
వరంగల్ అమ్మాయి పామిడిలో ప్రత్యక్షం
పామిడి : అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ బైపాస్‌లో రెండు రోజులుగా తిరుగుతున్న అమ్మాయి(16)ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. ఆ కాలనీవాసి, అబ్దుల్ కలామ్ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు పీటర్ విజయ్ ఆ అమ్మాయిని పలకరించారు. తనది తెలంగాణలోని వరంగల్ అని, పేరు ఉష, తండ్రి పేరు మల్లయ్య అని తెలిపింది. తననెవరో ఇక్కడికి తెచ్చి వదిలారని చెప్పింది. ఈ సమాచారాన్ని చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యురాలు మల్లీశ్వరికి స్థానికులు అందజేశారు. దీంతో ఆమె ఈ అమ్మాయిని పామిడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.