Vijayendra Prasad
-
ఆసక్తి రేపుతున్న ‘కళింగ’ ఫస్ట్ లుక్
‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.కళింగ అనే టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. పోస్టర్లో హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం, హీరో చేతిలోని ఆ కాగడ.. మొత్తం ఆ సెటప్‌ను చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. -
మహేష్ - జక్కన్న ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్
-
మీ అబ్బాయిని హీరో చేయండి.. రేణు దేశాయ్‌కు రిక్వెస్ట్!
మాస్ మహారాజా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. దసరా కానుకగా ఈ మూవీ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజతో పాటు రేణుదేశాయ్‌పై ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: ఇంద్రజ హీరోయిన్గా కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్!) విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ' టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూశా. మణిరత్నం తీసిన నాయకన్ సినిమా తెలుగులో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆ కోరిక పుష్ప చిత్రంతో తీరిపోయింది. టైగర్ నాగశ్వరరావు మూవీలో ఒక్కొక్క ఫ్రేమ్‌ను అద్బుతంగా తీశారు. ఈ చిత్ర డైరెక్టర్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. దర్శకుడు వంశీ ఫోన్ నంబరు తీసుకుని ఆయనతో మాట్లాడేంత వరకు నా మనసు ఆగలేదు. రవితేజ చేసిన విక్రమార్కుడు సినిమా కన్నడ, తమిళం, హిందీలో చేశారు. నీకున్న టాలెంట్‌ను ఎవరూ అందుకోలేరు. మన తెలుగు కీర్తిని దేశమంతట విస్తరింపచేయండి. నాకు అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు.'అని అన్నారు. అనంతరం రేణు దేశాయ్ గురించి చెబుతూ.. ' మీరు సినిమా ఫీల్డ్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. మాకు ఎప్పటికీ దగ్గరే. మీ అబ్బాయిని త్వరలోనే హీరోను చేయాలి. అందులో మీరే తల్లిగా నటించాలి' అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆయన మాటలు విన్నా రేణు దేశాయ్ చాలా సంతోషంగా కనిపించింది. రేణు దేశాయ్ ఆనందం చూస్తుంటే తప్పకుండా చేస్తానంటూ చెబుతున్నట్లే కనిపించింది. కాగా.. పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్‌కి పెళ్లి కాగా.. అకీరా నందన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాలాంటి బాధ ఎవరికీ రాకూడదని కోరుకున్నా: నయని పావని) -
ఈ దసరా మీదే
‘‘మణిరత్నంగారి ‘నాయగన్’ తరహా సినిమాలు తెలుగులో ఎప్పుడు వస్తాయా? అనుకునేవాడిని. ‘పుష్ప’తో నెరవేరింది. ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా అలా అనిపించింది’’ అన్నారు రచయిత–దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. రవితేజ టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కె. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రవితేజగారు చేసిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని తమిళ, కన్నడ, హిందీలో రీమేక్ చేశారు. అయితే ఎవరూ ఆయన్ను మ్యాచ్ చేయలేకపోయారు. రవితేజగారు తెలుగు సినిమాలకే పరిమితమైపోకుండా ఇతర భాషల చిత్రాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్రైలర్ చూడగానే ప్రతి ఫేమ్‌ను దర్శకుడు వంశీ అద్భుతంగా తీశారనిపించింది. అభిషేక్ అగర్వాల్గారికి మంచి టైమ్ నడుస్తోంది. దసరా పండగ వచ్చింది. దుర్గమ్మవారికి ఎవడూ ఎదురు నిలబడలేడు. ఆ దుర్గమ్మ తల్లి వాహనం టైగర్ ముందు కూడా ఎవడూ నిలబడలేడు. దసరా మీదే (టైగర్ నాగేశ్వరరావు టీమ్‌ను ఉద్దేశించి)’’ అన్నారు. మరో ముఖ్య అతిథి ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా మాట్లాడుతూ– ‘‘రవితేజగారికి ఉత్తరప్రదేశ్‌లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీ గర్వపడేలా నా మిత్రుడు అభిషేక్ అగర్వాల్ మరిన్ని సినిమాలు తీయాలి. ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా కథ విని, ఎగ్జయిట్ అయ్యాను. ఎమోషన్, థ్రిల్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. సినిమాలో ఉన్నవన్నీ ఒరిజినల్ పాత్రలే. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన అభిషేక్‌గారు ‘టైగర్’తో హ్యాట్రిక్ హిట్ సాధించాలి’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక బెస్ట్ ఫిలిమ్‌గా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు వంశీ. ‘‘నాలుగేళ్ల ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేను’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ఈ వేడుకలో చిత్ర సహ–నిర్మాత మయాంఖ్, దర్శకులు గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, టీజీ విశ్వప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్చిలో మొదలు?
‘గుంటూరుకారం’ సినిమాతో బిజీగా ఉన్నారు హీరో మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో మహేశ్ చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. అయితే దర్శకుడు రాజమౌళితో మహేశ్ బాబుకు ఓ సినిమా కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్ష¯Œ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ కథ ఓ కొలిక్కి వచ్చిందని, మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టేలా రాజమౌళి అండ్ కో ప్రణాళికలు రచిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. -
విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మొదలైన సిగ్గు
జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘సిగ్గు’ ఆదివారం ప్రారంభం అయింది. భీమవరం టాకీస్ పతాకంపై టి. రామసత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు కె.విజయేంద్ర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాతలు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్ స్క్రిప్ట్‌ను దర్శక–నిర్మాతలకు అందించారు. ‘‘చలంగారి నవల ‘సుశీల’ ఆధారంగా ‘సిగ్గు’ చేస్తున్నాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘సి.కల్యాణ్‌గారి సపోర్ట్‌తో ముందుకు వెళ్తున్నాను’’ అన్నారు టి.రామసత్య నారాయణ. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, డైరెక్టర్ రేలంగి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సుక్కు, కెమెరా: అబ్బూరి ఈషే. -
స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా రేంజ్లో!
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఆల్‌టైమ్ హిట్స్‌ను అందించారు. అయితే తాజాగా మరో స్టార్ హీరోకు కథను అందించేందుకు సిద్ధమయ్యారు. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి ఆయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 25 చిత్రాలకు పైగా కథలను అందించారు. తాజాగా కన్నడ హీరో కిచ్చాకు సైతం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 2న కిచ్చా సుదీప్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రివీల్ చేశారు. (ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! ) కిచ్చా సుదీప్ కథానాయకుడుగా ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్సీ స్టూడియోస్ భారీ బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కిచ్చా సుదీప్ మరోసారి కబ్జా దర్శకుడు ఆర్ చంద్రుతో జతకట్టబోతున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్లో ఆర్సీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఈ సంస్థ నిర్మించిన ఐదు చిత్రాలు వరుసగా తెరపైకి రాబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కిచ్చ సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో పని చేయడానికి ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను, నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!) -
రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది
భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చిన రోజు నుంచి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఇదే. అంతేకాకుండా ఈ సినిమాకు కథను కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారనే విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇదీ చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్) తాజాగ SSMB29 ప్రాజెక్ట్‌పై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. యాక్షన్ అడ్వంచర్ సినిమాగా మహేశ్‌బాబుతో కథ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యాక్షన్ సీన్స్ ఇండియానా జోన్స్ సినిమా టైపులో ఉంటాయని ఉదాహరణగా తెలిపారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ సైతం భాగం కానున్నారని ప్రకటించారు. దీంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో విడుదల కానున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. ఆఫ్రికా అడువుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన గతంలోనే ఆయన తెలిపారు. (ఇదీ చదవండి: రేణు దేశాయ్ వీడియో.. ఇంత పెద్ద స్టోరీ నడిచిందా?) సీక్వెల్స్‌లో కథలు మారుతుండొచ్చు. కానీ, ప్రధాన పాత్రలు మాత్రం అవే ఉంటాయని అప్పట్లో చెప్పుకొచ్చారు. 2024లో షూటింగ్ ప్రారంభిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాతో మహేష్‌బాబు బిజీగా ఉన్నారు. నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 13న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. "There is a possibility to rope in Hollywood actor for superstar #MaheshBabu's #SSMB29 with SS Rajamouli." This will be an African adventure film." - Vijayendra Prasad pic.twitter.com/uZKr2kmfiC — Manobala Vijayabalan (@ManobalaV) August 23, 2023 -
మార్పు మన నుంచే ప్రారంభం కావాలి
హిమాయత్‌నగర్: మార్పు మనఇంట్లో నుంచి..అంటే వ్యక్తి నుంచే ప్రారంభమైతే దేశం ప్రగతిపథంలో ముందుకెళుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. నేటితరం పిల్లలు ఏసీ లేకపోయినా, చెమట పట్టినా భరించలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారన్నారు. దేశ రక్షణ, భావితరాల భవిష్యత్‌కు సరిహద్దుల్లో మన సైనికులు రక్తం కారుస్తూ, చెమటోడుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలను అడ్డేస్తున్నారని చెప్పారు. 24వ కార్గిల్ దివస్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని కేఎంఐటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ దేశంకోసం త్యాగం చేస్తున్న సైనికులను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం వారు సినిమా హీరోలు, క్రీడాకారులను మాత్రమే గుర్తించగలుగుతున్నారని, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, వారిత్యాగాల గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినవారి కుటుంబీకులకు గవర్నర్ ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్, మేజర్ జనరల్ వీకే పురోహిత్, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
RRR Sequel: రామ్‌చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!
అద్గదీ.. సినిమా అంటే ఇట్టుండాల... తీసిందెవరు మరి? రాజమౌళి! ఈ మాట చాలాసార్లు విన్నాం. రాజమౌళి ఏ సినిమా తీసినా వంక పెట్టడానికి సందివ్వకుండా చూసుకుంటాడు. తన సినిమాకు వచ్చే ప్రశంసల సుడిగుండంలో ఒకటీరెండు విమర్శలు కొట్టుకుపోతాయి. రాజమౌళి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ రికార్డులు కూడా గడగడలాడిపోతాయి. గతేడాది ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయస్థాయిలో అవార్డులు సాధించి ఇండియన్ సినిమా ఖ్యాతిని మరోసారి చాటిచెప్పింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇంతవరకు ఇలాంటి సినిమాను చూసిందే లేదని ఆశ్చర్యపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఫిదా అవుతూ నెట్టింట పోస్టులు పెట్టారు. అయితే ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ తెరకెక్కించే ఆస్కారం లేకపోలేదని ఆమధ్య వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసే బాధ్యతను రచయిత విజయేంద్రప్రసాద్ తన భుజాన వేసుకున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు. హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా దాన్ని తెరకెక్కించాలని ఆలోచిస్తున్నాం. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిర్మాతను తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తాడనేది నేను కచ్చితంగా చెప్పలేను. ఒకవేళ అతడు లేదంటే అతడి నేతృత్వంలో మరొకరు ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తారు' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు జక్కన్న లేకుండా ఆర్ఆర్ఆర్ 2ను ఊహించలమా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్‌బాబుతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే! చదవండి: గన్ పేలుడు శబ్ధాలు.. అల్లర్ల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి జీవితమంతా కష్టాలే.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? -
మహేశ్ సినిమా క్లైమాక్స్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి
సూపర్‌స్టార్ మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి సినిమా షూటింగే ఇంకా మొదలవలేదు. అప్పుడే వరసపెట్టి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. స్వయానా రాజమౌళి తండ్రి, ఈ చిత్ర రచయిత కే విజయేంద్ర ప్రసాద్ వీటిని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పేశారు. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమాకి ఆస్కార్ రావడం మాటేమో గానీ డైరెక్టర్ రాజమౌళి రేంజు ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో తన నెక్స్ట్ మూవీ విషయంలో ఏ మాత్రం తొందరపడకుండా చాలా కూల్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ లాంచింగ్ ఉందని అంటున్నారు. మరోవైపు రైటర్ విజయేంద్ర ప్రసాద్.. జూలై కల్లా స్క్రిప్ట్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. (ఇదీ చదవండి: ప్రభాస్‌దే అసలైన సక్సెస్.. కమల్‌తో పాత వీడియో వైరల్) 'జూలైలోపు స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తాను. ఆ తర్వాత దాన్ని రాజమౌళికి అందజేస్తాను. ఈ సినిమా క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ గా వదిలేస్తున్నా. కుదిరితే దీనికి సీక్వెల్ తీసుకోవచ్చు. అందుకు తగ్గట్లే సీన్స్ రాస్తున్నా. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. గతంలోనే రాజమౌళి, మహేశ్ తో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది గ్లోబ్ ట్రొటింగ్ సినిమా అని అన్నారు. అడ్వెంచరస్ తరహా స్టోరీ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇలా రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ మాటలు బట్టి చూస్తుంటే ఇది ఇండియానా జోన్స్ తరహా జంగిల్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. రిలీజ్ మాత్రం కచ్చితంగా మరో మూడు-నాలుగేళ్ల తర్వాతే. ఎందుకంటే అక్కడున్నది ఎవరు.. రాజమౌళి! (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!) -
రాజమౌళి, మహేష్ మూవీ అప్డేట్ వచ్చేసింది.. సీక్రెట్స్ రివీల్ చేసిన విజయెంద్రప్రసాద్
-
అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్‌కే సాధ్యం: విజయేంద్ర ప్రసాద్
పట్టుదల, అకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేపడుతూ.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ వరల్డ్ సినిమాలను అందించిన విజయేంద్ర ప్రసాద్ శుక్రవారం నాడు తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వ సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. “ఇప్పుడే ఒక అద్భుతం చూశాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాన్ని కాదు, స్వయంగా చూశాను. అతి తక్కువ సమయంలో.. అతి తక్కువ బడ్జెట్లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారు. నిజం చెప్పాలంటే కేసీఆర్ ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు. అది ఆయనకే సాధ్యం. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఉపయోగపడే నిర్మాణం. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నాను' అంటూ ఆనందం వ్యక్తం చేశారు విజయేంద్ర ప్రసాద్. చదవండి: పుష్ప శ్రీవల్లితో ఐశ్వర్య రాజేశ్ పంచాయితీ.. స్పందించిన రష్మిక -
‘నాతో నేను’ టైటిల్ బాగుంది: విజయేంద్రప్రసాద్
సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్ ఇటీవల ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. ‘టైటిల్ బాగుంది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’ అని అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ ‘మంచి కథతో శాంతికుమార్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’అని అన్నారు. దర్శకుడు శాంతికుమార్ మాట్లాడుతూ ‘ఓ మంచి కథ రాసి మొదటి నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ నచ్చి వెంటనే అంగీకరించారు. నా తొలి ప్రయత్నానికి సాయికుమార్ గారు అండగా ఉన్నారు. చక్కని సలహా సూచనలు అందిస్తున్నారు. మంచి కథ రాశాను.. దానిని చక్కగా తెరపై చూపిస్తానని, ఆ దిశగా కృషి చేస్తానని చెబుతున్నాను’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథనచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. బిజీగా ఉండి కూడా మా ఆహ్వానం మేరకు విచ్చేసిన విజయేంద్రప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులకు మంచి సినిమా చూపించబోతున్నాం’ అని అన్నారు. -
అలాంటి చిత్రాలకు అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది: విజయేంద్ర ప్రసాద్
గత కొంతకాలంగా ఆపేసిన నంది అవార్డులను ఇచ్చి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. అవార్డులు ఇవ్వడం ద్వారా తెలంగాణ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా- 2023 వేడుకలు దుబాయ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్రప్రసాద్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాటోగ్రాఫర్ కె.కె సెంథిల్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్‌గా నంది అవార్డులు కేటాయిస్తే బాగుంటుందని నా ఆలోచన. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరిజం స్పాట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం ఇక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది.' అని అన్నారు. టీయస్‌ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ...' ప్రతాని రామకృష్ణ ఇస్తోన్న అవార్డ్స్‌కు ప్రభుత్వం తరఫు నుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ ఉంటుంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.' అని అన్నారు. ఈ కార్యక్రమంంలో ప్రసన్న కుమార్, కెయల్ఎన్ ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, వంశీ , శ్రీశైలం , నటి శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచవ్యాప్తంగా తెలుగుచిత్ర రంగానికి గుర్తింపు
-
అందుకే శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది: విజయేంద్ర ప్రసాద్
‘‘చిన్నప్పుడు నేను శ్రీలేఖకు ఒక ఆశ చూపించాను. ఆ ఆశ కోసమే తను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది. మంచి పాటలతో ప్రేక్షకులను అలరించింది. శ్రీలేఖ అన్న కీరవాణి సంగీతంలో ఆస్కార్ రేసులో ఉన్నారు. తన అన్నలానే శ్రీలేఖ కూడా ఆస్కార్ అంతటి అవార్డు అందుకోవాలి’’ అన్నారు రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్. ‘నాన్నగారు’ (1994) సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయమైన శ్రీలేఖ ఇప్పటి వరకూ 5 భాషల్లో 80 చిత్రాలకుపైగా సంగీతం అందించారు. ఆమె సినిమా రంగంలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25 దేశాల్లో 25మంది సింగర్స్‌తో ఈ నెల 17 నుంచి ‘వరల్డ్ మ్యూజిక్ టూర్’ని స్టార్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఆస్తులు సంపాదించకపోయినా నా పాటలతో ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఓ సాథియా మోషన్ పోస్టర్
ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ ఓ సాథియా. ఈ సినిమా నిర్మాత, డైరెక్టర్ మహిళలు కావటం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్‌పై చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. జి జాంబీ అనే చిత్రంతో ఇప్పటికే హీరో పరిచయం అయిన ఆర్యన్ గౌర్‌కు ఇది రెండవ సినిమా. ఇటీవల ఈ మూవీ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ లెజెండరి రైటర్, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందన అభిస్తోంది. మోషన్ పోస్టర్ వన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ప్యూర్ లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకు విన్ను సంగీతం అందించారు. ఈ మోషన్ పోస్టర్‌కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ నుంచి రెండోపోస్టర్ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. It's 1Million + Views for our First look Motion poster..Thanks for the immense response #osaathiya #motionposter@AryanGowra @IMishtii pic.twitter.com/uVahXwzYCK — Thanvika Jashwika Creations (@tjcreations123) January 9, 2023 -
సీక్వెల్స్ ఉన్నాయి!
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇప్పటికే ఇది ‘యాక్షన్ అడ్వంచరస్’ మూవీ అని ఆయన పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉంటాయన్నారు. ప్రధానపాత్రలు అలాగే ఉంటాయని, సీక్వెల్స్ కథ మారుతుంటుందని స్పష్టం చేశారాయన. ప్రస్తుతం తొలి భాగానికి సంబంధించిన కథను పూర్తి చేసే పని మీద ఉన్నారు విజయేంద్రప్రసాద్. ఇక మహేశ్ అద్భుత నటుడని, యాక్షన్ సీన్స్ బాగా చేస్తారని, ఏ రచయితకైనా ఆయనకు రాయడం బాగుంటుందని, ఈ చిత్రానికి హీరోగా తనే బెస్ట్ చాయిస్ అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యే అవకాశం ఉంది. -
మహేష్, జక్కన్న మూవీ పై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ..
-
రాజమౌళి అంత సక్సెస్ విశాల్ అందుకోవాలి
‘‘సినిమా కథకి ఎంత బడ్జెట్ అయినా, షూటింగ్‌కి ఎన్ని రోజులు పట్టినా చేయాలనే జబ్బు విశాల్‌కి ఉంది. ఆ జబ్బు మా అబ్బాయి రాజమౌళి నుంచి విశాల్‌కి అంటుకుంది (నవ్వుతూ). రాజమౌళి ఎంత సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా అంతే సక్సెస్ అందుకోవాలి’’ అని ప్రముఖ రచయిత–దర్శకుడు, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ అన్నారు. విశాల్, సునయన జంటగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాఠీ’. రానా ప్రొడక్షన్స్ పై రమణ, నంద నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘వినోద్ కుమార్ గురించి ‘లాఠీ’ విడుదలయ్యాక సిల్వర్ స్క్రీనే చెబుతుంది. రమణ, నంద చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. నా ప్రతి సినిమాలానే ‘లాఠీ’ని ఎంత మంది చూస్తారో టికెట్‌కి రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను’’ అన్నారు. ‘‘లాఠీ’ యాక్షన్ అడ్వంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ’’ అన్నారు వినోద్ కుమార్. ‘‘ఈ సినిమాతో విశాల్‌కి జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రమణ. మాటల రచయిత రాజేష్ ఎ.మూర్తి, పాటల రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. -
హెబ్బా పటేల్ 'బ్లాక్ అండ్ వైట్' టీజర్ అవుట్
కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం బ్లాక్ అండ్ వైట్ (Black and white). ఎన్‌ఎల్‌వీ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘నో కమిట్మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్‌తో టీజర్ షురూ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
టాలీవుడ్ హబ్‌ను ఏర్పాటు చేయాలి: విజయేంద్ర ప్రసాద్
‘‘తెలుగులో ‘టాలీవుడ్ హబ్’ ఏర్పాటు చేయాలి. దీని కోసం దక్షిణ భారత చిత్రనిర్మాతలు, దర్శకులు తదితరులను ఆహ్వానించాలి. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్, ఇతర సినిమా అసోసియేషన్స్ సహకారంతో హైదరాబాద్‌లో సభ నిర్వహించాలి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీగారిని ఆహ్వానించాలి’’ అన్నారు రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్. గురువారం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యాలతయానికి వెళ్లిన విజయేంద్ర ప్రసాద్‌ను నిర్మాతల మండలి తరఫున ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల సత్కరించారు. -
1770: రాజమౌళి శిష్యుడి డైరెక్షన్లో పాన్ ఇండియా చిత్రం
ఇండియన్ సినిమా వైవిధ్య కథా చిత్రాల కోసం తపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా చారిత్రక, జానపద, పౌరాణిక, ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుందా అని అనిపిస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ఘన విజయాలు దీనికి కారణం కావచ్చు. అలాంటి చారిత్రక ఇతివృత్తంతో 1770 అనే పాన్ ఇండియా చిత్రానికి బీజం పడింది. దీనికి రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించబోతున్నారు. ప్రఖ్యాత రచయిత బకించంద్ర చటర్జీ రాసిన అనందమత్ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, కథనాలను అందిస్తున్నారు. దీనిని నిర్మాతలు శైలేంద్ర కువర్, సుజాయ్ కుట్టి, పి.కృష్ణకుమార్, సరజ్ శర్మ కలిసి ఎస్ఎస్ 1 ఎంటర్టైన్మెంట్, పీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. కాగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ధ్వనిస్తున్న వందేమాతరం గీతంతో కూడిన టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ మొదలగు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. నవరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రవన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఆరెస్సెస్‌పై త్వరలో సినిమా: విజయేంద్ర ప్రసాద్
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై త్వరలో సినిమాతోపాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్‌మాధవ్ రచించిన ‘ది హిందూత్వ పారడైమ్’ పుస్తక పరిచయ కార్యక్రమం విజయవాడలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో మంగళవారం జరిగింది. సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం వరకూ ఆర్ఎస్ఎస్పై తనకున్న భావన వేరని, దానిపై చిత్రాన్ని తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్‌పూర్ వెళ్లి వాస్తవాలను తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానని వివరించారు. ఇదీ చదవండి: ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్ -
సల్మాన్ కోసం స్టోరీ రాయలేదు: విజయేంద్ర ప్రసాద్
సల్మాన్ ఖాన్ కెరీర్లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రం ‘బజరంగీ భాయిజాన్’. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు(2015, జూలై 17న విడుదలైంది). ఈ సందర్భంగా సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ‘‘చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ స్ఫూర్తితో ‘బజరంగీ భాయి జాన్’ కథ రాశాను. అయితే కథ రాస్తున్నప్పుడు ఎవరినీ మనసులో ఊహించుకోలేదు.ఆ తర్వాత సల్మాన్‌కి నచ్చడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్ ఉంటుంది. తొలి భాగం ముగిసిన 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల తర్వాత రెండో భాగం కథ ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య విద్వేషాలు తగ్గేలా స్టోరీ రాశాను’’ అన్నారు. ఈ చిత్రానికి ‘పవనపుత్ర భాయిజాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. -
ఆర్జీవీపై ప్రశంసలు కురిపించిన రచయిత విజయేంద్ర ప్రసాద్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రమఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. నిన్న(బుధవారం) జరిగిన అమ్మాయి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివ సినిమా నాటి దర్శకుడు మళ్లీ కనిపించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పది నెలల క్రితం కనబడుట లేదు మూవీ ఆడియో ఫంక్షన్‌కు తనని అతిగా పిలిచారని, అదే కార్యక్రమానికి వర్మ కూడా వచ్చాడన్నారు. ఆ సందర్భంగా దాదాపు 15 ఏళ్ల పాటు వర్మపై తనలో గూడుకట్టుకంటున్న కోపం, చిరాకు, బాధ, అసహ్యం అన్ని కలిపి ఆరోజు ఒక్కసారిగా బయటకు తీశానన్నారు. చదవండి: లండన్‌లో సీక్రెట్‌గా హీరో పెళ్లి..! ‘‘శివ సినమా చూశా. ఎంతో స్ఫూర్తి పొందా. వందల మంది రచయితలు, డైరెక్టర్లు, టెక్నిషియన్లు వర్మ వల్ల ప్రేరణ పొంది ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆనాటి వర్మ కనిపించడం లేదు. మీకు కనిపిస్తే చెప్పండి మళ్లీ శివ లాంటి సినిమా తీయమని’’ అన్నాను అని గుర్తు చేసుకున్నారు . అయితే ‘ఆ రోజు ఇలా అనొచ్చో లేదో కానీ నాలోని ఆవేశం అలా అనిపించేలా చేసింది. కానీ ఇప్పుడు అమ్మాయి సినిమా చూస్తుంటే నాకు శివ నాటి వర్మ మళ్లీ కనిపించారు. ఇప్పుడు గర్వం చెబుతున్నా.. వర్మ గారు మీలో ఆనాటి డైరెక్టర్ నాకు మళ్లీ కనిపించారు. శివ కంటే వంద రెట్లు ఎక్కువగా కనిపించారు. ఈ సినిమా 40వేల థియేటర్లో విడుదలవ్వడమంటే సాధారణ విషయం కాదు. చదవండి: దాని కోసం నేను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వచ్చింది: రెజీనా నిజంగా ఇది అద్భుతమైన విషయం. ఈ ఘనత ఇప్పటి వరకూ ఎవరు సాధించలేదు. మన తెలుగు వారందరికి ఇది గర్వకారణం’ అంటూ వర్మను కొనియాడారు. అనంతరం విజయేంద్ర వ్యాఖ్యలపై వర్మ ఆనందం వ్యక్తం చేశారు. మీరన్న మాటలు తనకెప్పటికీ గుర్తుంటాయని, ఇవి తనకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అని వర్మ వ్యాఖ్యానించాడు. కాగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వర్మ లడిఖి మూవీని తెరకెక్కించాడు వర్మ. దీన్ని తెలుగులో ‘అమ్మాయి’గా విడుదల చేస్తున్నారు. పూజా భలేకర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు సంగీత దర్శకులు ఎమ్ఎమ్ కీరవాణి హజరయ్యారు. -
‘రజాకార్ ఫైల్స్’ సినిమా తీస్తారా..?
