విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా చందర‍్లపాడు మండలం తర్లపాడు వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో బస్సులో ఉన్న 32మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం విద్యార్థులను అక్కడ నుంచి తరలించారు.