న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరిక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, వైఎస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ఈ క్రమంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌లో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారుల సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. అమెరికా తమకు అపూర్వమైన, శక్తివంతమైన ఆదేశాన్ని ఇచ్చిందని అన్నారు. తన సహచరుడు జేడీ వాన్స్, భారతీయ అమెరికన్ అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్‌పై ప్రశంసలు కురిపించారు.
‘‘మొదటగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఆయన అద్భుతమైన, అందమైన భార్య ఉషా వాన్స్‌ను అభినందిస్తున్నా. ఇక నుంచి మిమ్మల్ని ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలువచ్చు. ఈ ఎన్నికల్లో మనం చరిత్ర సృష్టించాం. ఎవరూ సాధ్యం కాదనుకున్న అడ్డంకులను అధిగమించాం. అమెరికా దేశం ఎన్నడూ చూడని రాజకీయ విజయం. నాకు మద్దతు ఇచ్చిన టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్‌కి కృతజ్ఞతలు’’ అని అన్నారు.
ఇక.. ట్రంప్ రన్నింగ్‌మేట్‌గా గెలుపు ఖరారు చేసుకున్న జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని వడ్లూరు గ్రామంలో జన్మించిన ఇండో అమెరికన్. జేడీ వాన్స్ గెలుపుతో ఆమె అమెరికాకు రెండవ మహిళ(Second Lady) హోదా దక్కించుకోకున్నారు. ఆమె యేల్ లా స్కూల్‌లో జేడీ వాన్స్‌ను మొదటగా కలుసుకున్నారు. ఈ జంట 2014లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉష పేరెంట్స్ రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పని చేశారు. గత ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాగా.. ఈసారి తెలుగుమూలాలున్న వ్యక్తి భర్త(జేడీ వాన్స్) ఆ పదవిని చేపట్టబోతున్నారు.
'Now I Can Say Vice President': Trump hails JD Vance, His wife after 'Political Victory'
Watch: https://t.co/Fj7vonSlLl | #USElection2024 #Trump2024 #JDVance #VicePresident #IndianAmerican #UshaVance pic.twitter.com/9DiDFHh1J9— Business Today (@business_today) November 6, 2024
Video Credits: Business Today
Comments
Please login to add a commentAdd a comment