపాడుకుంటాడు’. ఇది నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎదురవుతున్న పరిస్థితే అయినా... ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాల్లో ఎవరూ పట్టించుకోక... ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థకాక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. కేవలం రిఫ్యూజల్ పైనే కాకుండా ట్రాఫిక్ పోలీసులు దీనిపైనా దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా
సాక్షి, నల్గొండ : ప్రైవేటు పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం, డ్రైవర్ మద్యం మత్తు కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరు విద్యార్థులతో పాటు స్కూలు ఆయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముదిగొండ గ్రామం నుంచి చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి సుమారు 30 మంది విద్యార్థులతో బయల్దేరింది. మార్గమధ్యలో మల్లారెడ్డి గ్రామ సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న 1వ తరగతి చదువుతున్న జబ్బు సాయి, 3వ తరగతి చదువుతున్న చింతకుంట్ల విఘ్నేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. బస్సులో ఉన్న మరో పది మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. బస్సు ఆయాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తే ప్రమాదానికి కారణం మండలంలోని మల్లారెడ్డిపల్లి సమీపంలో పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన సంఘటనకు బస్సు డ్రైవర్ మద్యం మత్తే ప్రధాన కారణమని తెలుస్తోంది. తాగిన మైకంలో బస్సు డ్రైవర్ పాఠశాల బస్సును ఇష్టానుసారంగా నడపడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. 30 మంది విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడంతోపాటు పాఠశాల యాజమాన్యం నిబంధనలు పట్టించుకోకుండా గ్రామంలో ఆటో నడిపే ఓ యువకుడిని బస్సు డ్రైవర్‌గా నియమించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాగిన మైకంలో వాహనం నడుపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తప్పిన పెను ప్రమాదం పాఠశాల బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మిగతా విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాద సంఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీఏలో..అలజడి!
జిల్లా ఆర్టీఏలో రోజురోజుకు ముసలం ముదురుతోంది. ఎంవీఐలు మొదలు ఇతర ఉద్యోగులు సైతం ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతుండగా.. అందుబాటులో ఉన్నవారిలో పలువురు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. దీంతో మిగతా అధికారులు, ఉద్యోగులు సైతం ఒక్కొక్కరుగా జిల్లా దాటివెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆర్టీఏ సేవలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. లైసెన్సులు, ఆర్సీబుక్లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, ట్యాక్సుల వసూలు తదితర రెగ్యులర్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికే స్కూల్ బస్సులన్నింటికీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. స్కూళ్లు మొదలై వారం కావస్తున్నా ఈ విషయంపై ఇప్పటికీ దృష్టిసారించడం లేదు. ఒక్కోసారి పరిగిలో నిర్వహించాల్సిన ఫిట్నెస్ టెస్టులు, ఇతర సేవలకు సైతం వికారాబాద్ రప్పించుకుంటున్నారు. జిల్లాలో కేవలం పరిగిలో మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండగా.. వికారాబాద్‌లో ఎలాంటి చోదక పరీక్షలు నిర్వహించకుండానే లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిగి: జిల్లా పరిధిలో పని చేసేందుకు ఆర్టీ ఏ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరులో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి ఒకే ఎంవీఐ పోస్టు ఉంది. పరిగి ఆర్టీఏ యూనిట్ కార్యాలయంలో ఎంవీఐ పోస్టు ఉండగా.. వికారాబాద్, తాండూరుకు సైతం ఇన్చార్జ్ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవలి వరకు మూడు ఆర్టీఏ కార్యాలయాల్లో ఎంవీఐగా విధులు నిర్వహించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవటంతో చెకింగ్ ఎంవీఐ కిషోర్ బాబుకు మూడు కార్యాలయాల ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడులతో జంకిన ఈయన లాంగ్‌లీవ్‌పై వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన మరికొందరు ఉద్యోగులు సైతం ఇక్కడ ఇమడలేక జిల్లా దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారం రోజులుగా ఆర్టీఏ సేవలు స్తంభించాయి. ఈ విషయంలో వికారాబాద్ ఆర్టీఓ వాణిని వివరణ కోరగా ఇటీవల రెండు మూడు రోజులు సేవలు స్తంభించిన మాట వాస్తవమేనని, సాధ్యమైనంత వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పక్క జిల్లాకు చెందిన జూనియర్ ఎంవీఐలకు జిల్లాలో ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అధికారులకు అవినీతి మరకలు... జిల్లాలో ఆర్టీఏ ఉద్యోగుల అవినీతి హద్దులు దాటుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.500 చేయాల్సిన పనికి రూ.2 వేలు, రూ.వెయ్యికి పూర్తయ్యే పని కోసం రూ.5 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. రూ.2 వేలలోపు ఖర్చయ్యే హెవీ లైసెన్స్‌కు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. ఇటీవల ఓ ఆర్టీఏ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. దీంతో ఆర్టీఏ అధికారుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గతేడాది జిల్లాలో విధులు నిర్వహించే ఓ అధికారి అవినీతి నిర్వాకం రాష్ట్ర సరిహద్దులు దాటిన విషయం తెలిసిందే. ఏకంగా విజయవాడలో లారీలకు బాడీ ఫిట్టింగ్ జరుగుతుండగానే అక్కడికే వెళ్లి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ ఘటనతో సదరు అధికారిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా అవినీతి మరకలంటించుకున్న అధికారికి మళ్లీ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చి.. కొన్ని నెలల పాటు జిల్లాకు చెందిన మూడు కార్యాలయాల బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. -
లైసెన్స్ లేకున్నా ‘బడి బండి డ్రైవర్’.!
సాక్షి, సిటీబ్యూరో: చిన్నారులను పాఠశాలలకు తరలించే బడి వాహనాల భద్రత అంతంత మాత్రంగా మారింది. వీటి ఫిట్నెస్ మాట అటుంచితే కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లూ వీటిని నడిపేస్తున్నారు. శుక్రవారం తనిఖీలు చేపట్టిన అధికారులు 12 మంది లైసెన్స్ లేని డ్రైవర్లను గుర్తించారు. యాజమాన్యాల కక్కుర్తి, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి స్కూల్ వాహనాల డ్రైవర్లు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త బృందాల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టారు. ఒక్క రోజులోనే 521 కేసులు నమోదు చేశామని, భవిష్యత్‌లోనూ తనిఖీలు కొనసాగుతా యని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. యథేచ్చగా ఉల్లంఘన... బుధవారం నుంచి నగరంలో స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. దీంతో మళ్లీ రోడ్లపై పాఠశాలలకు విద్యార్థులను తరలించే బస్సులు, ఆటోలు, వ్యాన్ల హడావుడి ఎక్కువైంది. అనివార్య కారణాల నేపథ్యంలో అత్యధికంగా విద్యార్థులు స్కూళ్లకు ఆటోల్లోనే వెళుతుంటారు. నిబంధనల ప్రకారం వీటిలో ఆరుగురు విద్యార్థులను మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉన్నా... అనేక మంది ఆటోడ్రైవర్లు ఎనిమిది నుంచి పది మందిని తరలిస్తున్నారు. దీనిని సీరియస్‌గా పరిగణించిన ట్రాఫిక్ పోలీసులు స్కూల్ వాహనాలపై స్పెషల్‌డ్రైవ్స్ చేపట్టాలని నిర్ణయించారు. ఆర్టీఏ అధికారుల సాయంతో... ఇందుకుగాను ఆర్టీఏ అధికారులతో సంయుక్త బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ను సంప్రదించగా, ఆయన ఆరుగురు మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లను (ఎంవీఐ) కేటాయించారు. వీరితో పాటు స్థానిక ట్రాఫిక్ ఏసీపీల నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌లో ఏఎంవీఐ, ట్రాఫిక్ ఎస్సై, ఆర్టీఏ కానిస్టేబుల్లతో పాటు ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉంటున్నారు. ప్రధానంగా ఈ బృందాలు స్కూళ్లు తెరిచే, ముగిసే సమయాల్లోనే డ్రైవ్స్ చేపడుతున్నాయి. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వర కు ఆయా స్కూళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆరింటిపైనే దృష్టి... ప్రత్యేకంగా ఏర్పాటైన ఆరు ప్రత్యేక బృందాలు ప్రధానంగా ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదితర పత్రాలతో పాటు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేయడం, ఓవర్ లోడింగ్, మైనర్ డ్రైవింగ్ అంశాలను పరీక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాలు త్వరలో స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థులను తరలించే వాహనాల డ్రైవర్లు, తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నిబంధనలు, భద్రత అంశాలపై అవగాహన కల్పించనున్నారు. కొందరు తల్లిదండ్రులు బైక్‌లపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు తీసుకువస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పరిమితికి మించి చిన్నారుల్ని తీసుకువచ్చే తల్లిదండ్రులకూ అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్ కొనసాగిస్తాం. బడి పిల్లల భద్రతలో తల్లిండ్రులతో సహా అంతా భాగస్వాములు కావాలి. ఓవర్లోడింగ్ వాహనాల్లో తమ పిల్లలను పంపకూడదు. యాజమాన్యాలతో పాటు వీరు కూడా డ్రైవర్లు, వాహనం స్థితిగతులు, పత్రాలు తనిఖీ చేసుకోవాలి. ఈ తరహా వాహనాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే 9010203626తో పాటు ‘ట్రాఫిక్ లైవ్’ యాప్‌ను వినియోగించుకోవచ్చు. పాఠశాల యాజమాన్యాలు సైతం 2011 మార్చ్ 16న రవాణా శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లోని (జీఓ ఎంఎస్ నెం.35) అంశాలను కచ్చితంగా పాటించాలి.– అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
ప్రమాదాల వెం‘బడి’
సాక్షి, పార్వతీపురం (విజయనగరం): విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కేవలం రెండ్రోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విద్య పేరు చెప్పి రూ.లక్షలు దండుకోవాలన్న ధ్యాస తప్పా విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలన్న ఆలోచన విద్యా సంస్థల యాజమాన్యాలకు లేదన్న విమర్శలున్నాయి. పాఠశాల బస్సుల నిర్వహణలో నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థుల జీవితాలు గాల్లో దీపాలవుతున్నాయి. జిల్లాలో స్కూలు బస్సుల పరిస్థితిని చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు హడలిపోతున్నారు. సీట్లు చిరిగిపోయి, దుమ్ము, ధూళి పేరుకుపోయి, ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో మందులున్నా లేకపోయినా.. ఉన్న మందులు కాస్తా గడువు తేదీ దాటిపోయినా పట్టించుకోకుండా లాభార్జన చూసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి. డబ్బులు వసూళ్లు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రమాణాలు పాటించడంలో చూపించడం లేదు. వీరికి ఇటు విద్యాశాఖాధికారులు, అటు రవాణా శాఖాధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని కారణంగా ఎన్నోచోట్ల విద్యార్థులు ప్రమాదాలకు గురౌతున్నారు. నిబంధనలివి ► బస్సు సర్వీసు వయసు 15 ఏళ్లకు మించి ఉండరాదు. కచ్చితంగా బస్సుకు బీమా ఉండాలి ► బస్సు ముందు, వెనుక స్కూల్‌బస్సు అని రాసి ఉండాలి. దాని పక్కనే పాఠశాల పిల్లల బొమ్మలు ఉండాలి. ► పిల్లలు ఎక్కడానికి వీలుగా ఫుట్ బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు ఉండాలి ► బస్సు వెనుకవైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేసి చీకట్లో కూడా దాన్ని గుర్తించే విధంగా రేడియం స్టిక్కర్‌ను అంటించాలి. అత్యవసర ద్వారం అని తప్పకుండా రాసి ఉండాలి ► అగ్నిమాపక నిదోధక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాల కిట్ ఏర్పాటు చేసి చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచాలి. ► బస్సు ముందు తెలుపు, వెనుక ఎరుపు, పక్కన పసుపు రంగుతో కూడిన రేడియం స్టిక్కర్లు అంటించాలి. ► తప్పనిసరిగా వాహనాలకు పరావరణశాఖ అనుమతి ఉండాలి. పాఠశాల బస్సులు 40 కిలోమీటర్ల వేగాన్ని మించి నడుపరాదు. కొత్త వాహనానికి ఇరువైపులా పసుపు రంగు టేపు అతికించాలి. ► బస్సు తలుపు తెరుచుకుని విద్యార్థులు దిగేటప్పుడు వెనుకనుంచి వచ్చే వాహనదారులు గమనించే విధంగా స్టాప్ బోర్డును తలుపుమీద ఏర్పాటు చేయాలి. ► స్టీరింగ్, బ్రేక్, హారన్ కండిషన్లో ఉండాలి. విద్యార్థి కూర్చోవడానికి వీలుగా కుషన్ సీట్లు ఏర్పాటు చేయాలి ► బస్సుకు నలుమూలలా యాంచర్ కలర్ లైట్లు ఏర్పాటు చేయాలి. బస్సులో అత్యవసర ద్వారాలు ఏర్పాటుచేయాలి. డ్రైవర్ నిబంధనలు ► 25 నుంచి 60 ఏళ్ల లోపు ఆరోగ్యవంతుడై ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్సుతో పాటుగా కనీసం 5 ఏళ్ల అనుభం ఉండాలి ► కంటిచూపు స్పష్టంగా ఉంటూ కనీసం 6/2 కంటిచూపు కచ్చితంగా ఉండాలి. డ్రైవర్, క్లీనర్లు యూనిఫాం ధరించాలి. విధుల్లో మద్యం తాగరాదు. ► ఏటా ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుని బస్సును నడపడానికి అర్హుడేనని డాక్టర్ ధ్రువపత్రం పొందాలి. పాఠశాల ఆవరణలో బస్సు పార్కింగ్ ఏర్పాటు చేయాలి యాజమాన్యాల బాధ్యతలివీ.. ► బస్సు డ్రైవర్, సహాయకుడి ఫొటో, లైసెన్స్ వివరాలను అందరికీ తెలిసేలా బస్సు లోపల బోర్డులో పెట్టించాలి. నిత్యం ప్రయాణించే విద్యార్థుల జాబితాను బస్సులో ఏర్పాటు చేయాలి ► విద్యార్థులను ఎక్కించి, దింపేందుకు ప్రతి బస్సుకు ఒక సహాయకుడిని ఏర్పాటు చేయాలి. రోజూ బస్సు వెళ్లే మార్గాన్ని (రూట్ మ్యాప్) బస్సులో అతికించాలి. తప్పనిసరిగా బస్సులను పాఠశాల ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. ► పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులతో కలసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నెల బస్సు పరిస్థితిని సమీక్షించాలి. రోజూ ప్రయాణించే మార్గాన్ని ప్రధానోపాధ్యాయుడు అప్పుడప్పుడు పరిశీలించాలి పాఠశాల ఆటోలు పాటించాల్సినవి.. ► ఆటో మందు, వెనుక భాగంలో పాఠశాల ఆటో అని రాయించాలి. ఆరుగురు విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలి. ఆటో నడిపే డ్రైవర్‌కు ఏఆర్ (ఆటో రిక్షా) రవాణా వాహనం లైసెన్స్ ఉండాలి. ► ఆటోకు రెండువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. పది కిలోమీటర్ల లోపున్న పాఠశాలల పిల్లల్ని మాత్రమే తీసుకెళ్లాలి. అధికారుల బాధ్యతలివి ► వేసవి సెలవులు ప్రారంభం కాగానే బస్సుల తనిఖీపై పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు పంపాలి. పాత బస్సులైతే ఏటా ఒకసారి, కొత్త