US Elections 2024 Results
-
డోనాల్డ్ ట్రంప్ పాలన ఎలా ఉండనుంది?
నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇంకా విచారణ ఎదుర్కొంటున్న డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం మనకు తెలుసు. అన్ని ప్రజాస్వామిక దేశాల్లో జరిగే ఎన్నికలు ఒక ఎత్తయితే, అమెరికా ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా చూపే ప్రభావం మరొక ఎత్తు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మొదటి స్థానంలో వుంది. 80 దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే పటిష్టమైన గూఢచార వ్యవస్థ ఉంది. రెండు దేశాల మధ్య ఎక్కడ యుద్ధం జరిగినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా జోక్యం ఉంటుంది. అలాంటి అమెరికాలో మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సహజం.2025 జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ తన మంత్రివర్గ కూర్పులో నిమగ్నమయ్యారు. అమెరికాలో మంత్రి అనకుండా సెక్రటరీ అంటారు. ఏ సెక్రటరీ ఆయా శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ అధ్యక్షుడికి పాలనలో తోడుంటారు. అలాంటివారు సమర్థులుగా, మంచి నడవడి కలవారుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మంత్రులుగా ఎంపిక చేసుకున్న కొందరిపై సొంత పార్టీ వాళ్లే పెదవి విరుస్తున్నారు.పీట్ హేగ్సేత్: ఫాక్స్ న్యూస్ ఛానల్ హోస్టుగా కనిపిస్తారు. ట్రంప్ విధేయుడు. అమెరికా మిలిటరీలో మధ్య తరగతి అధికారి. ప్రపంచ పోలీసుగా పిలువబడే అమెరికాకు ఎంతో ప్రాధాన్యం ఉన్న రక్షణ శాఖను ఈయనకు ఇస్తున్నారు. ఈయన తన ఒంటిపై ‘దావూస్ ఉల్ట్’(లాటిన్లో ‘దేవుడి ఇచ్ఛ’ అని అర్థం) అని టాటూ వేయించుకున్నారు. మత యుద్ధాల్లో తెల్ల తీవ్రవాది తిరగబడాలనీ, అది దేవుని నిర్ణయమనీ భావన. ఈయన లైంగిక దాడి కేసును ఎదుర్కొన్నారు. ట్రంప్ ‘కాపిటల్ దాడి’ని సమర్థిస్తారు. సైన్యంలో స్త్రీలు ఉండ కూడదంటారు.మ్యాట్ గేట్జ్: ఈయనను అటార్నీ జనరల్‌గా ప్రకటించారు. ఈయన ఒక పదిహేడేళ్ల అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నారనీ, మాదక ద్రవ్యాలు వినియోగించారనీ కేసులు ఉన్నాయి. ఈయన రోజూ ట్రంప్‌తో టచ్‌లో ఉంటానని చెప్పుకొంటారు. ఎఫ్‌బీఐ, న్యాయ శాఖలనే రద్దు చేయాలంటారు. కాపిటల్ దాడిని సమర్థిస్తూ దానికి గర్వపడతానంటారు.చదవండి: అమెరికా ఓటర్లకు పట్టని గుణగణాలుతులసి గబ్బార్ద్: ఈమెను డైరెక్టర్ అఫ్ నేషనల్ ఇంటలిజెన్స్గా నియమించనున్నారు. ఈమె గతంలో డెమోక్రాట్. 2020 అధ్యక్ష స్థానం కోసం పోటీ పడాలనుకుని ప్రైమరీల్లో ఓడిపోయారు. సుమారు ఇరవై ఏళ్ళు మిలిటరీలో పనిచేశారు. రష్యా సానుభూతిపరురాలు అని పేరు. సిరియా ప్రజలను ఊచకోత కోసిన అధ్యక్షుడు బషర్‌ను సమర్థిస్తారు. బషర్‌కు రష్యా మద్దతుంది. ఈమె పేరు చూసి కొందరు ఇండియన్ అనుకుంటున్నారు. కానీ ఈమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు.క్రిస్టీ నోయెమ్: ఈమెను హోమ్ ల్యాండ్ సెక్రటరీగా ఎంపిక చేశారు. అంతర్గత భద్రత, సరిహద్దు భద్రత, వలసల నిరోధం లాంటివి పర్యవేక్షించాలి. ఈమె ట్రంప్ ప్రతిపాదించిన వలసవాదులను పంపించి వేయాలనే స్లోగన్‌ను బాగా సమర్థించారు. ఈమె రాసిన పుస్తకంలో– పెంపుడు కుక్క(పేరు క్రికెట్) తన ఆజ్ఞలను పాటించనందుకు చంపేయాల్సి వచ్చిందని రాస్తే పాఠకులు ఛీకొట్టారు. అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అంటారామె.చదవండి: వాస్తవాలను నిరాకరిస్తున్నామా?రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్: ఆరోగ్య మంత్రిగా ఎంపిక చేశారు. ఈయనకు టీకాలంటే అస్సలు గిట్టదు. ఔషధాల కంపెనీలంటే దురభిప్రాయం. పచ్చి ఆవుపాలు వాడటమే ఆరోగ్యమంటారు. పచ్చి పాలలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందనీ, వేడి చేసి వాడాలనీ ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్య మంత్రిగా ఈయన పేరు ప్రకటించగానే ఫార్మా కంపెనీల షేర్లు పడిపోయాయి. ఈయన అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, మధ్యలో విరమించుకుని ట్రంప్‌కు మద్దతిచ్చారు. ట్రంప్ తన మంత్రులుగా ఎంపిక చేసుకున్నవారిలో వీరు కొందరు. మరి ట్రంప్ పాలన ఎలా ఉండబోతున్నదో చూడాలి!- డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి రిటైర్డ్ సీనియర్ లెక్చరర్ (అమెరికా నుంచి) -
అమెరికా ఓటర్లకు పట్టని గుణగణాలు
డోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, చాలా వివరాలతో చాలా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటి లోని ఎక్కువ విషయాలు మేధావు లకు మాత్రమే అర్థం అయ్యేటట్టు వున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఎక్కువ ఓట్లు వేసి గెలిపించింది సాధారణ మనుషులే గానీ, మేధావులు కాదు. ఈ సాధారణ మనుషులు ఏ విషయాలతో ప్రభావితం అయి ఓట్లు వేశారు? ఈ సాధారణ మనుషులకు పట్టని విషయాలు కూడా ఉన్నాయా? (1) ట్రంపును స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాడిగా ఒక సివిల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి, తీర్పును ఇచ్చింది. ట్రంపు దాని మీద అపీల్ చేసుకున్నాడు కూడా. అయినా సరే, స్త్రీలతో సహా ఎంతో మంది తమ ఓటును ట్రంపుకు వేశారంటే, వారికి న్యాయస్థానాల మీద నమ్మకం లేనట్టా? (2) ఒక అశ్లీల చిత్రాల నటీమణితో తనకున్న సంబంధాన్ని దాచి వుంచడానికి, ట్రంపు ఆమెకి డబ్బు ఇచ్చి, ఆ డబ్బును దొంగ లెక్కలలో చూపించాడని ఒక క్రిమినల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి, తీర్పు ఇచ్చింది. జైలు శిక్షను ప్రకటించడం మాత్రం ఆలస్యం చేసింది రాజకీయ కారణాల వల్ల. శిక్షను ఇంకా ప్రకటించలేదు కాబట్టి, ట్రంప్ దీన్ని ఇంకా అపీల్ చేసుకోలేదు. ఇది కూడా సాధారణ ప్రజలకు పట్టలేదు. (3) 2020 ఎన్నికలలో ఓడిపోయాక, ట్రంప్, ఎన్నో గవర్నమెంటు రహస్య పత్రాలను చట్టవ్యతిరేకంగా సొంత ఇంటికి తీసుకుపోతే, అతని చేత నియామకమయిన జడ్జి ఒకావిడ, ఏదో కారణం చూపించి ఆ కేసును కొట్టివేసింది. (4) 2020 ఎన్నికలలో ఓడిపోయాక, ట్రంప్, తన అనుచరులను రెచ్చగొట్టి ప్రభుత్వ భవనం మీదకి ఉసి గొలిపాడు. ఆ అనుచరులు చేసిన విధ్వంసకాండ అంతా అన్ని టీవీలలోనూ వచ్చింది. ట్రంప్ అనుచరులను ఎంతో మందిని జైల్లో పెట్టారు. వారందరినీ బయటకు తీసుకు వస్తానని ట్రంప్, ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన ప్రజలు, మళ్ళీ ఓట్లు వేశారు. (5) కోవిడ్ సమయంలో, ట్రంప్ అసమర్థత వల్ల ఎంతో మంది మరణించడం అనేది 2020 ఎన్నికల్లో అతను ఓడిపోయాడనడానికి ఒక కారణమని అందరికీ తెలుసు.(6) డబ్బూ, ఖ్యాతీ వున్న మొగవాళ్ళు, ఆడవాళ్ల జననాంగాలని పట్టుకోవచ్చుననీ, ఆ ఆడవాళ్ళు ఏమీ అనరనీ, ట్రంప్ పబ్లిక్‌గా అన్నాడు. అయినా, ఎంతో మంది ఆడవాళ్ళు అతనికే ఓటు వేశారు!(7) స్త్రీలకి తమ శరీరం మీద తమకు హక్కు లేదనీ, అత్యాచారానికి గురయిన పదేళ్ళ బాలికయినా శిశువును కని తీరాల్సిందేననీ, తల్లి ప్రాణం మీదకి వచ్చినా సరే, ఆ తల్లికి అబార్షన్ చేయ కూడదనీ చెప్పే ఈ ట్రంపుకు, ఆ స్త్రీలే ఎలా ఓట్లు వేశారు? (8) రాజకీయ శత్రువులందరినీ, తను నెగ్గాక జైళ్ళలో పడేస్తానని ట్రంప్ అన్నా, ఈ సాధారణ జనాలకి ఆ మాటలు పట్టలేదు. చదవండి: డోనాల్డ్ ట్రంప్ పాలన ఎలా ఉండనుంది?(9) ‘అందమైన తన కూతురు నిజంగా తన కూతురు కాకపోతే, ఆమెతో డేటింగ్ చేసేవాడి’నన్న ఆ తండ్రిని ఈ సాధారణ జనాలు క్షమించేశారు. (10) రాజ్యాంగంలోని ఒక సూత్రాన్ని యాంత్రికంగా అన్వయించుకుని, చిన్న పిల్లలకి కూడా తుపాకీలు దొరికేలా వ్యాపార పరిస్థితు లను నెలకొల్పి, ఎన్నో స్కూళ్ళలో జరిగిన కాల్పులకి ఏ మాత్రం బాధ్యత వహించని ట్రంపుని ఈ సాధారణ ప్రజలు ఎలా సహించారు? (11) అనాదిగా వుండిన నేటివ్ అమెరికన్లని అణగగొట్టిన వలసదార్ల చేత ఏర్పడ్డది అమెరికా! ఇలాంటి దేశ ప్రతినిధిగా, పొట్టకూటి కోసం వలసవచ్చిన వారికి వ్యతిరేకంగా వుండే ట్రంపుకి ఈ సాధారణ ప్రజలు ఎలా ఓట్లు వేశారు? (12) సాధారణ ప్రజల సోషల్ సెక్యూరిటీ వసతులకీ, వారి మెడికల్ వసతులకీ భంగం కలిగిస్తానంటున్న ఈ రాజకీయ వేత్త ట్రంపుని ఎలా నమ్మారు? (13) బిలియనీర్ అయినా సరే, గవర్నమెంటుకి ఏవో నష్టాలు చూపించి ఎన్నో యేళ్ళు పన్నులు కట్టని ఈ ట్రంపుని ఈ ప్రజలు క్షమించేశారు, వారు పన్నులు కడుతూ! ఈ విషయాల వల్ల మనకి ఏం అర్థమవుతుందీ? అమెరికాలో అత్యధిక సాధారణ ప్రజల చైతన్య స్థాయి ఇలా వుందీ – అని. ఈ అమెరికా సాధారణ ప్రజలు, ఇండియాలోని అత్యధిక సాధారణ ప్రజలతో పోల్చినప్పుడు, పేదరికంలోనూ, విద్యాలేమి తోనూ లేరు. అయినా సరే, వీరి చైతన్య స్థాయి ఇలాగే వుంది. మోసపోయే వాళ్ళున్నంత వరకూ మోసగించే వాళ్ళు వుంటారు. చెయ్యాల్సినది ఆ మోసపోయే వాళ్ళకి చైతన్యం కలిగించడం. ఆ పని ఎవరు చెయ్యాలి? ఎంత వరకూ సాధ్యం అనేది వేరే విషయం! -జె.యు.బి.వి. ప్రసాద్ వ్యాసకర్త రచయిత (క్యూపెర్టినో, కాలిఫోర్నియా నుంచి) -
దిగువసభపై పట్టుసాధించిన రిపబ్లికన్ పార్టీ
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు తాజా గణాంకాల ప్రకారం దిగువసభపై ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ పట్టుసాధించింది. బుధవారం తెల్లవారు జామున కాలిఫోర్నియా లోని మరోచోట గెలవగా తాజాగా అరిజోనాలో మరో స్థానంలో గెలవడంతో రిపబ్లికన్లు ఇప్పటిదాకా గెల్చిన సీట్ల సంఖ్య 218కి పెరిగింది. కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రటిక్ పార్టీ కేవలం 208 చోట్ల మాత్రమే విజయం సాధించింది. దిగువసభలో మొత్తం 435 స్థానాలు ఉండగా ఇంకా 9 స్థానాల్లో ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్‌లోనూ ఇటీవలి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత సాధించింది. ఎగువ, దిగువ సభల్లో ఆధిక్యత కారణంగా త్వరలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చే నూతన చట్టాలకు ఎలాంటి అవాంతరాలులేకుండా సులభంగా ఆమోదముద్ర పడనుంది. -
‘వెల్కమ్ బ్యాక్ ట్రంప్’.. బైడెన్‌తో భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ బుధవారం తొలిసారి వాషింగ్టన్లో అడుగు పెట్టారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు వైట్‌హౌస్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఓవర్ ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికార మార్పిడికి సంబంధించిన ప్రాథమిక అంశాలు వారి నడుమ చర్చకు వచ్చినట్టు సమాచారం. తన భార్య, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌తో కలిసి ‘వెల్కం బ్యాక్’ అంటూ ట్రంప్‌ను బైడెన్ స్వాగతించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు. అనంతరం నేతలిద్దరూ కరచాలనం చేసుకున్నారు. ‘‘రాజకీయా లు కఠినమైన వ్యవహారం. అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.మెలానియా డుమ్మాబైడెన్తో ట్రంప్ భేటీకి ఆయన భార్య మెలానియా డుమ్మా కొట్టారు. ట్రంప్‌పై నమోదైన రహస్య పత్రాల కేసులో బైడెన్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతోనే ఈ సమావేశానికి ఆమె దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫ్లోరిడా నివాసంలో సోదాల సందర్భంగా మెలానియా వార్డ్ రోబ్‌ను అధికారులు అణువణువూ శోధించారు. ఆ క్రమంలో ఆమె లో దుస్తులున్న షెల్ఫ్‌ను కూడా వదిలి పెట్టలేదు. మెలానియా భేటీకి రాకున్నా ఆమెకు జిల్ అభినందన లేఖ రాశారు. దాన్ని ట్రంప్‌కు స్వయంగా అందజేశారు. -
ట్రంప్ కేబినెట్లో కీలక పదవులు దక్కించుకుంది వీరే.. (ఫొటోలు)
-
చివరి వారాల్లో అధ్యక్ష పీఠంపై కమల?
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో కాస్తంత వెనకబడి తొలి మహిళా దేశాధినేతగా అధ్యక్షపీఠంపై కూర్చునే సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గద్దెనెక్కించాలని గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్ స్థానికత సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అంతర్జాతీయ దౌత్యనీతిని పక్కకునెట్టి, దిగజారుడు వ్యక్తిగత దూషణలకు దిగి ఎలాగోలా పాపులర్ ఓటును ఒడిసిపట్టారన్న విమర్శల వేళ అగ్రరాజ్యంలో కొత్తరకం డిమాండ్ తెరమీదకొచ్చింది. చిట్టచివర్లో రేసులోకి దిగి, ఎన్నికల్లో చివరిదాకా పోరాడి అద్భుత పోరాటస్ఫూర్తిని ప్రదర్శించిన కమలాహారిస్‌కు చివరివారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. అయితే ఇదేతరహా డిమాండ్లకు తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవినే త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించినా హారిస్ అధ్యక్షపీఠమెక్కడం నైతికంగా ఎంత వరకు సబబు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘ బైడెన్ అద్భుతమైన నేత. ప్రజల ఎన్నో కోరికలను ఆయన నెరవేర్చారు. ఈ ఒక్క విన్నపాన్నీ ఆయన మన్నించాలి. అధికార మార్పిడికి ఒప్పుకుని హారిస్‌కు అవకాశం ఇవ్వాలి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే హారిస్ ఈ చివరి వారాలు అధికారంలో ఉంటే నైతిక విజయం కమలదే అనే బలమైన వాదనను వినిపించినవాళ్లమవుతాం. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలూ మెరుగవుతాయి. చివరి రోజుల్లో బైడెన్ చేయగల గొప్పపని అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే’’ అని కమలాహారిస్ కమ్యూనికేషన్స్ విభాగ మాజీ డైరెక్టర్ జమాల్ సైమన్స్ ఆదివారం విజ్ఞప్తిచేశారు. ‘‘ దేశవ్యాప్తంగా ట్రంప్‌తో పోలిస్తే కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే హారిస్‌కు తక్కువ వచ్చాయి. కోట్లాది మంది హారిస్‌ను అధ్యక్షపీఠంపై చూడాలనుకున్నారు. బైడెన్ దిగిపోయి హారిస్‌కు అవకాశమిస్తే వారి కల నెరవేరుతుంది. అమెరికా సైతం తొలి అధ్యక్షురాలిని చూస్తుంది’’ అని మరో డెమొక్రటిక్ నేత, నటుడు ఆండీ ఓస్ట్రీ అన్నారు. ట్రంప్‌తో ముఖాముఖి డిబేట్‌కు ముందువరకు బైడెనే డెమొక్రటిక్ అభ్యర్థి. డిబేట్లో పేలవ ప్రదర్శన తర్వాత అత్యున్నతస్థాయి డెమొక్రటిక్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే బైడెన్‌ను రేస్ నుంచి తప్పించారు. కమలను బరిలో నిలిపారు. ఈసారి కూడా టాప్ డెమొక్రాట్ల లాబీయింగ్ పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అసలు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేవా అనే వార్తపై కూడా అంతర్జాతీయ మీడియాకు లీకులు రావడం లేదు. 25వ సవరణ ఏం చెప్తోంది?అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే కమల ప్రెసిడెంట్ కావడం సాధ్యమే. రాజ్యాంగంలోని 25వ సవరణలోని ఒకటో సెక్షన్ ప్రకారం అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా, అధ్యక్షుడు రాజీనామా చేసినా, లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు. ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమలకు అధ్యక్షపగ్గాలు చేతికొస్తాయి. అయితే ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనైతికమవుతుందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఈ దుశ్చర్య ఏకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర’’ అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కమల ఎందుకు అధ్యక్ష పదవికి అనర్హురాలో మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే ధారాదత్తం అవుతాయి. ఈ విధానం కారణంగానే 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ఆ ఎన్నికల్లో హిల్లరీక్లింటర్ను దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చాయి. అంటే పాపులర్ ఓటు సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ సాధించలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పాపులర్ ఓటు సాధించిఉంటే కమలకు నైతిక అర్హత ఉండేదేమోనని కొందరు అభిప్రా యపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ పాపులర్ ఓటుతోపాటు అత్యధిక ఎలక్టోరల్ ఓట్లనూ సాధించడం విశేషం. ఏదేమైనా పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి శ్వేతసౌధం నుంచి కూడా అర్ధంతరంగా బయటికొస్తారేమోనని కమల అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్‌తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్‌టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్‌కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్‌టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్‌కు చెందిన సోమ్‌నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్‌పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్‌తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్‌లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బైడెన్ వల్లే ఓడిపోయాం
వాషింగ్టన్: ఎన్నికల ఫలితాలపై డెమొక్రాట్లలో ఆగ్రహం వెల్లువవుతోంది. పార్టీ హారిస్, బైడెన్ అనుకూల వర్గాలుగా చీలిపోయింది. ఓటమికి కారణం మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. ఆయన పోటీ నుంచి తొందరగా తప్పుకొని ఉంటే డెమొక్రాట్లు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారన్నారు. అయితే ఓటమికి హారిస్ సాకులు చెబుతున్నారని బైడెన్ మాజీ సహాయకుడు ఆక్సియోస్ చెప్పారు. గెలవకుండానే ఒక బిలియన్ డాలర్లు ఎలా ఖర్చుచేశారని ప్రశ్నించారు. జో బైడెన్‌ను బయటకు నెట్టడానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహాదారులు పార్టిలో అంతర్గత కుమ్ములాటలను బహిరంగంగా ప్రోత్సహించారని ఆరోపించారు. బైడెన్‌ను గద్దె దించడానికి కుట్ర పన్నిన వారే ఎన్నికల్లో ఓటమికి కారణమని డెమొక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ ఆరోపించారు. -
విషెస్ చెప్పి విమర్శలపాలైన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ప్రజలకు సుద్దులు చెప్పే నేతలు తాము మాత్రం నిబంధనల్ని బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తారన్న విమర్శలు నిజమని పాక్ ప్రధాని నిరూపించారు. వేర్పాటువాద శక్తులు విరివిగా ఉపయోగిస్తూ దేశంలో అస్థిరకతకు కారణమవుతున్నారని, అందుకు పరోక్షంగా కారణమైన ‘ఎక్స్’సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దానిని అమలుచేస్తోంది కూడా. అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయనాదం చేసిన ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’వేదికను వినియోగించుకోవడం విమర్శలకు తావిచ్చింది. స్వయంగా ప్రభుత్వాధినేతనే సొంత నిర్ణయాలకు విలువ ఇవ్వనప్పుడు ప్రజలేం పట్టించుకుంటారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. -
USA Elections Results 2024: ఆ నాలుగు వద్దు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులైన మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. గర్భస్రావ హక్కులకు వ్యతిరేకి అయిన ట్రంప్ రాక పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పురుషుల ఓట్లతోనే ఆయన గెలిచారని వారు భావిస్తున్నారు. ట్రంప్‌కు ఓటేసి గెలిపించినందుకు ప్రతీకారంగా పురుషులను పూర్తిగా దూరం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు! ఈ దిశగా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ‘4బీ’ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఆ మగవాళ్లను దూరంగా పెడతాం. వారితో శృంగారం, పెళ్లి, పిల్లలను కనడం వంటి సంబంధాలేవీ పెట్టుకోబోం’’అని కరాఖండిగా చెబుతుండటం విశేషం! దక్షిణ కొరియాలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ట్రంప్ విజయం తర్వాత బాగా ట్రెండింగ్‌గా మారింది. ట్రంప్ మహిళల వ్యతిరేకి అని, స్త్రీవాదమంటే ఆయనకు పడదని డెమొక్రటిక్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. గర్భస్రావ హక్కులకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయంపై మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ విజయంతో ఆవేదనకు గురై వారు కన్నీరుపెట్టారు. తమ బాధను సోషల్ మీడియాలో పంచుకోవడంతోపాటు 4బీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పొడవునా మహిళల హక్కులపై ట్రంప్, హారిస్ మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం సాగింది. 4బీ ఉద్యమం దానికి కొనసాగింపని చెబుతున్నారు. ఇది మహిళల విముక్తి పోరాటమంటూ పోస్టు పెడు తున్నారు. ‘‘తరాలుగా సాగుతున్న పురుషాధిక్యత, అణచివేతపై ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాం’’ అంటున్నారు. 4బీ పోరాటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. పోస్టులు, లైక్‌లు, షేరింగ్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రాడికల్ ఫెమినిస్ట్ ఉద్యమం నానాటికీ బలం పుంజుకోంటుంది. ఏమిటీ 4బీ ఉద్యమం?ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ’ఉద్యమం తర్వాత అదే తరహాలో దక్షిణ కొరియాలో 2018లో 4బీ ఉద్యమం మొదలైంది. ఓ మహిళ తన ఆర్ట్ క్లాస్‌లో భాగంగా నగ్నంగా ఉన్న పురుషున్ని ఫొటో తీసినందుకు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీనిపై మహిళల ఆగ్రహావేశాలు 4బీ ఉద్యమానికి దారితీశాయి. బీ అంటే కొరియా భాషలో సంక్షిప్తంగా నో (వద్దని) చెప్పడం. పురుషులతో డేటింగ్, పెళ్లి, శృంగారం, పిల్లలను కనడం. ప్రధానంగా ఈ నాలుగింటికి నో చెప్పడమే 4బీ ఉద్యమం. దీన్ని అణచివేసేందుకు కొరియా ప్రభుత్వం ప్రయతి్నంచింది. స్త్రీ పురుషుల ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి ఉద్యమాలు దెబ్బతీస్తాయని అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ 2021లో చెప్పారు. ఇప్పుడక్కడ 4బీ గొడవ కాస్త సద్దుమణిగినప్పటికీ ప్రజలపై దాని ప్రభావం ఇంకా బలంగానే ఉంది. దాంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. 4బీ ఉద్యమమే దీనికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్‌దే నెవడా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన ట్రంప్ తన మెజారిటీని మరింత పెంచుకుంటున్నారు. ఏడు కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన నెవడాను కూడా శనివారం తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడి 6 ఎలక్టోరల్ ఓట్లతో కలిపి ఆయన మొత్తం ఓట్లు 301కి పెరిగాయి. నెవడా 20 ఏళ్ల తర్వాత డెమొక్రాట్ల చేజారడం విశేషం. 11 ఓట్లున్న అరిజోనాలో ఫలితం వెలువడాల్సి ఉంది. అక్కడా 83 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ట్రంప్ 5 శాతానికి పైగా ఆధిక్యంలో ఉన్నారు. హారిస్‌కు 226 ఓట్లుకు రావడం తెలిసిందే. రిపబ్లికన్లు నాలుగేళ్ల తర్వాత సెనేట్‌లో కూడా మెజారిటీ సాధించడం తెలిసిందే. వారికి 52 సీట్లు రాగా డెమొక్రాట్లు 44కే పరిమితమయ్యారు. 2 సీట్లు స్వతంత్రులకు దక్కగా మరో రెండింట్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ల ఆధిపత్యమే సాగుతోంది. 435 స్థానాలకు గాను ఇప్పటిదాకా రిపబ్లికన్లు 212 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 సీట్లు వస్తే వారు మెజారిటీ మార్కు చేరుకుంటారు. డెమొక్రాట్లకు 200 స్థానాలు దక్కాయి. -
ట్రంప్ ఎన్నికపై సైన్యంలో రుసరుసలు!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో అమెరికా రక్షణ శాఖలో కొత్త పరిణామాలు సంభవించబోతున్నాయి. విదేశాల నుంచి సామూహిక వలసలను కఠినంగా అణచివేస్తానని, అక్రమ వలసదార్లపై కచ్చితంగా చర్యలుంటాయని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వలసలను కట్టడి చేయడానికి సైనిక దళాల సేవలు వాడుకుంటామని చెప్పారు. దేశంలో తన వ్యతిరేక గళాలపైనా ఆయన విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యర్థులకు వేధింపులు తప్పవన్న ప్రచారం సాగుతోంది. దేశంలో చట్టాల పటిష్ట అమలుకు యాక్టివ్–డ్యూటీ దళాలను రంగంలోకి దించుతానని ట్రంప్ చెప్పారు. సైన్యంలో తిష్టవేసిన అవినీతిపరులను ఏరిపారేస్తానని ప్రకటించారు. తన ప్రభుత్వంలో విధే యులకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. సొ ంత ఇంటి(స్వదేశం) లోని శత్రువులపైకి సైన్యాన్ని పంపిస్తానని చెప్పారు. మరోవైపు తన అవసరాల కోసం సైన్యాన్ని వాడుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ఆయన దుందుడుకు చర్యలను సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా వారితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు సైనిక జనరల్స్ బలహీనులు, అసమర్థులు అని ట్రంప్ విమర్శించారు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన తీరుపై అమెరికా సైన్యంలో చర్చ మొదలైంది. ఒకవేళ ట్రంప్ వివాదాస్పద ఆదేశాలు ఇస్తే ఏం చేయాలి? ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై ఇటీవల పెంటగాన్ అధికారులు సమావేశమైన చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ అనధికారికంగానే జరిగింది. ట్రంప్ ఆదేశాలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంటే సున్నితంగా తిరస్కరించడమే మేలని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. ట్రంప్ మళ్లీ ఎన్నిక కావడం సైన్యంలో చాలామందికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. చట్టానికే విధేయులం.. అమెరికా అధ్యక్షుడంటే సమస్త సైనిక దళాలకు సుప్రీం కమాండర్. ఆయన ఆదేశాలను అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్‌పై సైన్యంలో స్పష్టమైన విముఖత కనిపిస్తోంది. ట్రంప్ వర్సెస్ అమెరికా మిలటరీ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ట్రంప్‌తో సైన్యానికి ఉన్న గత అనుభవాలే ఇందుకు కారణం. ఆయన మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రక్షణశాఖను ప్రక్షాళన చేస్తారని అంచనా వేస్తున్నారు. తన విధేయులకు పెద్దపీట వేయడంతోపాటు తనను వ్యతిరేకించేవారిని లూప్లైన్లోకి పంపిస్తారని చెబుతున్నారు. అన్ని రకాల ప్రతికూల పరిణామాలకు సిద్ధమవుతున్నామని ట్రంప్ వ్యతిరేక అధికారులు కొందరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి హోదాలో ఆయన చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇస్తే వ్యతిరేకిస్తామని, ఎదురు తిరుగుతామని కొందరు పేర్కొంటున్నారు. తాము కేవలం చట్టానికి మాత్రమే విధేయులమని, ట్రంప్‌నకు గానీ, ఆయన ఇచ్చే చట్టవిరుద్ధ ఆదేశాలకు గానీ కాదని ఓ అధికారి స్పష్టంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజకీయాలకు కమలా హారిస్ గుడ్‌బై?!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఏం చేయబోతున్నారు?. అమెరికా కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని.. కొనసాగిస్తానని చెప్పిన మాట మీద ఆమె నిలబడతారా?. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆమె భావిస్తున్నారా?.ట్రంప్ చేతిలో ఓటమి తర్వాత హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హారిస్ గంభీరంగానే ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. అయితే.. మరో 72 రోజుల్లో ఆమె ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత ఆమె ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.సాధారణంగా.. అమెరికా అధ్యక్షఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు.. మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశాలు దక్కుతుంటాయి. లేదంటే ఏదో ఒక కీలక పదవుల్లో వాళ్లకు అవకాశాలు దక్కవచ్చు. 2004లో జార్జి బుష్ చేతిలో ఓటమిపాలైన జాన్ కెర్రీ.. బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అంటే.. ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట.అయితే జాన్ కెర్రీలా తిరిగి రాజకీయాల్లో రాణించేందుకు ఛాన్స్ కమలకు ఉంది . 2017 నుంచి 2021 మధ్య కాలిఫోర్నియా నుంచి సెనేట్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించారు. అయితే మళ్లీ సెనేట్‌కు వెళ్లేందుకు ‘ఇంటిపోరు’ ఆమెకు ఆటంకంగా మారే అవకాశం లేకపోలేదు. సొంత రాష్ట్రంలో.. డెమోక్రటిక్ మద్దతుదారుల నుంచే ఆమెకు వ్యతిరేక గళం వినిపిస్తోంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలిచ్చినవాళ్లూ ఆమె పట్ల అసంతృప్తితోనే ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. పోటీ డెమోక్రటిక్ ప్రతినిధిగా కొనసాగుదామన్నా.. అందుకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ఈ లెక్కన.. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిత్వం కోసం ఆమె తీవ్రంగానే శ్రమించాల్సి ఉంటుంది. అలాకాకుంటే..రాజకీయాలకు దూరం జరిగి హిల్లరీ క్లింటన్, ఏఐ గోర్ మాదిరి సాహిత్య రచన, ఇతర వ్యాపకాల్లో మునిగిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. తన పోరాటం కొనసాగుతుందని కమలా హారిస్ ప్రకటించినప్పటికీ.. అందుకు అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవేవీకాకుండా ఆమె తన వ్యక్తిగత జీవితంపై దృష్టిసారించవచ్చనే అభిప్రాయమూ ఒకటి వినిపిస్తోంది. కమలా హారిస్ వయసు 60 ఏళ్లు. కాబట్టి, అధ్యక్ష ఎన్నికల రేసులో ఆమెకు బోలెడు అవకాశం ఉందని ఆమెకు దగ్గరి వ్యక్తులు చెబుతున్నారు. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది 2025 జనవరి 20 తర్వాత తేలిపోనుంది. -
