usha
-
ట్రంప్, జేడీ వాన్స్ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇక, జేడీ వాన్స్ ప్రమాణం సందర్భంగా ఆయన పక్కనే తన భార్య ఉషా వాన్స్(Usha Vance) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ఆనందంతో ఉప్పొంగిపోయారు. సాధారణంగా అధ్యక్షుడి కంటే ముందు ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలోనే తొలుత అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భార్య ఉషా చిలుకూరి, పిల్లలు ఆయన పక్కనే నిల్చుని ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జేడీ వాన్స్.. తన సతీమణి ఉషా చిలుకూరి ప్రేమగా ముద్దిచ్చారు.ఇక, ప్రమాణం సందర్బంగా జేడీ వాన్స్..‘విదేశీ, దేశీయ శత్రువులందరికీ వ్యతిరేకంగా.. నేను యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగానికి మద్దతు ఇస్తానని, దానిని రక్షించుకుంటానని నేను గంభీరంగా ప్రమాణం చేస్తున్నాను. నేను అమెరికా రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటాను. ఎటువంటి మెంటల్ రిజర్వేషన్ లేదా ఎగవేత ఉద్దేశ్యం లేకుండా.. నేను ఈ బాధ్యతను స్వేచ్ఛగా తీసుకుంటాను. నేను ప్రవేశించబోయే పదవి విధులను నేను చక్కగా, నమ్మకంగా నిర్వర్తిస్తాను అని అన్నారు.Having a woman who looks into your eyes with the trust and faith that J.D. Vance's wife, Usha, does is truly beautiful. It's a wonderful day for such a lovely family. pic.twitter.com/QviCXTK9PO— Kish (@kish_nola) January 20, 2025ఇదిలా ఉండగా.. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ భారత సంతతికి చెందినవారు. ఆమెకు తెలుగు మూలాలు కూడా ఉన్నాయి. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. వారు సుదీర్ఘ కాలం కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఉషా చిలుకూరి అక్కడే జన్మించారు. 1986లో కాలిఫోర్నియాలో జన్మించిన ఉషా చిలుకూరి.. శాన్ డియాగో శివారులో పెరిగారు. ఆమె రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు.జేడీ వాన్స్‌తో పరిచయం..2013లో జేడీ వాన్స్‌ను ఉషా చిలుకూరి కలిశారు. వారు కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికాపై చర్చా సమూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. ఆ తర్వాత వారు 2014లో వివాహం చేసుకున్నారు. ఒక హిందూ పూజారి సమక్షంలో నిర్వహించిన వేడుకలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జేమ్స్ డేవిడ్ వాన్స్-ఉషా చిలుకూరి వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవాన్, వివేక్, మిరాబెల్.Vice President JD Vance and Second Lady Usha joined President Trump and First Lady Melania for an inaugural ball dance. I’m crying 🥹❤️🇺🇸pic.twitter.com/vqLtMpB2sy— Jane Carrot (@JanecheersJazz) January 21, 2025 -
అద్భుతమైన జంట.. జేడీ వాన్స్, ఉషా వాన్స్‌కు అభినందనలు: ట్రంప్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, వైఎస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ఈ క్రమంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్లో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారుల సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. అమెరికా తమకు అపూర్వమైన, శక్తివంతమైన ఆదేశాన్ని ఇచ్చిందని అన్నారు. తన సహచరుడు జేడీ వాన్స్, భారతీయ అమెరికన్ అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్‌పై ప్రశంసలు కురిపించారు.‘‘మొదటగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఆయన అద్భుతమైన, అందమైన భార్య ఉషా వాన్స్‌ను అభినందిస్తున్నా. ఇక నుంచి మిమ్మల్ని ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలువచ్చు. ఈ ఎన్నికల్లో మనం చరిత్ర సృష్టించాం. ఎవరూ సాధ్యం కాదనుకున్న అడ్డంకులను అధిగమించాం. అమెరికా దేశం ఎన్నడూ చూడని రాజకీయ విజయం. నాకు మద్దతు ఇచ్చిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్‌కి కృతజ్ఞతలు’’ అని అన్నారు.ఇక.. ట్రంప్ రన్నింగ్మేట్గా గెలుపు ఖరారు చేసుకున్న జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని వడ్లూరు గ్రామంలో జన్మించిన ఇండో అమెరికన్. జేడీ వాన్స్ గెలుపుతో ఆమె అమెరికాకు రెండవ మహిళ(Second Lady) హోదా దక్కించుకోకున్నారు. ఆమె యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్‌ను మొదటగా కలుసుకున్నారు. ఈ జంట 2014లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉష పేరెంట్స్ రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పని చేశారు. గత ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాగా.. ఈసారి తెలుగుమూలాలున్న వ్యక్తి భర్త(జేడీ వాన్స్) ఆ పదవిని చేపట్టబోతున్నారు.'Now I Can Say Vice President': Trump hails JD Vance, His wife after 'Political Victory'Watch: https://t.co/Fj7vonSlLl | #USElection2024 #Trump2024 #JDVance #VicePresident #IndianAmerican #UshaVance pic.twitter.com/9DiDFHh1J9— Business Today (@business_today) November 6, 2024Video Credits: Business Todayచదవండి: US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ -
ప్రముఖ నటుడు లిఫ్ట్‌లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: నటి
మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలను దారుణంగా వేధిస్తున్నారని జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది. లేడీ ఆర్టిస్టులను అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి ఉష తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. 1992లో మోహన్‌లాల్‌తో కలిసి సినిమా చేస్తున్న రోజులవి.. టీమ్ అంతా కలిసి బహ్రెయిన్ వెళ్లాం. అక్కడ ఓ షో పూర్తవగానే అందరం తిరుగుప్రయాణానికి రెడీ అయ్యాం. లిఫ్ట్‌లో నాతో అసభ్యంగా..మోహన్‌లాల్ మా సామాన్లు తెచ్చేసుకోమని చెప్పాడు. నేను గదిలోని నా సామాను సర్దేసుకుని లిఫ్ట్ ఎక్కాను. అప్పటికే అందులో ఓ సీనియర్ నటుడు ఉన్నాడు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే కోపంతో చెంప చెళ్లుమనిపించాను. మలయాళ చిత్రపరిశ్రమలో అందరూ ఎంతగానో అభిమానించే ఆ నటుడు ఇలా చీప్‌గా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ మాట మోహన్‌లాల్‌కు చెప్తే మంచి పని చేశావన్నాడు.ఛాన్సులు తగ్గిపోయాయి..కానీ అందరూ నాకు పొగరు అని ముద్ర వేశారు. ఈ సంఘటన తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడా పెద్ద మనిషి బతికి లేడు కాబట్టి తన పేరు చెప్పదల్చుకోలేదు. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారంటారేమో.. ఈ విషయం నేను గతంలో చెప్పాను. అందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుండటంతో మరోసారి చెప్తున్నాను అని ఉష పేర్కొంది.చదవండి: ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ -
ఉషా చిలుకూరి..ఏయూ ప్రొఫెసర్ శాంతమ్మ మనవరాలే..!
అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరు నామినేట్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు మారుమోగిపోయింది. ఆయన భార్య మన తెలుగింటి అమ్మాయి కావడంతో వాన్స్ తెలుగింటి అల్లుడంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కసారిగా భారత మూలాలు ఉన్న ఉషా చిలుకూరి పేరు ప్రాధ్యాన్యత సంతరించుకుంది. పైగా ఆమె భర్త విజయ కోసం భారత్‌లో ఒక్కసారిగా ఆమె కుటుంబ బలం పెరిగిపోయింది.ఎందుకంటే తెలుగు రాష్టంలో మన అమ్మాయి భర్త పలాన వాళ్లు అంటూ ఆరాలు మొదయ్యిపోయాయి. ఇక ఉషా చిలుకూరికి విశాఖపట్నంలో బంధువులున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ప్రొఫెసర్‌గా పాఠాలు చెబుతూ ఉత్సాహంగా ఉండే శాంతమ్మ మనవరాలే ఈ ఉష. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఈయన కుమారుడు రాధాకృష్ణ సంతానమే ఈ ఉష. ఉష భర్త జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంపై శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరగడంతో పరిచయం తక్కువేనన్నారు. వాన్స్ అభ్యర్థిత్వం, మా బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్లో అభినందనలు తెలిపారని చెప్పారు. చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉష మేనత్త శారద.. వాన్స్, ఉషల వివాహానికి హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. ‘మా బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా, గర్వంగా అనిపించింది. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య అయితే ఎక్కువ, లేకపోతే తక్కువ అని కాకుండా నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి’ అని శాంతమ్మ వివరించారు.ఇక శాతమ్మ ఇంత వయసులోనూ ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఫిజిక్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తునే ఉండటం విశేషం. అంతేగాదు ఆమె ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చింది. అది ప్రస్తుతం క్లినిక్‌గా పనిచేస్తుంది. త్వరలో దాన్ని కూడా ఆస్పత్రిగా మార్చనున్నారు. ఆమె 1945లో మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుంచి భౌతికశాస్త్రంలో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. ఆమె అప్పుడు మద్రాసు రాష్ట్రంలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ విధ్యార్థిని. ఇక ఆమె బాల్యం దగ్గర కొచ్చేటప్పటికీ..1929 మార్చి 8న మచిలీపట్నంలో జన్మించారు. ఐదు నెలల వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి తరఫు మేనమామ వద్ద పెరిగారు. భౌతిక శాస్త్రం ఆమె ఇష్టమైన సబ్జెక్ట్. ఆమె ఏడు దశాబ్దాలుగా ఫిజిక్స్ బోధిస్తూ యువతకు స్ఫూర్తినిస్తుంది. ఆమె 1989లో 60 ఏళ్ల వయసులో పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత పరిశోధన వైపు దృష్టిసారించి మళ్లీ ఆంధ్రాయూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరి ఆరేళ్లు పనిచేశారు. అలా ఆమె తనకు తొమ్మిదపదుల వయసు వచ్చిన బోధనా వృత్తిని మాత్రం వదలలేదు. అంతేగాదు తన తల్లి జాకమ్మ 104 ఏళ్ల వరకు జీవించారని చెబుతారు శాంతమ్మ. "ఆరోగ్యం మన మనస్సులో సంపద మన హృదయంలో" ఉంటుందని చెబుతుంటారామె. తాను తన చివరి శ్వాస వరకు బోధిస్తూనే ఉంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు శాంతమ్మ. (చదవండి: సాహో... ప్రొఫెసర్ శాంతమ్మ!)(చదవండి: యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ ..బడ్జెట్ బాధ్యత ఆమెదే..!) -
ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషా‘పతి’
ఉషా చిలుకూరి వాన్స్.. తెలుగు పేరులా ఉంది కదా! అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కొత్తగా చర్చనీయాంశమైన పేరు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వాన్స్ భార్య. కాలిఫోర్ని యాలో పుట్టి పెరిగిన ఆ తెలుగు ఆడబిడ్డ గురించి కొన్ని ముచ్చట్లు.. వాషింగ్టన్: సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్‌గా ఉన్న జేమ్స్ డేవిడ్ వా న్స్ (జేడీ వాన్స్)ను ప్రకటించారు. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా ఉన్న జేడీ వాన్స్ తరువాత ఆయనకు అనుచరుడిగా మారిపో యారు. ట్రంప్‌పై హత్యాయ త్నం జరిగిన వెంటనే.. దీని వెనుక అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండొచ్చని మొట్టమొదటగా ట్వీట్ చే సింది కూడా జేడీనే. సోమవారం జరిగిన కన్వెన్షన్‌లో అభర్థిత్వం ప్రకటించిన త రువా త ప్రసంగించిన ఆయన.. తన ప్రస్థానం వె నుక భార్య ఉషా చిలుకూరి వాన్స్ సహ కా రం ఎంతో ఉందన్నారు. చరిత్ర విద్యార్థిగా.. ఉషా తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాండియాగోలో జన్మించారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ఉషా.. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఉష అక్కడి లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవ లప్మెంట్ ఎడిటర్‌గా, యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. కేంబ్రిడ్జిలో ఆమె లెఫ్ట్–వింగ్, లి బరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో వామపక్ష డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఉషా.. 2018లో రిపబ్లికన్ పార్టీ సభ్యత్వం తీసుకు న్నారు. 2015–2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీలోని వివిధ సంస్థల్లో పని చేశారు. యేల్ వర్సిటీలో చదువుతుండగానే ఉషకు జేడీ వాన్స్ పరిచయం. ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ అనుబంధం ప్రేమగా మారి.. వారిద్దరూ 2014లో కెంటకీలో పెళ్లి చేసుకున్నారు. ఓ పక్క న్యాయ వాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా ఉన్నారు. జేడీ వాన్స్, ఉష దంపతులకు ఇద్దరు కొడుకులు వివాన్, వివేక్, కూతురు మిరాబెల్ ఉన్నారు. వారిని హిందూ, క్రిస్టియన్ రెండు మత విశ్వాసాలతో పిల్లలను పెంచుతున్నారు. -
అమెరికా రిపబ్లికన్ ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు వెన్స్..
-
రోబోటిక్స్ విజేత
‘‘రోబోటిక్స్ రంగంలో బాలురు మాత్రమే రాణిస్తారని ఒకప్పుడు అనుకున్నాను. అది కేవలం అపోహ మాత్రమే. బాలికలు కూడా రాణించగలుగుతారని, బాలురకంటే మెరుగైన ఫలితాలను సాధించగలరని నిరూపించాను’’ అన్నది ఉషా కుమావత్. పదిహేనేళ్ల ఉషా కుమావత్.గోవా, పంజిమ్ పట్టణంలో పదవ తరగతి చదువుతున్న ఉష గత మార్చి నెలలో దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కోవెడర్ 5.0 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రోబో సిటీ చాలెంజ్‌లో విజేతగా నిలిచింది. యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్సెప్ట్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో అరవై దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో స్టెల్లార్ కంట్రోల్ స్కిల్స్‌లో ఉష ప్రతిభ కనబరిచింది. తన విజయాన్ని తన టీచర్ మాయా కామత్‌కి అంకితమిచ్చింది ఉషా కుమావత్. వీడియోగేమ్ కూడా తెలియదు ‘‘మా సొంతూరు రాజస్థాన్‌లోని గుహాలా గ్రామం. నేను పుట్టింది పెరిగింది గోవాలోనే. నాన్న భవన నిర్మాణరంగంలో టైల్స్ అమర్చే పని చేస్తాడు. అమ్మ గృహిణి. కంప్యూటర్ను దూరం నుంచి చూడడమే కానీ కనీసం తాకిన సందర్భం కూడా లేదు. అలాంటి నన్ను మా టీచర్ మాయా కామత్ ఒక రోబోటిక్స్ వర్క్ షాప్‌కి తీసుకెళ్లారు. నాకు చాలా ఆసక్తి కలిగింది. ఎన్నో సందేహాలు కలిగాయి. అవన్నీ టీచర్ని అడుగుతూ ఉంటే ఆమె కూడా చాలా ఇష్టంగా వివరించేవారు.కోడింగ్ కూడా నేర్పించారు. నాకు వీడియో గేమ్ ఆడిన అనుభవం కూడా లేదు. అలాంటిది రోబోటిక్స్‌లో నైపుణ్యం సాధించగలిగానంటే అంతా మా టీచర్ప్రోత్సాహమే. దుబాయ్‌లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ముందు గురుగ్రామ్‌లో జాతీయస్థాయి పోటీలకు తీసుకెళ్లారు. పోటీల వేదిక మీద రోబోను ఆపరేట్ చేయడం కొంత బెరుగ్గా అనిపించినప్పటికీ నా ప్రతిభను ప్రదర్శించగలిగాను. ఆ పోటీల్లోనే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాను.ఆ పోటీల్లో రాణించాలంటే ఇంకా చాలా బాగా సాధన చేయాలని నాకే అర్థమైంది. ఎక్కువ రోజుల్లేవు. నా రోబో పేరు క్వార్కీ. దాంతో ఐదు నిమిషాల సమయంలో మ్యాచింగ్ కలర్స్, జడ్జింగ్ డైరెక్షన్స్, నావిగేటింగ్, సెగ్రెగేటింగ్ వంటి పదకొండు పనులు చేయించి నిరూపించాలి నేను. రోజూ టైమ్ పెట్టుకుని సాధన చేస్తూ ఒక రోజుకంటే మరో రోజు ఇంకా తక్కువ సమయంలో పూర్తి చేస్తూ మొత్తానికి లక్ష్యాన్ని సాధించగలిగాను’’ అని వివరించింది ఉషా కుమావత్. పేరు మారింది ఇదిలా ఉండగా... ఉషకు రోబోటిక్స్‌లో శిక్షణ ఇవ్వడం కంటే దుబాయ్ వెళ్లడానికి పాస్‌పోర్టు కోసం పడిన కష్టాలే పెద్దవన్నారు ఉష టీచర్ మాయా కామత్. ‘‘పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలను చూస్తే ఒకదానితో మరొకటి సరిపోలడం లేదు. స్కూల్ రికార్డ్స్‌లో ఉషా కుమావత్ అని ఉంది, బర్త్ సర్టిఫికేట్లో ఉషా కుమారి అని ఉంది. బర్త్ సర్టిఫికేట్‌ను సరిచేయమని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేయాల్సి వచ్చింది. ఉష తల్లిదండ్రుల మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు. వారి పెళ్లి రాజస్థాన్‌లోని వాళ్ల సొంతూరులో జరిగింది. ఆ సర్టిఫికేట్ కుదరదని పాన్ కార్డు కోసం అప్లయ్ చేశాం.పాన్ కార్డు రావాలంటే ముందు ఆధార్ కార్డులో పేరు సరి చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ని ప్రయాసల తర్వాత పాస్‌పోర్టు జారీ అయింది. కానీ ప్రయాణఖర్చులు ప్రశ్నార్థకమయ్యాయి. గోవాలోని పెద్ద వ్యాపార కంపెనీలను అభ్యర్థించి మొత్తానికి అవసరానికి తగిన డబ్బు సమకూర్చగలిగాను. దుబాయ్ వరకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చక్కటి ప్రతిభ ప్రదర్శించి మనదేశానికి గౌరవం తెచ్చింది. ఉష లాగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉంటే నేర్పించి వారిని విజేతలుగా తీర్చిదిద్దడానికి మాలాంటి టీచర్లు సిద్ధంగా ఉంటారు. మా విజయం మా విద్యార్థులే’’ అన్నారు మాయా కామత్. -
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
-
ఈ పేదింటి బంగారం.. ఓ అద్భుతం!
అరవై దేశాల విద్యార్థులుపాల్గొనే అంతర్జాతీయ పోటీ అది. గోవా దాటని ఉష తొలిసారిగా దుబాయ్‌కు వెళ్లడానికి రెడీ అవుతోంది. వెళ్లడానికి ముందు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ‘సాధించాలని బలంగా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాం’ అనే మాటను తారకమంత్రంలా జపించిన పదిహేను సంవత్సరాల ఉష దుబాయ్‌లో జరిగిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’లో కప్పు గెలుచుకుంది.కొన్ని రోజుల క్రితం..పనాజీ(గోవా)లోని ప్రోగ్రెస్ హైస్కూల్లో రోబో సందడి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్కూలు పిల్లలు తమ ప్రపంచం వదిలి రోబో ప్రపంచంలోకి వెళ్లారు. రోబోటిక్స్ పోటీ అయిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’ తాలూకు సందడి అది. ఆ స్కూల్ స్టూడెంట్ ఉషను ఇంటర్నేషనల్ రౌండ్‌కు చేర్చడానికి టీచర్ మాయా కామత్ బాగా శ్రమించింది.దుబాయ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకుంది మాయా కామత్. ‘ఎన్నో దేశాలుపాల్గొనే ఈ పోటీలో మనం ఎక్కడ! అక్కడి దాకా వెళితే అదే పదివేలు’ ఇలాంటి మాటలను ఆమె పట్టించుకోలేదు. ఎలాగైనా బంగారు కప్పు గెలుచుకోవాలనే పట్టుదలతో పనిచేసింది.గోవాలో జరిగిన రీజనల్ రౌండ్ కోసం ముగ్గురు స్టూడెంట్స్‌ను ఎంపిక చేసింది మాయ. అందులో ఉషతోపాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే మొదట్లో కనిపించిన ఉత్సాహం ఉషలో ఆ తరువాత కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తగ్గింది. ఇలాంటి సమయంలోనే మాయ ఉషలో ధైర్యం నింపి ముందుకు నడిపించింది. ఆ ధైర్యమంత్రం ఫలించి గురుగ్రామ్‌లో జరిగిన నేషనల్ రౌండ్లో ఉష అద్భుత పనితీరు ప్రదర్శించింది. రోబోను బాగా హ్యాండిల్ చేసింది. ఆ తరువాత దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ రౌండ్‌కు ఎంపికైంది.నేషనల్ రౌండ్లో సాధించిన విజయం ఉషకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భయాలను ఎదుర్కొనేలా చేసింది. ఎట్టకేలకు మాయ కామత్ కలను ఉష సాకారం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ అంతర్జాతీయ పోటీలో ఉష కప్పును గెలుచుకుంది. ఉష తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. రోబో సిటీ చాలెంజ్ రూపంలో తన ప్రతిభను ప్రదర్శించే అరుదైన అవకాశం ఉషకు లభించింది. ఉష సాధించిన విజయం తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తింది. ‘సాధించాలని గట్టిగా అనుకున్నాను. సాధించాను’ నవ్వుతూ అంటుంది ఉష.ఛాంపియన్స్ చేంజ్‌మేకర్..‘క్వార్కీ’ అనే రోబోట్‌ను స్టూడెంట్స్‌తో కలిసి తయారు చేసింది మాయా కామత్. నిర్ణీత సమయంలో రకరకాల పనులు చేసేలా ఈ ‘క్వార్కీ’ని రూపొందించారు. పోటీలో ‘క్వార్కీ’ అయిదు నిమిషాల్లో 11 టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజు రెండు గంటలు ప్రాక్టిస్ చేసేది ఉష. రంగులను సరిపోల్చడం, దిశలను అంచనా వేయడం, అడ్డంకులను అధిగమించడం, వస్తువులను వేరు చేయడంలాంటి ‘క్వార్కీ’ నైపుణ్యాలను ఉష అద్భుతంగా ఆపరేట్ చేసింది.‘నేను చెప్పే సలహాలను శ్రద్ధగా విని అందుకు అనుగుణంగా ఉష ప్రాక్టిస్ చేసేది. నేర్చుకోవాలనే తపన ఆమె విజయానికి కారణం. విజయం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉన్నప్పటికీ మాకు ఎదురైన అతి పెద్ద సవాలు దుబాయ్ పర్యటనకు నిధులు సమకూర్చుకోవడం. విజయం సంగతి ఎలా ఉన్నా అసలు దుబాయ్‌కు వెళ్లగలమా అనే సందేహాం వచ్చింది.ఈ పరిస్థితులలో ప్రోగ్రామింగ్‌లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సయేష్ గాంధీ అనే టీచర్ క్రౌడ్‌ఫండింగ్‌కు సంబంధించి సలహా ఇచ్చారు. ఉష కుటుంబ నేపథ్యం, రోబోటిక్స్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి, అంతర్జాతీయ పోటీలోపాల్గొనాలనే ఆమె కల, ఆర్థిక ఇబ్బందులు...మొదలైన వాటి గురించి వీడియో చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది’ అంటుంది మాయా కామత్. ఉష విజయం ఒక సంతోషం అయితే ఆమె గురువు మాయా కామత్ ‘చాంపియన్స్ చేంజ్‌మేకర్’ అవార్డ్ అందుకోవడం మరో సంతోషం.ఇవి చదవండి: పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు! -
Inedible Ink: తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు!
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం తొమ్మిదేళ్లయినా సిరా గుర్తు వదలడం లేదు. ఆమెకు ఇదో పెద్ద తలనొప్పిగా కూడా మారింది! షోరన్పూర్లోని గురువాయూరప్పన్ నగర్లో ఉండే 62 ఏళ్ల ఉష 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన ఇంకు గుర్తు 9 ఏళ్లయినా మాసిపోలేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఆ తర్వాతి స్థానిక ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తే వేలిపై గుర్తు చూసి ‘నువ్విప్పటికే ఓటేశావు పొ’మ్మన్నారట ఎన్నికల అధికారులు! పోలింగ్ బూత్‌లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేయడానికి అనుమతించారు. పోలింగ్ బూత్‌ల్లో ఎందుకీ గోల అని 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయలేదు! ఈసారీ అదే సమస్య ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు.ప్రచారానికి వచ్చిన ఓ నాయకునికి విషయం చెప్పడంతో ఆయన ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని వాళ్లు హామీ ఇచ్చారట. ఎన్నికల సిరా గుర్తు ఇంతకాలం పాటు చెరగకుండా ఉన్న ఘటనలు ఎక్కడా లేవని వారు విస్తుపోతున్నారు! అయితే ఇలా జరిగేందుకు అవకాశం ఉందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. ‘‘సిరా చుక్క గోళ్ల కింద చేరితే మచ్చ అలాగే ఉండే చాన్సుంది. సమగ్ర వైద్య పరీక్షలు చేస్తే కారణం తెలుస్తుంది’’ అని చెబుతున్నారు. -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్‌లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్‌ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్‌వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్‌లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్‌లతో కలిసి ఆ మీటింగ్‌కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్‌గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్‌లో మార్చి 21న విడుదలైంది. -
Maddali Usha Gayathri: నృత్య తపస్వి
ఆమె ప్రయాణం నాట్యం. ఆమె ప్రయత్నం నాట్యకళకు జీవం పోయడం. నాలుగేళ్ల వయసు నుంచి కూచిపూడిని జీవనాడిగా చేసుకుని., 69 ఏళ్ల వయసులోనూ కళను వీడలేదు హైదరాబాద్ వాసి మద్దాలి ఉషాగాయత్రి. సుదీర్ఘ నృత్య ప్రయాణంలో భారత్‌తోపాటు దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వందల మంది ఔత్సాహికులు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా 200కు పైగా నృత్యాంశాలకు సోలోగా కొరియోగ్రఫీ చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి బ్యాలే చేసి, కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న డా. ఉషా గాయత్రి నృత్య ప్రయాణం తెలుసుకుంటే ఈ కళాసేవ ఒక తపస్సులా అనిపించకమానదు. ‘‘కూచిపూడి నృత్యానికి సంబంధించిన సాహిత్యం, రచనలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పుస్తకాలుగా తీసుకురావాలనేది నా చిరకాల స్వప్నం. దానిని నిజం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను’’ అని తనను తాను పరిచయం చేసుకున్న తపస్వి ఉషాగాయత్రి తన నృత్య జీవన గమ్యాన్ని ఇలా మనముందుంచారు. ‘‘నాలుగేళ్ల వయసులో ఉదయ్ శంకర్ శిష్యుడైన దయాల్ శరణ్ వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టాను. ఇక్కడే కథక్, ఒడిస్సీ, సంగీతం కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రఖ్యాత గురువు వేదాంతం జగన్నాథ శర్మ వద్ద కూచిపూడి, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్ డా.వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద యక్షగానాలు, ప్రఖ్యాత కళాక్షేత్ర గురువు కమలారాణి వద్ద నట్టువాంగం, పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ వద్ద పదములు నేర్చుకున్నాను. 1988లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ. పూర్తయ్యింది. అంతేకాకుండా ‘తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర వృద్ధి, వికాసం, నాట్యంలో అవతరణ‘ అనే అంశం మీద పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పొందాను. రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయంలోని నృత్య విభాగంలోనూ పనిచేశాను. ఆ తర్వాత దాదాపు పాతిక సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేశాను. నాట్యానికే అంకితం అవ్వాలనే తపనతో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ‘నృత్యకిన్నెర‘ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో వందల మందికి శిక్షణనిస్తూ వచ్చాను. ఇందులో 50 మంది శిష్యులు నృత్యంలో డిప్లొమా సర్టిఫికెట్లు పొందారు. 10 మంది చిన్నారులు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఆర్టీ స్కాలర్షిప్ పొందారు. నా శిష్యులు దేశవిదేశాల్లో స్థిరపడటమే కాకుండా నృత్యంలో పీహెచ్డీ, ఎం.ఏ. పట్టాలు పొంది గురువులు, నర్తకులుగా అభివృద్ధి చెందారని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. పాదం కదపని వేదిక లేదు సంగీత నాటక అకాడమీ, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్, టీటీడీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఎన్నో వందల ప్రదర్శనలు. దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాను. భారత స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో 1997లో మారిషస్‌లో ఇచ్చిన ప్రదర్శనకుగాను ఆనాటి ప్రెసిడెంట్ సత్కరించడం ఒక గొప్ప జ్ఞాపకం. ప్రదర్శనల కోసం శిష్యులతోపాటు యూకే, యూరోప్‌లలో పర్యటించాను. యూకేటీఏ, జయతే కూచిపూడి, అంతర్జాతీయ కూచిపూడి ఫెస్టివల్లో భాగంగా ప్రదర్శనలు ఇవ్వడం మరో గొప్ప అనుభూతి. ప్రధానంగా దాదాపు 200 లకు పైగా సోలో నృత్యాంశాలకు కొరియోగ్రఫి చేయడంతో పాటు ప్రతిష్టాత్మకమైన 16 బ్యాలేలు చేశాను. ఇందులో భాగంగా రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవల శివభక్త మార్కండేయ, మా తెలుగుతల్లికి మల్లెపూదండ, స్వర్ణోత్సవ భారతి, వందేమాతరం, సంక్రాంతి లక్ష్మి, రుక్మిణీ సత్య, అలిమేలుమంగ చరిత్ర, యశోదకృష్ణ వంటి బ్యాలేలు ప్రదర్శించాను. రవీంద్రుని గీతాంజలి మాట నిజమైన వేళ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి బ్యాలే చేయడం నా అదృష్టంగా భావిస్తాను. కలకత్తా వేదికగా ఈ ప్రదర్శన చేసిన సమయంలో ఒక విషయం నన్ను అమితమైన ఆనందానికి లోను చేసింది. ‘ఏదో ఒకనాడు, ఎవరో ఒకరు నా సాహిత్యానికి నృత్య రూపాన్ని తీసుకువస్తారు’ అని ఆనాడే రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మాటలను అక్కడి వారు ప్రస్తావించడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. కావ్యాలకు, కథనాలకు, నృత్యానికి ఎంతటి అనుబంధం ఉంటుందో ఆ సంఘటన రుజువు చేసింది. 12 గంటలు 12 మంది శిష్యులు నృత్యం దర్శయామిలో భాగంగా 72 సోలో నృత్యాంశాలైన శబ్దాలు, తరంగములు, దరువులు, తిల్లానాలు, అష్టపదులు, కీర్తనలు.. తదితర అంశాలతో 12 మంది శిష్యురాళ్లతో కలిసి 12గంటల పాటు అవిరామంగా నృత్యప్రదర్శన చేశాం. 12గంటల పాటు నిరంతరాయంగా నట్టువాంగం నిర్వహించి దానిని గురువు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రికి అంకితం చేశాం. చేసిన సోలో ప్రదర్శనలు, బ్యాలేలు న్యూ ఢిల్లీ దూరదర్శన్ తో పాటు విదేశీ ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. ఎంతో ప్రోత్సాహం.. ఈ నృత్య ప్రయాణంలో నా జీవిత భాగస్వామి మద్దాళి రఘురామ్ ప్రోత్సాహం ఎనలేనిది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. వాటిలో .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2001లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ అవార్డు ‘హంస పురస్కారాన్ని’, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, యూరప్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ నర్తకిగా, న్యూయార్క్‌లో ఉత్తమ నాట్యగురువుగా, సిలికాన్ ఆంధ్ర అంతర్జాతీయ కూచిపూడి కన్వెన్షన్ లో ఆనాటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, మారిషస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నృత్యరత్న బిరుదుతోపాటు, ఉత్తమ నర్తకి–నాట్యగురు అవార్డులను పొందాను. 1984లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (న్యూ ఢిల్లీ) ఆధ్వర్యంలో ఉత్తమ కళాకారిణిగానూ, భారత్‌తో పాటు విదేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలకు న్యాయనిర్ణేతగా సేవలందించాను. గత డిసెంబర్లో స్ట్రోక్ వచ్చి వీల్‌చెయిర్‌లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా నా కళా తపన ఆగలేదు. వీల్ చెయిర్ నుంచే విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను అందిస్తున్నాను. ఈ నెల 6న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక పురస్కారాన్ని వీల్‌చెయిర్‌లో ఉండే అందుకున్నాను. నా శ్వాస ఉన్నంతవరకు కళాసేవలో తరించాలని, కళలో ఔత్సాహికులను నిష్ణాతులను చేయాలన్నదే నా తపన’ అంటూ ఉషాగాయత్రి తన సుదీర్ఘ నృత్య ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా మన ముందు ఆవిష్కరించారు. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి సిటీ, హైదరాబాద్ -
సాగుబడి: ఆంధ్రా వర్సిటీలో ఆర్గానిక్ పంటలు!
'నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలను, ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడానికి విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆవరణలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నగరంలోనే పండించి తాజాగా నగరవాసులకు అందిస్తోంది. నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు మట్టి వాసనను పరిచయం చేయటం.. సేంద్రియ ఇంటిపంటల సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని నగరవాసులకు కల్పించటం ప్రశంసనీయం. ఈ సామాజిక కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘ఎయు– అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్’ నిర్వాహకులు ఉషా రాజు, హిమబిందు కృషిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రత్యేక కథనం'. పదిహేనేళ్లుగా సేంద్రియ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న పౌష్టికాహార నిపుణురాలు ఉషా రాజు, హిమబిందు ఆంధ్రా యూనివర్సిటీతో కలసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన మన్యం రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు కూడా అయిన వీరు విశాఖపట్నం నగరం మధ్యలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజలకు ప్రకృతితో కలసి జీవించడం నేర్పుతున్నారు. వాలంటీర్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తూ అర్బన్ కమ్యూనిటీ ఫార్మింగ్‌ని ఆచరించి చూపుతున్నారు. నగర వాసులు తమ ఇంటిపైన కూడా ఆరోగ్యదాయకమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌కు అనువైన స్థలం కేటాయించాలని ఉషా రాజు, హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన అందుకు అంగీకరించారు. వృక్షశాస్త్రం, ఫుట్ టెక్నాలజీ, ఫార్మసీ విద్యార్థులను ఈ అర్బన్ సాగులో భాగస్వాముల్ని చేయాలని వీసీ సూచించారు. ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం..! మా ‘మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను ‘అవని ఆర్గానిక్స్’ పేరుతో విశాఖ నగరంలోని 4 రైతుబజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే, ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికి కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచననుప్రోత్సహించిన ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్ల ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు కలే, లెట్యూస్, బాక్చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను, కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి, ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం. స్థలంతోపాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది. వైర్ ఫెన్సింగ్, డ్రిప్‌లు, సిబ్బంది జీతాలను మా ఎఫ్.పి.ఓ. సమకూర్చుతోంది. నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు, నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతి రోజూ ఉదయం 7–9 గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు. నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ల వచ్చు. స్కూలు విద్యార్థులకు ఇంటిపంటలు, ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని మేం భావిస్తున్నాం. యూనవర్సిటీలో ఈ పంటలను 2 ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది. – ఉషా రాజు, ఎయు–అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 80 సెంట్లలో బహుళ పంటల సాగు.. ఆ విధంగా 2023 నవంబర్ చివరి నాటికి ఏయూ ఫార్మ్ టెస్టింగ్ లాబరేటరీ (ఎలిమెంట్) ఎదురుగా ఉన్న సుమారు 80 సెంట్ల ఖాళీ స్థలంలో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్‌లో ప్రకృతి సేద్యం ్రపారంభమైంది. కలుపు మొక్కలను తొలగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చటానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. తొలుత ఆకుకూరల సాగును ్రపారంభించారు. పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, గలిజేరు, ఎర్రతోటకూర, పుదీనా వంటి పది రకాల ఆకుకూరలను చిన్నమడులుగా చేసుకొని సాగు చేస్తున్నారు. సలాడ్లలో వినియోగించే అరుదైన బాక్చాయ్ వంటి మొక్కలతో పాటు గోధుమ గడ్డి, ఆవ ఆకులు, చేమదుంపలు, కేరట్, బీట్రూట్, చిలగడదుంప వంటి దుంప పంటలనూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాడ బీర, వంగ, బొప్పాయి కాత దశకు వస్తున్నాయి. త్వరలో దొండ పాదులు సైతం నాటబోతున్నారు. ప్రతీ మూడు నెలలకు నాలుగైదు రకాల కూరగాయలు పెంచే విధంగా వీరు ప్రణాళిక చేసుకుని పనిచేస్తున్నారు. ఆకర్షితులవుతున్న ప్రజలు.. పశువుల పేడ తదితరాలతో తయారు చేసిన ద్రవ జీవామృతం, ఘనజీవామృతంతో ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్, స్ప్రిక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. అనేక రకాల పంటలను కలిపి పండించటం వల్ల ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పెద్దగా పురుగు పట్టడం లేదు. తమ కళ్ల ముందే ఆరోగ్యదాయకంగా సాగవుతున్న పంటలు వర్సిటీ ఆవరణలో నిత్యం వాకింగ్‌కు వచ్చే వందలాది మందిని ఆకర్షిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ్రపాంగణంలో గడుపుతూ.. ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ.. కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కమ్యూనిటీ ఫార్మింగ్.. ప్రతీ ఆదివారం కమ్యూనిటీ ఫార్మింగ్నిప్రోత్సహిస్తున్నారు. నగరవాసులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి కొద్దిసేపు వ్యవసాయం నేర్చుకోవడం కోసం భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడకు వచ్చి కాసేపు పంట మొక్కల మధ్య సరదాగా గడుపుతున్నారు. దీనితో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తోందని చెబుతున్నారు. వలంటీర్లకు అవకాశం.. అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వలంటీర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతీ ఇంటిలో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగాప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు ఉమా రాజు, హిమ బిందు చెబుతున్నారు. ప్రస్తుతం ఏయూలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. మొక్కలపై తమకున్న ఆసక్తితో స్వచ్ఛందంగా ఉదయపు వేళల్లో రెండు గంటల సమయం వెచ్చిస్తున్నారు. విద్యార్థులనుప్రోత్సహిస్తూ వారికి అవని ఆర్గానిక్స్ ప్రత్యేకంగా స్టైఫండ్‌ను అందిస్తోంది. కూరగాయల మొక్కలు, ఇండోర్ ΄్లాంట్స్ను విశాఖవాసులకు అందుబాటులో ఉంచే విధంగా నర్సరీని ్రపారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ఏయూ ఉన్నతాధికారులతో పాటు అవని ఆర్గానిక్స్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండటం, సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ్రపారంభించటం ఆదర్శ్రపాయం మాత్రమే కాదు, ఇతరులకు అనుసరణీయం కూడా! – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: పి.ఎల్ మోహన్ రావు, సాక్షి, విశాఖపట్నం తిరుపతిలో 9 నుంచి ఆర్గానిక్ మేళా.. తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ (పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక)లో మార్చి 9,10,11 తేదీల్లో ఉ.6.30– రాత్రి 8 గం. వరకు ‘కనెక్ట్ 2ఫార్మర్’ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతులు తమ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ 2ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలి΄ారు. ప్రతి నెలా రెండో శని, ఆదివారాల్లో తిరుపతిలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నెల ప్రత్యేకంగా 3 రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు. 9న మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు, ఇంటిపంటల సాగుదారులు 63036 06326 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 11న గృహిణులకు సిరిధాన్యాల వంటల పోటీ ఉంది. 83091 45655 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరీ, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్, పెన్ కలంకారీ పై వర్క్‌షాప్‌లు జరుగనున్నాయి. ఇతర వివరాలకు.. 91330 77050. 7న మిద్దెతోట రైతులకు పురస్కారాలు.. ఈ నెల 7న ఉ. 11 గం.కు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పట్టణ ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల’ ప్రదానోత్సవం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలి΄ారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సమాచార కమిషనర్ ఎం. హనుమంతరావు, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అతిథులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. ఇవి చదవండి: షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి -
కన్నకూతురిని కత్తులతో నరికి..
వైరా రూరల్: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కూతురినీ నరికేశాడు.. శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్‌కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
సింగర్ ఉష కూతురు గొంతు ఎంత బాగుందో వినండి
-
ఈ బుట్ట బొమ్మ ఎంత బాగా పాడిందో బుట్ట బొమ్మ పాట
-
ఎంత బాగా పాడారో తల్లి కూతుర్లు
-
పెళ్లయిన తర్వాత యూఎస్ కి వెళ్లాను కానీ..! సింగర్ ఉష
-
కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు.. రాత్రికి రాత్రే స్టార్ సింగర్
మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఆశప్ప, మాణిక్యమ్మ దంపతులకు ఉష, మంజుల ఇద్దరు కూతుళ్లు. ఉష గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి వరకు చదివి మానేసింది. చిన్నప్పటి నుంచే పొలం పనులకు వెళ్లేది. అయితే వీరి తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో బంధువులు చేరదీసి వరుసకు మామ అయిన వ్యక్తితో పెళ్లి చేశారు. బాబు, పాప పుట్టి అనారోగ్యంతో నెలలు నిండకుండానే మృతిచెందారు. భర్తకు సైతం మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గ్రామంలో జీవనోపాధి కష్టంగా మారడంతో హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేస్తూ ఒంటరి మహిళగా జీవనం సాగిస్తుంది. పొట్ట చేతపట్టుకొని పట్నం వెళ్లిన ఓ ఒంటరి మహిళ జీవితాన్ని ఒక్కపాట సెన్సేషన్‌గా మార్చేసింది. చిన్నప్పటి నుంచి జానపద పాటలంటే ఉన్న విపరీతమై ఇష్టమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ‘కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు’ అనే పాటతో రాత్రికి రాత్రి స్టార్ సింగర్‌గా మారింది. పాట రాసి, స్వరం కలిపి ప్రాణం పోసి అచ్చం తెలంగాణ యాస, భాషతో పల్లె జానపదాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ఆ కళాకారిణి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఉష. ఈమె ఈ ఏడాది జూన్ 29న పాట పాడగా ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 26 మిలియన్ల వ్యూస్ అంటే 2.60 కోట్ల మంది చూశారంటే పాట క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు.. తాను వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఆడవాళ్లు పాడుకునే జానపద పాటలను శ్రద్ధగా గమనించి పాడుతూ ఉండేది. గత పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ తీరిక సమయంలో జానపద పాటలు పాడుతూ ఉండేది. యూట్యూబ్‌లో జానపద పాటలకు ఆదరణ పెరగడం చూసి తాను సైతం పాటలు పాడాలనే కోరికతో కొన్ని పాటలు రాసి వీడియోలు చేసింది. సరైన ఆదరణ రాకపోయినా.. పట్టువిడవకుండా పాటలు రాస్తూ.. ట్యూన్లు కలుపుతూ అవకాశాల కోసం ఎదురుచూసింది. గతంలో జగిత్యాల జోగుల వెంకటేశ్‌తో రెండు పాటలు, గొల్లపల్లి శివన్న సిరిసిల్లతో ఒక పాట పాడింది. ఓ రోజు జానపద పాటల కవర్‌పై హరీశ్ పాటేల్ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి.. తాను జానపద పాటలు రాసి, పాడతానని అవకాశం ఇవ్వాలని కోరింది. ఆయన దగ్గరకు వెళ్లి మూడు పాటలు పాడి వినిపించింది. ఈ క్రమంలోనే కెమెరా పట్టిన్నడే సీమ దదర సిన్నోడు అనే పాట నచ్చడంతో గజ్వేల్‌లో అమూల్య స్టూడియోలో ఆమె దగ్గర పాడించి జూన్ 29న రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో వస్తున్న సెన్షేషన్ చూసి ఉష రాత్రికి రాత్రి జానపద స్టార్ సింగర్‌గా మారిపోయింది. చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దల వరకు యూట్యూబ్‌లో పాట వింటూ మురిసిపోతున్నారు. చేయూత ఇవ్వండి..గ్రామంలో రేకుల షెడ్డు ఇల్లు మాత్రమే ఉంది. ప్రభుత్వం నా పరిస్థితిని గుర్తించి గృహలక్ష్మి ఇల్లుతోపాటు జీవనోపాధి కోసం దళితబంధు పథకాన్ని మంజూరు చేయాలి. నాకు జానపద పాటలంటే ఎంతో ఇష్టం. భవిష్యత్‌లో అవకాశం వస్తే సినిమా పాటలు పాడతా. పదేళ్లుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా. కళాభిమానులు నా జానపద పాటలను ఆదరించి చేయూతనివ్వండి. – ఉష, జానపద కళాకారిణి, పెద్దజట్రం -
కేజిన్నర బంగారం దోపిడీ
గుడిపాల (చిత్తూరు జిల్లా): జనం చూస్తుండగానే ఓ మహిళపై దాడిచేసి.. బ్యాగ్‌లో ఉన్న కేజిన్నర బంగారాన్ని దుండగులు దోచుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వసంతాపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వసంతాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఉష దంపతులు గుడిపాలలో జ్యూవెలరీ దుకాణం నడుపుతున్నారు. వీరు ప్రతిరోజూ ఇంటి నుంచి బంగారాన్ని తీసుకుని దుకాణానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మిగిలిన ఆభరణాలను రాత్రివేళ ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్త చేస్తుంటారు. బుధవారం రాత్రి 7:30 గంటలకు దుకాణం నుంచి కారులో బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటివద్ద వెనుక వైపున భర్త కారు పార్కింగ్ చేస్తుండగా.. ఉష బంగారు ఆభరణాలున్న బ్యాగ్ పట్టుకుని నిలబడింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఉషపై దాడి చేశారు. ఆమె చేతిలో ఉన్న బంగారం బ్యాగ్‌ను గుంజుకుని పారిపోయారు. దీనిని గమనించిన భర్త, స్థానికులు ఆమె వద్దకు చేరుకోగా.. అప్పటికే దుండగులు పరారయ్యారు. నిందితులు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో గల ద్విచక్ర వాహనంపై వచ్చారని స్ధానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, తమిళనాడు సరిహద్దులో వాహన తనిఖీ చేపట్టామని చెప్పారు. -
కన్సాస్ సెనేటర్‌గా ఉషా రెడ్డి
హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు. మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది. -
ప్రేయసి కాదు.. ఆమె రాక్షసి!!
ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. చివరికి.. ప్రేమ పేరిట ఆమె ఆడిన నాటకంలో ఆ భగ్న ప్రేమికుడు కాస్త.. బలి పశువు అయ్యాడు. ప్రాణాల కోసం ఆస్పత్రిలో రోజుల తరబడి పోరాడి.. చివరకు కన్నుమూశాడు. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడి మరణం కేసు.. మిస్టరీగా మారింది. అతనెలా మరణించాడన్నది ఎటూ తేల్చలేకపోతున్నారు పోలీసులు. అయితే బాధిత కుటుంబం మాత్రం మూఢనమ్మకంతో.. ప్రియురాలే తమ బిడ్డ ప్రాణం తీసిందని అంటోంది. పరసాలాకు చెందిన షరోన్ రాజ్(23) గత కొంతకాలంగా ఉష అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్కి.. ఈమధ్య ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయ్యిందని విషయం తెలిసి షాకయ్యాడు. ఈలోపే ఉష అతనికి కాల్ చేసింది. తనకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని చెప్పింది. దీంతో అప్పటి నుంచి అతను ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు షరోన్ దగ్గర ఉన్నాయి. వాటి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అనుకుందో ఏమో.. అతనితో వాట్సాప్ ఛాటింగ్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. అయితే బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చానని చెప్పడంతో ఫోన్ పెట్టేసింది. కాసేపు ఆగి మళ్లీ ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరు.. రమ్మని ఆహ్వానించింది. స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్. స్నేహితుడు బయట ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. పావు గంటకు పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. ఆ తర్వాత కూడా ఇద్దరూ చాట్ చేసుకున్నారు. కషాయం, జ్యూస్‌ల్లో ఏం కలిపావని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా పండ్ల రసం వికటించిందేమో అని సమాధానం ఇచ్చింది ఆమె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. దారి పొడవునా నీలి రంగులో వాంతులు కావడంతో.. షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు ఆ స్నేహితుడు. ఆపై తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత రెండు రోజులకు షరోన్ పరిస్థితి విషమించడంతో.. తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు అతని పేరెంట్స్. 11 రోజుల పాటు చికిత్స పొందిన షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో యాసిడ్లాంటిది కలిసిందని నిర్ధారించారు. అయితే ఏం కలిపారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదింకా. ఇక ఈ కేసులో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల దర్యాప్తు పూర్తిగా నిందితుల కుటుంబానికి అనుకూలంగా ఉందని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. అంతేకాదు.. పరారీలో ఉన్న ఉష కుటుంబాన్ని పోలీసులు ఇంతదాకా ట్రేస్ చేయలేకపోయారు. ఆ గండం గట్టెక్కేందుకే.. ఉష కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఉషకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. పెళ్లి సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఎందుకనో ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో.. తమ బిడ్డ మరణం వెనుక మూఢనమ్మక కోణం కూడా ఉందని షరోన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఉషకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉందని, ఆ దోషం పొగొట్టేందుకు తమ బిడ్డతో బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారని షరోన్ కుటుంబం అంటోంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని కూడాఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. ఇంటికి పిలిపించి మరీ పక్కా ప్లాన్‌తో ఉషతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై ఏదో తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తోంది. ఇలాంటిదే మరో ఘటన.. షరోన్ రాజ్‌తో పాటు మరో చిన్నారి మృతి కేసు కూడా కేరళలో మిస్టరీగా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన అథెన్కోడ్కు చెందిన ఓ స్కూల్ విద్యార్థి.. మరో విద్యార్థి ఇచ్చిన డ్రింక్ తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ డ్రింకులోనూ యాసిడ్ తరహా ఆనవాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వారాలపాటు చికిత్స పొందిన 11 ఏళ్ల ఆ బాలుడు.. చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే కన్నుమూశాడు. సుచింద్రమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా.. షరోన్ రాజ్ మృతి కూడా అదే తరహాలో చోటు చేసుకోవడం గమనార్హం. -
పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, జంతికలు.. మొత్తం 80 రకాలు! ఇంట్లోనే పిండివంటలు చేస్తూ..
