అన్నదమ్ముల గొడవ వల్ల మోహన్‌బాబు ఏళ్లతరబడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అంతా బజారుకెక్కింది. పెదరాయుడిగా అందరి సమస్యలు తీర్చే మోహన్‌బాబు ఇంటి గొడవను చక్కదిద్దలేక డీలా పడిపోయాడు. రోజుకో వివాదం, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందే లేదు.
నాన్న మనసు విరిగింది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు (Vishnu Manchu) తన ఇంట్లో జరుగుతున్న కలహాలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. తండ్రిగా మోహన్‌బాబు (Mohanbabu).. మనోజ్‌ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గరించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు.
అమ్మ కొడుతుందేమో..
కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది అమ్మ. ఏదో ఒకరోజు అమ్మ మా అందర్నీ కొడుతుందేమోననిపిస్తోంది. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్‌లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారు అని చెప్పుకొచ్చాడు.
(చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు)
మనోజ్‌తో కలిసిపోతా..
మనోజ్ (Manchu Manoj)కు భయపడి దుబాయ్‌కు షిఫ్ట్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్‌లో చదివించాలనుకుంటున్నానంతే! అన్నాడు. మనోజ్‌తో కలిసిపోతారా? అన్న ప్రశ్నకు.. అది కచ్చితంగా జరుగుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి అన్నాడు.
కుటుంబం
జెనరేటర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. జెనరేటర్‌లో చక్కెర పోస్తే ఫిల్టర్ ప్రాసెస్‌లోనే ఆగిపోతుంది తప్ప పేలదు. ఇది చాలా సిల్లీ అని నవ్వేశాడు. మోహన్‌బాబు కుటుంబ విషయానికి వస్తే.. ఈయన మొదటగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు లక్ష్మీ ప్రసన్న, విష్ణు జన్మించారు. విద్యా దేవి మరణించాక ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మనోజ్ పుట్టాడు.
డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విశేషాలు
కన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఏడెనిమిది సంవత్సరాలపాటు దీనిపై అధ్యాయం చేశాను. శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ను సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్ రిజెక్ట్ చేశారు. మూడుసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దర్శకురాలు సుధా కొంగరతో మాట్లాడించి తనను ఒప్పించాను. ప్రభాస్ సినిమాలో భాగమవడానికి నాన్నే కారణం అని చెప్పాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.
చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా
Comments
Please login to add a commentAdd a comment