బస్సులైతే రెండేళ్లకోసారి తనిఖీలు నిర్వహించాలి ► బస్సు కండిషన్‌ను రవాణా శాఖాధికారులు, సిబ్బంది స్వయంగా పరిశీలించాలి. కండిషన్ సరిగా లేకుంటే సమస్యను పరిష్కరించి తీసుకురావాలని సూచించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సు నిర్వహణ ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. అతిక్రమిస్తే కఠిన చర్య ఈ ఏడాది ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల బస్సులను అణువణువూ పరిశీలించాం. డివిజన్ వ్యాప్తంగా 100 బస్సులుండగా వాటిలో 80 బస్సులు ఫిట్నెస్ కోసం వచ్చాయి. కొన్నింటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చాం. కొన్ని బస్సులను మరమ్మతుల నిమిత్తం పంపించాం. బస్సుల ఫిట్మెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని బస్సులను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని అనుమతించడం లేదు. ఎవరు నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎంవీఐ,పార్వతీపురం -
బడి బండి.. భద్రత కరువండి!
సాక్షి, సిటీబ్యూరో: మరో 24 గంటల్లో బడి గంట మోగనుంది. బుధవారం స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో సర్వత్రా సందడి మొదలైంది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు తిరిగి స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పిల్లలను సురక్షితంగా స్కూళ్లకు తీసుకెళ్లి తిరిగి తీసుకురావాల్సిన బడి బస్సులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. సామర్థ్యం లేని బస్సులు వేల సంఖ్యలో ఉన్నాయి. కాలం చెల్లినవి వందల్లో ఉన్నాయి. స్కూల్ యాజమాన్యాలు, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, ఆర్టీఏ నిర్లక్ష్యం ఫలితంగా పిల్లల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల 15వ తేదీనే స్కూల్ బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసింది. తిరిగి పునరుద్ధరించుకునేందుకు కనీసం 20 రోజలకు పైగా గడువు ఉంది. కానీ చాలా స్కూళ్లు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించాయి. అదే సమయంలో కొన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2,321 స్కూల్ బస్సులు నమోదై ఉండగా... ఇప్పటి వరకు ఆర్టీఏ అధికారులు కేవలం 948 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించారు. 1,373 బస్సులు సామర్థ్యం లేనివే. ఈ ఒక్క జిల్లాలోనే 15 ఏళ్ల కాలపరిమితి ముగిసినవి 727 బస్సులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఫిట్నెస్ లేనివి, కాలం చెల్లిన బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్లో 13,082 స్కూల్, కాలేజీ బస్సులుంటే వాటిలో ఇప్పటి వరకు 8,574 బస్సులకు ఫిట్నెస్ నిర్వహించారు. ఇంకా 4508 బస్సులు ఫిట్నెస్ లేకుండా ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులు 1424 వరకు ఉన్నాయి. ఇలాంటి కాలం చెల్లిన బస్సుల్లోనే కొన్ని స్కూళ్లు పిల్లలను తరలిస్తున్నాయి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ కేవలం ప్రహసనంగా మారిందనేందుకు ఇదే నిదర్శనం. కదలిక లేని స్కూళ్లు... నిజానికి ఫిట్నెస్ గడువు ముగిసిన వెంటనే ఆర్టీఏ అధికారులను సంప్రదించడం స్కూళ్ల బాధ్యత. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పిల్లల భద్రతకు సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా బస్సులను నిర్వహించాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సు, అగ్నిమాపక యంత్రం వంటి రక్షణ చర్యలతో పాటు బస్సుల నాణ్యత, సరైన సూచికలు, హెచ్చరిక బోర్డులు, స్కూల్ వివరాలు వంటివి అన్ని స్పష్టంగా ఏర్పాటు చేయాలి. బడి బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించే సమయంలో మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్ స్థాయికి ఏమాత్రం తగ్గని ఆర్టీఏ అధికారి ప్రతి బస్సును విధిగా పరీక్షించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించాలి. బస్సు కొద్ది దూరం నడిపించి సంతృప్తి చెందిన తరువాతనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ అందుకు విరద్ధంగా ఎలాంటి పరీక్షలు లేకుండానే ఫిట్నెస్ ధ్రువీకరిస్తున్నారు. కొన్ని చోట్ల కేవలం కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడం గమనార్హం. మరోవైపు