‘‘అక్కా! ఈ జంతికలు సరిగ్గా కాలాయో లేదో ఓ సారి చూస్తావా!’’.. ‘‘ఉషా! తోటకూర వేపుడు పొడి చేయిస్తున్నావా? కమ్మటి వాసన వస్తోంది!!’’ ... ‘‘పెద్దమ్మాయి పిల్లలకు మునగాకు పొడి కావాలట. ప్యాక్ చేయించక్కా!’’.. ‘‘పాలు వచ్చాయి... కోవా బాణలి స్టవ్ మీద పెట్టమ్మాయ్. నేను వస్తున్నా... అడుగంటకుండా కాగాలి పాలు. గులాబ్ జామూన్ మృదువుగా ఉండాలి’’ సికింద్రాబాద్, న్యూ బోయిన్ పల్లి, ‘బాణలి’లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల సంభాషణ ఇది. ఇద్దరూ అరవయ్యేళ్లు దాటిన వాళ్లే. వాళ్లకు అధిక బరువు సమస్య ఎలా ఉంటుందో తెలియదు. జుట్టుకు డై వేయాల్సిన అవసరమూ రాలేదు. ‘ఆరోగ్యంగా తింటే అనారోగ్యం ఎందుకు వస్తుంది’ అంటారు. ఆరోగ్యంగా తినడం అంటే... మన సంప్రదాయ వంటకాలేనంటారు వాళ్లు. ‘‘మేము రోజూ ఆవకాయతో మొదలు పెట్టి గడ్డపెరుగుతో పూర్తి చేస్తాం. ఏ అనారోగ్యమూ లేదు. రోజూ ఒక ముద్ద వేడి అన్నంలో నెయ్యి, మునగాకు పొడి కలిపి తినండి. రోజూ సున్నుండ, నువ్వులుండ తినండి. మెత్తగా జారిపోయే కేకుల బదులు వేరుశనగ పట్టీని పటపటా కొరికి బాగా నమిలి తినండి. మా ఇంట్లో అలాగే తింటాం. ఆరోగ్యంగా ఉన్నాం. అనారోగ్యం పాలవుతున్న కొత్తతరానికి ఆరోగ్యపు బాట వేయడానికే ఈ పని మొదలు పెట్టాం’’ అంటూ ‘బాణలి’ పేరుతో హోమ్‌ఫుడ్ సెంటర్ ప్రారంభించడానికి కారణాన్ని వివరించారు ఈ అక్కాచెల్లెళ్లు దాట్ల రాజేశ్వరి, పెన్మెత్స ఉష. వంటలన్నీ ఇంట్లోనే ‘‘మా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం, దర్భరేవు గ్రామం. పదహారేళ్లకే మాకు పిండివంటలు చేయడం నేర్పించింది మా అమ్మ. మా నాన్న కలిదిండి సత్యనారాయణ రాజు. ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో రోజూ అతిథులుండేవారు. రకరకాలు వండడం వడ్డించడంలో మా అమ్మకు రోజు సరిపోయేది కాదు. పెళ్లయి అత్తగారింటికి వెళ్తే అక్కడ మామగారు మునసబు. గ్రామానికి ఏ ఉద్యోగి వచ్చినా భోజనం మా ఇంట్లోనే. ఏ ఫంక్షన్ అయినా అన్నీ ఇంట్లోనే వండేవాళ్లం. పెళ్లి, పేరంటాలకు పాతిక కావిళ్లు సారె పంపించడం... ఇలా ఎప్పుడూ వండడమే. ఒక్కమాటలో చెప్పాలంటే వండడం తప్ప మరొకటి తెలియదు, వంటల్లో మాకు తెలియనిది లేదు’’ అన్నారు రాజేశ్వరి. వంద రుచులు వచ్చు! ‘‘పచ్చళ్లు, పొడులు, స్వీట్లు, చెగోడీ–జంతికల వంటివి మొత్తం ఎనభై రకాలు వండుతాం. ఇతర వంటకాలన్నీ కలిపి వంద రకాలు వచ్చు. మాకు వంటల పుస్తకాలు తెలియదు. దినుసులన్నీ ఉజ్జాయింపుగా వేయడమే. వంటల పుస్తకాలు రాయమని చెప్తున్నారు. కానీ దేనికీ కొలతలు పాటించం, కొలతలతో వండడం మాకు తెలియదు. కొలతలతో చెప్పడమూ తెలియదు. మా అమ్మ వండుతుంటే చూసి నేర్చుకున్నాం. మా దగ్గర పని చేసే వాళ్లకూ అలాగే నేర్పించాం’’ అన్నారు ఉష. పలాస జీడిపప్పు... నర్సాపురం బెల్లం ‘‘వండడం వస్తే సరిపోదు, దినుసుల్లో నాణ్యత కూడా ముఖ్యమే. బెల్లం నర్సాపురం నుంచి, కారం బోధన్ నుంచి, జీడిపప్పు పలాస నుంచి, మంచి ఆవునెయ్యి కర్ణాటక నుంచి తెప్పించుకుంటాం. ఇంట్లో దినుసులు ఎలాగ మంచివి తెచ్చుకుంటామో అలాగే ఇదీనూ. మా అమ్మాయి హైదరాబాద్‌లో ఉండడంతో తరచూ అమ్మాయి ఇంట్లో పది– ఇరవై రోజులుండేవాళ్లం. మనుమడు ప్యాకెట్లలో దొరికే చిరుతిళ్లు తింటుంటే... ఇదేం తిండి అనిపించేది. ఒంటికి బలం రాని తిండితో పిల్లలు ఊబదేలుతారు, ఎముక పుష్టితో పెరగరు. అందుకే ఇంట్లో రకరకాల పిండివంటలు చేసేదాన్ని. అమ్మాయి స్నేహితులు, వాళ్ల పిల్లలు ఎంతో మెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా అనిపించేది. ‘మీ చేతిలో ఉన్న విద్య విలువ మీకు తెలియడం లేదు. చాలామందికి మన గోదారి జిల్లాల వంటల పేర్లు తప్ప రుచి కూడా తెలియదు. అందరికీ పరిచయం చేయవచ్చు కదా! నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించనూ వచ్చు. అన్నింటికంటే ముందు మన పిల్లలతోపాటు అందరి పిల్లలూ ఆరోగ్యంగా పెరుగుతారు. మీకు నాలుగు డబ్బులు కూడా వస్తాయి’ అని మా వియ్యంకులు చెబితే... ఎందుకో చాలా బిడియం వేసింది. మాకు చక్కగా వండి పెట్టడమే తెలుసు, వంటను అమ్మడం చిన్నతనంగా అనిపించింది. కానీ వాళ్ల మాటలు కాదనలేక మొదలుపెట్టాం. గత ఏడాది ఉగాది రోజు మొదలైంది. ఇప్పుడు మా వంటల్ని కొన్నవాళ్లు నాలుగువేల మంది. ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్‌గారు ఈ సెంటర్‌ను చూసి మమ్మల్ని అభినందించారు. ‘ఈ వంటలు మీ తరంతో అంతరించి పోకూడదమ్మా. కొత్త తరానికి అందించండి’ అని చెప్పారాయన. అంతపెద్ద ఆఫీసర్‌గారు ప్రశంసిస్తుంటే మేము చేస్తున్న పని మంచిదే అని మాకు ధైర్యం వచ్చింది’’ అన్నారు ఉష. అక్కడ ఇడ్లీ ప్రియం! ‘ఈ స్టోర్ చూసిన వాళ్లు మీ ఇద్దరే ఇన్ని చేస్తున్నారా! అని ఆశ్చర్యపడుతుంటారు. ఈ వయసులో చక్కటి ఆరోగ్యం మీది’ అని మెచ్చుకుంటారు. దేహానికి మంచి ఆహారం, తగినంత శ్రమ ఉంటే అనారోగ్యాలెందుకు వస్తాయి? అంటారు రాజేశ్వరి. ‘చపాతీలు చేయాలంటే గోధుమలు రోట్లో దంచాం, పిండి తిరగలితో విసిరాం. గారెలకు పిండి రోట్లో రుబ్బాం. ఈ చేతులకు ఈ పని పెద్ద పనేమీ కాదు’’ అని స్టోర్‌లో ఉన్న రకరకాల పిండివంటలను చూపించారీ సీనియర్ సిస్టర్స్. ఇంకా... ‘‘మన సంప్రదాయ వంటల్లో ఆరోగ్యం ఉంది. ముందు తరాలకు అందివ్వాలి. వీటిని మన తరంతో అంతరించిపోనివ్వకండి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వాళ్ల పిల్లలకు వీటిని వండడం నేర్పించండి. మనం కేకులు, పిజ్జాలు, బర్గర్లు తినడం ఫ్యాషన్ అనుకుంటున్నాం. పాశ్చాత్యదేశాల వాళ్లు మన ఇడ్లీ, దోశెలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. మన రుచిని మర్చిపోవద్దు. మన పోపుల పెట్టె ఔషధాల గని. తరతరాలకు అందించండి’’ అని సాటి మహిళలకు ఓ మంచిమాట చెప్పారు. మరొక్క చిన్నమాట... ‘మేము స్వీట్లు చేస్తాం. కానీ తినం. రోజూ ప్రతి స్వీట్నీ తయారైనప్పుడు తప్పకుండా రుచి చూస్తాం. ఎక్కువ మోతాదులో తింటే రుచిని గుర్తించడం కష్టం’ అన్నారు. బహుశా! వీళ్ల విజయ రహస్యం, ఆరోగ్య రహస్యం ఇదే కావచ్చు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోర్ల అనిల్ కుమార్ చదవండి: Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు -
టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..
