Counting of Parliament
-
దిగువసభపై పట్టుసాధించిన రిపబ్లికన్ పార్టీ
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు తాజా గణాంకాల ప్రకారం దిగువసభపై ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ పట్టుసాధించింది. బుధవారం తెల్లవారు జామున కాలిఫోర్నియా లోని మరోచోట గెలవగా తాజాగా అరిజోనాలో మరో స్థానంలో గెలవడంతో రిపబ్లికన్లు ఇప్పటిదాకా గెల్చిన సీట్ల సంఖ్య 218కి పెరిగింది. కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రటిక్ పార్టీ కేవలం 208 చోట్ల మాత్రమే విజయం సాధించింది. దిగువసభలో మొత్తం 435 స్థానాలు ఉండగా ఇంకా 9 స్థానాల్లో ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్‌లోనూ ఇటీవలి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత సాధించింది. ఎగువ, దిగువ సభల్లో ఆధిక్యత కారణంగా త్వరలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చే నూతన చట్టాలకు ఎలాంటి అవాంతరాలులేకుండా సులభంగా ఆమోదముద్ర పడనుంది. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్), ఎలక్షన్ నోడల్ అధికారి జితేందర్ వెల్లడించారు. మంగళవారం ఆయన డీజీపీ కార్యాలయంలో మరో నోడల్ అధికారి ఎస్పీ సుమతితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియను 23వ తేదీన చేపట్టనున్న నేపథ్యంలో బందోబస్తుపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 34,603 పోలింగ్ స్టేషన్లలో 18,526 పోలింగ్ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించామని చెప్పారు. వీటికి 40 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కొనసాగిస్తున్నామని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు 10 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్.. కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జితేందర్ తెలిపారు. కేంద్ర బలగాల పహారా మధ్య ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో జనసంచారంపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. సరైన అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడం కుదరదని వెల్లడించారు. ఒకవేళ అనుమతి ఉన్నా.. మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్లడానికి వీల్లేదని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద స్థానిక అవసరాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టామని.. ప్రతీ కేంద్రానికి డీఎస్పీ స్థాయి అధికారి భద్రతా చర్యలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షిస్తారని వివరించారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి.. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి అని జితేందర్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండటంతో ర్యాలీలు చేపట్టాలనుకున్నవారు పోలీసులను ముందుగా సంప్రదించి, అనుమతి తీసుకుంటే తామే బందోబస్తు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన తెలంగాణ ప్రజలకు జితేందర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలోనే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి.. నిజామాబాద్‌లో ఈవీఎం యంత్రాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జితేందర్ వెల్లడించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో నిజామాబాద్ ఫలితం మిగిలిన అన్ని స్థానాల కంటే ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనికితోడు సున్నిత ప్రాంతాల్లో కమిషనర్లు, ఎస్పీలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలోనూ ఇలాంటి ఏర్పాట్లే చేశామని వెల్లడించారు. -
ఓటరు దేవుని తీర్పు నేడే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉత్కంఠకు నేటితో తెరపడనుంది....సార్వత్రిక ఫలితం కోసం పదహారు రోజుల నిరీక్షణ ముగియనుంది....అయితే, జాతకాలు తేలేసమయం రోజుల నుంచి గంటల్లోకి రావడంతో రాజకీయవర్గాల్లో అంతులేని టెన్షన్ నెలకొంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుండడంతో ఫలితం ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ప్రజలు పట్టం కడతారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణలోనే జిల్లా ఫలితంపై జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడి ఫలితంపైనే అందరి అంచనాలు ఉన్నాయి... బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. మొత్తంమీద ఖమ్మం జిల్లా భావి పాలకులెవరనేది నేడు ఓటరుదేవుడు తేల్చనున్నాడు. ఉదయం 8 నుంచి కౌంటింగ్.... గత నెల 30న జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరగడంతో మధ్యాహ్నానికి పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాలతో పాటే పార్లమెంటు కౌంటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లపై లెక్కించిన ఈవీఎంలన్నింటిలో ఎంపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి ఒక్కో రౌండ్‌గా పరిగణించనున్నారు. మొత్తం మీద ఖమ్మం పార్లమెంటు ఫలితం అసెంబ్లీలయిపోయిన తర్వాత అర్ధగంటలోపు ఇచ్చేస్తామని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి మాత్రం ఫలితం అక్కడే ప్రకటించనున్నారు. అన్ని పార్టీలకు కీలకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో జరిగిన ఎన్నికల ఫలితాలు జిల్లాలో వివిధ ప్రధాన పార్టీలకు కీలకం కానున్నాయి. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐలు భవిష్యత్‌పై గంపెడాశతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ ముగిసిన 16 రోజుల తర్వాత ఫలితం వస్తుండడంతో ప్రధాన పార్టీల తరఫున పోటీచేసిన అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. మొన్నటి వరకు గుంభనంగా ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులు ఫలితాలొచ్చే సమయం దగ్గరపడుతున్న కొద్దీ గాభరాకు లోనయ్యారు. శుక్రవారం ఉదయం ఫలితాలు రానుండడంతో గురువారం రాత్రి వారికి కాళరాత్రిగానే మిగిలిపోయింది. చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రంగా బరిలో ఉన్న వారు కూడా తమకు ఎన్ని ఓట్లు వస్తాయోనని అంచనాల్లో మునిగిపోయారు. అన్ని పార్టీల శ్రేణులు కూడా విజయంపై ఓ వైపు ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నాయి. మొత్తంమీద వీరి టెన్షన్‌కు శుక్రవారం మధ్యాహ్నం కల్లా తెరపడనుంది.