కొన్ని స్కూళ్ల నిర్వాహకులు కాలం చెల్లిన బస్సులనే పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని తనిఖీ చేసి జప్తు చేయాల్సి ఉంది. కానీ ఆర్టీఏ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం వల్లనే నగరంలో ఈ బస్సులపై నియంత్రణ లేకుండా పోతోందనే విమర్శలున్నాయి. హడావుడిగా స్పీడ్ గవర్నెర్స్.. ఒకవైపు స్కూళ్లు తెరుచుకొనే గడువు ముంచుకొస్తుండగా మరోవైపు రవాణాశాఖ హడావుడిగా ఒక జీవోను వెలువరించింది. బడి బస్సుల భద్రతకు సంబంధించిన ఈ జీవో ప్రకారం ప్రతి బస్సు కు తప్పనిసరిగా వేగ నియంత్రణ పరికరాలైన స్పీడ్ గవర్నర్స్‌ను బిగించాలి. గంటకు 60 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్లకుండా ఇవి నియంత్రిస్తాయి. కానీ ఇప్పటికే 8 వేలకు పైగా బస్సులకు తనిఖీలు చేసి సర్టిఫికెట్లను ఇచ్చేశారు. తిరిగి ఆ బస్సులకు మరోసారి పరీక్షలు నిర్వహించడం, స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ఆచరణ సాధ్యం కాని విషయం. ఇది అధికారులకు సైతం తెలిసిన సంగతే. 12 నుంచి స్పెషల్ డ్రైవ్... ఫిట్నెస్ లేని బస్సులపై ఈ నెల 12 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. గడువు ముగిసినా ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోకుండా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నగరంలో మొత్తం స్కూల్ బస్సులు: 13,082 ఫిట్నెస్ పూర్తయినవి: 8,574 ఇంకా చేయాల్సినవి: 4,508 కాలం చెల్లిన బస్సులు: 1,424 -
మిగిలింది ఆరు రోజులే..
సాక్షి,సిటీబ్యూరో: బడి బస్సుల భద్రతపై ఆర్టీఏ దృష్టి సారించింది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డెక్కే బస్సులను సీజ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. జూన్ 1 నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయనే ఉద్దేశంతో తొలుత హడావిడి చేసినా 12వ తేదీకి వాయిదా పడడంతో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వాస్తవంగా మే 15 నాటికి అన్ని స్కూల్ బస్సులకు ఫిట్నెస్ గడువు ముగుస్తుంది. ఆ రోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోగా బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయించాలి. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల పరిధిలోని 12 వేలకు పైగా స్కూల్ బస్సుల్లో ఇప్పటి వరకు సుమారు 3700 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 8 వేలకు పైగా బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఇందుకు ఆరు రోజులు మాత్రమే గడువు మిగిలింది ఉంది. ఈ కొద్దిపాటి వ్యవధిలోనే గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో పరీక్షలు నిర్వహించి బడి బస్సుల భద్రతా ప్రమాణాలను నిర్ధారించాల్సి ఉంది. ఆ దిశగా తాము ఇప్పటికే కార్యాచరణ చేపట్టినట్లు రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు లేఖలు రాయడంతో పాటు స్కూల్ బస్సు డ్రైవర్లు, అటెండర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి స్కూల్ యాజమాన్యం బస్సుల ఫిట్‌నెస్‌పై అప్రమత్తంగా ఉండాలని, డ్రైవర్లు, అటెండర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. 12న స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నందున ఆ లోగా ఫిట్నెస్ ధృవీకరణ పొందాల్సి ఉంటుందన్నారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే వాటిని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఈ సారి ఆర్టీఏ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. బస్సులు..భద్రతా ప్రమాణాలు.. ♦ బస్సు పసుపు రంగులో ఉండాలి. రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. బస్సులోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి.దీనివల్ల లోపల ఉన్న పిల్లలు కూడా డ్రైవర్‌కు కనిపిస్తారు. ♦ బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్), పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి. ♦ సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకొనేందుకు వీలుగా అక్కడక్కడా లోహపు స్తంభాలను అమర్చాలి. ♦ వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబ ర్ (గాఢ పసుపు పచ్చని) రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి.పిల్లలు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. ♦ సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసేలా ముందు భాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్ధులు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) నల్లరంగులో చిత్రించాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి. ♦ బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్ తో ఉండాలి. సైడ్ విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు. ♦ ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. ♦ లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకొనేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్ ఉండాలి. ♦ బస్సులో ప్రయాణించే విద్యార్థుల పేర్లు, తరగతులు,ఇళ్ల చిరునామాలు, ఎక్కవలసిన, దిగవలసిన వివరాలు బస్సులో ఉండాలి. డ్రైవర్ల అర్హతలు ... ♦ డ్రైవర్ వయస్సు 60ఏళ్లకు మించకుండా ఉండాలి. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి. ♦ యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకుప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి. ♦ డ్రైవర్‌ను నియమించేందుకు ముందు అతని అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్, తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. ♦ డ్రైవర్‌కు బస్సు డ్రైవింగ్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ♦ డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. పేరెంట్స్ కమిటీ పనితీరు... ♦ బస్సుకు సంబంధించిన బాహ్య పరికరాలు విండ్‌స్క్రీన్, వైపర్స్, లైటింగ్స్ వంటి వాటి మెకానికల్ కండీషన్స్, పనితీరు తెలుసుకొనేందుకు ప్రిన్సిపాల్‌తో కలిసి పేరెంట్స్ కమిటీ ప్రతి నెలా తనిఖీలు చేయాలి. ♦ ఫస్ట్ ఎయిడ్ బాక్సులో మందులు, ఇతరపరికరాలు కూడా తనిఖీ చేయాలి. -
జపాన్‌లో స్కూల్ బస్సుపై దుండగుడి దాడి
-
బడి బస్సులో భద్రత ఎంత?
కంటికి రెప్పలా కాపాడుకుంటూ అరచేతుల్లో పెట్టుకుని పెంచుకునే పిల్లలకు చిన్నపాటి గాయమైనా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. తమ పిల్లల భవిష్యత్ బంగారుమయం కావాలన్న తాపత్రయంతో దూరంగా ఉన్నా మంచి పాఠశాలలను ఎంచుకుని ఆ పాఠశాల బస్సుల్లో ప్రతి రోజూ పంపిస్తారు. వారు తిరిగి ఇంటికి చేరే వరకూ అటువైపే దృష్టి ఉంటుంది. అయితే చాలా పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సుల విషయంలో తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. అనకాపల్లి: అధిక శాతం మంది తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, బోధన, ఇతర అభ్యసన ప్రక్రియలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు కోరుకునే పాఠశాలకు వారి పిల్లలను పంపాలంటే ఆయా పాఠశాలలకు చెందిన బస్సులే కీలకం. అయితే డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయమైన కొన్ని విద్యాసంస్థలు బస్సుల నిర్వహణ, సిబ్బంది విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రోడ్డు రవాణాశాఖ అధికారులు పాఠశాల బస్సుల నిర్వహణలో పలు మార్గదర్శకాలు రూపొందించినా.. వాటిని కేవలం ఏడాదికొకసారే పరిశీలన జరిపి వదిలేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు బడులకు వెళ్లేటప్పుడు ఆయా విద్యాసంస్థల బస్సులు ఢీకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది నెలలు క్రితం అనకాపల్లి మండలంలోని కూండ్రంలో ఆడుతున్న చిన్నారులపైకి ఒక బస్సు వెళ్లి బలితీసుకుంది. అనకాపల్లి పరిసరాల్లో ఉన్న కొన్ని పాఠశాలలకు చెందిన బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. గత విద్యాసంవత్సరంలో మూసివేసిన ఓ పాఠశాలకు చెందిన బస్సు బైపాస్‌రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు బస్సు ముందు ఉన్న అద్దం బద్దలైంది తప్ప చిన్నారులకు గాయాలు కాలేదు. రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల వినోదయాత్ర నిమిత్తం యారాడ బీచ్‌కు విద్యార్థులను తీసుకెళ్లింది. తిరిగి వస్తుండగా బస్సులు ప్రమాదానికిగురి కావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. పిల్లలకు తీవ్ర గాయాలైనప్పటికీ ఎవరూ చనిపోకపోవడంతో అటు అధికారులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యాసంస్థలను నిర్వహించే యాజమాన్యాల ఆర్థిక పరిస్థితి బట్టి బస్సుల కొనుగోలు ఉంటుందనేది అందరికీ తెలిసిందే. చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలకు సెకెండ్‌హ్యాండ్ బస్సులను కొనుగోలు చేస్తుంటారు. ఇటువంటి బస్సుల్లో రోడ్డు రవాణా శాఖ అధికారులు విధించిన ప్రమాణాలు ఉండవనేది అందరికీ తెలిసిందే. అయితే ఎటువంటి ఉపద్రవం ఎదురుకానంత వరకు ఎవరూ పట్టించుకోరు. 