జీవితం ఓ ప్రయాణం.. ఆటుపోట్లు.. కష్ట సుఖాలు కేనీడ వంటివి. ఒక్కక్షణం ఆలోచిస్తే సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నా... ఈ ప్రపంచంలో పరిష్కారంకాని సమస్య ఏదీ లేదని తత్వవేత్తలు బోధిస్తున్నా.. చాలామంది క్షణికావేశానికి లోనవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందమైన జీవితాలను అగ్నికి ఆహుతిచేస్తున్నారు. అయినవారికి ఆవేదన మిగుల్చుతున్నారు. జిల్లాలో మూడేళ్లలో సుమారు 654 మంది ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ ఆలోచింపజేస్తున్న అంశంగా మారింది. విద్యార్థిని ఆత్మహత్య గజపతినగరం: గజపతినగరం మండలం పిడిశీల గ్రామానికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థిని ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం శ్యామలవలస గ్రామానికి చెందిన తాడ్డి ఉష (18) తాతగారి గ్రామం అయిన పిడిశీలలో ఊంటూ చదువుతోంది. ఉష తల్లిదండ్రులు పార్వతి, రమణమూర్తిలు విజయనగరం మయూర జంక్షన్ సమీపంలో టిఫిన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఉషను గజపతినగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదివిస్తున్నారు. చక్కగా చదువుకుని ప్రయోజకురాలు అవుతుందని ఊహించారు. బైపీసీ గ్రూపును చదవలేక రెండురోజులుగా ఉష కళాశాలకు వెళ్లడం లేదు. మరి చదవలేనన్న బెంగతో మనస్థాపానికి గురై సోమవారం సాయంత్రం అమ్మమ్మ అప్పయ్యమ్మ పొలంపనికి వెళ్లే సమయంలో ఇంటి దూలానికి సున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతి, రమణమూర్తిలకు ఇద్దరు ఆడపిల్లలు. అందులో పెద్దమ్మాయి పావనికి వివాహం కాగా, ఉష ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉషను ప్రయోజకురాలిని చేయాలనే ఊరిని విడిచిపెట్టి కష్టపడుతున్నామని, ఇంతలో అఘాయిత్యానికి పాల్పడిందంటూ తల్లి బోరున విలపిస్తోంది. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రమేష్, ఎస్ఐ గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) సాక్షి, విజయనగరం: ప్రేమ విఫలమైందని కొందరు.. భర్త, అత్తమామలు వేధించారని.. ఆరోగ్యం మరి కుదుటపడదని.. చదువుకోమని తల్లిదండ్రులు మందలించారని.. ఇలా.. చిన్నచిన్న కారణాలకే చాలామంది క్షణికావేశానికి గురవుతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు. పరిష్కరించుకోగలిగే చిన్నపాటి సమస్యలే అయినా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఏటా వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడతుండం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. పెద్దవారిలో పురుషులు ఎక్కువుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల్లో బాలికలు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. మారిన వ్యవహారశైలి.. జీవన వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయి. సాంకేతికత పెరుగుతున్నప్పటకీ మానవ సంబంధాలు, కుటుంబ విలువల గురించి నేటితరం పెద్దగా పట్టించుకోవడం లేదు. పూర్వ కాలంలో విలువలు పాటించేవారు. తగాదాలు అనేవి చాలా తక్కువుగా వచ్చేవి. ఆత్మహత్యలు కూడా అరుదు. ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చేవారు. 10 నుంచి 20 మంది వరకు ఒకే కుటుంబంగా కలిసి జీవించేవారు. కొంతమంది అయితే 30 నుంచి 40 మంది వరకు కలిసి ఉండేవారు. కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకునేవారు. చిన్నచిన్న గొడవలు వచ్చినా పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కేవారు కాదు. ప్రస్తుతం ఒంటరి జీవితాలకు అలవాటు పడుతున్నారు. భర్త, భార్య, పిల్లలు మాత్రమే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వారికి ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పేవారు ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదం వచ్చినా గొడవ పెద్దది చేసుకోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం చేస్తున్నారు. అధికశాతం మంది ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణంగా కనిపిస్తోంది. మనోధైర్యం లేని యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. జీవితం తృణప్రాయంగా.. 2019 నుంచి 2021 అక్టోబర్ నెలఖారు నాటికి 654 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో పెద్దవారు 621 మంది కాగా, 16 ఏళ్లలోపు వారు 33 మంది. పెద్దవారిలో మగవారు 458 మంది కాగా మహిళలు 163 మంది ఉన్నారు. 16 ఏళ్లు లోపు వారిలో బాలురు 10 మంది, బాలికలు 23 మంది ఉన్నారు. కౌన్సెలింగ్ ఇప్పించాలి పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలి. మనోధైర్యం కోల్పోయిన వారికి సకాలంలో ఫ్యామిలీ సపోర్టు కావాలి. పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. పిల్లలతో ప్రస్తుతం ఎక్కువుగా తల్లిదండ్రులు గడపడం లేదు. దీనివల్ల వారు స్నేహితులతో గడుపుతున్నారు. మంచి స్నేహం అయితే ఫర్వాలేదు. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం కుదిరితే చెడుమార్గంలో వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాల వల్ల ఎక్కువుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కౌన్సెలింగ్ సెంటర్ల ఆవశ్యకత ప్రస్తుతం ఎంతైనా ఉంది. మద్యం సేవించడం తగ్గించుకోవాలి. సకాలంలో కౌన్సెలింగ్ ఇచ్చి, మందులు వాడిస్తే ఆత్మహత్యల బారినుంచి కాపాడవచ్చు. – డాక్టర్ జాగరపు రమేష్, మానసిక వైద్యుడు, విజయనగరం సమస్యను ఎదుర్కొనే శక్తి లేకనే.. ఏదైనా సమస్య వస్తే దానిని ఎదుర్కోగలిగే శక్తి లేక మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనారోగ్య సమస్యలున్న వారు వాటిని మంచి వైద్యుని దగ్గర చూపించుకుని వైద్యం చేయించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మానవజన్మ దేవుడిచ్చిన వరం. క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడకూడదు. సమస్య వచ్చినప్పడు స్నేహితులకు, బంధువులకు చెప్పి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. మనసుకు బాధ కల్గినప్పుడు మనోధైర్యాన్ని కోల్పోరాదు. మానవ సంబంధాల గురించి నేటివారికి తెలియజేయాలి. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ ►విజయనగరానికి చెందిన కాకర్లపూడి అనిత అనే మహిళ ఎంవీజీఆర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త మందలించారన్న కారణంతో గతనెల 20న గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ►పార్వతీపురం పట్టణానికి చెందిన పిచ్చిక ప్రదీప్‌కుమార్ అనే యువకుడు మానసిక స్థితి బాగులేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ►జామి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ నెలరోజుల కిందట కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ►మధ్యప్రదేశ్‌కు చెందిన సాహు అనే వ్యక్తి గంట్యాడ మండలంలోని కరకవలసగ్రామం సమీపంలో ఉన్న తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ►పార్వతీపురం మండలానికి చెందిన సురేష్ అనే యువకుడు ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. -
అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఆవిష్కరించిన ఉపాసన
సాక్షి, జూబ్లీహిల్స్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ గాయని ఉష ఆలపించిన అష్టలక్ష్మి స్తోత్రంతో ఆడియో తీసుకురావడం అభినందనీయమని అపోలో లైఫ్ అధినేత్రి ఉపాసన కొణిదెల అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉష రూపొందించిన ‘సుమనస వందిత’ పాటలను ఆమె ఆవిష్కరించారు.