ఊడిపోయిన బస్సు చక్రాలు, డ్రైవర్ అప్రమత్తం | Just Missed In big Accident of School Bus in krishna district | Sakshi
Sakshi News home page

ఊడిపోయిన బస్సు చక్రాలు, డ్రైవర్ అప్రమత్తం

Published Fri, Jul 25 2014 9:23 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

Just Missed In big Accident of School Bus in krishna district

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట వద్ద విద్యార్థులను తీసుకువెళ్తున్న చైతన్య టెక్నో స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. దాంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై సెడన్ బ్రేక్ వేసి బస్సును నిలిపివేశాడు. 48 మంది విద్యార్థులను డ్రైవర్ బస్సులో నుంచి కిందకి దింపివేశాడు. అనంతరం ఆ ఘటనపై పోలీసులకు, స్కూలు యాజమాన్యానికి సమాచారం అందించాడు. స్కూల్ యాజమాన్యం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 48 మంది విద్యార్థులను మరో వాహనంలో స్కూలు కు తరలించారు. రహదారిపై నిలిచిన బస్సును స్థానికుల సహాయంతో పోలీసులు పక్కకు మళ్లించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement