అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరు నామినేట్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు మారుమోగిపోయింది. ఆయన భార్య మన తెలుగింటి అమ్మాయి కావడంతో వాన్స్ తెలుగింటి అల్లుడంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కసారిగా భారత మూలాలు ఉన్న ఉషా చిలుకూరి పేరు ప్రాధ్యాన్యత సంతరించుకుంది. పైగా ఆమె భర్త విజయ కోసం భారత్‌లో ఒక్కసారిగా ఆమె కుటుంబ బలం పెరిగిపోయింది.
ఎందుకంటే తెలుగు రాష్టంలో మన అమ్మాయి భర్త పలాన వాళ్లు అంటూ ఆరాలు మొదయ్యిపోయాయి. ఇక ఉషా చిలుకూరికి విశాఖపట్నంలో బంధువులున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ప్రొఫెసర్‌గా పాఠాలు చెబుతూ ఉత్సాహంగా ఉండే శాంతమ్మ మనవరాలే ఈ ఉష. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఈయన కుమారుడు రాధాకృష్ణ సంతానమే ఈ ఉష.
ఉష భర్త జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంపై శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరగడంతో పరిచయం తక్కువేనన్నారు. వాన్స్ అభ్యర్థిత్వం, మా బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్‌లో అభినందనలు తెలిపారని చెప్పారు. చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉష మేనత్త శారద.. వాన్స్, ఉషల వివాహానికి హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. ‘మా బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా, గర్వంగా అనిపించింది. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య అయితే ఎక్కువ, లేకపోతే తక్కువ అని కాకుండా నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి’ అని శాంతమ్మ వివరించారు.
ఇక శాతమ్మ ఇంత వయసులోనూ ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఫిజిక్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తునే ఉండటం విశేషం. అంతేగాదు ఆమె ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చింది. అది ప్రస్తుతం క్లినిక్‌గా పనిచేస్తుంది. త్వరలో దాన్ని కూడా ఆస్పత్రిగా మార్చనున్నారు. ఆమె 1945లో మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుంచి భౌతికశాస్త్రంలో గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. ఆమె అప్పుడు మద్రాసు రాష్ట్రంలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ విధ్యార్థిని.
ఇక ఆమె బాల్యం దగ్గర కొచ్చేటప్పటికీ..1929 మార్చి 8న మచిలీపట్నంలో జన్మించారు. ఐదు నెలల వయసులోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి తరఫు మేనమామ వద్ద పెరిగారు. భౌతిక శాస్త్రం ఆమె ఇష్టమైన సబ్జెక్ట్. ఆమె ఏడు దశాబ్దాలుగా ఫిజిక్స్ బోధిస్తూ యువతకు స్ఫూర్తినిస్తుంది. ఆమె 1989లో 60 ఏళ్ల వయసులో పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత పరిశోధన వైపు దృష్టిసారించి మళ్లీ ఆంధ్రాయూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరి ఆరేళ్లు పనిచేశారు.
అలా ఆమె తనకు తొమ్మిదపదుల వయసు వచ్చిన బోధనా వృత్తిని మాత్రం వదలలేదు. అంతేగాదు తన తల్లి జాకమ్మ 104 ఏళ్ల వరకు జీవించారని చెబుతారు శాంతమ్మ. "ఆరోగ్యం మన మనస్సులో సంపద మన హృదయంలో" ఉంటుందని చెబుతుంటారామె. తాను తన చివరి శ్వాస వరకు బోధిస్తూనే ఉంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు శాంతమ్మ.
(చదవండి: సాహో... ప్రొఫెసర్ శాంతమ్మ!)
(చదవండి: యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ ..బడ్జెట్ బాధ్యత ఆమెదే..!)
Comments
Please login to add a commentAdd a comment