15తో ముగియనున్న బస్సుల ఫిట్నెస్ గడువు అనకాపల్లి ఆర్టీఏ కార్యాలయ పరిధిలో సుమారు 1,400 ప్రైవేటు పాఠశాలల బస్సులు ఉన్నాయి. ఆయా పాఠశాల బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఈ బస్సులను ఉపయోగించాలంటే తక్షణమే ఆర్టీఏ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను పొందాలి. ఆయా బస్సుల్లో మెడికల్ కిట్, డ్రైవర్, క్లీనర్, ఫైర్‌సేఫ్టీ కిట్, బస్సు తిరిగే రూట్‌మ్యాప్ ఉండాలి. బస్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే మిగతా ప్రక్రియ ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆయా పాఠశాల బస్సుల్లో చివరి విద్యార్థి దిగే వరకూ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. డ్రైవర్‌కు లైసెన్స్‌తోపాటు హెల్త్‌కార్డు, మూడు నెలలకొకసారి సబ్మిట్ చేస్తుండాలి. మద్యం తాగే వ్యక్తిని, కంటిచూపు మందగించిన వారిని స్కూల్ బస్ డ్రైవర్లుగా ఉపయోగించరాదు. వీటన్నింటిని పర్యవేక్షించిన అనంతరం ఆర్టీఏ అధికారులు బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ నిబంధనలు పాటిస్తేనే సర్టిఫికెట్ ♦ బస్సు ఎడమ వైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపరచాలి ♦ బస్సు బయలుదేరు సమయం, ఆగు స్థలాలు, రూల్ప్లాన్ బస్సులో ఉంచాలి ♦ విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి, సీట్ల సామర్థ్యానికి తగ్గట్టుగా విద్యార్థులతోప్రయాణించాలి. ♦ డ్రైవర్‌కు కనీసం ఐదేళ్ల అనుభవం, ఆరోగ్యంగా ఉన్నట్టు ధ్రువీకరించు హెల్త్‌కార్డు ఉండాలి. ♦ ప్రతి నెలా బస్సు కండీషన్‌ను యాజమాన్యం, పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాలి. ♦ ఫిర్యాదుల పుస్తకం బస్సులో ఉంచాలి. పుస్తకాన్ని ప్రతీనెలా యాజమాన్యం తనిఖీ చేసి, ఫిర్యాదులు పరిశీలించాలి. ♦ బస్సుకు కన్వెన్స్క్రాస్ అద్దాలు అమర్చాలి. లోపలి భాగంలో పెద్ద పారదర్శక అద్దం ఉండాలి. ♦ అత్యవసర ద్వారం, ప్రథమ చికిత్స మందులు వాహనంలో ఉంచాలి ♦ బస్సులను ఆయా విద్యా సంస్థలకు చెందిన పార్కింగ్ స్థలాల్లో ఉంచాలి. ♦ ప్రతీ బస్సుకు అటెండర్ ఉండాలి. డ్రైవర్, అటెండర్ యూనీఫారం ధరించాలి. ♦ బస్సు డ్రైవర్ రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించే శిక్షణతరగతులకు హాజరుకావాలి ♦ విడతల వారీగా బస్సులో టీచర్లు ప్రయాణించేలా చూసి, విద్యార్థుల సంరక్షణను పర్యవేక్షించాలి. క్షుణ్ణంగా పరిశీలించాకే... ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తాం. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు కచ్చితంగా పాటింటిచాలి. వాహనం కండిషన్లో లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా సర్టిఫికెట్ నిరాకరిస్తాం. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఈనెల 15వతేదీలోగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. నిబంధనల మేరకు బస్సులో సదుపాయాలు కల్పించాలి. – రవీంద్రనాథ్, ఆర్టీవో -
స్కూల్ బస్సు హైజాక్.. ఆపై నిప్పు
రోమ్: ఇటలీలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ 51 మంది పిల్లలున్న బస్సును హైజాక్ చేసి బస్సుతోపాటు వాళ్లందరినీ తగులబెట్టాలని చూశాడు. అదృష్టవశాత్తూ పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి మంటల్లో చిక్కుకున్న పిల్లలందర్నీ రక్షించగలిగారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీలోకి వలస వస్తున్న వారిపై ఇటలీ ఉప ప్రధానుల వైఖరికి నిరసనగా ఈ పని చేసినట్లు ఆ డ్రైవర్ చెప్పాడు. ‘మధ్యధరా సముద్రంలో ఎంతో మంది చనిపోతున్నారనీ, ఈ రోజు మీరు∙చావబోతున్నారు’ అని అతను విద్యార్థులతో అన్నాడు. 51 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది ఓ క్రీడా వేదికకు వెళ్లొస్తుండగా డ్రైవర్ ఈ హైజాక్‌కు పాల్పడ్డాడు. 30 నిమిషాలపాటు వారిని తన బందీలుగా ఉంచుకున్నాడు. వెంట తెచ్చిన పెట్రోల్‌ను బస్‌పై పోసి నిప్పంటించాడు. ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి హైజాక్ విషయం చెప్పడం, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్వరమే పోలీసులు అక్కడకు చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి అందరినీ రక్షించారు. -
