KT Kunjumon Gentleman 2 Begins at Chennai - Sakshi
Sakshi News home page

'జెంటిల్‌ మేన్‌ 2' ప్రారంభం

Published Sun, Aug 20 2023 4:53 AM | Last Updated on Mon, Aug 21 2023 8:46 PM

KT Kunjumon Gentleman 2 begins at Chennai - Sakshi

కీరవాణి, కుంజుమోన్‌

ముప్పైఏళ్ల క్రితం అర్జున్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్‌ నిర్మించిన ‘జెంటిల్‌ మేన్‌’ సంచలన విజయం సాధించింది.  ఆ తర్వాత నిర్మించిన ‘ప్రేమ దేశం’, ‘రక్షకుడు’ వంటివి కూడా భారీ బడ్జెట్‌ చిత్రాలే. చాలా గ్యాప్‌ తర్వాత కుంజుమోన్‌ ‘జెంటిల్‌ మేన్‌ 2’కి శ్రీకారం చుట్టారు. చేతన్‌ శ్రీను హీరోగా గోకుల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది.

ఈ వేడుకలో తమిళనాడు సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖా మంత్రి ఎల్‌. మురుగన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతదర్శకుడు. ఈ వేదికపై కీరవాణిని సన్మానించారు కుంజుమోన్‌. ‘‘ప్రతి ఒక్కరూ జెంటిల్‌మేన్‌ అవ్వాలి అనేది ఈ చిత్రం ప్రధానాంశం’’ అన్నారు కుంజుమోన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement