
సండేస్ ఆన్ సైకిల్ మిషన్‌లో తెలంగాణలోని జర్నలిస్టులు పాల్గొనాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత చతుర్వేది కోరారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య స్పృహ కలిగిన రవాణా విధానాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్ చేపట్టనుందన్నారు.
దీని ద్వారా సాధారణ శారీరక శ్రమ, ఫిట్‌నెస్ ప్రోత్సహించడం ద్వారా పౌరులను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రేరేపించడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుకు అనుగుణంగా తమ శాఖ ఈ నెల 27న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘సండేస్ ఆన్ సైకిల్’ ప్రత్యేక ఎడిషన్‌ను నిర్వహించ తలపెట్టామని, ఈ కార్యక్రమం గచ్చిబౌలిలో జరుగుతుందన్నారు.
ఈ డ్రైవ్‌ను గతేడాది డిసెంబర్ 17న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణ జర్నలిస్టులందరూ తమ పేర్లను నమోదు చేసుకుని పాల్గొనాలని ఆ శాఖ కార్యదర్శి సుజాత శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
(చదవండి: వేసవిలో మహాపానీయం 'మజ్జిగ'..! ఆరోగ్యానికి ఏవిధంగా మేలు చేస్తుందంటే..)