సాక్షి,చందర్లపాడు : విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా చందర‍్లపాడు మండలం తుర్లపాడు వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో బస్సులో ఉన్న 32మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం విద్యార్థులను అక్కడ నుంచి తరలించారు.
ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్క్ష్యంగా మితిమీరిన వేగంతో బస్సును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మూల మలుపు వద్ద నెమ్మదిగా వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినా డ్రైవర్ పెడచెవిన పెట్టేవాడని, స్కూల్ యాజమాన్యం డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తమ పిల్లలు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment