కాన్స్‌లో కన్నప్ప | Vishnu Manchu Kannappa teaser set to be unveiled at Cannes Film Festival | Sakshi

కాన్స్‌లో కన్నప్ప

May 14 2024 12:29 AM | Updated on May 14 2024 1:14 PM

Vishnu Manchu Kannappa teaser set to be unveiled at Cannes Film Festival

ప్రతిష్టాత్మక కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీమ్‌ సందడి చేయనుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్‌’ సిరీస్‌ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ నెల 14 నుంచి 25 వరకూ జరగనున్న కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 20వ తేదీన ‘ది వరల్డ్‌ ఆఫ్‌ కన్నప్ప’గా కన్నప్ప మూవీ టీజర్‌ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ‘కన్నప్ప’ సినిమా టీజర్‌ను ఆవిష్కరించనుండటం ఆనందంగా ఉంది. మేం ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నప్పను ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్‌ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ట్వీట్‌ చేశారు విష్ణు మంచు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement