Vishnu Manchu
-
మంచు విష్ణు కూతుళ్లు.. అప్పుడే ఇంత పెద్దోళ్లు అయిపోయారే! (ఫొటోలు)
-
అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే!
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి ఆయా పాత్రలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్స్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పిలక పాత్రలో నటించగా, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ వీరి పాత్రలను పరిచయం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. -
మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళల భద్రత, రక్షణలను మరింత మెరుగుపరచడం కోసం వారి తరఫున ప్రాతినిధ్యం వహించేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు ‘మా’ అధ్యక్షుడిగా నాది ఒక విజ్ఞప్తి.తెలుగ చిత్ర పరిశ్రమలోని మహిళల భద్రత, రక్షణ మరింత మెరుగుపడేలా, వారి తరఫున ప్రాతినిధ్యం ఉండేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయండి. కెమెరా ముందు, వెనక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. భద్రత, సాధికారితలకు చలన చిత్ర పరిశ్రమ ప్రతిరూపంగా నిలిపేందుకు తెలుగు ఇండస్ట్రీలో భాగమైన ప్రతి ఒక్కర్నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నాం’’ అంటూ గురువారం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే... మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాక ఇతర పరిశ్రమల్లోనూ ఆ తరహా కమిటీ ఏర్పాటు చేయాలని పలువురు స్టార్స్ అంటున్న విషయం తెలిసిందే. తెలుగులో ఉన్న విభాగాల్లో ఓ కీలక విభాగం అయిన ‘మా’ తరఫున మంచు విష్ణు కమిటీ ఏర్పాటుని ప్రతిపాదించారు. -
మా కోసం పది లక్షలు విరాళం
మూవీ ఆర్టిస్ట్స్’ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. తన మూడో కుమార్తె (విష్ణు–విరానికా దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు) ఐరా విద్యా మంచు జన్మదినం (ఆగస్టు 9) సందర్భంగా ‘మా’ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనకబడిన కళాకారుల సంక్షేమం కోసం ఆయన ఈ విరాళాన్ని అందించారు.కళాకారుల సంరక్షణ, సహాయాల నిమిత్తం ఈ నగదుని వెచ్చించనున్నారు. అలాగే ‘మా’ భవనంపై కూడా విష్ణు మంచు దృష్టి సారించారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే...ప్రస్తుతం విష్ణు మంచు హీరోగా ‘కన్నప్ప’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ కానుంది. -
డిసెంబరులో కన్నప్ప
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విష్ణు. అయితే విడుదల తేదీ ఎప్పుడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. శివ భక్తుడైన కన్నప్ప కథతో ‘కన్నప్ప’ రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్‌లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్‌బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్‌ను కాన్స్‌లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్‌ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్‌లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్‌లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్‌లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్‌కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్‌లో భారతీయం... కాన్స్‌లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్‌లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు. -
కన్నప్పలో కాజల్
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘కన్నప్ప’ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది.ఇంకా ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మోసగాళ్ళు’ (2021) మూవీ కోసం విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ‘కన్నప్ప’ కోసం కలిశారు. -
కాన్స్‌లో కన్నప్ప
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప’ టీమ్ సందడి చేయనుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా ఈ నెల 14 నుంచి 25 వరకూ జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 20వ తేదీన ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’గా కన్నప్ప మూవీ టీజర్‌ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ సినిమా టీజర్‌ను ఆవిష్కరించనుండటం ఆనందంగా ఉంది. మేం ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నప్పను ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ట్వీట్ చేశారు విష్ణు మంచు. -
కన్నప్ప సెట్స్‌లో...
వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న హీరో ప్రభాస్ తాజాగా ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారుపాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్ తమ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణలను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలికింది యూనిట్. ‘‘విష్ణు మంచు కలల ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ రూపొందుతోంది. శివ భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నాం.ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథా కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి వారు ‘కన్నప్ప’కి పని చేస్తున్నారు. -
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. తాజాగా కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగుపెట్టేశారు. ఈమేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశారు.ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు సమాచారం ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. దాదాపు షూటింగ్ కార్యక్రమం పూర్తి దశలో ఉన్న కన్నప్ప ఇదే ఏడాది విడుదల కానుంది.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. "కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్. -
కన్నప్పలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్లో జాయిన్ అయ్యారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా మోహన్‌బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్‌కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
మరోసారి 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు.. క్లారిటీ ఇచ్చిన మాదాల రవి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే మరోసారి కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ప్రకటించారు. 2021 లో జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. వాస్తవంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన 'మా అసోసియేషన్ ఎన్నికలు' ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించారంటూ వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని తాజాగా మాదాల రవి ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి కాలం ఇప్పటికే ముగిసిపోయింది. అయినా కూడా విష్ణునే ఇన్నాళ్లు అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు. ‘మా’కు ఎప్పుడో ఎన్నికలు జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల జాప్యం ఏర్పడింది. మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కోసం జూలై లో మారిషస్‌లో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇదే విషయాన్ని మంచు విష్ణు కూడా గతంలో ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఉపయోగిస్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యుక్షుడిగా మంచు విష్ణు ఏమైనా స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. -
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
మా కోసం మలేసియాలో ఉత్సవం
‘‘ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో స్వర్ణయుగం నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిగారికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విషయం. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు ప్రభాస్.. నా బ్రదర్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. కీరవాణిగారికి ఆస్కార్ అవార్డు వచ్చింది. దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో మహేశ్‌బాబు–రాజమౌళి సినిమా రాబోతోంది. ఇలా ఎన్నో సాధిస్తున్నాం. తెలుగు సినిమా 90 సంవత్స రాలు పూర్తి చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో ‘మా’ నిధుల సేకరణ కోసం మలే సియాలో ‘నవతిహి ఉత్సవం’కు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషంగా ఉంది’’ అని ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. తెలుగు సినిమా 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు సినిమా చరిత్రను తెలియజేసేలా మలేసియాలో ‘నవతహి ఉత్సవం’ పేరిట ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ను జూలైలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విష్ణు మంచు మాట్లాడారు. -
కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది
‘‘కన్నప్ప’ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ్ర΄ారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1’ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు. -
కన్నప్ప గురి
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కన్నప్ప‘ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు మంచు లుక్ విడుదలైంది. ‘‘ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నారు విష్ణు మంచు. ఫస్ట్ లుక్ పోస్టర్ కన్నప్ప క్యారెక్టర్‌లోని డెప్త్, ఇంటెన్సిటీ చూపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతుండగా అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం రెండో షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
న్యూజిలాండ్‌లో భార్య వెరోనికాతో మంచు విష్ణు సందడి (ఫొటోలు)
-
90 రోజుల తర్వాత స్వదేశానికి 'కన్నప్ప'.. 600 మందితో సాహసం
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ 3 నెలల క్రితం న్యూజిల్యాండ్‌లో మొదలైంది. ‘‘న్యూజిల్యాండ్‌లో 600 మంది హాలీవుడ్, భారతదేశంలోని అతిరథ మహారథులైన నటీనటులతో 90 రోజుల మొదటి షెడ్యూల్ చేశాం. అక్కడి అద్భుతమైన లొకేషన్స్‌లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసి, భారతదేశానికి తిరిగి వస్తున్నాం. ఈ సినిమాకు థాయ్‌ల్యాండ్, న్యూజిల్యాండ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు మోహన్‌బాబు. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
కన్నప్పకి శ్రీకారం
విష్ణు మంచు తన కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తిలో ఈ సినిమాని ప్రారంభించారు. స్టార్ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’కి దర్శకత్వం వహిస్తారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపుర్ సనన్ కథానాయిక. విష్ణు మాట్లాడుతూ– ‘‘భక్త కన్నప్ప, ఆయన భక్తి గొప్పతనాన్ని ‘కన్నప్ప’ ద్వారా ఈ తరానికి తెలియజేయాలన్నది మా సంకల్పం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ మూవీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ నటీనటులు నటిస్తారు. త్వరలో షూటింగ్ ఆరంభించి ఒక్క షెడ్యూల్లోనే పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాసి. -
Ayra Vidya Birthday Celebrations: మంచు విష్ణు గారాలపట్టి ఐరా బర్త్‌డే.. లిటిల్ ఏంజెల్ క్యూట్ ఫోటోలు
-
వారి బంధం భార్యాభర్తల్లాంటిది: మంచు విష్ణు
‘‘ఇండస్ట్రీలో ఓ యాక్టర్‌కి, మేకప్ మేన్‌కి ఉన్న బంధం భార్యాభర్తల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి మేకప్‌మేన్ చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైటర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సినిమా చేయటం అంత సులభం కాదు.. ఆయన మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ‘మాధవే మధుసూదనా’ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. తేజ్ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను విష్ణు మంచు రిలీజ్ చేశారు. బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ–‘‘నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అన్నపూర్ణ స్టూడియో సంస్థకు, నాగార్జునగారికి రుణపడి ఉంటాను. మోహన్‌బాబుగారు సింగపూర్‌లో ఉండటం వల్ల ఆయన స్థానంలో విష్ణుని పంపించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
ఓటీటీలోకి జిన్నా, అప్పటినుంచే స్ట్రీమింగ్!
మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో రేపటి(డిసెంబర్ 2) నుంచి ప్రసారం కానుంది. తెలుగు, మలయాళ భాషల్లో జిన్నా అందుబాటులోకి రానుందంటూ అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా కథ విషయానికి వస్తే జిన్నాలో హీరో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. షార్ట్‌కట్‌గా జిన్నా అని పిలుచుకుంటారు. హీరో అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లి ఆగిపోతుంది. అలాంటప్పుడు జిన్నా తన అప్పు ఎలా తీర్చాడనేదే కథ. The endlessly entertaining movie is all set to entertain you on @PrimeVideoIN 🤩 from tomorrow. Just a day to go and full-on entertainment #GINNA!#GinnaOnPrime In Telugu & Malayalam.@iVishnuManchu @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory @saregamasouth pic.twitter.com/9Jn2rESSH0 — AVA Entertainment (@avaentofficial) December 1, 2022 చదవండి: కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాక్‌లో హౌస్మేట్స్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్ -
మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమానే నా ఊపిరి
‘‘సినిమానే మన ఊపిరి అని మా గురువు దాసరి నారాయణరావుగారు అనేవారు.. అలా సినిమానే మా ఊపిరి.. నా ఊపిరి. కళామతళ్లి మాకు భోజనం పెట్టింది. ‘జిన్నా’ సినిమా గొప్ప హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈశాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవ్రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘జిన్నా జాతర’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ–‘‘జిన్నా’లో విష్ణు ఎంతో రిస్కీ షాట్స్ చేశాడు.. జీవితంలో అలాంటి సన్నివేశాలు చేయడం మంచిది కాదని చెప్పాను. ‘ఢీ’ కంటే పది రెట్ల హిట్‌ని ‘జిన్నా’ అందుకోవాలి. విష్ణుని ఛోటా కె.నాయుడు అద్భుతంగా చూపించాడు. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్‌కి థ్యాంక్స్. అరియానా– వీవీయానా ఇంత అద్భుతంగా పాడతారని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా సూర్య గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. నాకు ఎన్నో హిట్ పాటలకు డ్యాన్స్‌లు సమకూర్చిన ప్రభుదేవా ‘జిన్నా’ లో విష్ణుకి నృత్యరీతులు సమకూర్చారు.. మా ఫ్యామిలీలో ఒకడిగా, మాపై ఉన్న గౌరవంతో తను డబ్బు తీసుకోకుండా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘జిన్నా’ సినిమాకి ముందుగా కోన వెంకట్‌గారికి థ్యాంక్స్. ఛోటాగారితో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు కుదిరింది. ‘జిన్నా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. నా కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్‌కి థ్యాంక్స్. అరియానా–వీవీయానా తొలిసారి అయినా అద్భుతంగా పాడారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన సూర్యకి థ్యాంక్స్. అందరూ మా సినిమాని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘జిన్నా’ కథా రచయిత జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘జిన్నా’ రషెస్ చూసినప్పుటి నుంచి ఒక బ్లాక్‌బస్టర్ వైఫై నా చుట్టూ తిరుగుతోంది.. ఇది వందశాతం నిజం. సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో హిట్ చూసిన ఎవరైనా సరే.. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ బాబు, చిరంజీవిగార్లు.. ఎవరైనా ఫ్లాప్ చూస్తారు.. కానీ, ఫ్లాప్‌ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్‌బాబుగారి ద్వారా విష్ణుకి వచ్చింది.. తను ఎదుర్కొన్నాడు.. ‘జిన్నా’ తో బ్లాక్ బస్టర్ కొడతాడు’’ అన్నారు.‘‘జిన్నా’ సినిమా కాదు.. మా అన్నయ్య(మోహన్‌బాబు)గారు నాపై పెట్టిన బాధ్యత. ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది’’ అన్నారు చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు అలీ, చమ్మక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.