
సాక్షి, జగ్గయ్యపేట: అనైతిక బంధం మోజులో పడిన ఆ తల్లి విచక్షణ మరిచిపోయింది. రక్తం పంచుకుపట్టిన బిడ్డనే ప్రియుడితో కలిసి కడతేర్చిందో మహిళ. ఈ దారుణ సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును హతమార్చి, మృతదేహాన్ని మరో ప్రాంతంలో పూడ్చి పెట్టింది. వివరాల్లోకి వెళితే.. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లికి చెందిన ఉష రెండు నెలల క్రితం భర్తతో విడిపోయి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఉష ఇద్దరి కుమారులు కూడా వారితోనే ఉంటున్నాడు.
అయితే కొడుకు తమకు అడ్డంకిగా మారడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. దీంతో ప్రియుడు శ్రీనుతో కలిసి చిన్న కొడుకును హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తెలంగాణలోని కోదాడ వద్ద పూడ్చి పెట్టారు. అయితే వీరి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉషతో పాటు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరం చేసినట్లు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment