Actor Brahmaji Son Sanjay Rao New Movie Shooting Launched: నటుడు బ్రహ్మాజీ తనయుడు, 'ఓ పిట్టకథ' ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రంతో ఏఆర్ శ్రీధర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రణవి మానుకొండ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీరామనవమి పండగ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి హీరో సోహైల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ ఇచ్చారు. రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును యూనిట్‌కి అందించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ జె. రెడ్డి కెమెరా వర్క్ చేయగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. లైన్ ప్రొడ్యూసర్‌గా రమేష్ కైగురి, సహ నిర్మాతలుగా చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం వ్యహరించారు.
చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్
Comments
Please login to add a commentAdd a comment