వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు తాజా గణాంకాల ప్రకారం దిగువసభపై ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ పట్టుసాధించింది. బుధవారం తెల్లవారు జామున కాలిఫోర్నియా లోని మరోచోట గెలవగా తాజాగా అరిజోనాలో మరో స్థానంలో గెలవడంతో రిపబ్లికన్లు ఇప్పటిదాకా గెల్చిన సీట్ల సంఖ్య 218కి పెరిగింది.
కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రటిక్ పార్టీ కేవలం 208 చోట్ల మాత్రమే విజయం సాధించింది. దిగువసభలో మొత్తం 435 స్థానాలు ఉండగా ఇంకా 9 స్థానాల్లో ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్‌లోనూ ఇటీవలి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత సాధించింది. ఎగువ, దిగువ సభల్లో ఆధిక్యత కారణంగా త్వరలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చే నూతన చట్టాలకు ఎలాంటి అవాంతరాలులేకుండా సులభంగా ఆమోదముద్ర పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment