పెనమలూరు మండలం గంగూరు వద్ద ఆగి ఉన్న రోడ్డు రోలర్‌ను నలంద విద్యానికేతన్ అనే పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 విద్యార్ధులకు, ముగ్గురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. అక్షిత అనే ఆరేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఐసీయూలో చికిత్సపొందుతోంది. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు రోలర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు
Published Fri, Feb 12 2016 11:59 AM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM
Advertisement
Advertisement