Shooting Launch
-
'జెంటిల్ మేన్ 2' ప్రారంభం
ముప్పైఏళ్ల క్రితం అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్ మేన్’ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత నిర్మించిన ‘ప్రేమ దేశం’, ‘రక్షకుడు’ వంటివి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. చాలా గ్యాప్ తర్వాత కుంజుమోన్ ‘జెంటిల్ మేన్ 2’కి శ్రీకారం చుట్టారు. చేతన్ శ్రీను హీరోగా గోకుల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో తమిళనాడు సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖా మంత్రి ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతదర్శకుడు. ఈ వేదికపై కీరవాణిని సన్మానించారు కుంజుమోన్. ‘‘ప్రతి ఒక్కరూ జెంటిల్‌మేన్ అవ్వాలి అనేది ఈ చిత్రం ప్రధానాంశం’’ అన్నారు కుంజుమోన్. -
కన్నప్పకి శ్రీకారం
విష్ణు మంచు తన కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తిలో ఈ సినిమాని ప్రారంభించారు. స్టార్ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’కి దర్శకత్వం వహిస్తారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నూపుర్ సనన్ కథానాయిక. విష్ణు మాట్లాడుతూ– ‘‘భక్త కన్నప్ప, ఆయన భక్తి గొప్పతనాన్ని ‘కన్నప్ప’ ద్వారా ఈ తరానికి తెలియజేయాలన్నది మా సంకల్పం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్న ఈ మూవీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ నటీనటులు నటిస్తారు. త్వరలో షూటింగ్ ఆరంభించి ఒక్క షెడ్యూల్లోనే పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాసి. -
నటుడు సింహా ప్రధాన పాత్రలో ‘రావణ కల్యాణం’
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రావణ కల్యాణం’. ఆలూరి సురేష్, సింహా సమర్పణలో జేవీ మధుకిరణ్ దర్శకత్వంలో అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం ఆరంభమైంది. తొలి సీన్‌కి యాక్టర్ సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సింహా మాట్లాడుతూ.. ‘‘రావణ కల్యాణం’ కథ విన్నప్పుడు నేనెంత ఎగై్జట్ అయ్యానో, థియేటర్స్‌లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు అంతే ఎగై్జట్ అవుతారనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సందీప్ మాధవ్, రాజేంద్రప్రసాద్, శత్రు, శరత్ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. రధన్ సంగీతం, మనోహర్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్. -
అలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు: హీరో
Dharma Chakram 2022 Movie: సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ హీరో హీరోయిన్లుగా నాగ్ ముంత దర్శకత్వంలో.. జీపీ రెడ్డి నిర్మాతగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ‘ధర్మచక్రం’. ఇటీవలె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వినూత్న కథ కథనాలతో రాబోతున్న ఈ మూవీ ప్రారంభోత్సవంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా.. రాజశేఖర్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. ఎం శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. ‘సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల మీద ఈ కథను దర్శకుడు రాసుకున్నారు. ఆయన చెప్పిన కథాకథనాలు నచ్చి.. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాను’ అని నిర్మాత జీపీ రెడ్డి తెలిపారు. దర్శకుడు నాగ్ ముంత మాట్లాడుతూ.. ‘ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాలు రోజూ చూస్తుంటాం. ఆడవాళ్లకు స్వీయ సంరక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. హీరోయిన్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నిర్మాత జీపీ రెడ్డికి కథ చెప్పిన వెంటనే నచ్చడంతో.. ఈ సందేశాత్మక చిత్రాన్ని చేద్దామన్నారు. సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ? ‘నిర్భయ, దిశ ఘటనలాంటివి మనం చూశాం. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. నేను ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. మీ ఆశీర్వాదం లభిస్తే ఇంకా మంచి మంచి పాత్రలను పోషించగలను’ అని తెలిపారు హీరోయిన్ మోనిక చౌహాన్. హీరో సంకేత్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు మంచి కథను చెప్పారు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. మంచి సందేశంతో మీ ముందుకు రాబోతున్నాం. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’ హీరో సంకేత్ పేర్కొన్నారు. -
నటుడు బ్రహ్మాజీ కొడుకు హీరోగా మరో సినిమా..
Actor Brahmaji Son Sanjay Rao New Movie Shooting Launched: నటుడు బ్రహ్మాజీ తనయుడు, 'ఓ పిట్టకథ' ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రంతో ఏఆర్ శ్రీధర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీరామనవమి పండగ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సోహైల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ ఇచ్చారు. రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును యూనిట్‌కి అందించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ జె. రెడ్డి కెమెరా వర్క్ చేయగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. లైన్ ప్రొడ్యూసర్‌గా రమేష్ కైగురి, సహ నిర్మాతలుగా చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం వ్యహరించారు. చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ -
పిచ్చెక్కించే వినోదం
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకునిగా మారారు. ఆయన తెరకెక్కించనున్న ‘ఆర్జీవీ’ అనే చిత్రం హైరదాబాద్‌లో ప్రారంభమైంది. ‘కార్తికేయ’ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాల కుటుంబరావు పొన్నూరి మాట్లాడుతూ– ‘‘ఒక విద్యావేత్తగా పాఠాలు చెప్పి మంచిని బోధించే వృత్తిలో ఉన్న నాకు, జొన్నవిత్తుల గారు చెప్పిన కథ నచ్చడంతో సామాజిక బాధ్యతగా ఈ సినిమా నిర్మిస్తున్నా. ఇదొక మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో కొందరు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఒక సిద్ధాంతంలా ఎక్కించారు. దీని వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో పిచ్చెక్కించే వినోదం ఉంటుంది. ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మార్చి మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
కొబ్బరికాయ కొట్టిన ‘టక్ జగదీష్’
నేచురల్ స్టార్ నాని తన 26వ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘టక్ జగదీష్’అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో పలువురు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాల అనంతరం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవుడి చిత్ర పటాలపై టాలీవుడ్ ఆగ్ర నిర్మాత దిల్ రాజ్ క్లాప్ కొట్టారు. చిత్ర యూనిట్‌కు దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ అందించగా, నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేశాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల ఆరంభం నుంచి జరుపుకోనుంది. నిన్ను కోరి, మజిలీ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న దర్శకుడు శివ నిర్వాణ. ఈ లవ్ డైరెక్టర్ తనకు తొలి అవకాశం ఇచ్చిన హీరో నానితో చేస్తున్న చిత్రమే ‘టక్ జగదీష్’ . ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న ‘వి’ చిత్రంతో నాని బిజీగా ఉన్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావు హైదరిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: నేనే నానీనే! ‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా అనుకున్నారు -
మహాప్రస్థానం మొదలైంది
తనీష్, ముస్కాన్ సేథీ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ‘జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. ‘వరుడు’ ఫేం భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తనీష్ మాట్లాడుతూ– ‘‘సినిమా సెట్లో నేను అడుగుపెట్టి ఏడాదిన్నర అవుతోంది. కథలు వింటున్నా నచ్చడం లేదు. జానీగారు చెప్పిన ‘మహాప్రస్థానం’ కథ నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది’’ అన్నారు. ‘‘నేను గతంలో ‘అంతకుమిం చి’ చిత్రాన్ని తెరకెక్కించా. ‘మహాప్రస్థానం’ నా రెండో సినిమా. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు జాని. శుభాంగీ పంత్, గగన్ విహారి, అమిత్ నటిస్తున్న ఈ చిత్రానికి సం గీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బాల్ రెడ్డి. -
కేసీఆర్ బయోపిక్ ప్రారంభం