మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
కన్నప్పలో ప్రభాస్
అయితే కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్‌లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్‌తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment