
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
కాగా ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి ఆయా పాత్రలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్స్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పిలక పాత్రలో నటించగా, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ వీరి పాత్రలను పరిచయం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment