బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్‌లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment