సైనా షేర్ చేసిన వీడియోలో ఏముంది? | Saina Nehwal's mother's work out session in gym will give you fitness goals | Sakshi
Sakshi News home page

సైనా షేర్ చేసిన వీడియోలో ఏముంది?

Published Sun, Feb 12 2017 11:46 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

సైనా షేర్ చేసిన వీడియోలో ఏముంది? - Sakshi

సైనా షేర్ చేసిన వీడియోలో ఏముంది?

ఆటల్లో రాణించేందుకు క్రీడాకారులు ఎంతో శ్రమిస్తుంటారు.

న్యూఢిల్లీ: ఆటల్లో రాణించేందుకు క్రీడాకారులు ఎంతో శ్రమిస్తుంటారు. ముఖ్యంగా ఫిట్ నెస్ కాపాడుకునేందుకు కఠినమైన కసరత్తులు చేస్తుంటారు. తమ పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దే క్రమంలో వారి తల్లిదండ్రులు కూడా ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. పిల్లల కోసం అవసరమైతే ఆటలు నేర్చుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ కోవలోకే చెందుతారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తల్లి ఉష. కూతురు కోసం ఆమె కఠినమైన కసరత్తులు చేస్తున్నారు.

ఇటీవల మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత సైనా నెహ్వాల్.. మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ గెలిచి సత్తా చాటింది. తాను వేగంగా కోలుకుని మళ్లీ ఆడడం వెనుక తన తల్లి ఉష ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పేందుకు సైనా తన ట్విటర్ పేజీలో షేర్ చేసిన వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. తన తల్లి జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తుండగా తీసిన వీడియోను సైనా పోస్ట్ చేసింది. ఈ వీడియాఓ చూసిన వారంతా సైనాను ప్రోత్సహించేందుకు ఆమె తల్లి పడుతున్న కష్టాన్ని మెచ్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement