Bhashyam educational institutions
-
వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
-
మహబూబ్‌నగర్.. వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి మహబూబ్‌నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళుతున్న భాష్యం టెక్నో స్కూల్‌కు చెందిన బస్సు నీటిలో చిక్కుకుంది. రాంచంద్రపూర్, మాచన్‌పల్లి, సూగురుగడ్డ తాండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది. చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విద్యార్దులంతా క్షేమంగా బయటపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు. అయితే బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి -
ఘనంగా భాష్యం బ్లూమ్స్ వార్షికోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : మణికొండలోని భాష్యం బ్లూమ్స్ పాఠశాలలో అయిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను సత్కరించారు. మెరిట్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా సత్కరించారు. స్కూల్ ప్రిన్సిపల్ పాల్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వీటిలో చిన్నారులు చేసిన నృత్యాలు, కరాటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని ముఖ్య అతిధులు పేర్కొన్నారు. -
రేపు నాసా యాత్రకు వెళ్తున్న భాష్యం ఐఐటీ విద్యార్థిని
గుంటూరు ఎడ్యుకేషన్: భాష్యం ఐఐటీ అకాడమీ ఫౌండేషన్‌లో 9వ తరగతి చదువుతున్న జి.సాయి పూజిత ఈనెల 30న అమెరికాలోని అంతరిక్ష పరిశోధ న సంస్థ (నాసా) సందర్శనకు వెళు తోందని భాష్యం లిటిల్ చాంప్స్ సీఈవో భాష్యం ఆశాలత తెలిపారు. గుంటూరులోని భాష్యం ప్రధాన కార్యాలయంలో శనివారం ఆమె విలేకరు లతో మాట్లాడారు. యూఎస్ఏలోని ఆస్ట్రానాట్ మెమోరియల్ ఫౌండే షన్, ఫ్లొరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గో ఫర్ గురు సంస్థ సంయుక్తంగా గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పేస్ సైన్స్ వ్యాసరచన పోటీలో దేశవ్యాప్తంగా 826 పాఠ శాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. ఈ పరీక్షల్లో అత్యంత ప్రతిభ చూపడం ద్వారా భారత్ నుంచి ముగ్గురు విద్యార్థులను నాసా ఎంపిక చేయగా, వారిలో ఒకరు సాయిపూజిత కావడం గర్వించదగిన విషయమన్నారు. నాసా వ్యోమగామి డాక్టర్ డాన్ ధామస్ చేతుల మీదుగా తమ విద్యార్థిని సాయి పూజిత నాసా సందర్శ నార్థం ఉచితంగా విమాన టికెట్ అందుకుందని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐదు అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించగా వాటిలో ‘అబ్దుల్ కలాం మై ఇన్స్పిరేషన్, మై హీరో’ అనే అంశంపై రాసిన వ్యాసానికి గానూ సాయిపూజిత అర్హత సాధించినట్లు తెలిపారు. -
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
-
భాష్యం స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి,చందర్లపాడు : విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో బస్సులో ఉన్న 32మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం విద్యార్థులను అక్కడ నుంచి తరలించారు. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్క్ష్యంగా మితిమీరిన వేగంతో బస్సును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మూల మలుపు వద్ద నెమ్మదిగా వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినా డ్రైవర్ పెడచెవిన పెట్టేవాడని, స్కూల్ యాజమాన్యం డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తమ పిల్లలు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
యోగాలో సుజాత ప్రతిభ
చీపురుపల్లి: జిల్లా స్థాయిలో జరిగిన యోగా పోటీల్లో పట్టణానికి చెందిన గవిడి సుజాత అనే గృహిణి చక్కని ప్రతిభ కనపరిచి స్థానికుల నుంచి అభినందనలు దక్కించుకుంది. ఈ నెల 6న విజయనగరంలోని భాష్యం పాఠశాలలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 35 ఏళ్ల విభాగంలో పాల్గొన్న పట్టణానికి చెందిన గవిడి సుజాత జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో తృతీయ స్థానాన్ని సంపాదించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల స్థానికంగా హర్హం వ్యక్తం అవుతోంది. పట్టణానికి చెందిన సాయికిరణ్ అనే విద్యార్థి 8 ఏళ్ల విభాగంలో జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని సంపాదించుకున్నాడు. పట్టణంలోని కొత్తగవిడివీధిలో యోగా గురువు వెంకటరమణ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కేంద్రంలో వీరు గత కొంత కాలంగా శిక్షణ తీసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల యోగా గురువు వెంకటరమణ వీరిని అభినందించారు. -
వైభవంగా ‘భాష్యం’ వేడుకలు
గుంటూరు ఎడ్యుకేషన్ : భాష్యం విద్యాసంస్థల 23వ వార్షికోత్సవాన్ని గోరంట్లలోని భాష్యం టీచర్స్ కాలనీ ప్రాంగణంలో మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ముందుగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జన్మదినోత్సవాన్ని ఇదే వేదికపై జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యతోనే మనిషికి సమాజంలో ఒక గుర్తింపు వస్తుందని చెప్పారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పి జీవితాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్ల వినయ, విధేయతలతో నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో అగ్రగామి విద్యాసంస్థగా, విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో టాపర్లుగా తీర్చిదిద్దుతూ బ్రాండ్ ఇమేజ్ను భాష్యం సొంతం చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విలువలు కలిగిన మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రుల నమ్మకమే పునాదిగా భాష్యం ఎదిగిందని చెప్పారు. కార్యక్రమంలో భాష్యం పూర్వ విద్యార్థి గౌతమ్, సంస్థ సలహాదారు మైలవరపు శ్రీనివాసరావు, భాష్యం హనుమంతరావు, భాష్యం గోపి, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేలాదిగా పాల్గొన్నారు. అనంతరం విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారీ విద్యుత్ వెలుగుల నడుమ తీర్చిదిద్దిన వేదిక సినీ సెట్టింగ్‌ను తలపించింది.