విద్యార్థిని బలిగొన్న స్కూల్ బస్సు
మొయినాబాద్ (చేవెళ్ల): ఉదయం ఇంట్లోంచి పాఠశాలకు వెళ్లేటప్పుడు అమ్మా టాటా అంటూ నవ్వుతూ చెప్పి వెళ్లిన బాలుడు మధ్యాహ్నానికి ఇంటి ముందే విగతజీవిగా మారాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బలయ్యాడు. బస్సు కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే గారాబంగా గోరుముద్దలు తినిపించాలనుకున్న ఆ తల్లికి తీరని శోకం మిగిల్చాడు. ఈ హృదయవిదారకమైన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన బసవాని సునీల్, భాగ్యలక్ష్మి దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువుకోసం మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామానికి వలస వచ్చారు. తమ ముగ్గురు కొడుకులతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సునీల్ గ్రామ సమీపంలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సునీల్ పెద్ద కుమారుడు వరుణ్ (9) చిలుకూరులోని ఓ పాఠశాలలో స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే శనివారం ఉదయం స్కూల్ బస్సులో వెళ్లాడు. శనివారం హాఫ్‌డే కావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్కూల్ బస్సులో ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు బస్సు ఆగడంతో బస్సులోంచి దిగి రోడ్డు దాటేందుకు బస్సు ముందుకు వెళ్లాడు. బాలుడిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో బాలుడు సిమెంటు రోడ్డుపై పడిపోయాడు. బస్సు ముందు చక్రం అతని తలపై నుంచి పోవడంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పెద్దగా అరవడంతో బస్సును అక్కడే నిలిపేశాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ఉదయం కొడుకు చెప్పిన మాటలను తలుచుకుంటూ తల్లి రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పాఠశాల యాజమాన్యం బాలుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు బాలుడి మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సును మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
విజయవాడలో స్కూల్ బస్సు బీభత్సం
-
టైర్ పేలి స్కూల్ బస్సును ఢీకొన్న కారు
కర్నూలు ,మంత్రాలయం రూరల్: టైర్ పేలడంతో అదుపు తప్పిన కారు..స్కూల్ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులకు సురక్షితంగా బయపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంత్రాలయం మండల పరిధిలోని చెట్నేహళ్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. మాధవరం వైపు నుంచి మంత్రాలయం వైపు వస్తున్న శ్రీవైష్ణవి పాఠశాలకు చెందిన స్కూల్ బస్సును మంత్రాలయం వైపు నుంచి మాధవరం వైపు వెళ్తున్న కారు టైరు పగిలి ఢీకొట్టింది. స్కూల్ బస్సు చివరన కారు తాకడంతో పాక్షికంగా దెబ్బతింది. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జున, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు సత్యరాజు, నాయకులు అశోక్‌కుమార్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను క్షేమంగా మరొక బస్సులో స్కూల్‌కు పంపారు. -
అదుపు తప్పిన స్కూల్ బస్సు
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పడంతో ఇద్దరు గాయపడిన సంఘటన బుధవారం పలాసలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం సమీపంలో కౌసల్యనగర్ చెందిన దండాసి లచ్చయ్య రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం తన ఇంటి నుంచి కాశీబుగ్గ బస్టాండ్‌కు రిక్షా తీసుకుని వెళ్తుండగా పలాస విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో లచ్చయ్య రిక్షాతో సహా రోడ్డుపై బోల్తాపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఇడ్లీలు అమ్ముకుంటూ నడిచి వెళ్తున్న బరాటం శ్రీనివాసరావును కూడా బస్సు ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులిద్దరినీ పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాష్యం కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు సపర్యలు చేస్తున్నారు.