కన్నప్ప సెట్స్‌లో... | Prabhas Joins In Shooting For Kannappa, Manchu Manoj Announces With Poster | Sakshi
Sakshi News home page

Prabhas In Kannappa Movie: కన్నప్ప సెట్స్‌లో...

Published Fri, May 10 2024 4:12 AM | Last Updated on Fri, May 10 2024 10:22 AM

Prabhas joins Kannappa shoot

వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న హీరో ప్రభాస్‌ తాజాగా ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారుపాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇప్పటికే అక్షయ్‌ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌కుమార్‌ తమ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణలను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్‌ ‘కన్నప్ప’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలికింది యూనిట్‌. ‘‘విష్ణు మంచు కలల ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ రూపొందుతోంది. శివ భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నాం.

ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథా కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ షెల్డన్‌ చౌ, యాక్షన్‌ డైరెక్టర్‌ కెచా ఖంపక్డీ వంటి వారు ‘కన్నప్ప’కి పని చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement