కన్నప్పకి శ్రీకారం | Vishnu Manchu Announces His Dream Project Kannappa shooting launch | Sakshi
Sakshi News home page

కన్నప్పకి శ్రీకారం

Published Sat, Aug 19 2023 4:11 AM | Last Updated on Sat, Aug 19 2023 6:17 PM

Vishnu Manchu Announces His Dream Project Kannappa shooting launch - Sakshi

విష్ణు మంచు తన కలల ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ చిత్రానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తిలో ఈ సినిమాని ప్రారంభించారు. స్టార్‌ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ‘కన్నప్ప’కి దర్శకత్వం వహిస్తారు. అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపుర్‌ సనన్‌ కథానాయిక.

విష్ణు మాట్లాడుతూ– ‘‘భక్త కన్నప్ప, ఆయన భక్తి గొప్పతనాన్ని ‘కన్నప్ప’ ద్వారా ఈ తరానికి తెలియజేయాలన్నది మా సంకల్పం. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ మూవీలో ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్‌ నటీనటులు నటిస్తారు. త్వరలో షూటింగ్‌ ఆరంభించి ఒక్క షెడ్యూల్‌లోనే పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement