Kannappa
-
అక్షయ్ కుమార్ బర్త్ డే.. కన్నప్ప టీం స్పెషల్ పోస్టర్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే ఈ రోజు కన్నప్ప నటుడు అక్షయ్ కుమార్ బర్త్ డే కావడంతో చిత్రబృందం విషెస్ తెలియజేసింది. ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చేతికి రుద్రాక్ష మాల ధరించిన ఫోటోను అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం లాంటి స్టార్స్ సైతం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది.A Heartfelt Birthday wish to @akshaykumar! 🎉🙏 Your portrayal of Lord Shiva in this film is a testament to your unwavering dedication. Team #Kannappa🏹 celebrates you today and always.🌟 #HappyBirthdayAkshayKumar #HarHarMahadevॐ #TeamKannappa@themohanbabu @ivishnumanchu… pic.twitter.com/d6jqUpI8Z1— Kannappa The Movie (@kannappamovie) September 9, 2024 -
Bollywood Stars: అక్కడ హీరో.. ఇక్కడ విలన్
బాలీవుడ్ నుంచి ఎక్కువగా హీరోయిన్లు టాలీవుడ్‌కి వస్తుంటారు. ఈసారి పలువురు నటులు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కొందరు నటులు, నటీమణులు కనిపించగా... త్వరలో రానున్న బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కన్నప్పతో ఎంట్రీబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కన్నప్ప’. హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీకి ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పలు భాషలకు చెందిన స్టార్ హీరోలు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘కన్నప్ప’ చిత్రంలో అక్షయ్ కుమార్ కీలకమైన అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కి వచ్చి, తన పాత్ర షూటింగ్‌ని అక్షయ్ కుమార్ పూర్తి చేసి వెళ్లారు. అక్షయ్ వంటి స్టార్ హీరో ‘కన్నప్ప’లో భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. అయితే అక్షయ్ కుమార్ ఏ పాత్రలో నటించారు? అనే విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోన్న ‘కన్నప్ప’ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓమీ భాయ్బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్నారు ఇమ్రాన్ హష్మీ. హీరోయిన్లతో ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఆయన తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మీ. మార్చిలో ఇమ్రాన్ హష్మీ పుట్టినరోజుని పురస్కరించుకుని, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న ఓమీ భాయ్ పాత్రని పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తన లుక్‌పై ఇమ్రాన్ హష్మీ ‘ఓజీ’ సినిమాలోని ఓ డైలాగ్‌తో స్పందించారు. ‘గంభీరా... నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ్ర΄ామిస్... ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది’ అంటూ ట్వీట్ చేశారాయన. ఇక గూఢచారితోనూ తెరపై కనిపించనున్నారు ఇమ్రాన్. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘జీ 2’ (గూఢచారి 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అనీల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ‘జీ 2’. ఈ మూవీలో ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని టాక్. దేవరతో జోడీఅతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండి΄ోయే ΄ాత్రలు చేశారు. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని శ్రీదేవి అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించనుంది. ‘దేవర’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నారు జాన్వీ కపూర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు..’పాటలో జాన్వీ కపూర్ ఫుల్ గ్లామరస్‌గా కనిపించడంతో ఈ సాంగ్ ఇప్పటికే ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. మరి సినిమా విడుదల తర్వాత జాన్వీకి ఎంతమంది ఫ్యాన్స్ అవుతారో వేచి చూడాలి. కాగా ‘దేవర’ తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే జాన్వీకి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెండితెరపై చిరంజీవి–శ్రీదేవిలది సూపర్ జోడీ. వారి వారసులు రామ్ చరణ్– జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇది రెండవ చిత్రం. ఒకప్పటి హిట్ జోడీ అయిన చిరంజీవి–శ్రీదేవిల వారసులు రామ్‌చరణ్–జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ ΄ాన్ ఇండియా సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. వీరమల్లుతో పోరాటం గత కొన్నేళ్లుగా బాబీ డియోల్ కెరీర్ ఆశాజనకంగా సాగడం లేదు. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ (2023) సినిమా తర్వాత ఈ బాలీవుడ్ నటుడి క్రేజ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ సినిమాలో ఆయన నటించిన విలన్ పాత్రకి అద్భుతమైన పేరు రావడంతో విపరీతమైన డిమాండ్ పెరిగింది. హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఆయన నటిస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్ కల్యాణ్, నిధీ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో ఆయన తప్పుకున్నారట. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని సమాచారం. ఏఎమ్ రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్బీకే 109’ (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ బాబీ డియోల్ నటిస్తున్నారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. 1998లో విడుదలైన హీరో నాగార్జున ‘చంద్రలేఖ’ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో కనిపించారు సంజయ్ దత్. దాదాపు ఇరవైఆరేళ్ల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన తెలుగు సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. విలన్ బిగ్ బుల్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు సంజయ్ దత్. ఆయన నటిస్తున్న మరో తెలుగు చిత్రం ‘రాజా సాబ్’. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ (తెలుగు–హిందీ) సినిమాతో తెలుగులో పరిచయమైన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం జూన్ 27న విడుదలైంది. ఈ సినిమా రెండో భాగంలోనూ దీపిక నటించనున్నారు. వెర్సటైల్ యాక్టర్‌గా పేరొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఈ ఏడాది ‘సైంధవ్’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. వికాస్ మాలిక్‌గా విలన్ పాత్రలో తనదైన శైలిలో అలరించారాయన. ఇలా ఈ ఏడాది ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ తెలుగుకి పరిచయం కాగా... మరెందరో రానున్నారు. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. దేవరాజ్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో నటుడు దేవరాజ్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో ఆయన గిరిజనుల నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. అతని కుమారుడిగా బాలీవుడ్ నటుడు లావి పజ్నీ నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. తాజాగా రిలీజైన ఈ పోస్టర్లపై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. Introducing #Devaraj in the #Kannappa🏹 hailing from the Nilipala Hills, Mundadu and @iamlavipajni as his son #Bebbuli is ready to unleash a new wave of strength and fierce spirit 🔥#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar… pic.twitter.com/viVdUCKEny— Kannappa The Movie (@kannappamovie) August 5, 2024 -
బన్నీ పుష్ప-2 కు పోటీగా మంచు విష్ణు కన్నప్ప..
-
డిసెంబరులో కన్నప్ప
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాని డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విష్ణు. అయితే విడుదల తేదీ ఎప్పుడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. శివ భక్తుడైన కన్నప్ప కథతో ‘కన్నప్ప’ రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
ట్రైబల్ కథల్
ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి... సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం ఓ వ్యక్తి పోరాటం చేస్తాడు... తమ హక్కుల కోసం పోరాటం చేస్తాడు ఓ గిరిజన తెగ నాయకుడు... ఓ తెగకు చెందిన వ్యక్తి శివభక్తుడిగా మారతాడు... సినిమా పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ‘ట్రైబల్’ నేటివిటీ. ఇలా ట్రైబల్ కథల్తో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ ‘కాన్సార్ ఎరుపెక్కాలా...’ అంటూ ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్‌కి అటు అభిమానులు ఇటు ప్రేక్షకుల కేకలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం... ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూశాం. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’ విడుదల వరకూ ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ⇒ ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర’ కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటో చెప్పింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ్రపాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ⇒ ‘చావుని ఎదిరించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం’ అంటూ ‘తంగలాన్’ మూవీ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉంది. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ⇒ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్‌ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. ⇒ మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు (ఆ తర్వాత శివ భక్తుడు కన్నప్పగా మారారు) పాత్ర చేస్తున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్దుడైన నాద నాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తిగా ఉంటాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందట. -
Kannappa: నాథనాధుడుగా శరత్ కుమార్..లుక్ అదిరింది!
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా నేడు(జులై 14) ఆయన కారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ కనిపిస్తున్నారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. On the special occasion of @realsarathkumar Garu's birthday, Team #Kannappa🏹 is thrilled to introduce him as Nathanadhudu! Wishing you a legendary year ahead 🏹@24FramesFactory @avaentofficial @KannappaMovie#HBDSarathkumar #KannappaMovie #ATrueIndianEpicTale #HarHarMahadevॐ pic.twitter.com/MMyUMTo8ge— Kannappa The Movie (@kannappamovie) July 14, 2024 -
Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ప్రభాస్ కోసం రాసుకున్న కథే కన్నప్ప: మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ ఈవెంట్లో పాల్గొన్న మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.మోహన్ బాబు మాట్లాడుతూ.. 'కన్నప్ప సినిమా ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో వ్యయప్రయాసలతో కన్నప్పను నిర్మించాం. దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను నేను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజుతో మాట్లాడాం. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కృష్ణంరాజు మాకు ఇచ్చేశారు. మేం మున్ముందు ఇంకా ఎన్నో ఈవెంట్లు నిర్వహిస్తాం. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా.. కన్నప్ప టీంకు ప్రజలందరి ఆశీస్సులు కావాలి’ అని అన్నారు. -
కన్నప్పలో కాజల్
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘కన్నప్ప’ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది.ఇంకా ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మోసగాళ్ళు’ (2021) మూవీ కోసం విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ‘కన్నప్ప’ కోసం కలిశారు. -
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్. -
మంచు విష్ణు కన్నప్పలో మిల్కిబ్యూటీ..
-
ప్రతి ఒక్కరికీ నిద్రలేని రాత్రులు: మంచు విష్ణు
టాలీవుడ్ హీరో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్టార్ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మాత మంచు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపుర్ సనన్ కథానాయికగా కనిపించనుంది. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ విశేషాలను తెలియజేస్తూ మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం నా ఏడేళ్ల కల అని.. శివుడు, పార్వతి దేవి దివ్య ఆశీర్వాదాలతోనే ఇది సాధ్యమైందంటూ పోస్ట్ చేశారు. ఈరోజు న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో 'కన్నప్ప' షూటింగ్‌ను ప్రారంభించాం. నా ఏడేళ్ల కల సాకారం శివుడు, పార్వతి దేవి దివ్య ఆశీర్వాదానికి నిదర్శనం. గత ఎనిమిది నెలలుగా కన్నప్పలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిద్రలేని రాత్రులు మిగిలాయి. పండుగలు మరచిపోయి.. సెలవులు మానేసి.. 5 గంటల నిద్రనే ఆనందంగా భావించారు. ఏడేళ్ల క్రితం తనికెళ్ల భరణి తొలిసారిగా కన్నప్ప భావనను నాతో పంచుకున్నప్పుడు.. నేను తక్షణమే ఆకర్షితుడయ్యాను. కథను మరింతగా మెరుగుపరచడానికి నేను బాధ్యత తీసుకున్నా. ఈ ప్రయాణంలో నాతో కలిసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దిగ్గజాలైన పరచూరి గోపాలకృష్ణ , విజయేంద్ర ప్రసాద్ , తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి , ఈశ్వర్ రెడ్డి స్క్రిప్ట్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా.. 'కన్నప్ప'కి ప్రాణం పోసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మంది తారాగణం, సిబ్బంది న్యూజిలాండ్‌లో కలిశాం. ప్రియమైన వారిని విడిచిపెట్టి వారు చేసిన త్యాగాలే ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకానికి నిదర్శనం. ఈ ప్రయాణంలో నన్ను నమ్మిన మా నాన్నగారి తిరుగులేని మద్దతు .. అలాగే నా సోదరుడు వినయ్ ప్రోత్సాహం నిరంతరం బలం, ప్రేరణగా నిలిచాయి. అంటూ పోస్ట్ చేశారు. 'కన్నప్ప'లో అద్భుతమైన నటీనటులు ఉన్నారని.. ఈ జాబితాను త్వరలోనే తెలియజేస్తామని చెప్పేందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మా ప్రాజెక్ట్ వివరాలను గోప్యంగా ఉంచేందుకు మా వంతు ప్రయత్నం చేసినప్పటికీ.. లీక్‌ల బెడద సవాలుగా మారిందన్నారు. మా చిత్రంలో నటీనటులకు సంబంధించి అధికారిక ప్రొడక్షన్ (ట్విట్టర్) వచ్చే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 'కన్నప్ప' కేవలం ప్రాజెక్ట్ కాదు.. ప్రేమ, అంకితభావం, విశ్వాసంతో చేస్తున్న సాహసమని తెలిపారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. EPIC ADVENTURE BEGINS Today, I stand in awe as the adventure of a lifetime unfolds in the picturesque landscapes of New Zealand, as we commence the shooting of 'Kannappa.' This dream has been seven years in the making, and its realization is a testament to the divine blessings… pic.twitter.com/tVotX1RIJr — Vishnu Manchu (@iVishnuManchu) September 25, 2023 -
కన్నప్పకి శ్రీకారం
విష్ణు మంచు తన కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తిలో ఈ సినిమాని ప్రారంభించారు. స్టార్ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’కి దర్శకత్వం వహిస్తారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపుర్ సనన్ కథానాయిక. విష్ణు మాట్లాడుతూ– ‘‘భక్త కన్నప్ప, ఆయన భక్తి గొప్పతనాన్ని ‘కన్నప్ప’ ద్వారా ఈ తరానికి తెలియజేయాలన్నది మా సంకల్పం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ మూవీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ నటీనటులు నటిస్తారు. త్వరలో షూటింగ్ ఆరంభించి ఒక్క షెడ్యూల్లోనే పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాసి. -
మంచు విష్ణు భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’ లాంఛ్ ఫొటోలు
-
కన్నప్ప కోసం
కన్నప్ప తిరగబోయే ప్రదేశాల వేటలో బిజీబిజీగా ఉన్నారు మంచు విష్ణు. అందుకోసం న్యూజిల్యాండ్, సిడ్నీను చుట్టేస్తున్నారు. శివ భక్తుడు భక్త కన్నప్ప కథ ఆధారంగా మంచు విష్ణు నటించి, నిర్మించనున్న చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లొకేషన్స్‌ను ప్రస్తుతం వెతుకుతున్నారు మంచు విష్ణు. ఇప్పటివరకూ ఎవ్వరూ షూట్ చేయని, సరికొత్త లొకేషన్స్‌లో ఈ సినిమాను షూట్ చేయాలని భావిస్తోందట చిత్రబృందం. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండే ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు. ఈ సినిమాకు ఎవరు దర్శకుడు, మిగతా సాంకేతిక నిపుణులు వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
అమ్మదొంగా? ఏకశిలానగరం క్రీ,శ 1300 ( వరంగల్)
పదం నుంచి పథంలోకి 16 గజదొంగ కన్నప్ప రాజమహేంద్రి నుంచి ఓరుగల్లుకు ఆ పూటే వచ్చి దిగబడ్డాడు. ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. దొంగతనం చేస్తే ఓరుగల్లు పడమటి వీధుల్లోనే చేయాలి’ అని తన గురువు మాటవరసకన్న మాటను పట్టుకొని బయలుదేరి అక్కలవీధిలో పూటకూళ్ల సీతక్క ఇంట్లో బసచేసాడు. పొద్దుపోయే వేళకి నిద్రలేచి మండువాలో అడుగుపెట్టాడు. ‘ఏమయ్యా! ఉదయం వచ్చిన కాడ్నించీ పండుకొనే ఉన్నావ్? ఏ ఊరేంటి మనదీ?’ అడిగింది సీతక్క. ‘రాజమహేంద్రి! కంసాలి బిడ్డని’ అంటూ ఒళ్లు విరుచుకొని ‘పక్షంరోజులు బండి ప్రయాణం. అడివిదారి. దేహం పులుసై పోయింది’ అని జవాబిచ్చాడు కన్నప్ప. ‘ఇంకేం మా మంగలి భీముడు ఒక్కసారి వీపు తోమితే చాలు అన్నీ సర్దుకుంటాయి. వేడి పాలిస్తాను తాగి స్నానం చేసిరా అన్నం పెడతాను’ అని కంచు చెంబులో పాలు తెప్పించింది. సీతక్కది ఓరుగల్లు అక్కలవీధిలో అతిపెద్ద పూటకూళ్లిల్లు. రెండంతస్తుల మేడ. లోగిలి చుట్టూ మామిడితోట. రోజూ మార్చే చలువ దుప్పట్లతో నలబై పడకగదులు, ఇక భోజనాల సమయంలో అయితే ఆ ఘుమఘుమలే వేరు. ఒక రూకకి నెల్లూరి సన్న బియ్యం, పెసరపప్పు, నాలుగు కాయగూరలూ, లప్పల కొద్ది పెరుగుతో రుచికరమైన భోజనం. పాండ్యదేశపు నల్ల మిరియాలతో సీతక్క చేసే ధప్పళం కోసం రూక వెచ్చించి విస్తరి కోసం జనం పడిగాపులు పడుతారు. అలాంటి సీతక్క ఇంట దిగి, వేడి పాలు తాగి తోటలోని స్నానమంటపం చేరాడు కన్నప్ప. మామిడితోటలో అరుగులపై చాలామంది కనిపించారు. తాంబూలం సేవిస్తూ భుక్తాయాసంతో అవస్త పడుతూ సాటి వర్తకులతో వ్యాపారం సాగించే కోమట్లు... వెనుకమూలలో చలువపందిరి కింద గొల్లభామలు కాల్చిన వేడివేడి చీకులు, కొబ్బరిపాలలో నాన్చిన చేపముక్కల నంజుడుతో గౌడు కాసిన ఆసవాలు సేవిస్తూ వాగ్యుద్ధాలు చేసే తెలగ ఎక్కట్లు, రెడ్డివీరులు, వెలమనాయకులు.... మండువా అరుగుపై ఆంధ్రదేశం నలుమూలల నుంచి వచ్చి తమ పాండిత్యంతో, కవిత్వంతో రాజాస్థానంలో ప్రవేశం కోసం గాలం వేసే పండిత ప్రకాండులు... స్నానశాల పక్కనే చలువరాతి అరుగుపైన బోర్లా పడుకొని ఒళ్లు పట్టించుకుంటున్నాడు కన్నప్ప. పూటకూళ్లక్క చెప్పినట్లు భీముడి చేతిలో ఏదో మంత్రముంది. సంపెంగ, బాదం నూనెలతో వాడు ఒళ్లు పడుతుంటే బడలిక ఇట్టే మాయమయిది. ‘తమరు ఓరుగల్లుకి కొత్తనుకుంటాను బాబయ్యా. ఎన్నాళ్లుంటారో?’ బొటనవేళ్లతో వెన్నుపూసలని కొలుస్తూ మాట కలిపాడు భీముడు. ‘పనయ్యేదాకా! ఎన్నాళ్ళయితే అన్నాళ్లు!’ మూలిగాడు కన్నప్ప. ‘ఏం పనో’ ‘నగల వ్యాపారం! నీకు తెలిసినంతలో మంచి నగల బేరానికి బాగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేంట్రా?’ అని అడిగాడు కన్నప్ప. ‘ఎందుకు లేరూ. అడిగో అనుమయ్య. జొన్నల వ్యాపారి. కోటలో ధాన్యం కోష్టం, మైలసంతలో వీధిబారునా అంగళ్ళు. ధనం బాగా మూలుగుతోంది. అందునా వచ్చేనెల బిడ్డ పెళ్ళి’ అంటూ చెట్టు కింద కూర్చొని నెరిసిన బుంగమీసాలు, తలపై సరిగ రుమాలు, చెవులకి బోలుకమ్మలతో, తోటి కోమట్లతో ముచ్చట్లాడుతున్న శెట్టిని చూపాడు. ‘సీతక్కతో కబురుచెయ్యి బాబయ్యా. ఇంట్లో ఆడాళ్లకి నీ నగలు నచ్చితే కొనకచస్తాడా!’ అంటూ నవ్వాడు భీముడు. ************** పడమటివీధి మొదట్లో శివాలయం ముందు దారికి అడ్డంగా భైరవుడి విగ్రహం. వెళ్ళేపని సరిగ్గా సాగితే బూరెల దండ వేయిస్తానని మొక్కుకొని లెంపలు వేసుకుంటూ ముందుకి సాగాడు కన్నప్ప. అనుమయ్య శెట్టిది పడమటి వీధిలో పదడుగుల ప్రహరీ మధ్యలో రెండంతస్తుల మేడ. ఇంటి గోడలు దిట్టంగా కోటగోడల్లా ఉన్నాయి. వీధిలోంచి ప్రహరీగోడ మీదకి వాలిన పొగడచెట్టు కొమ్మని గమనిస్తూ ఇంట్లోకి ప్రవేశించాడు కన్నప్ప. సేవకునికి ఒక కాసు లంచం పడేస్తే శెట్టిసాని దర్శనం సులువుగానే అయ్యింది. ‘నమస్కారం శెట్టిసాని’ అని నమస్కారం పెట్టాడు కన్నప్ప. ఆమె ఎగాదిగా చూసింది. కన్నప్ప తన దగ్గరున్న దంతపు పెట్టెను తెరిచాడు. రత్నాల హారం. ఛక్కున మెరిసింది. దానికి అతడు చెప్పిన వెలకి నిర్ఘాంతపోయింది శెట్టిసాని. అణుచుకోలేని ఆనందంతో అతడిని అక్కడే ఉండమని సంజ్ఞచేస్తూ గబగబా పడమటి గదిలోని పెనిమిటి వద్దకి వెళ్లి- ‘వ్యాపారానికి కొత్తనుకుంటాను. లేకుంటే కనీసం నూరు గద్యాణాలు చేసే హారానికి నూరు మాడలేనా? సగానికి సగం! బంగారం బరువే సరిపోతుంది’ అని మొగుడి చెవిలో గుసగుసలాడింది. ‘ఏమో. కొత్తవాడంటున్నావ్. కాకిబంగారం కాదుకదా?’ అడిగాడు, అనుమయ్య. ‘ఆహా. మన కంసాలికి చూపెట్టాను. మేలిమి బంగారం. రాళ్ళు కూడా జాతి రాత్నాలే. ఏమైనా మన అమ్మాయి అదృష్టవంతురాలు’ ‘అయితే తీసుకో. నూరు మాడలేగా? అతడ్ని పిలువు’ అంటూ పడమటి గది గోడలో అమర్చిన ఇనుపపెట్టె తెరిచాడు. దూరం నుండే ఉత్కంఠతో అంతా గమనిస్తున్న కన్నప్ప తృప్తిగా ఊపిరిపీల్చాడు. ********* అర్ధరాత్రి దాటింది! మరునాటి రాత్రి గడిస్తే మైలసంత. అనుమయ్య శెట్టి పనివాళ్ళంతా కోట బయట దుకాణాలకి కాపలాకి పోయారు. దొంగతనానికి అదే మంచి అదను. నూనె ఖర్చుకి వెరచి చావిట్లో దీపాలు కూడా పెట్టలేదు పిసినిగొట్టు! అందుకే చేసేది జొన్నల వ్యాపారమే అయినా బాగానే కూడబెట్టాడు. నీలిబట్టలలో పొగడ కొమ్మపైన పిల్లిలా పాకుతూ ప్రహరీ దాటాడు. అంతెత్తు నుంచి దూకినా అట్టచెప్పులు ఏమాత్రమూ శబ్దం చేయలేదు. వీపుకి వేలాడుతున్న సంచిలో ముళ్ళబంతి, కొండె, గద్దగోరు, కన్నపుకత్తి తడిమి చూసుకొని మెల్లగా పడమటి గది సమీపించారు. గదిలో దీపాలు వెలుగుతున్నాయి, లోపల్నుంచి సన్నగా ఏవో మాటలు వినవస్తున్నాయి. వాళ్ళు గది వదిలేవరకూ ఇలాగే వేచి ఉండాలా, లేక మరోరోజు పని కానివ్వాలా? పడమటి గది గోడలు పటిష్టంగా పకడ్బందీగా ఉన్నాయి. పది అడుగుల ఎత్తులో గవాక్షం (వెంటిలేటర్) తప్ప గాలి కూడా జొరలేదు. కొండెకి పట్టుగుడ్డ చుట్టి కప్పుమీద విసిరాడు. ఏదో పట్టింది. లాగి బలం చూసుకొని పైకి ఎగబాకాడు. గదిలో అనుమయ్య, ఎవరో శెట్టితో వాదులాడుతున్నాడు! అర్ధరాత్రి. ఏం వ్యాపారమో? చెవిని గోడకి ఆన్చి సంభాషణ వినసాగాడు. అమ్మదొంగా! ఇదా అసలు రహస్యం? నేటితో నా పంట పండింది! శెట్టి ఆయువుపట్టు దొరికింది. ఇక కన్నం దేనికి? రేపు దొరలాగే వచ్చి ఈ శెట్టి చేస్తున్న మోసాన్ని బయటపెడతానని భయపెట్టి కావలసినది పట్టుకెళ్ళవచ్చు, అనుకుంటూ మెల్లగా కిందకి జారి అక్కలవీధి దారి పట్టాడు దొంగకన్నప్ప. ఆ శెట్టి చేస్తున్న నేరం ఏమిటి? సమాధానం తరువాయి భాగం ‘మైలసంత’ కథలో...