అమెరికా నుంచి వెళ్లిపోతా.. ఎలన్ మస్క్ కుమార్తె
వాషింగ్టన్: అమెరికాలో భవిష్యత్ కనిపించడం లేదని, దేశాన్ని వీడి వెళ్తానని ఎలన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె వివియన్ విల్సన్ ప్రకటించారు. 2022 నుంచి తండ్రికి దూరంగా ఉంటున్న వివియన్.. ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత మెటా థ్రెడ్స్‌లో తన ఆలోచనలను పంచుకున్నారు. ‘‘నేను కొంతకాలంగా ఈ విషయం మీద ఆలోచిస్తున్నా. నిన్నటిరోజును చూశాక నిర్ణయం తీసుకున్నాను. నేను అమెరికాలో ఉండేలా భవిష్యత్ కనిపించడం లేదు’’అని రాసుకొచ్చారు. దీనిపై మస్క్ స్పందించారు. ‘‘మైండ్ వైరస్ నా కొడుకును చంపేసింది’’అని మరోసారి ట్వీట్ చేశారు. నేను అలసిపోయాను.. మళ్లీ.. తన తండ్రి పోస్ట్ స్క్రీన్ షాట్‌ను థ్రెడ్స్‌లో షేర్ చేస్తూ.. ‘‘మీరు ఇప్పటికీ నా బిడ్డ ఏదో ఒక వ్యాధి బారిన పడ్డారంటున్నారు. మీరు నన్ను ద్వేషించడానికి పూర్తిగా కారణం అదే. దయచేసి దాని జోలికి పోవద్దు. ప్రతి సన్నివేశంలో నేను బాధితురాలిని తప్ప మరేమి కాదు. నేను అలసిపోయాను. నాకు విసుగ్గా ఉంది’’అని ఆమె జత చేశారు. ఆ తరువాత మరోపోస్ట్‌లో... ఒకరిపై అధికారం కోల్పోయాననే తన తండ్రి అలా పిచి్చగా మాట్లాడుతున్నారని వివియన్ పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగా పరిణితి చెందని మీరు భ్రమలో ఉన్నారు, ఒకరి మీద నియంత్రణ కోల్పోయాననే కలతతో ఉన్నారు. మీరెలాంటివారో మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికీ తెలుసు. అది నా సమస్య కాదు’’అని ఆమె తెలిపారు. -
ట్రంప్ గెలుపుపై పుతిన్ రియాక్షన్ ఇదే
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత గురువారం రష్యాలోని సోచిలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.అదే సమయంలో ఏడాది జులైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై స్పందించారు. హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్ చూపించిన తెగువ, ధైర్యం తనను ఆకట్టుకుందన్నారు. పుతిన్‌తో మాట్లాడలేదుఅధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను 70 మంది దేశాది నేతలతో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని పిలుపున్చిన పుతిన్‌తో తాను మాట్లాడలేదని ట్రంప్ వెల్లడించారు. -
US Election Results 2024: ముంచింది బైడెనే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే ప్రధాన కారణమంటూ వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్ష రేసు నుంచి ఆయన ఆలస్యంగా తప్పుకోవడం పార్టీ పుట్టి ముంచిందంటూ మండిపడుతున్నారు. హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక సంతులనం సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు. ‘‘దాంతో బైడెన్ విధానాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పదేపదే తీవ్ర విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. వాటిలో లోటుపాట్లను సరిచేసుకుంటామని స్పష్టంగా చెప్పి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు’’అంటూ వాపోతున్నారు. ఈ దారుణ ఓటమితో డెమొక్రటిక్ పార్టీ భవితపై నీలినీడలు కమ్ముకున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 81 ఏళ్ల బైడెన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని 2023 ఏప్రిల్‌లోనే ప్రకటించారు. వయోభారం దృష్ట్యా తప్పుకోవాలని పార్టీ నేతలు చెప్పినా ససేమిరా అన్నారు. పారీ్టలో ట్రంప్‌ను ఓడించగల ఏకైక నేతను తానేనని వాదించారు. మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా తనకుందని, దేవుడు తప్ప ఎవరూ తనను తప్పించలేరని చెప్పుకున్నారు. కానీ ట్రంప్‌తో తొలి డిబేట్లో ఆయన దారుణంగా తడబడటం, ప్రసంగం మధ్యలో ఆగి పదాల కోసం తడుముకోవడం డెమొక్రాట్లను హతాశులను చేసింది. బైడెన్ మానసిక సంతులనంపై అనుమానాలు పెరిగాయి. అభిప్రాయానికి పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు జూలైలో పోటీ నుంచి తప్పుకుని హారిస్‌కు దారిచ్చారు. దాంతో ప్రచారానికి ఆమెకు తక్కువ సమయం లభించింది. దానికి తోడు అప్పటికే ట్రంప్ గెలుపు ఖాయమనే తరహా వాతావరణం నెలకొని ఉంది. దాన్ని మార్చేసి ట్రంప్‌ను గట్టిగా ఢీకొట్టేలోపే పోలింగ్ తేదీ ముంచుకొచ్చింది. ఇదంతా ఆయనకు బాగా కలిసొచ్చిందని డెమొక్రాట్లు ఇప్పుడు తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.బైడెన్ నీడలోనే... అమెరికాలో గత 70 ఏళ్లలో అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు బైడెనేనని గాలప్ పోల్ సర్వే తేల్చింది. ప్రజల మనసులు గెలవలేకపోయిన రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కంటే కూడా ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి అధ్యక్షుడి నీడ నుంచి హారిస్ బయటపడలేకపోవడం కూడా ఓటమికి గట్టి కారణంగా నిలిచిందని ఆమె సహాయకులే అంటున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ నిర్ణాయల్లో తాను భాగమేనని ఆమె భావించారు. అందుకే బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకా ముందయ్యారు. అలాగాక బైడెన్ విధానాల్లో లోటుపాట్లను సమీక్షించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకుంటామని స్పష్టంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’అని వారంటున్నారు. ఎకానమీ, వలసల వంటి కీలక విధానాలపై ట్రంప్ దూకుడుకు హారిస్ నుంచి గట్టి సమాధానమే లేకపోయిందని గుర్తు చేస్తున్నారు. కనీసం వాటికి దీటైన ఇతర అంశాలను తెరపైకి తేవడంలో కూడా ఆమె విఫలమయ్యారంటున్నారు. అంతేగాక అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి తెలిసి కూడా ముందే చెప్పకుండా తమను, అమెరికా ప్రజలను హారిస్ మోసగించారని పలువురు డెమొక్రాట్లు ఆక్రోశిస్తున్నారు. పైగా 78 ఏళ్ల ట్రంప్‌తో పోలిస్తే కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో 60 ఏళ్ల హారిస్ విఫలమయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ప్రచార తీవ్రత చాలలేదని హారిస్ ప్రచార కమిటీ సీనియర్ సలహాదారు డేవిడ్ ప్లోఫ్ అంగీకరించారు. ఇది దారుణమైన ఓటమేనంటూ ఎక్స్‌లో వాపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కొత్త’ ట్రంప్ ఎలా పాలిస్తారు?
ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో కొలువుదీరినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. అదే సమయంలో గతం హయాంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు, చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. కాబట్టి ట్రంప్ 2.0 పాలన, ట్రంప్ 1.0 పాలన కంటే భిన్నంగా ఉంటుందని ఆశించాలి. అయితే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉంటుందనైతే చెప్పవచ్చు. ట్రంప్ మునుపటి లాగే చైనాతో కఠినంగా ఉండవచ్చు, భారతదేశం పట్ల స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ అది ఆయన తక్షణ ప్రాధాన్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయడం మంచిది.అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఆకర్షించి నంత ఎక్కువగా మరే దేశ ఎన్నికా ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశంగా అమెరికా కొనసాగుతోంది. దీని అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద సాంకేతిక, శాస్త్రీయ కేంద్రం, అతిపెద్ద సాయుధ దళాలను అమెరికా అధ్యక్షుడు నడుపుతారు. అయినప్పటికీ దేశాధ్యక్షురాలిగా ఒక మహిళను ఎన్ను కునేందుకు అమెరికా ఇంకా సిద్ధంగా లేదు. డోనాల్డ్ ట్రంప్‌కు స్త్రీలను ద్వేషించే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్‌లను ఓడించగలిగారు. జాతి, వర్గ ఆధిపత్య రాజకీయాలలో, లింగానికి వెనుక సీటు దక్కింది. ఎన్నికల ఒపీనియన్ పోల్స్ మరోసారి తలకిందులైపోయాయి.కొత్త ముఖాల ప్రభుత్వంబెర్లిన్ నుండి టోక్యో వరకు, మాస్కో నుండి బీజింగ్ వరకు, టెల్ అవీవ్ నుండి తెహ్రాన్, నిజానికి, న్యూఢిల్లీ వరకు, ప్రతి ప్రభుత్వం ట్రంప్ ఎన్నుకునే జట్టును నిశితంగా గమనిస్తుంది. ఇది ట్రంప్ రెండవ టర్మ్ అయినప్పటికీ, గతంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు. చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడు కొత్త ముఖాలు ఉంటాయి. వైట్‌హౌస్‌లో ఆయన గతంలో కొలువు దీరినప్పటితో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మారినందున ట్రంప్‌ను ప్రపంచం కొత్తగా అంచనా వేయడం జరుగుతుంది.స్వదేశంలో, ట్రంప్ మొదటి బాధ్యత స్థిరత్వాన్ని సాధించడం; పెద్దగా ప్రాధాన్యత లేని తన మద్దతుదారులకు, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఆశను కల్పించడం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్ద వృద్ధి లేక పోయినా స్థిరంగానే ముందుకు సాగుతోంది. వృద్ధి 2 శాతానికి పైగా ఉంది. అయినప్పటికీ, నిరుద్యోగం పెద్ద ఆందోళనగా ఉంది. ఒక వైపు తన సొంత తరగతి మిలియనీర్లు, బిలియనీర్ల దురాశనూ, మరో వైపు తక్కువ ఆదాయం కలిగిన, సామాజికంగా, ఆర్థికంగా అణగారిన తన మద్దతుదారుల అవసరాన్నీ ట్రంప్ ఎలా సమతుల్యం చేస్తారో చూడాలి.విదేశాలతో ఎలా వ్యవహరిస్తారు?విదేశాల్లో, ముఖ్యంగా యూరప్, పశ్చిమాసియాలో విభేదాలను పూర్తిగా పరిష్కరించడంలో ట్రంప్‌పై పెను భారం ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానంపై ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ నుండి బయట పడతానని ఆయన హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చేరుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో చైనాతో కఠినంగా ఉండవచ్చు, అధిక సుంకాలను విధించవచ్చు. కానీ వైరు ధ్యాలతోనే స్నేహాన్ని కోరుకోవచ్చు. పశ్చిమాసియాలో, ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంటారనీ, బహుశా పాలన మార్పు కోసం ఒత్తిడి తెస్తారనీ భావిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కూడా అదుపులో ఉంచవచ్చు.రాబోయే నాలుగేళ్లలో ’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ వాగ్దానం చేసినందున, ఆయన ప్రతి ఒక్క చర్య కూడా అమెరికాకు, ప్రపంచానికి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. ట్రంప్ మూడో సారీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పు కోసం ప్రయత్నిస్తారా అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమైనప్పటికీ, వయస్సు, సమయం ఆయన పక్షాన లేనందున ట్రంప్ 2.0 పాలన ట్రంప్ 1.0 పాలన నుండి భిన్నంగా ఉంటుందని ఆశించాలి.అమెరికా ఎలా పరిపాలించబడుతుందనే దానిపై ట్రంప్ శాశ్వత ప్రభావాన్ని కలిగిస్తారు. కానీ అమెరికాకు ప్రపంచాన్ని రూపొందించే సామర్థ్యం పరిమితంగా ఉంది. అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ట్రంప్ అధ్యక్ష పదవిపై యూరప్, జపాన్ రెండూ ఆందోళనగా ఉన్నాయి. ట్రంప్ గత హయాంలో యూరప్‌లో ఏంజెలా మెర్కెల్, జపాన్ లో షింజో అబే ఉన్నారు. ప్రస్తుతం,ట్రంప్‌ను ఎదిరించే లేదా ఆయన్ని నిలువరించగల సామర్థ్యం ఉన్న యూరోపియన్ లేదా తూర్పు ఆసియా నాయకులు ఎవరూ లేరు. వారు బహుశా ట్రంప్‌కు అనుగుణంగా నడుచుకోవచ్చు.పుతిన్‌ను ఊపిరి పిల్చుకోనిస్తారా, జెలెన్స్కీని కాస్త తగ్గమని అడుగుతారా అనేది ట్రంప్, ఆయన సలహాదారులు... యూఎస్ ‘డీప్ స్టేట్’పై, మిలిటరీ–ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌పై, జో బైడెన్ రష్యా విధానం వెనుక ఉన్న ప్రభావశీల వ్యక్తులపై ఎంత నియంత్రణను కలిగి ఉంటారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ కనీసం మొదట్లోనైనా ట్రంప్ యంత్రాంగంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరుకుంటారు. విరోధాబాస ఏమిటంటే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉండవచ్చు.ఇండియాతో వైఖరి?అదృష్టవశాత్తూ, అధ్యక్షుడు ట్రంప్‌తో భారతదేశం మంచి సమీక రణాన్ని కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరూ ట్రంప్ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ట్రంప్ 2.0 అన్ని సంభావ్యతలలోనూ,ట్రంప్ 1.0 లాగా ఉండదనే ఎరుకతో భారత నాయకత్వం ముందుకు సాగాలి. ట్రంప్ వాస్తవికతా విధానం, ‘అమెరికా ఫస్ట్’ విధానం... వాణిజ్యం, వలసలు, వాతావరణ మార్పు వంటి భారత్‌కు ఆసక్తి ఉన్న రంగాలపై సవాళ్లు విసురుతాయి. నేను ఉదారమైన అమెరికా వీసా విధానం పట్ల గొప్ప ఔత్సాహికుడిని కాదు. ఇది భారతదేశం నుండి ప్రతిభను హరించడానికి దోహదపడింది. అయితే ట్రంప్ పాత సలహా దారులలో కొందరు, ముఖ్యంగా అమెరికా మాజీ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్థైజర్ వంటి వ్యక్తులు తిరిగి కార్యాలయంలోకి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం సవాలుగా మారవచ్చు.అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం, సరఫరా గొలుసులతో అనుసంధానం కావడాన్ని భారతదేశం కొన సాగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించడం మంచిది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున అది వీడి పోకపోవచ్చు. దాని అలలు భారత తీరాలను తాకుతూనే ఉంటాయి. ట్రంప్ 1.0 సమయంలో షింజో అబే మొదట వైట్ హౌస్ తలుపులు తట్టారు, స్నేహపూర్వక హస్తాన్ని చాచారు, అహంభావిని పొగిడారు, భారత దేశానికి ప్రయోజనం కలిగించే క్వాడ్ వంటి ఆలోచనలను చేశారు. అబే రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి స్నేహి తుడు. ఆయన వారసులు కేవలం రాజకీయ నాయకులు, పైగా భారత్‌కు అనుకూలమైనవారు కాదు. చదవండి: ముంచింది జో బైడెనే.. కమలా హారిస్ తీరుపైనా విమర్శలుట్రంప్ భారత్ పట్ల స్నేహ పూర్వకంగా ఉండవచ్చు, కానీ మన దేశానికి ఆయన తక్షణ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మోదీ వంటి మిత్రులు కాసేపు వేచివుండి, అమెరికా మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపి యన్లు వైట్‌హౌస్‌లో తమ ఆందోళనతో కూడిన సంభాషణలను ముగించేందుకు అనుమతించడం ఉత్తమం.దేవుడు తనను కాపాడాడు కాబట్టే వైట్‌హౌస్‌కు తిరిగి వస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొన్నారు. తమను తాము ‘దేవుడు, విధిచే ఎన్ను కోబడిన’ వారిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా మంచి కంటే ఎక్కువ హాని చేస్తారు. అలాంటివారితో ఉన్న స్నేహాన్ని ప్రద ర్శించుకోవడం కంటే, ముందు వాళ్లను తమ పనిలో తలమునకలు కానివ్వడం మంచిది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం.. భారత్‌కు అనుకూలం’
ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవటం దౌత్యపరంగా భారత్‌కు అనుకూలమని అమెరికాలో భారత మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుందని తెలిపారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత ప్రధాన నరేంద్ర మోదీపై తనకు అభిమానం ఉందని చెప్పడానికి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. మోదీని ట్రంప్ స్నేహితుడిగా, బలమైన నాయకుడిగా భావిస్తారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యక్తిగత దౌత్యం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుంది. పరిపాలన మార్పులు గతంలో విజయవంతంగా జరిగాయి. ప్రతీ ప్రభుత్వ పరిపాలన ద్వారా ఇరుదేశాల మధ్య మెరుగైన లౌకిక బంధాల్లో అభివృద్ధి చెందాయి....ఇరు దేశాల మధ్య దౌత్య వ్యవహారాల విషయంలో ఎవరు (ట్రంప్ లేదా కమలా హారిస్) అధ్యక్ష పదవి చేపడతారనే ఆందోళన భారత్‌కు ఉందని భావించటం లేదు. అయితే.. అధ్యక్షుడిగా జో బిడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలనపై భారత్ ప్రాధాన్యతనిచ్చే కొన్ని అంశాలు ఉన్నాయని భావిస్తున్నా. ఇక.. పరిపాలనలో మార్పు వచ్చిన ప్రతిసారీ కొన్ని అడ్డంకులు సాధారణంగానే ఉంటాయి. ...అమెరికా ఒక ప్రపంచ శక్తి.. ఇది ప్రపంచస్థాయి నిర్ణయాలతో పాలన కొనసాగింస్తుంది. కొన్నిసార్లు అమెరికా తీసుకునే నిర్ణయాలు.. ప్రపంచ స్థాయిలో పరోక్షంగా ప్రభావం చూపుతాయి. అయితే.. ట్రంప్ భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుంకాలు, వాణిజ్యం వంటి కొన్ని అంశాల్లో మార్పులను ప్రవేశపెడితే.. అది మనపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని తెలిపారు.చదవండి: Donald Trump: మళ్లీ హౌడీ.. అంటారా? -
ట్రంప్ గెలుపు.. స్పందించిన ఇరాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్.. కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంపై ఇరాన్ స్పందించింది. అమెరికా గతంలో పాటించిన తప్పుడు విధానాలను సమీక్షించే ఒక అవకాశంగా డొనాల్డ్ ట్రంప్ గెలుపును చూస్తామని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై మీడియాతో మాట్లాడారు. ‘‘ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అమెరికా అధ్యక్ష పదవీకాలంలో ఇరాన్‌పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అనుసరించారు. గతంలో అమెరికా ప్రభుత్వాల విధానాలు మాకు చాలా చేదు అనుభవాలు మిగిల్చాయి. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం.. గత ప్రభుత్వాల తప్పుడు విధానాలను సమీక్షించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం. ఆ విధానాలను సరిదిద్దే అవకాశం ఇప్పడు రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం’’ అని తెలిపారు.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్‌ను బుధవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించేందుకు ముందు ఇరాన్.. అమెరికా ఎన్నికలను అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. ‘‘యునైటెడ్ స్టేట్స్ , ఇరాన్ విధానాలు స్థిరంగా ఉన్నాయి.ఎవరు అమెరికాకు అధ్యక్షుడు అవుతారన్నది ముఖ్యం కాదు. ప్రజల జీవనోపాధిలో ఎలాంటి మార్పు రాకుండా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం’’ అని ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ అన్నారు.ఇక.. ఇరాన్, అమెరికా 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ప్రత్యర్థులుగా మారాయి. ఇరుదేశాల మధ్య 2017 నుంచి 2021 వరకు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ట్రంప్ ఏకపక్షంగా 2015 ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా.. బాగ్దాద్ విమానాశ్రయంపై వైమానిక దాడి చేసి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్ ఖాసేమ్ సులేమానిని హతమార్చింది. చదవండి: అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్ -
ట్రంప్‌నకు మద్దతు.. మస్క్ కంపెనీలు ఎంత పెరిగాయంటే..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాన్‌మస్క్ తన విజయానికి ఎంతో కృషి చేసినట్లు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ గెలుపు ఖాయం అని నిర్ధారించుకున్న మార్కెట్లు గడిచిన రెండు సెషన్ల నుంచి భారీగా పెరుగుతున్నాయి. అనుకున్న విధంగానే ఆయన గెలుపు ఖరారైంది. దాంతో మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీల స్టాక్ విలువ భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు సెషన్‌ల్లో దాదాపు రూ.రెండు లక్షల కోట్లు మేర వీటి విలువ పెరిగినట్లు మార్కెట్ అంచనా వేస్తుంది.ప్రభుత్వ ఏజెన్సీల సడలింపులుమస్క్ కంపెనీల్లోకెల్లా ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్‌కు ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని ఆయా కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు ఇవే..టెస్లాస్పేస్ఎక్స్న్యూరాలింక్ది బోరింగ్ కంపెనీఎక్స్ కార్పొరేషన్జిప్ 2పేపాల్స్టార్లింక్ఎక్స్ ఏఐ -
అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్లో సందడి చేస్తున్నాయిఅధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్‌ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024 -
ట్రంప్ మా నాన్న.. తెరపైకి పాక్ యువతి
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది. అయితే ఈ వీడియో ప్రామాణికతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషువాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని తెలిపింది. తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె పేర్కొంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో @pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. Does @realDonaldTrump know he has children in Pakistan who speak Urdu & English in Punjabi? pic.twitter.com/anhRKbiLGo— Pakistan Untold (@pakistan_untold) November 6, 2024ఇది కూడా చదవండి: ‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో.. -
‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అమోఘ విజయం సాధించారు. యావత్ ప్రపంచం దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే కేంద్రీకృతమైన నేపధ్యంలో.. ట్రంప్ విజయం తరువాత అన్ని దేశాలు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నాయి. అలాగే ప్రపంచంలోని పలు వార్తా పత్రికలు ట్రంప్ విజయాన్ని పతాక శీర్షికన ప్రచురించాయి. ‘డాన్ తిరిగొచ్చాడు’ అంటూ ఒక వార్తా పత్రిక పతాక శీర్షికన ట్రంప్ పునరాగమనాన్ని స్వాగతించింది. డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ప్రపంచమంతా ఆయన పునరాగమనానికి శుభాకాంక్షలు చెబుతోంది.అన్ని దేశాల్లోని వార్తాపత్రికల మొదటి పేజీల్లోనూ డొనాల్డ్ ట్రంప్ విజయం పతాక శీర్షికన నిలిచింది.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు.హనోయిలో వియత్నామీస్ వార్తాపత్రికలోనూ డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందనలను ప్రచురించారు.మెల్బోర్న్ వార్తాపత్రికల మొదటి పేజీలోనూ నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయంపై వార్త ప్రచురించారు.డొనాల్డ్ ట్రంప్ భారతీయ వార్తాపత్రికల మొదటి పేజీలలో చోటు దక్కించుకున్నారు.డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయానికి ప్రతిస్పందనలు వార్తాపత్రికలలో ప్రచురితమయ్యాయి.కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్నా, అమెరికా ప్రజలు మరోసారి ట్రంప్‌కు పట్టంకట్టారు.అమెరికాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ మాయాజాలం ఫలించింది.ట్రంప్ చారిత్రాత్మక పునరాగమనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వీక్షించారు. ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు -
అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి తర్వాత, ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అభిమానులు కొందరు వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు.ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించేందుకు ఆమె మద్దతుదారులు ఎంతో కృషి చేశారు.కొన్ని సందర్భాలలో కమలా మద్దతుదారులు ఎంతో దూకుడుగా కనిపించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక సీన్ మారిపోయింది.కమలా హారిస్ కోసం సోషల్ మీడియా మొదలుకొని వీధులలో ప్రచారం సాగించిన ఆమె అభిమానులు ఫలితాలు వెలువడ్డాక తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు.అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కమలా హారిస్ వాషింగ్టన్లో ప్రసంగించారు. మీరు నాపై చూపిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు.ఎన్నికల్లో ఓడిపోయినా మన లక్ష్య సాధన కోసం పోరాటం కొనసాగుతుందని కూడా కమలా హారిస్ అన్నారు.ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను ఓడించారు. నాలుగేళ్ల క్రితం డెమొక్రాట్ల చేతిలో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.వాషింగ్టన్లో కమలా హారిస్ ప్రసంగిస్తున్నప్పుడు, ఆమె మద్దతుదారులు విచార వదనాలతో కనిపించారు.తమ నేత దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని కమలా హారిస్ మద్దతుదారులు భావించారు. అయితే వారి ఆశలు అడియాసలుగా మిగిలాయి. ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ -
ట్రంప్ విజయంపై కమలా హారిస్, జోబైడెన్ తొలి స్పందన..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించారు.డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ప్రెసిడెంట్ జో బైడెన్ల తొలి ప్రకటనలు మీడియాకు అందాయి. దానిలో కమలా హారిస్.. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితం మనం కోరుకున్నది కాదని అమె అన్నారు. మనం నిరంతరం పోరాడుతూనే ఉందాం. ఈ ఎన్నికల ఫలితాలను మనం అంగీకరించాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తాను కలుసుకుని, అభినందనలు తెలిపానని కమలా హారిస్ పేర్కొన్నారు.అధికార మార్పిడిలో ట్రంప్‌కు, ఆయన బృందానికి సహకరిస్తామని, ఇదంతా శాంతియుతంగా జరిగేలా చూస్తామని కమలా హారిస్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఒక ప్రకటనలో కమలా హారిస్ చిత్తశుద్ధి మెచ్చుకోదగినదని అన్నారు. ఆమె అమెరికన్లకు ఛాంపియన్‌గా కొనసాగుతారన్నారు. జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. కాగా ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ అభినందనలను అందుకున్నారని, త్వరలోనే బైడెన్‌ను కలుసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు.ఇది కూడా చదవండి: USA Presidential Election Results 2024: మహిళలకు మళ్లీ మొండిచెయ్యే -
ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్‌నకు అక్కడి ప్రజలు పట్టంకట్టారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. దాంతో అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు కొంత నిరాశ చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత హయాంలో మాదిరిగానే ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనలు సహజంగా వ్యక్తమవుతున్నాయి. 80 శాతం పైగా భారత్ ఐటీ సర్వీసుల ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. హెచ్1బీ/ఎల్1 వీసాలపై(యూఎస్ కంపెనీలు విదేశీయులకు అందించే వీసాలు) ట్రంప్ తొలిసారి అధికారం వచ్చిన వెంటనే నిబంధనలను కఠినతరం చేయడం తెలిసిందే.వీసా పరిమితులు?గతంలో ట్రంప్ హయాంలో విదేశీ ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో అమెరికన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో పాటు వీసాల జారీపైనా పరిమితులు విధించారు. దీంతో అప్పట్లో ఐటీ కంపెనీలు వ్యయ భారాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావంతో వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు విదేశీ సెంటర్లలో స్థానిక నిపుణులకే పెద్దపీట వేశాయి. 2016–17లో అమెరికాలో భారతీయ ఐటీ సంస్థల ఉద్యోగుల్లో మూడింట రెండొంతులు హెచ్1బీ/ఎల్1 వీసాల ద్వారానే నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు..ఐటీ అగ్ర త్రయం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్1బీ వీసాలు గత పదేళ్లలో 50–80% తగ్గిపోయినట్లు అంచనా. ట్రంప్ నియంత్రణల తర్వాత ఇది జోరందుకుంది. 2019–20లో ఇన్ఫీ గ్లోబల్ సిబ్బంది 65 శాతానికి, విప్రోలో 69 శాతానికి ఎగబాకినట్లు బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 హయాంలో మళ్లీ వీసా పరిమితులు, కఠిన నిబంధనలు విధించినప్పటికీ.. పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు దేశీయ కార్యకలాపాలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 21% నుంచి 15%కి తగ్గిస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలు కూడా భారత్ ఐటీ కంపెనీలకు సానుకూలాంశమని విశ్లేషకులు చెబుతున్నారు. వీసా నియంత్రణలు ఉన్నప్పటికీ ట్రంప్ తొలి విడతలో దేశీ ఐటీ షేర్లు పుంజుకోవడం విశేషం. టీసీఎస్ 185 శాతం, ఇన్ఫోసిస్ 174 శాతం, విప్రో 140 శాతం చొప్పున ఎగబాకాయి. -
ట్రంప్‌తో ఫోన్లో సంభాషించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. దీనిని ప్రధాని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు.తన స్నేహితుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో తాను సంభాషించానని ప్రధాని మోదీ దానిలో రాశారు. అద్భుత విజయం సాధించినందుకు ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం తదితర రంగాలలో భారతదేశం-యూఎస్ఏ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మరోసారి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Had a great conversation with my friend, President @realDonaldTrump, congratulating him on his spectacular victory. Looking forward to working closely together once again to further strengthen India-US relations across technology, defence, energy, space and several other sectors.— Narendra Modi (@narendramodi) November 6, 2024దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా వేదికగా ట్రంప్ సాధించిన చారిత్రాత్మక విజయానికి అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. ట్రంప్‌ను విజేతగా ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ‘ చారిత్రాత్మక విజయం సాధించిన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాలను ముందుకు తీసుకెళ్లబోతున్నారు. భారత్- యూఎస్ఏల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, పరస్పర సహకార పునరుద్ధరణకు ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కలసి పని చేద్దాం’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనం.. ఇప్పటికే 294 ఎలక్టోరల్ ఓట్లు కైవసం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
US Elections 2024: సంతకం రాక.. ఓట్లు చెల్లక
వాషింగ్టన్: మనకు ఒక కచ్చి తమైన సంతకం అంటూ లేకపోతే ఎంత నష్టమో అమెరికా ఎన్నికలను చూసి తెలుసుకోవచ్చు. పోస్టు ద్వారా వచ్చి న చాలా ఓట్లు సంతకంలో తేడాల వల్ల చెల్లకుండాపోయా యి. సంతకం చేయడం రాకపోవడంతో ఓటు వేసి నా అవి చెల్లలేదు. ప్రధానంగా యువ ఓటర్ల విషయంలో ఈ సమస్య ఎదురైంది. ఓటు–బై–మెయిల్ బ్యాలెట్‌లోని సంతకం, ఓటర్ రికార్డులోని సంత కం ఒకేలా ఉండాలి. ఎన్నికల అధికారులు రెండింటినీ సరిపోల్చుతారు. ధ్రువీకరణ తర్వాతే ఆ ఓటు ను లెక్కిస్తారు. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిస్తే సదరు ఓటరుకు సమాచారం ఇస్తారు. సంతకాన్ని సరిచేసుకొనే అవకాశం కల్పిస్తారు. ఓటర్లు స్పందించపోవడంతో ఈసారి పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లలేదు. నెవడా రాష్ట్రంలోని క్లార్క్ కౌంటీలో 11,300, వాషో కౌంటీలో 1,800 ఓట్ల విషయంలో సంతకాలను మళ్లీ సరిదిద్దాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి ఫ్రాన్సిస్కో అగిలార్ చెప్పారు. నేటి టెక్నా లజీ యుగంలో చేతితో రాయడం పెద్దగా అవసరం పడట్లేదు. అన్నీ కంప్యూటర్, ఫోన్లోనే టైప్ చేస్తున్నారు. సాధారణంగా సంతకాలను వంపు తిరిగిన అక్షరాల్లో(కర్సివ్) చేస్తారు. అమెరికా పాఠశాలల్లో ఇటీవలి కాలంలో కర్సివ్ చేతిరాత నేరి్పంచడం లేదు. దాంతో పిల్లలకు సంతకాలు చేయడం రావడం లేదని నిపుణులు అంటున్నారు. -
7 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కుల విజయం
వాషింగ్టన్: అబార్షన్ హక్కులు ఏడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. అత్యంత నిర్బంధ గర్భస్రావం నిషేధాన్ని రద్దు చేయడానికి మిస్సోరి ఓటర్లు మార్గం సుగమం చేశారు. అరిజోనా, కొలరాడో, మేరీల్యాండ్, మోంటానాలో అబార్షన్ హక్కుల సవరణలు కూడా ఆమోదం పొందాయి. నెవాడా ఓటర్లు ఒక సవరణను ఆమోదించారు. అది అమల్లోకి రావాలంటే వారు దానిని 2026లో మళ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాల ఓటర్లు మాత్రం రాజ్యాంగ సవరణపై విముఖత వ్యక్తం చేశారు. అబార్షన్ నిషేధాన్ని రద్దు చేసిన రో వర్సెస్ వేడ్ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న చాలా రాష్ట్రాల్లో నిషేధాలు అమల్లోకి రావడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం 13 రాష్ట్రాలు కొన్ని మినహాయింపులతో గర్భధారణ అన్ని దశలలో నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆరు వారాలు, మరికొన్ని నాలుగు వారాల తరువాత గర్భస్రావాన్ని నిషేధించాయి. అబార్షన్ రాష్ట్రాలకు వదిలేయాల్సిన అంశమని రిపబ్లికన్ అభ్యరి్థగా పదేపదే చెప్పిన ట్రంప్... ఇప్పుడు అధ్యక్షుడిగా కార్యనిర్వాహక చర్య ద్వారా అబార్షన్ హక్కులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిషేధాన్ని ఎత్తేసిన మిస్సోరీ.. ఏ దశలోనైనా గర్భస్రావానికి హక్కును కలి్పస్తూ, అబార్షన్‌పై నిషేధాన్ని ఎత్తివేసే మొదటి రాష్ట్రంగా మిస్సోరి నిలిచింది. గర్భస్రావం, జనన నియంత్రణ, గర్భధారణ చుట్టూ నిర్ణయాలు వ్యక్తిగతమైనవని, వాటిని రాజకీయాలు కాకుండా వ్యక్తులకే వదిలేయాలనే హక్కులకు ఓటేసి మిస్సోరియన్లు చరిత్రను సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో ఆంక్షలుఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాలు అబార్షన్‌పై నిషేధాన్ని సమరి్ధంచాయి. అబార్షన్ వ్యతిరేకులు బ్యాలెట్ పద్ధతిలో విజయం సాధించారు. ఫలితంగా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిశాంటిస్‌కు రాజకీయ విజయం లభించింది. ఈ ఫలితం ఫ్లోరిడాలో, మొత్తం దేశానికి ఒక ముఖ్యమైన విజయమని జాతీయ గర్భస్రావ వ్యతిరేక గ్రూపు ఎస్బీఏ ప్రో–లైఫ్ అమెరికా అధ్యక్షుడు మార్జోరీ డాన్నెన్ఫెల్సెర్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు మినహా గర్భస్రావంపై నిషేధం ఉన్న మరో రాష్ట్రమైన సౌత్ డకోటా సైతం అబార్షన్ హక్కులకు వ్యతిరేకంగా ఓటేసింది. అబార్షన్ హక్కులను కల్పించే రాజ్యాంగ సవరణను నెబ్రాస్కా ఓటర్లు తిరస్కరించారు. ఆమోదం తెలిపిన ఏడు రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలు అబార్షన్ హక్కుల చట్ట సవరణకు ఆమోదం తెలిపాయి. గర్భం దాలి్చన మొదటి 15 వారాల తర్వాత అబార్షన్‌ను నిషేధించే ప్రస్తుత చట్టాన్ని సవరణకు అరిజోనా ఆమోదం తెలిపింది. గర్భస్రావ హక్కులను ఇప్పటికే అనుమతించిన మేరీలాండ్‌లో ఈ ఫలితాలు పెద్ద తేడాను చూపవు. మిస్సోరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ గర్భస్రావం ఇప్పటికే చట్టబద్ధమైనది. కొలరాడోలో 55% ఓటర్లు అబార్షన్ హక్కులకు మద్దతును ప్రకటించారు. గర్భస్రావం కోసం రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను ఉపయోగించడాన్ని నిషేధించిన గత సవరణను కూడా ఇది రద్దు చేయనుంది. స్టేట్ మెడికేడ్, ప్రభుత్వ ఉద్యోగుల భీమా పథకాలు గర్భస్రావాన్ని కవర్ చేసే అవకాశాన్ని కూడా ఇది కలి్పంచనుంది. న్యూయార్క్ సమాన హక్కుల చట్టం కూడా ఆమోదం పొందింది. ఇందులో ‘గర్భస్రావం’అనే పదం లేకపోయినా.. గర్భధారణ ఫలితాలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, స్వయంప్రతిపత్తి ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది న్యూయార్క్ వాసులందరికీ గొప్ప విజయమని ఈక్వల్ రైట్స్ క్యాంపెయిన్ డైరెక్టర్ సాషా అహుజా ప్రకటించారు. -
మహిళలకు మళ్లీ మొండిచెయ్యే
అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారన్న అంచనాలు తారుమారయ్యాయి. 2016 తర్వాత మరోసారి ఓ మహిళకు అత్యున్నత పీఠం త్రుటిలో చేజారింది. హారిస్ మాదిరిగానే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కూడా హోరీహోరీ తలపడ్డారు. అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన తొలి మహిళగా నిలిచారు. హిల్లరీ కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫునే పోటీ చేయడం విశేషం. అప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే. ఆయనతో డిబేట్లలో హిల్లరీ తడబడ్డా ఆద్యంతం గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించారు. అంతేగాక ఆ ఎన్నికల్లో పాపులర్ ఓట్ కూడా సాధించారు. అంటే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఆమెకే ఎక్కువ పడ్డాయి. ట్రంప్ కంటే హిల్లరీ ఏకంగా 28 లక్షల పై చిలుకు అధిక ఓట్లు సాధించారు. కానీ ఎలక్టోరల్ కాలేజీ విధానం వల్ల ట్రంప్ చేతిలో 76 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో డెమొక్రాట్ల రాష్ట్రాలుగా పేరుబడ్డ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటమి కూడా హిల్లరీ కొంప ముంచింది. హిల్లరీ 2008లో కూడా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం విఫలయత్నం చేశారు. భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న 1993–2001 మధ్య కాలంలో ఆమె ఫస్ట్ లేడీగా వ్యవహరించారు. ఆమెకు ముందు 1968లోనే చార్లెన్ మిషెల్ అనే మహిళ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచిపోయారు. మిషెల్ పేరు కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్యాలెట్ పత్రాలపై చోటుచేసుకుంది. 150 ఏళ్ల క్రితమే తొలి పోటీ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఉదంతం 150 ఏళ్ల క్రితమే చోటుచేసుకుంది. ఆమె పేరు విక్టోరియా వుడ్హల్. 1872లో ఈక్వల్ రైట్స్ పార్టీ తరఫున ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మహిళలకు పురుషులతో సమాన హక్కుల కోసం ఉద్యమించిన నేతగా వుడ్హల్కు పేరుంది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కే ఉండని రోజుల్లో ఆమె ఏకంగా అధ్యక్ష పదవికే పోటీపడటం సంచలనంగా నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. కానీ పోటీ చేసేనాటికి వుడ్హల్కు 33 ఏళ్లు మాత్రమే. ఎన్నికల్లో ఆమె ఒక్క ఎలక్టోరల్ ఓటు కూడా సాధించలేకపోయారు. తర్వాత 1884, 1888ల్లో బెల్వా ఆన్ లాక్వుడ్ అనే మహిళను ఈక్వల్ రైట్స్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దింపింది. తర్వాత చాలాకాలానికి 1964లో మార్గరెట్ చేజ్ స్మిత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీ పడ్డారు. తద్వారా ఒక ప్రధాన పార్టీ అభ్యరి్థత్వ రేసులో దిగిన తొలి మహిళగా నిలిచారు. 1972లో షిర్లీ చిషోమ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం ప్రయత్నించారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలిచిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు. ఇక ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ తొలి మహిళగా గెరాల్డిన్ ఫెరారో. ఆమె 1984లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాల్టర్ మాండలేకు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. 2004లో సారా పాలిన్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. ఆమె జాన్ మెక్కెయిన్కు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. గత 30 ఏళ్లుగా పలు చిన్న పార్టీల తరఫున కూడా ఎందరో మహిళలు అధ్యక్ష రేసులో నిలిచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టారిఫ్ వార్ 2.0!
‘చైనా, బ్రెజిల్, భారత్... అమెరికాపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులపై చైనా కంటే భారీగా భారత్ సుంకాలను విధిస్తోంది. ‘టారిఫ్ కింగ్’గా మారింది. నేను తిరిగి అధికారంలోకి వస్తే టిట్–ఫర్–టాట్ సుంకాలతో బదులు తీర్చుకుంటాం. అమెరికాను మళ్లీ అత్యంత సంపన్న దేశంగా మార్చాలంటే ప్రతీకార టారిఫ్‌లే మందు’. గతేడాది అక్టోబర్‌లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. అనుకున్నట్లే బంపర్ విక్టరీతో మళ్లీ అగ్రరాజ్యాధిపతిగా శ్వేత సౌధంలో కొలువుదీరనున్నారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాతో భారత్ సహా చాలా దేశాలకు టారిఫ్ వార్ గుబులు పట్టుకుంది. ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’ నినాదం గనుక అమల్లోకి వస్తే... ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫార్మా వంటి కొన్ని కీలక రంగాల్లో ఎగుమతులపై అధిక కస్టమ్స్ సుంకాలకు దారితీసే అవకాశం ఉందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. చైనాతో పాటు భారత్, మరికొన్ని దేశాలపై సుంకాల పెంపు ద్వారా ట్రంప్ 2.0లో మలివిడత టారిఫ్ వార్‌కు ట్రంప్ తెరతీయవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘ట్రంప్ రెండో విడత అధికారంలో అమెరికా ఫస్ట్ నినాదానికి అనుగుణంగానే భారత్ ఉత్పత్తులపై రక్షణాత్మక చర్యలు, ప్రతీకార సుంకాలు విధింవచ్చు. ఈ జాబితాలో వాహన రంగం, వైన్స్, టెక్స్టైల్స్, ఫార్మా, స్టీల్ వంటి కీలక రంగాల్లో అడ్డంకులకు ఆస్కారం ఉంది. దీనివల్ల ఆయా పరిశ్రమల ఆదాయాల్లో కోత పడుతుంది’ అని శ్రీవాస్తవ చెప్పారు. అయితే, మనతో పోలిస్తే చైనాపై టారిఫ్ వార్ తీవ్రంగా ఉంటే గనుక, అది భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కలి్పస్తుందన్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి... భారత వస్తు, సేవలకు సంబంధించి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో 190 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే, అమెరికా మూడో అతిపెద్ద ఇన్వెస్టర్. 2000 నుంచి 2024 మధ్య 66.7 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారత్ అందుకుంది! కాగా, ఇంజనీరింగ్ గూడ్స్, స్టీల్ వంటి అత్యధిక ఎగుమతి ఆదాయ రంగాలపై అమెరికా భారీగా టారిఫ్‌లు విధిస్తే, ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఐఐ జాతీయ ఎగ్జిమ్ కమిటీ కో–చైర్మన్ సంజయ్ బుధియా పేర్కొన్నారు. ట్రంప్ గత హయాంలో స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 10–25 % అదనపు సుంకాలు విధించడంతో, భారత్ 28 ఉత్పత్తులపై ప్రతీకార టారిఫ్‌లతో బదులిచ్చింది. ఇవే కాకుండా డెయిరీ ఉత్పత్తులు (188%), పండ్లు–కూరగాయలు (132%), నూనె గింజలు, ఫ్యాట్స్, ఆయిల్స్ (164 శాతం), బేవరేజెస్–పొగాకు (150%)పై కూడా అమెరికా అధిక టారిఫ్‌లతో విరుచుకుపడింది.వస్తు ఎగుమతి–దిగుమతులు (బి. డాలర్లలో) వాణిజ్య వివాదాలు పెరగవచ్చు... ట్రంప్ 2.0 హయాంలో వాణిజ్య పరంగా కష్టాలకు ఆస్కారం ఉంది. అధిక టారిఫ్‌ల కారణంగా వాణిజ్య వివాదాలు పెరగవచ్చు. గతంలో మాదిరిగా రక్షణాత్మక విధానం, కఠిన వలస నిబంధనల ట్రెండ్ కొనసాగుతుంది. – అజయ్ సహాయ్, భారత ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ టెక్ బంధాన్ని బలోపేతం చేసుకుందాం... ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య నెలకొన్న అద్భుతమైన టెక్నాలజీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రభుత్వంతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యంలో టెక్నాలజీ రంగం ‘వెన్నెముక’గా నిలుస్తోంది. – సింధు, గంగాధరన్, నాస్కామ్ చైర్పర్సన్ఎగుమతులకు కొత్త మార్కెట్లు.... ట్రంప్ 2.0 హయాంలో చైనా, కొన్ని యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు, దిగుమతి నియంత్రణలకు ఆస్కారం ఉంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరుచుకుంటాయి. ట్రంప్ భారత్‌ను ట్రంప్ మిత్ర దేశంగానే పరిగణిస్తారు. దీనివల్ల యూఎస్ కంపెనీల పెట్టుబడులు పెరుగుతాయి. ట్రంప్ విజయం భారత్‌కు సానుకూలాంశమే. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ -
మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. మిత్రుడంటూనే..2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సంబంధాలు..గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.వీసా విధానం..ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!! -
Donald Trump: ట్రంప్ రికార్డులు.. చరిత్రలో అతిపెద్ద పునరాగమనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. 132 ఏళ్ల అనంతరం మధ్యలో ఒక విరామం తర్వాత రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించారు. సంచలనాలు, వివాదాలకు మారుపేరైన ట్రంప్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. వ్యాపారం, స్థిరాస్తి, మీడియా రంగాల్లో తన ప్రతిభాపాటవాలతో రాణించారు. వ్యాపార కుటుంబంలో జన్మించిన ట్రంప్ విలక్షణ నాయకుడిగా పేరుపొందారు. రాజకీయ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అమెరికా రాజకీయాలపై తనదైన ముద్ర వేయడం విశేషం. 1982లోనే ఫోర్బ్స్ జాబితాలోకి.. ట్రంప్ అసలు పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. 1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రు లు ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నే మెక్లి యోడ్ ట్రంప్. మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో సంతానం. ఫ్రెడ్ ట్రంప్ అమెరికాలో విజయవంతమైన రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. డొనాల్డ్ ట్రంప్ బాల్యం న్యూయార్క్‌లోనే గడిచింది. న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చదువు కున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్య అభ్యసించారు. 1968లో కామర్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. కాలేజీలో చదువు పూర్తయ్యాక ట్రంప్ 1971లో తన తండ్రి వ్యాపార సంస్థలోకి అడుగుపెట్టారు. తమ సంస్థను ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా పేరుమార్చారు. ట్రంప్ గ్రూప్‌నకు సంబంధించిన హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులను మరింత విస్తరింపజేశారు. తన పేరిట కొన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అనతికాలంలోనే ట్రంప్ బ్రాండ్‌కు మంచి పేరొచ్చింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా డొనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగిపోయింది. 200 మిలియన్ డాలర్ల సంపదతో 1982లో తొలిసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరారు. 2023లో ఆ సంపద విలువ 631 మిలియన్ డాలర్లతో సమానం. 2004లో ప్రారంభమైన అప్రెంటీస్ అనే టీవీ రియాలిటీ షోను ట్రంప్ స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇంటింటా అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. 14కుపైగా పుస్తకాలు రాశారు. 1987లో విడుదలైన ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం విపరీతమైన పాఠకాదరణ పొందింది. నెరవేరిన స్వప్నం డొనాల్డ్ ట్రంప్‌కు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. 1980వ దశకంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. రిపబ్లిన్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు కావాలన్నది ట్రంప్ కల. అందుకోసం ఎంతగానో శ్రమించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు. మొదట్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో కృషిచేశారు. 2015 జూన్ 16న రిపబ్లిన్ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా తెరపైకి వచ్చింది. ప్రైమరీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను వెనక్కి నెట్టి, ఎట్టకేలకు 2016 జూలైలో అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలిచారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన పేరు అధికారికంగా ఖరారైంది. 2016 నవంబర్ 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సంచలన విజయం సాధించారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించారు. రష్యా ప్రభుత్వం ఆయన విజయానికి సహకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20వ తేదీ దాకా అగ్రరాజ్యానికి 45వ అధ్యక్షుడిగా సేవలందించారు. పన్ను సంస్కరణలు, వలస విధానం, విదేశీ వ్యవహారాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కొన్ని కీలకమైన పన్నులను తగ్గించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగేళ్ల పాలనలో యుద్ధాలకు దూరంగా ఉన్నారు. కానీ, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. శత్రుదేశంగా భావించే ఉత్తర కొరియాలో కాలుమోపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా(పదవిలో ఉండగానే) ట్రంప్ చరిత్రకెక్కారు. వలసలపై కొంత కఠినంగానే వ్యవహరించారు. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు సైనిక నిధులను మళ్లించారు. తన పదవీ కాలంలో ముగ్గురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. ట్రంప్ పాలనలోనే కోవిడ్–19 మహమ్మారి వచ్చిపడింది. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ట్రంప్ తీవ్ర అలసత్వం వహించారన్న ఆరోపణలు వచ్చాయి. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ, అణ్వాయుధాల నియంత్రణ దిశగా ఆయనను ఓప్పించలేకపోయారు. ట్రంప్ వేగంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. అదే ఆయనను బలమైన నాయకుడిగా మార్చింది. రెండు సార్లు అభిశంసన అధ్యక్షుడిగా ట్రంప్ పాలనాకాలం పలు వివాదాలతో గడిచింది. శృంగార తార స్మార్మీ డేనియల్స్‌కు చెల్లించిన సొమ్మును రికార్డుల్లో చూపించకుండా వాటిని తారుమారు చేసిన ‘హష్ మనీ’ కేసులో న్యూయార్క్ కోర్టు ఈ ఏడాది మే నెలలో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఒక నేరంలో అమెరికా అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ట్రంప్‌కు ఇంకా శిక్ష విధించలేదు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు(ఇంపీచ్మెంట్) గురయ్యారు. ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2019 డిసెంబర్లో అభిశంసనను ఎదుర్కొన్నారు. తన మద్దతుదారులతో క్యాపిటల్ భవనం వద్ద ఘర్షణను ప్రేరేపించినట్లు విమర్శలు వెల్లువెత్తడంతో 2021 జనవరిలో మరోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అపకీర్తి పొందారు. అయితే, కాంగ్రెస్‌లో ఎగువ సభ అయిన సెనేట్ మాత్రం ఈ రెండు సందర్భాల్లో ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రభావం చెక్కుచెదరలేదు. అందుకే అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేయగలిగారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడిగానూ ట్రంప్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవడం కావడం విశేషం. కేసులు, విచారణలతో ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోట్లో నానింది. 3 వివాహాలు.. ఐదుగురు సంతానం 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కుటుంబం పెద్దదే. మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత చెక్ రిపబ్లిక్కు చెందిన మోడల్ ఇవానాను పెళ్లాడారు. 1977 నుంచి 1990 దాకా ఆమెతో కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సినీ నటి మార్లా మాపిల్స్‌ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 1999 దాకా వారి బంధం కొనసాగింది. విడాకులతో వేరయ్యారు. 2005లో స్లొవేనియా మోడల్ మెలాని యాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇరువురూ కలిసే ఉంటున్నారు. ట్రంప్‌కు ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు. మొదటి భార్య ఇవానాతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంక, ఎరిక్, రెండో భార్య మార్లాతో టిఫానీ జన్మించారు. మూడో భార్య మెలానియాతో బారోన్ ట్రంప్ జన్మించాడు. మద్యం, సిగరెట్, డ్రగ్స్ తీసుకోవడం తనకు అలవాటు లేదని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు. గోల్ఫ్ ఆయనకు ఇష్టమైన క్రీడ. అదే ఆయన వ్యాయామం కూడా. ఇతర వ్యాయామాలేవీ చేయరు. నడక(వాకింగ్) కూడా పెద్దగా ఇష్టపడరు. మానవ శరీరం ఒక బ్యాటరీ లాంటిదని, అందులో సహజంగానే మనిషికి కావాల్సిన శక్తి ఉంటుందని, వ్యాయామాలతో ఆ శక్తి హరించుకుపోతుందని ట్రంప్ నమ్ముతారు. ట్రంప్ రికార్డులు→ ట్రంప్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఒక విరామం తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా జరగడం గత 132 ఏళ్లలో ఇదే తొలిసారి. గ్రోవర్ క్లీవ్‌లాండ్ తర్వాత ఈ రికార్డు ట్రంప్ సొంతమైంది. క్లీవ్‌లాండ్ 1885 నుంచి 1889 దాకా 22వ అధ్యక్షుడిగా, 1893 నుంచి 1897 దాకా 24వ అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ 2017 నుంచి 2021 వరకు ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించారు. మధ్యలో ఒక విరామంతో 2025 నుంచి 2029 దాకా మరో సారి అధ్యక్షుడిగా పని చేయబోతున్నారు. → 78 ఏళ్ల వయసులో ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నిక ల్లో గెలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అత్యంత వృద్ధుడు ట్రంప్. → గత 20 సంవత్సరాల్లో పాపులర్ ఓటుతో గెలిచిన మొదటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్చరిత్రలో అతిపెద్ద పునరాగమనం నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఆయన అభిమానులు రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం వద్ద వీరంగం సృష్టించారు. వారి నిరసన హింసాత్మకంగా మారింది. ఈ వ్యవహారం చివరకు ట్రంప్ మెడకు చుట్టుకుంది. 2020 నాటి ఎన్నికల్లో పరాజయంతో ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్లేనని అప్పట్లో రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు. పలు వివాదాల్లో ఇరుక్కుపోవడంతోపాటు హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్ ఇక ఎప్పటికీ రాజకీయ రంగంలో కనిపించే అవకాశం లేదని వాదించారు. వారి అభిప్రాయాలను ఫటాపంచలు చేస్తూ ట్రంప్ మరోసారి సమరోత్సాహంతో దూసుకొచ్చారు. 78 ఏళ్ల వయసులో అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి వైట్‌హౌస్‌లో కాలు పెట్టబోతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హారిస్.. ఐదు వైఫల్యాలు
1. ప్రభుత్వ వ్యతిరేకత–బైడెన్ అసమర్థతజో బైడెన్ నాలుగేళ్ల పాలనలో డెమొక్రాట్లపై అమెరికా అంతటా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత నెలకొంది. ఆర్థిక వ్యవస్థను అదుపు పెట్టడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారన్న అపప్రథను మూటగట్టుకున్నారు. అన్ని అంశాలపైనా ఆయన విధానాలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక బైడెన్ విదేశీ విధానం కూడా విమర్శలపాలైంది. ముఖ్యంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాలను నివారించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఇవన్నీ హారిస్‌కు ప్రతికూలంగానే మారాయి. విదేశీ విధానంపై ఆమె వాదన అమెరికన్లను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో ట్రంప్‌తో పోలిస్తే బాగా మెతక అన్న అభిప్రాయం ఆమెకు బాగా చేటు చేసింది. పలు కీలకాంశాలపై తన వైఖరి చెప్పకుండా దాటవేయడం కూడా ప్రతికూలంగా మారింది. నిజానికి హారిస్ ఆలస్యంగా బరిలో దిగినా శాయశక్తులా పోరాడి ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ అడుగడుగునా బైడెన్ వైఫల్యాల తాలూకు భారాన్ని మోయాల్సి రావడం హారిస్‌కు అతి పెద్ద ప్రతికూలాంశంగా పరిణమించింది. మెజారిటీ అమెరికన్లకు జీవన్మరణ సమస్యగా మారిన ఆర్థిక అవ్యవస్థను గాడిన పెట్టడానికి ఏం చేస్తానన్నది ఆమె సమర్థంగా వివరించలేకపోయారు. ఈ విషయంలో ఆమెకు మొదటినుంచీ పెద్దగా మార్కులు పడలేదు. దీనిపై ప్రతి సర్వేలోనూ ట్రంప్‌దే పైచేయిగా నిలిచింది. ఏకంగా మూడొంతుల మందికి పైగా ప్రభుత్వ విధానాలన్నీ అట్టర్ ఫ్లాప్ అని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలిగా ప్రభుత్వ విధానాల్లో నాలుగేళ్లుగా భాగస్వామి అయిన హారిస్ వాటితో గట్టిగా విభేదించలేకపోయారు. ఇది అంతిమంగా ఆమె కొంప ముంచింది.2. దన్నుగా నిలవని లాటిన్లు, ఇండియన్లులాటిన్, ఇండియన్ అమెరికన్లు సాంప్రదాయికంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా పేరుబడ్డారు. వారిపై హారిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిలో ఎక్కువమంది ఈసారి ట్రంప్‌కే ఓటేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. 2020లో ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌కు ఓటేసిన లాటిన్ అమెరికన్ల సంఖ్య 23 శాతం ఎక్కువని తేలింది. ఈసారి సీన్ రివర్సయింది. లాటిన్ అమెరికన్ల ఓట్లు హారిస్ కంటే ట్రంప్‌కు కనీసం 8 శాతం ఎక్కువగా పడ్డట్టు పోల్ పండితులు అంచనా వేస్తున్నారు! ఇండియన్ అమెరికన్లలో కూడా హారిస్‌కు నిరాశే ఎదురైంది. వారు కొన్నాళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ముఖ్యంగా యువతలో ట్రంప్‌ను సమర్థించే వారి సంఖ్య బాగా పెరిగింది. పురుషుల్లోనూ ఈ ధోరణి పెరిగినట్టు పలు సర్వేల్లో తేలింది. భారతీయ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్‌ను సమర్థించగా 47 శాతం ట్రంప్‌వైపు మొగ్గారు. కానీ మిగతా అమెరికన్ల మాదిరిగా ధరాభారం, ఉపాధి తదితరాలు భారత సంతతి వారిని కూడా ప్రభావితం చేసినట్టు కన్పిస్తోంది.3. యువ, స్వతంత్ర, తటస్థ ఓటర్ల మొండిచేయి2020లో బైడెన్‌కు ఓటేసిన వారితో పోలిస్తే అన్ని రకాల ఓటర్లలోనూ హారిస్‌కు మద్దతు తగ్గింది. కేవలం విద్యాధికులైన యువతుల్లో మాత్రమే ఆమె బైడెన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగారు. యువకులు మాత్రం ట్రంప్‌కే జైకొట్టారు. దాంతో మొత్తంగా 2020లో బైడెన్‌తో పోలిస్తే హారిస్‌కు యువత ఓట్లు తగ్గాయి. తటస్థులు, ఉదారవాదుల ఓట్లను కూడా ఆమె అనుకున్నంతగా సాధించలేకపోయారు. హారిస్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న అబార్షన్ హక్కుల అంశం కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ట్రంప్ నియంతృత్వ ధోరణులపై ఆందోళన వెలిబుచ్చడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణను ప్రధానాంశంగా పేర్కొన్న ఓటర్లు హారిస్‌కే భారీగా మద్దతిచ్చారు. కానీ అడ్వాంటేజీని పూర్వపక్షం చేస్తూ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ఆందోళనగా ఉన్నవారంతా ట్రంప్‌కే గుండుగుత్తగా ఓటేశారు.4. ఆదుకోని పట్టణ ప్రాంతాలుడెమొక్రాట్లకు దన్నుగా నిలుస్తూ వస్తున్న పట్టణ, శివారు ప్రాంతాల్లో కూడా ఈసారి ట్రెండ్ రివర్సయింది. వాటిలోనూ ట్రంప్ గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించినట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా స్పష్టత వచ్చిన పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ చోట్ల 2020లో బైడెన్ సాధించిన ఓట్లతో పోలిస్తే హారిస్ వెనకబడ్డారు. పైగా ఆ తేడా కనీసం ఒకట్రెండు పాయింట్లు, అంతకుమించి నమోదైంది. మిషిగన్ వంటి కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనైతే పట్టణ ప్రాంతాల్లో బైడెన్ సాధించిన 14 శాతం ఆధిక్యాన్ని హారిస్ నిలుపుకోలేకపోయారు. ఇది కూడా అంతిమ ఫలితాలపై గట్టి ప్రభావమే చూపింది.5. సోషల్ మీడియాఈసారి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తేల్చడంలో సోషల్ మీడియా కూడా కీలకంగా వ్యవహరించింది. అమెరికా మెయిన్‌స్ట్రీమ్ మీడియా దాదాపుగా హారిస్‌కే దన్నుగా నిలిచింది. కానీ దానికి అమెరికా ప్రజల్లో విశ్వసనీయత అడుగంటి చాలాకాలమైంది. వారు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాకు మళ్లుతున్నారు. ఈ మార్పును ఒడిసిపట్టుకున్న ట్రంప్ సోషల్ మీడియా ప్రచారంలో దూకుడు కనబరిచారు. ముఖ్యంగా ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ బాహాట మద్దతు ఆయనకు బాగా కలిసొచ్చింది. జో రోగన్ వంటి పాడ్కాస్టర్లు కూడా ట్రంప్‌కు విస్తృతమైన ప్రచారం కల్పించారు.అమెరికా జనాభాలో ఎవరెంత మంది?అమెరికా జనాభా 33 కోట్ల పైచిలుకుశ్వేతజాతీయులు 58.9 శాతంహిస్పానియన్లు 19.1 శాతంఆఫ్రో అమెరికన్లు 12.6 శాతంఆసియన్లు 6.1 శాతంమిగతా వారు 2.4 శాతంమూలవాసులు 0.7 శాతంఇతరులు 0.2 శాతంఓటేసేవారిలోశ్వేత జాతీయులు 73 శాతంఆఫ్రో 11 శాతంహిస్పానియన్లు 9 శాతంఆసియన్లు 2 శాతం -
విజయానికి ఐదు మెట్లు
పోరు హోరాహోరీ అంటూ విశ్లేషణలు. హారిస్‌దే పైచేయి అంటూ అమెరికా మీడియాలో కథనాల వెల్లువ. అందుకు తగ్గట్టు ట్రంప్‌తో ఏౖకైక డిబేట్లోనూ హారిస్ స్పష్టమైన ఆధిపత్యం. వీటికి తోడు ఆమె ఆఫ్రికన్, భారత మూలాలు. మహిళల దన్నుపై ధీమా. అబార్షన్ వంటి కీలకాంశాలు కలిసొస్తా యన్న అంచనాలు. సెలబ్రిటీల బహిరంగ మద్దతు. రిపబ్లికన్లతో పోలిస్తే ప్రచారానికి వరదలా వచ్చి పడ్డ నిధులు. కానీ తీరా చూస్తే ట్రంప్ హవా ముందు అన్నీ కొట్టుకుపో యాయి. హోరాహోరీ అనుకున్న పోటీ కాస్తా ఫలితాలొచ్చే సరికి ఏకపక్షంగా మారిపోయింది. ట్రంప్ విజయానికి, హారిస్ పరాజయానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే...1. అమెరికా ఫస్ట్2016లో ట్రంప్‌ను విజయతీరాలకు చేర్చిన ఈ నినాదం ఈసారి కూడా గట్టిగా పని చేసింది. ఉక్రెయిన్‌కు మద్దుతుగా బైడెన్ సర్కారు వందలాది కోట్ల డాలర్లను గుమ్మరించడం సగటు అమెరికన్లకు మింగుడు పడలేదు. దానికి తోడు చైనా తదితర దేశాల నుంచి కారుచౌకగా వచ్చిపడుతున్న వస్తూత్పత్తులు వారి పొట్టకొట్టడమే గాక ఉపాధికి కూడా ఎసరు పెడుతున్నాయి. అసలే ధరాభారంతో కుంగిపోతున్న అమెరికన్లకు ఈ పరిణామం కొన్నేళ్లుగా రోకటిపోటుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను ప్రాభవం కొడిగడుతున్న దేశంగా ట్రంప్ అభివర్ణించడాన్ని వారు సమర్థించారు. సుంకాలను భారీగా పెంచడం ద్వారా కారుచౌక దిగుమతులకు అడ్డుకట్ట వేస్తానన్న ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్థిక అవ్యవస్థ సహా అన్ని సమస్యలనూ చక్కదిద్దడానికి హారిస్‌తో పోలిస్తే ట్రంపే సరైన నేత అని మెజారిటీ ప్రజలు భావించారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదానికి విపరీతమైన స్పందన దక్కింది. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ అమెరికా ప్రాధాన్యాన్ని పునరుద్ధరిస్తానన్న వాగ్దానం శ్వేతజాతీయుల మనసు గెలుచుకుంది.2. అక్రమ వలసలువలసదారులు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారన్న ఆక్రోశం స్థానికుల్లో చాలా ఏళ్లుగా నెలకొని ఉంది. వారిలోని ఈ వ్యతిరేకతను ట్రంప్ పూర్తిస్థాయిలో సొమ్ముచేసుకోగలిగారు. బైడెన్ నాలుగేళ్ల పాలనలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో అక్రమ వలసలు జరిగాయి. వలసదారులు అమెరికన్ల పొట్టకొడుతు న్నారన్న ట్రంప్ వాదనతో వారు ఏకీభవించారు. వాటికి అడ్డుకట్ట వేయడమే గాక అక్రమంగా వచ్చిన 10 లక్షల పై చిలుకు మందిని స్వదేశాలకు పంపేస్తానని ప్రకటించడం ట్రంప్‌కు భారీగా లాభించింది.3.ఎకానమీఈసారి ట్రంప్‌ను గద్దెనెక్కించిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది. బైడెన్ పాలనలో గత నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం చుక్కలను తాకింది. నిత్యావసరాల ధరలు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు రెట్లకు పైగా పెరిగిపోయాయి. కరోనా తదితర సమస్యలూ దానికి కారణమైనా ఓటర్లు మాత్రం బైడెన్‌ను, ఆయన డెమొక్రటిక్ పార్టీనే దోషులుగా చూశారు. ట్రంప్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేదన్నది అమెరికన్లలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దే సామర్థ్యం విషయంలో ట్రంప్‌తో పోలిస్తే హారిస్ తేలిపోయారని అన్ని సర్వేల్లోనూ తేలింది.4. గ్రామీణ ఓటర్ల బ్రహ్మరథంతొలినుంచీ ట్రంప్‌కు గట్టి ఓటు బ్యాంకుగా నిలిచిన గ్రామీణ ఓటర్లు ఆయనకు ఈసారి మరింత దన్నుగా నిలిచారు. గత కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగినట్టు ఫలితాల సరళి చెబుతోంది. ఈ ట్రెండు దేశవ్యాప్తంగా కొనసాగడం ట్రంప్‌కు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే గ్రామీణ ఓట్లను ఆయన దాదాపుగా స్వీప్ చేశారు.మైనారిటీ ఓటర్లలోనూ పాగామెక్సికో తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తరాల కిందట వలస వచ్చి స్థిరపడ్డ స్పానిష్ మాట్లాడే వారిని హిస్పానియన్లుగా పిలుస్తారు. ఫలితాల్లో వీరి ఓట్లూ కీలకమే. డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లలో 12 శాతం దాకా ఉండే హిస్పానియన్లు కొన్నేళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ఆ ట్రెండ్ కూడా ఈసారి కూడా కొనసాగినట్టు కన్పిస్తోంది. దీనికి తోడు హిస్పానియన్లకు, ఇండియన్ అమెరికన్లకు దగ్గరయ్యేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పోలింగ్ సమీపించిన తరుణంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులను ఖండిస్తూ చేసిన ప్రకటన ఇండియన్ అమెరికన్లపై ప్రభావం చూపింది. 2020తో పోలిస్తే ట్రంప్‌కు ఈసారి లాటిన్, ఇండియన్ అమెరికన్ ఓట్లు గణనీయంగా పెరిగినట్టు దేశవ్యాప్తంగా 1.15 లక్షల ఓటర్లతో జరిపిన ఏపీ వోట్కాస్ట్ ప్రాథమిక సర్వే తేల్చింది. 2020లో బైడెన్‌కు ప్రతి 10 మంది లాటిన్ ఓటర్లలో 9 మంది ఓటేయగా ఈసారి హారిస్‌కు 8 మందే వేసినట్టు పేర్కొంది. 2020లో 60 శాతం పడ్డ హిస్పానియన్ ఓట్లు ఈసారి 50 శాతానికి తగ్గాయి. 30 ఏళ్ల లోపు ఓటర్లలో 2020లో బైడెన్‌కు 60 శాతం మంది ఓటేయగా ఈసారి అది 50 శాతానికి పరిమితమైంది. వారిలో 2020లో ట్రంప్‌కు మూడో వంతే ఓటేయగా ఈసారి అది 40 శాతానికి పెరిగింది. ఈ చిన్న మార్జిన్లే తుది ఫలితాలను గట్టిగా ప్రభావితం చేశాయి.5. భావజాలాలుపైకి కన్పించకపోయినా అమెరికా సమాజంలో జాత్యహంకారం, పురుషాధిక్య భావజాలం బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. ట్రంప్‌కు శ్వేతజాతీయులు మొదటినుంచీ గట్టి మద్దతుదారులుగా ఉండటానికి ఇది కూడా కారణమేనని చెబుతారు. అందుకే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ వంటి ట్రంప్ నినాదాల్లో అంతర్లీనంగా దాగున్న ఆ భావనలు ఓటర్లపై గట్టి ప్రభావమే చూపాయని భావిస్తున్నారు. వీటికి తోడు ట్రంప్‌పై కోర్టు కేసులు, క్రిమినల్ అభియోగాలను ప్రజలు పట్టించుకోకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది. పైగా ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఆ దూకుడేనని వారు భావించారు. దీన్ని ట్రంప్ కూడా అంగీకరించడం విశేషం. తనపై ఉన్న కేసులు, అభియోగాలు జనాదరణను మరింతగా పెంచాయని చెప్పుకొచ్చారాయన. -
ట్రంప్ అధ్యక్షుడైతే.. మరి కేసుల సంగతి!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు, అభియోగాలు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టు బయటే అరెస్ట్ కాగా.. మరో కేసులో కోర్టు దోషిగా తేల్చేసింది కూడా. మరి ఇప్పుడు ఆయన మరోసారి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న ఆయనకు.. ఈ కేసులు తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదా?.ఓ మాజీ శృంగార తారతో అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలారు. ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని న్యాయస్థానం నవంబర్ 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే, ఈ కేసును వాయిదా వేయాలని ట్రంప్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరే అవకాశం లేకపోలేదు. ఇక.. వాషింగ్టన్ డీసీ, ఫ్లోరిడాల్లో నమోదైన రెండు క్రిమినల్ కేసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, వీటిని కూడా విచారణ వాయిదా వేయించాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఎందుకంటే.. స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ట్రంప్‌కు ఏమాత్రం అనుకూలంగా లేరు. దీంతో విచారణ వాయిదా గ్యాప్ దొరికితే.. ఆయనపై వేటు వేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయాలు ఎవరో నిపుణులు చెప్పినవి కావు.. స్వయానా డొనాల్డ్ ట్రంప్ పలుఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పడం గమనార్హం. అంటే.. అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ తన సొంత ‘న్యాయ’ వ్యవస్థతో తనను తాను నిర్దోషిగా మార్చుకునే అవకాశం ఉందన్నమాట!. -
కమల యోధురాలు
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్‌ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు. స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్‌దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం. ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు. చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన -
ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. ట్రంప్‌నకు మద్దతుగా టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన సమయంలో పోస్ట్ చేసిన వీడియోను ఎడిట్ చేసి తిరిగి తాజాగా అమెరికా అధ్యక్ష ఫలితాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా పంచుకున్నారు.ఇలాన్‌మస్క్ 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసి కార్యాలయంలో ప్రవేశించే సమయంలో వినూత్నంగా సింక్‌ను చేతిలో పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను అప్పటి ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్(దాన్ని మునిగిపోనివ్వండి)’ అంటూ కామెంట్‌ను జోడించారు. అప్పటివరకు ప్రత్యర్థుల యాజమాన్యంలోని సంస్థను మస్క్ కొనుగోలు చేసిన నేపథ్యంలో తాను అలా కామెంట్ చేస్తూ సింక్‌తో ట్విటర్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?అమెరికా ఎన్నికలు పూర్తయి ట్రంప్ విజయం ఖారారైంది. ట్రంప్‌నకు మద్దతుగా నిలిచి దాదాపు 118 మిలియన్ డాలర్లు(రూ.984 కోట్లు) రిపబ్లికన్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠంపై కూర్చోబోతుండడంతో ఇప్పటివరకు పాలించిన ప్రత్యర్థులను ఉద్దేశించి తిరిగి మస్క్ వైట్‌హౌజ్‌ను తలిపించేలా సింక్‌తో ప్రవేశించిన ఫోటోను షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్’ అని కామెంట్ రాశారు. మస్క్ 2022లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)ను 44 బిలియన్ డాలర్ల(రూ.3.67 లక్షల కోట్లు)కు కొనుగోలు చేశారు. -
అమ్మా.. నీకు మాటిస్తున్నా..!
-
30 రాష్ట్రాల్లో ట్రంప్ ప్రభంజనం..
-
డొనాల్డ్ ట్రంప్ గెలుపు వెనుక ఎలాన్ మస్క్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో అపరకుబేరుడు ఎలాన్ మస్క్ పాత్రను తీసిపారేయలేం. మొదటి నుంచి ట్రంప్‌కు మద్ధతు పలుకుతూ వచ్చిన మస్క్.. బైడెన్ ప్రభుత్వంపైనా, పోటీదారు కమలా హారిస్పైనా అదే స్థాయిలో విమర్శలతో చెలరేగిపోయాడు. అదే టైంలో.. సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’కి బాస్‌గా ఎలాన్ మస్క్ నడిపించిన ఉద్యమం కూడా ట్రంప్ గెలుపులో కీలకభూమిక పోషించింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్‌కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ పరోక్షంగా ఉపయోగపడింది. మస్క్ తన సోషల్ మీడియా వేదికలపై ప్రముఖులతో కలిసి ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు. అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, ట్రంప్ గెలుపుతో అమెరికన్లకు కలిగే ప్రయోజనాలతో పాటు వివిధ సున్నిమైన అంశాల గురించి చర్చించారు. ఆ చర్చలే ఓటర్లకు దగ్గరయ్యేలా చేసింది. పలు సందర్భాల్లో ప్రజల్లో ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. అన్నింటికంటే ముందు.. ట్రంప్‌పై గతంలో విధించిన సోషల్ మీడియా బ్యాన్‌ను ఎత్తిపారేశారాయన.ఇదీ చదవండి: కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంట్రంప్కు బహిరంగ మద్దతు వ్యాపార వ్యవహరాల్లోనే కాదు రాజకీయంగా మస్క్.. ట్రంప్‌కు ప్రత్యక్షంగా మద్దతు పలికారు. వాస్తవానికి 2016, 2020 ఎన్నికలలో ట్రంప్‌కు మస్క్ పరోక్ష మద్దతిచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో మస్క్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్‌కు మద్దతు పలికారు. అలాగే.. ట్రంప్ హామీలు, గత పాలనలో నిర్ణయాలను విపరీతంగా ప్రమోట్ చేశారు. కుటుంబ నియంత్రణ, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక జాతీయవాదం వంటి అంశాలపై మద్దతు పలకడంతో కోట్లాది మంది మస్క్ అభిమానులు సైతం ట్రంప్‌కు ఓటు వేసేందుకు ఉపయోగపడింది. మస్క్‌ను నమ్మారు!ట్రంప్‌కు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. ఆయన కంపెనీలైన టెస్లా, స్పేస్ఎక్స్ ఆవిష్కరణలతో పాటు పెట్టుబడిదారులు, వినియోగదారులు లబ్ధి చేకూరొచ్చని భావించారు. పన్నులు, ఇంధనం, రాయితీ వంటి హామీలపై మస్క్ ఎక్కువ ఫోకస్ చేశారు. పెట్టుబడిదారుల నుంచి వినియోగదారుల వరకు మస్క్ మాటల్ని నమ్మారని, కాబట్టే మస్క్ అభిమానుల ఓట్లు ట్రంప్‌కు పడేలా చేశాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎలాన్ మస్క్ చేసిన పోస్టులే..సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వేచ్ఛ పేరుతో.. ఎలాంటి అంశంపైన అయినా స్పందిస్తుంటారు. మీడియా, టెక్నాలజీలతో పాటు ఉన్నత రంగాల ప్రముఖుల పట్ల జోబైడెన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలుమార్లు ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ అంశం ట్రంప్‌కు బాగా కలిసొచ్చింది. ప్రపంచకుబేరుల జాబితాలో మస్క్ ముందు వరుసలో ఉండడం, ఆకట్టుకునేలా మాటలు ట్రంప్‌కు అనుకూలంగా పనిచేశాయి.ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మస్క్ మరింత చురుకైన పాత్ర పోషిస్తే, ట్రంప్‌కు ప్రయోజనం చేకూర్చేలా అమెరికన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ఆయా సోషల్ మీడియా వేదికలపై ప్రస్తావించారు. టెక్నాలజీ, ఆర్థిక సమస్యలు, సంస్కృతి వంటి అంశాల ట్రంప్‌కు అనుకూలంగా మారాయి.వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ జోక్యం, వ్యక్తిగత స్వేచ్ఛపై మస్క్ వ్యక్తిగత విశ్వాసాలు ట్రంప్‌కు మద్దతు పలికేలా చేశాయి. వాక్ స్వాతంత్య్రం, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంపై మస్క్.. ట్రంప్‌తో జతకట్టేలా చేశాయి. ట్రంప్ గెలుపులు ఈ అంశాలు కలిసొచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ చేసిన ప్రచారం ఓటర్ల శైలిని మార్చేసిందనే చెప్పొచ్చు. -
డియర్ మస్క్ ఐ లవ్ యూ..!
-
ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?
అమెరికా ఎన్నికలు ముగిశాయి. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గతంలో పాలించిన జోబైడన్, అంతకుముందు పాలించిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఎవరి హయాంలో ఎంత వృద్ధి చెందిందో తెలుసుకుందాం.92 శాతం పెరిగిన వాణిజ్యంయునైటెడ్ స్టేట్స్కు సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్-అమెరికా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పదేళ్లలో యూఎస్‌తో భారత వాణిజ్యం 92 శాతం పెరిగింది. 2014లో ఇది 61.5 బిలియన్ డాలర్లు(రూ.5.13 లక్షల కోట్లు)గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా 118.3 బిలియన్ల(రూ.9.87 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకోనుండడంతో రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ఆసక్తికరంగా మారనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.గరిష్ఠ ఎగుమతులుండే విభాగాలు..యూఎస్‌కు 2023-24లో భారత ఎగుమతులు 77.53 బిలియన్లుగా(రూ.6.47 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం గరిష్టంగా ఉన్న 78.40 బిలియన్లుగా(రూ.6.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. గత పదేళ్లలో భారత్ ఎగుమతులు 2014లో 39.1 బిలియన్ల(రూ.3.26 లక్షల కోట్లు) నుంచి 2024 వరకు 98 శాతం పెరిగి 77.5 బిలియన్ల(రూ.6.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్‌తో సహా భారతీయ వస్తువులకు అమెరికాలో భారీ గిరాకీ ఉంది.డొనాల్డ్ ట్రంప్-జోబైడెన్ హయాంలో ఇలా..డొనాల్డ్ ట్రంప్ హయాంలో జనవరి 2017 నుంచి జనవరి 2021 వరకు అమెరికాకు భారతదేశ ఎగుమతులు నాలుగేళ్లలో 22 శాతం పెరిగాయి. జోబైడెన్ హయాంలో అమెరికాకు దేశ ఎగుమతులు కేవలం మూడు సంవత్సరాల్లో(2025 ఆర్థిక సంవత్సరం డేటా ఇంకా అందుబాటులో లేదు) 51 శాతం అధికమయ్యాయి. ట్రంప్ హయాంలో నాలుగేళ్ల(2018-21)లో అమెరికా నుంచి భారత్ దిగుమతులు 29% పెరిగాయి. మరోవైపు జోబైడెన్ హయాంలో మూడేళ్లలో భారత్ దిగుమతులు 42% అధికమయ్యాయి.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!విభాగాల వారీగా ఎగుమతుల విలువఇంజినీరింగ్ వస్తువులు 16.3 బిలియన్ డాలర్లు(రూ.1.36 లక్షల కోట్లు)రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులు 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.07 లక్షల కోట్లు)ఎలక్ట్రానిక్ వస్తువులు 10.5 బిలియన్ డాలర్లు(రూ.88000 కోట్లు)రత్నాలు, ఆభరణాలు 9.9 బిలియన్ డాలర్లు (రూ.83 వేలకోట్లు)పెట్రోలియం ఉత్పత్తులు 5.8 బిలియన్ డాలర్లు (రూ.48,760 కోట్లు)ఇతర ఉత్పత్తులు సంయుక్తంగా 22.2 బిలియన్ డాలర్లు(రూ.1.86 లక్షల కోట్లు) -
ట్రంప్ గెలుపుపై చైనా రియాక్షన్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు రిపబ్లిక్ పార్టీ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. ఇక.. ట్రంప్ సాధించిన భారీ విజయంపై భారత ప్రధాని మోదీతో సహా పలు దేశాధినేతలు, దేశాలు స్పందిస్తూ.. ఆయన అభినందనలు తెలియజేస్తున్నాయి. తాజాగా చైనా సైతం డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించింది. అయితే.. ట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డ్రాగన్ దేశం స్పందించింది.‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల ఎంపిక నిర్ణయాన్ని గౌరవిస్తాం. అధ్యక్ష ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం. అయితే.. అమెరికా పట్ల చైనా విధానం స్థిరంగా ఉంది. పరస్పర గౌరవం, శాంతియుత జీవనం, సహకారం వంటి సూత్రాలకు అనుగుణంగా చైనా-యూఎస్ సంబంధాలను కొనసాగిస్తాం’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. మరోవైపు.. చైనాపై కఠినంగా వ్యహరిస్తారనే ముద్ర ఉన్న డొనాల్డ్ ట్రంప్.. రానున్ను రోజుల్లో డ్రాగన్ దేశంతో సంబంధాలు ఎలా కొనసాగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.చదవండి: ట్రంప్ విజయంపై మోదీ సహా ప్రపంచ నేతల స్పందన -
US Election Results: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ మార్క్‌ను దాటారు.విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన ఈ మ్యాజిక్ ఫిగర్ దాటారు. ఇక.. ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో ఆయన అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్-280కమలా హారిస్-224ఇంకా నెవడా 6, మిషిగన్ 15, మైన్ 2, ఆరిజోనా 11, అలస్కా 3 చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.ట్రంప్ నెగ్గిన రాష్ట్రాలుఅలబామా 9, ఆర్కాన్సాస్ 6, ఫ్లోరిడా 30, జార్జియా 16, అయోవా 6, ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్ 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్ 1, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, నార్త్ కరోలినా 16, నార్త్ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17, ఓక్లహోమా 7, పెన్సిల్వేనియా 19, సౌత్ కరోలినా 9, సౌత్ డకోటా 3, టెన్నెసీ 11, టెక్సాస్ 40, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4,వయోమింగ్ 3, విస్కాన్సిన్ 10కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలివే..కాలిఫోర్నియా 54, కొలరాడో 10, కనెక్టికట్ 7, డీసీ 3, డెలవేర్ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, మైన్ 1, మిన్నెసోటా 10, నెబ్రస్కా 1, న్యూహ్యాంప్‌షైర్ 4, న్యూజెర్సీ 14, న్యూమెక్సికో 5, న్యూయార్క్ 28, ఓరెగాన్ 8, రోడ్ ఐల్యాండ్ 4, వర్జినియా 13, వెర్మాంట్ 3, వాషింగ్టన్ 12ట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్‌హౌజ్ వైపు అడుగులేశారు.చదవండి: Usha Chilukuri: ‘సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా’గా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి.. -
US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక విశేషం చోటు చేసుకుంది. 2024 అమెరికా ఎన్నికల ఫలితాలతో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రతినిధి నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి వరుసగా 20 సార్లు గెలుపొందిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. అంతేకాదు హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా నాన్సీ పెలోసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఆమె సొంతం. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2003 నుండి హౌస్ డెమొక్రాట్లకు నాయకత్వం వహించారు. హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రధాన పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ. 2007- 2011 వరకు, తిరిగి 2019- 2023 వరకు హౌస్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఎక్కువ కాలం పనిచేసిన హౌస్ డెమోక్రాటిక్ నాయకురాలు పెలోసి. అలాగే చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హౌస్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎఫర్డబుల్ కేర్ రక్షణ చట్టంతో సహా కొన్ని కీలకమైన చట్టాలను ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన లాంటి ఇతర ముఖ్యమైన సందర్భాలలో పార్టీలో ఆమె పాత్ర కీలకం.రాజకీయ వారసత్వం: రాజకీయంగా చురుకైన కుటుంబం నుండి వచ్చారు. నాన్సీ పెలోసి బాల్టిమోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి రాజకీయ మేత్త మేయర్ , కాంగ్రెస్ సభ్యుడు థామస్ డి'అలెసాండ్రో జూనియర్. వాషింగ్టన్ ట్రినిటీ కళాశాల నుండి నాన్సీ 1962లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్త పాల్ పెలోసిని వివాహం చేసున్నారు. -
ట్రంప్ కే పట్టం కట్టిన అమెరికన్లు
-
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం
-
ఒకే రోజు రూ.5 లక్షల కోట్ల కొనుగోళ్లు!
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,484 వద్దకు చేరింది. సెన్సెక్స్ 901 పాయింట్లు ఎగబాకి 80,378 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేరకు కొనుగోళ్లు జరిగినట్లయింది.ఇటీవల వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒక అంచనాకు వస్తుండడంతో మార్కెట్లు పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, యూఎన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా దేశీయ సంబంధాలు మెరుగ్గానే ఉంటాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కొంత స్పష్టత వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫీసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రంప్ కి మోదీ విషెస్
-
అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు
-
ట్రంప్ విక్టరీ.. చైనాకు బిగ్ షాక్..
-
అద్భుతమైన జంట.. జేడీ వాన్స్, ఉషా వాన్స్‌కు అభినందనలు: ట్రంప్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, వైఎస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ఈ క్రమంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్లో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారుల సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. అమెరికా తమకు అపూర్వమైన, శక్తివంతమైన ఆదేశాన్ని ఇచ్చిందని అన్నారు. తన సహచరుడు జేడీ వాన్స్, భారతీయ అమెరికన్ అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్‌పై ప్రశంసలు కురిపించారు.‘‘మొదటగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఆయన అద్భుతమైన, అందమైన భార్య ఉషా వాన్స్‌ను అభినందిస్తున్నా. ఇక నుంచి మిమ్మల్ని ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలువచ్చు. ఈ ఎన్నికల్లో మనం చరిత్ర సృష్టించాం. ఎవరూ సాధ్యం కాదనుకున్న అడ్డంకులను అధిగమించాం. అమెరికా దేశం ఎన్నడూ చూడని రాజకీయ విజయం. నాకు మద్దతు ఇచ్చిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్‌కి కృతజ్ఞతలు’’ అని అన్నారు.ఇక.. ట్రంప్ రన్నింగ్మేట్గా గెలుపు ఖరారు చేసుకున్న జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని వడ్లూరు గ్రామంలో జన్మించిన ఇండో అమెరికన్. జేడీ వాన్స్ గెలుపుతో ఆమె అమెరికాకు రెండవ మహిళ(Second Lady) హోదా దక్కించుకోకున్నారు. ఆమె యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్‌ను మొదటగా కలుసుకున్నారు. ఈ జంట 2014లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉష పేరెంట్స్ రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పని చేశారు. గత ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాగా.. ఈసారి తెలుగుమూలాలున్న వ్యక్తి భర్త(జేడీ వాన్స్) ఆ పదవిని చేపట్టబోతున్నారు.'Now I Can Say Vice President': Trump hails JD Vance, His wife after 'Political Victory'Watch: https://t.co/Fj7vonSlLl | #USElection2024 #Trump2024 #JDVance #VicePresident #IndianAmerican #UshaVance pic.twitter.com/9DiDFHh1J9— Business Today (@business_today) November 6, 2024Video Credits: Business Todayచదవండి: US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ -
అల్లుడిపై ట్రంప్ ప్రశంసలు
-
ట్రంప్‌కే పట్టం: ఎదురుదెబ్బలను తట్టుకుని పైకిలేచి రెండోసారి వైట్‌హౌజ్‌కు..
కొందరు ఆయన్ను ప్రేమిస్తారు.. మరికొందరు ఆయన్ను ద్వేషిస్తారు.. కానీ ఆయన్ను విస్మరించడం మాత్రం ఎవరి వల్లా కాదు.. ఆయనే డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు అభిశంసనకు గురైన మిస్టర్ ట్రంప్..రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ గతంలో ట్విట్టర్ ఆయన్ను వెలివేసింది.. 2020 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన పడిన పాట్లు అన్నీఇన్నీ కావు.. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. తలదించలేదు.. వెన్నుచూపని వీరుడిలా మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఎదురుగా బలమైన ప్రత్యర్థి కమల హారీస్ ఉన్నా ఏ మాత్రం బెదరలేదు... వణకలేదు..! డొంక తిరుగుడు మాటలు ఏ మాత్రం తెలియని ట్రంప్.. తన ముక్కుసూటితనంతోనే ఓటర్ల మనసును గెలిచి 47వ ప్రెసిడెంట్‌గా 2025 జనవరి 20న రెండోసారి ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. పడి చోటే లేచిన ట్రంప్ తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. రెండోసారి వైట్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిలియనీర్ ట్రంప్నేపథ్యం..డోనాల్డ్ ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్‌లోని ఓ సంపన్న కుటుంబంలో పుట్టారు.ట్రంప్ తండ్రి ఫ్రెడ్ విజయవంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి. న్యూయార్క్‌తో పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో ట్రంప్ కుటుంబానికి చాలా అపార్ట్మెంట్లు, ఆస్తులు ఉన్నా...ట్రంప్ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఆయన కుటుంబానికి ఉన్న డబ్బే ట్రంప్‌కు స్కూల్లో శాపంగా మారింది. ట్రంప్‌ను చాలా మంది వేరుగా చూసేవారు. అందరిలో ఒకడిలా ట్రంప్‌ని ఉండనివ్వలేదు. ఇదే ఆయన్ను స్కూల్లో క్రమశిక్షణ తప్పేలా చేసింది. పదేపదే స్కూల్ టీచర్ల నుంచి కంప్లైంట్ వస్తుండడంతో ట్రంప్‌ను మిలటరీ స్కూల్‌కు పంపారు తల్లిదండ్రులు. అక్కడే ట్రంప్‌కు డిసిప్లెన్ అలవాటైంది. అయితే అదే స్కూల్ ఆయన్ను తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరిగేలా చేసింది. అటు తండ్రి ఫ్రెడ్ కూడా చాలా స్ట్రిక్ట్. దీంతో ట్రంప్ బాల్యం ఆంక్షలు మధ్య ఏ మాత్రం స్వేచ్ఛ లేనట్టే గడిచింది.వ్యాపారవేత్తగా..చదువులు పూర్తి చేసిన తర్వాత ట్రంప్ తన తండ్రి లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లారు. తండ్రిలా కాకుండా వ్యాపారంలో రిస్క్ చేయాలన్నది ట్రంప్ ఆలోచన. బోల్డ్‌గా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లిన ట్రంప్ చాలాసార్లు వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నారు. 1980లలో విలాసవంతమైన భవనాలు, హోటళ్ళు, కాసినోలలో భారీగా పెట్టుబడి పెట్టారు. అయితే 1990ల ప్రారంభంలో అమెరికాను చుట్టేసిన మాంద్యం ట్రంప్ కు నష్టాలను తెచ్చిపెట్టింది. భారీ అప్పులు ఆయన నెత్తిమీద వచ్చి పడ్డాయి. కొన్నాళ్లపాటు దివాలా అంచు వరకు ఉన్న ట్రంప్ 2000వ సంవత్సరం తర్వాత కోలుకున్నారు. నాడు రియాలిటీ టీవీ షోలలో కనిపించి మెరిశారు. ది అప్రెంటిస్ అనే బిజినెస్ పోటీ షోతో ప్రజలకు దగ్గరయ్యారు . ఈ ప్రొగ్రామ్‌లో 'యు ఆర్ ఫైర్' అని ట్రంప్ చెప్పే డైలాగ్ నాడు అమెరికాలో మారుమోగింది. ఇలా తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ట్రంప్ మరోసారి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. రాజకీయాల్లోనూ..ఇలా 2015 వరకు వివిధ వ్యాపారాల్లో బిజీగా ఉన్న ట్రంప్ అదే సంవత్సరం నుండి ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ట్రంప్ చెప్పినప్పుడు అంతా నవ్వారు. పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నాడని ఎగతాళి చేసినవారు కూడా ఉన్నారు. అయితే ట్రంప్ ఎవరి మాటలు పట్టించుకోలేదు.. చేయాల్సింది చేశారు.. నామినేషన్ వేయడమే కాదు.. 2016ఎన్నికల్లో గెలిచి అమెరికా 45వ అధ్యక్షుడిగా వైట్ హౌస్ మెట్లెక్కారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారే కానీ ఎన్నో సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఎన్నో వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. వివిధ అంశాల్లో ఆయన విధానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విధానాలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లిం వ్యతిరేకి అంటూ దుయ్యబట్టాయి. అంతేకాదు అనేకసార్లు నల్లజాతీయులకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.ఆయన హయంలోనే ప్రపంచాన్ని కుదిపేసిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగింది.ట్రంప్ పాలనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అటు NATO మిత్రదేశాలతోనూ అమెరికా సంబంధాలు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే దెబ్బతిన్నాయి. ఓటమి తర్వాత..2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఆ తర్వాత మరిన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి చేయడం, అక్కడి పరిసరాలకు నిప్పు పెట్టడం అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. నాడు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ తన సపోర్టర్స్‌ను ప్రసంగాలతో రెచ్చగొట్టడం కారణంగానే వారంతా విధ్వంసానికి దిగారని నాటి సైనికాధికారులే ప్రకటించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ నుంచి ట్రంప్ అభిశసంనలకు గురవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని అంతా భావించారు. అయితే అందరి ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆయన ట్రంప్ ఎందుకవుతారు.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు రెడీ అయ్యారు. పడిలేచిన కెరటంలా..భారీ సంపద, హోదా ఉన్నప్పటికీ ఆయన ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు, కిందపడి మళ్లీ లేచి గెలిచిన నైజం ఆయనలోని పోరాటయోధుడిని కళ్లకు కడుతోంది. ఎన్నో కష్టమైన ఆర్థిక, రాజకీయ క్షణాలను ఒంటరిగానే ఎదుర్కొన్న ట్రంప్ వ్యక్తిగతంగానూ ఎన్నో బాధలు పడ్డారు. ట్రంప్‌ని ఎన్నో అంశాల్లో తిట్టేవారు ఉండొచ్చు కానీ ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేని విషయం ఒకటుంది. ఆయన మందు తాగరు.. అల్కహాల్‌కు చాలా దూరంగా ఉంటారు. 1981లో తన సోదరుడు అల్కహాల్ అలవాటు కారణంగానే అనారోగ్యంతో చనిపోయాడు. ఇది ట్రంప్‌ను ఎంతగానో కుంగదీసింది. అందుకే మద్యాన్ని పుచ్చుకోని ట్రంప్ తన తోటివారికి కూడా మందు తాగవద్దని చెబుతుంటారు. అటు ట్రంప్ వైవాహిక జీవితం కూడా ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. 1990లో మొదటి భార్య ఇవానాతో విడాకులు ట్రంప్‌ను మానసికంగా కుమిలిపోయేలా చేసింది. అటు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలా వ్యక్తిగతంగా, రాజకీయపరంగా ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా గెలవడాన్ని ఒక ఏడాది ముందు వరకు ఎవరు ఊహించి ఉండరు కూడా. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కూడా తమతో తామే మూసివేసిన తలుపుల లోపల సొంత యుద్ధాలను ఎదుర్కొంటారని చెప్పేందుకే ట్రంప్ జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం.. మరి అగ్రరాజ్యపు అధ్యక్షునిగా మున్ముందు ప్రపంచానికి ఎటువంటి దక్షత ప్రదర్శిస్తాడో ఈ మొక్కవోని వ్యాపారి ట్రంప్. తన టెంపరితనంతో ప్రత్యర్ధులకు టెంపరేచర్ పెంచి ఎదురులేని విక్టరీ సాధించిన ట్రంప్ వచ్చే నాలుగేళ్లు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి:::నాగ త్రినాథ్ బండారు , సాక్షి డిజిటల్ -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో ఆయన రెండోసారిఅ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అమెరికన్ ఓటర్లు.. రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారని యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించి.. డొనాల్డ్ ట్రంప్, రన్నింగ్‌మేట్( ఉపాధ్యక్షుడు) జేడీ వాన్స్‌కి అభినందనలు తెలిపారు.‘‘ మేం అమెరికాను రక్షించాం. రిపబ్లిక్ పార్టీ ఘన విజయంతో..యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా సెనేటర్ జేడీ వాన్స్ వైట్ హౌస్‌కు వెళ్తున్నారు. వారితో కలిసి అమెరికన్ ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.We have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024చదవండి: రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ! -
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా
-
ట్రంప్ విజయంపై మోదీ సహా ప్రపంచ నేతల స్పందన
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఆయన సిద్ధమయ్యారు.అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చారిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించిన నా మిత్రుడు ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు అని ట్విటర్లో పేర్కొన్నారు.‘మీ గత పదవీకాలంలో సాధించిన విజయాల మాదిరి.. ఈసారి కూడా భారత్, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మా సహకారాన్ని పునరుద్దరించడానికి ఎదురుచూస్తున్నాను. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి కృషి చేద్దాం’ అని పేర్కొన్నారు.Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY— Narendra Modi (@narendramodi) November 6, 2024అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుభాకాంక్షలు తెలిపారు.‘ గొప్ప పునరాగమనంతో చరిత్ర సృష్టించినందుకు ప్రియమైన డోనాల్డ్, మెలానియా ట్రంప్‌కు అభినందనలు. యూఎస్ వైట్ హౌస్‌కు మీరు తిరిగి రావడం అమెరికాకు కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఇజ్రాయెల్-యూఎస్ మధ్య శాశ్వతమైన మైత్రిని పునరుద్ఘాటిస్తుంది. ఇది నిజమైన స్నేహానికి అందిన భారీ విజయం’ అని కొనియాడారు.ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు తన అభినందనలు చెప్పారు. యూఎస్‌తో కలిసి పనిచేసేందుకు, తమ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు. రాబోయే నాలుగు సంవత్సరాలు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరస్పర గౌరవం, ఆశయంతో ఇరు దేశాల శాంతి, శ్రేయస్సు కోసం కృషి చేసేందుకు ఎదురు చూస్తున్నా’ అని తెలిపారు.A nome mio e del Governo italiano, le più sincere congratulazioni al Presidente eletto degli Stati Uniti, Donald #Trump.Italia e Stati Uniti sono Nazioni “sorelle”, legate da un’alleanza incrollabile, valori comuni e una storica amicizia.È un legame strategico, che sono certa…— Giorgia Meloni (@GiorgiaMeloni) November 6, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌ను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అభినందించారు. తన స్నేహితుడి గెలుపుతో టర్కీ-యూఎస్ సంబంధాలు బలపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ, ప్రపంచ సంక్షోభాలు, యుద్దాలు, ముఖ్యంగా పాలస్తీనా సమస్య, రాష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.Amerika Birleşik Devletleri’nde yapılan başkanlık seçimini büyük bir mücadelenin ardından kazanarak yeniden ABD Başkanı seçilen dostum Donald Trump’ı tebrik ediyorum.Amerikan halkının seçimiyle başlayacak olan bu yeni dönemde, Türkiye-ABD ilişkilerinin güçlenmesini, Filistin…— Recep Tayyip Erdoğan (@RTErdogan) November 6, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అభినందించారు. గత సెప్టెంబర్‌లో ట్రంప్‌ను కలుసుకున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఉక్రెయిన్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం, విజయ ప్రణాళిక,ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు పలికే మార్గాల గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌ను వ్యక్తిగతంగా అభినందించడానికి, యూఎస్‌తో ఉక్రెయిన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను చర్చించడానికి తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు.Congratulations to @realDonaldTrump on his impressive election victory! I recall our great meeting with President Trump back in September, when we discussed in detail the Ukraine-U.S. strategic partnership, the Victory Plan, and ways to put an end to Russian aggression against…— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) November 6, 2024 కాగా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజార్టీ మార్కు 270. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం అధికారాన్ని చేపట్టడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు 266 ట్రంప్ అతి చేరువలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 224 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. ట్రంప్ విజయంతో ఓ వైపు రిపబ్లికన్లు సంబరాలు మొదలు పెట్టగా.. కమలాహారిస్ మాత్రం నేటి తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.