90 రోజుల తర్వాత స్వదేశానికి 'కన్నప్ప'.. 600 మందితో సాహసం | Vishnu Manchu Kannappa team completes 90 days New Zealand schedule | Sakshi
Sakshi News home page

90 రోజుల తర్వాత స్వదేశానికి 'కన్నప్ప'.. 600 మందితో సాహసం

Published Sun, Dec 24 2023 12:05 AM | Last Updated on Sun, Dec 24 2023 6:51 AM

Vishnu Manchu Kannappa team completes 90 days New Zealand schedule - Sakshi

విష్ణు మంచు టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ 3 నెలల క్రితం న్యూజిల్యాండ్‌లో మొదలైంది.

‘‘న్యూజిల్యాండ్‌లో 600 మంది హాలీవుడ్, భారతదేశంలోని అతిరథ మహారథులైన నటీనటులతో 90 రోజుల మొదటి షెడ్యూల్‌ చేశాం. అక్కడి అద్భుతమైన లొకేషన్స్‌లో దిగ్విజయంగా షూటింగ్‌ పూర్తి చేసి, భారతదేశానికి తిరిగి వస్తున్నాం. ఈ సినిమాకు థాయ్‌ల్యాండ్, న్యూజిల్యాండ్‌ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు’’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు మోహన్‌బాబు. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement