కొబ్బరికాయ కొట్టిన ‘టక్‌ జగదీష్‌’ | Nanis Tuck Jagadish Telugu Movie Shooting Launched Today | Sakshi
Sakshi News home page

కొబ్బరికాయ కొట్టిన ‘టక్‌ జగదీష్‌’

Published Thu, Jan 30 2020 1:29 PM | Last Updated on Thu, Jan 30 2020 1:29 PM

Nanis Tuck Jagadish Telugu Movie Shooting Launched Today - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని తన 26వ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘టక్‌ జగదీష్‌’అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో పలువురు టాలీవుడ్‌ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాల అనంతరం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవుడి చిత్ర పటాలపై టాలీవుడ్‌ ఆగ్ర నిర్మాత దిల్‌ రాజ్‌ క్లాప్‌ కొట్టారు. చిత్ర యూనిట్‌కు దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ అందించగా, నవీన్‌ ఎర్నేని కెమెరా స్విచ్చాన్‌ చేశాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెల ఆరంభం నుంచి జరుపుకోనుంది. 

నిన్ను కోరి, మ‌జిలీ వంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ మనసులను దోచుకున్న దర్శకుడు శివ నిర్వాణ. ఈ లవ్‌ డైరె​క్టర్‌ తనకు తొలి అవకాశం ఇచ్చిన హీరో నానితో చేస్తున్న చిత్రమే ‘టక్‌ జగదీష్‌’ . ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌తో సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. హరీష్‌ పెద్ది, సాహూ గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న ‘వి’ చిత్రంతో నాని బిజీగా ఉన్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావు హైదరిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

చదవండి:
నేనే నానీనే!

‘దిల్‌’ రాజుకి ఏమైనా మెంటలా అనుకున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement