
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నప్పపాత్రను విష్ణు మంచుపోషించగా, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్యపాత్రలుపోషించారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘శివ శివ శంకరా...’ అనేపాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ– ‘‘శివ శివ శంకరా’పాటని ఇప్పటికే 80 మిలియన్ల (8 కోట్లు) మంది వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు
ప్రజలు ఈపాటని ఆదరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈపాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి సందర్భంగా ఈ సాంగ్ మరింతగా చేరువ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.