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ కథారచయిత, దర్శకుడు విజేయంద్ర ప్రసాద్‌తో ఆదివారం రాత్రి బీజేపీ సీనియర్ నేతలు తరుణ్‌ఛుగ్, బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘రజాకార్ ఫైల్స్’సినిమా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సిందిగా విజయేంద్ర ప్రసాద్‌ను బీజేపీ నేతలు కోరినట్టు చెబుతున్నారు. గతంలో ఆయన రజాకార్ల ఆగడాలపై దర్శకత్వం వహించిన ‘రాజన్న’సినిమాను గురించి వారు ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ అంశంపై సినిమాకు దర్శకత్వం వహించే విషయంపై విజయేంద్రప్రసాద్ స్పందన ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణకు సంబంధించిన ఈ అంశం, ఎదుర్కొన్న ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు, ప్రజలు పడిన బాధలపై కచ్చితంగా సినిమా తీయాలనే పట్టుదలతో బీజేపీ నాయకులున్నట్టు సమాచారం. గతంలో కశ్మీర్ ఫైల్స్ సినిమాను వీక్షించిన సందర్భంగా బండి సంజయ్ తప్పకుండా ‘రజాకార్ ఫైల్స్’సినిమా తీస్తామని ప్రకటించారు. దీనికి బలం చేకూర్చేలా తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ యత్నాలు ముమ్మరం తెలంగాణ చరిత్రతో ముడిపడిన అంశాలు, గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో పేదలపై జరిగిన అరాచకాలు, దాష్టీకాలపై ‘రజాకార్ ఫైల్స్’సినిమా తీసేందుకు ఏర్పాట్లు ఊపందుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివాదస్పదంగా మారడంతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘కశ్మీర్ ఫైల్స్’నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఈ సినిమా నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలతో ముడిపడిన ‘సెప్టెంబర్ 17 విలీనదినం’ప్రాముఖ్యతను వివరించడంతోపాటు భారతదేశంలో వివిధ సంస్థానాల విలీనంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జరిపిన కృషిని వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతున్నారు. -
రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే..
కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ స్వయానా పెదనాన్న కొడుకు. చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం.. తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు. వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే సాగింది. అనంతరం ఏలూరులో చదివారు. 1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు. బాహుబలి..ఆర్ఆర్ఆర్ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. -
రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషా, తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ను పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. సంబంధిత రంగాల్లో వారు అందించిన సేవలను కొనియాడారు. పీటీ ఉషా ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. ఇళయరాజా మధురమైన సంగీతంతో ప్రజలను రంజింపజేశారని గుర్తుచేశారు. భిన్నతరాల ప్రజలు ఆయన సంగీతాన్ని ఆస్వాదించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లో వీరేంద్ర హెగ్గడే అందిస్తున్న సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్‌కు సృజనాత్మక ప్రపంచంతో దశాబ్దాల అనుబంధం ఉందని, భారతదేశ ఘనమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం గమనార్హం. పాటల ‘పెద్ద’రాజా ‘పచ్చని చేల పావడ గట్టి...కొండమల్లెలే కొప్పున బెట్టి.. వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని..’వంటి అత్యద్భుత గీతానికి అంతే అద్భుతంగా బాణీలు సమకూర్చి పాటకు అమృతత్వాన్ని సాధించిపెట్టారు ఇళయరాజా. ఇలాంటి పాటలెన్నో ఆయన పాటల పూదోటలో అలా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ పాటలోని ‘పచ్చని చేల’కు ఇళయరాజా జీవితానికి మధ్య సంబంధం ఎంతో బలమైంది. ఇళయరాజాకు పాటపై మక్కువ ఏర్పడింది, ఆయన్ను సంగీతం వైపు అడుగులేయించింది ఈ పచ్చని చేలల్లో రైతులు, కూలీలు పాడే పాటలే. ‘అన్నక్కిళి’తర్వాత బిజీ సంగీత కచేరీల్లో పాల్గొంటూ మరోవైపు పశ్చిమ బెంగాల్‌కి చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా చేశారు ఇళయరాజా. కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ దగ్గర దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా చేశారు. ఇక తమిళ చిత్రం ‘అన్నక్కిళి’తో (1976)తో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా మారారు. ‘అన్నక్కిళి’నిర్మాత పంజు అరుణాచలం రాజాకి ‘ఇళయ’(యంగ్ అని అర్థం) అని చేర్చి ‘ఇళయరాజా’గా మార్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో దాదాపు 1,500 చిత్రాలకు 7 వేల పాటలకు పైగా స్వరపరిచారు ఇళయరాజా. 2010లో భారత ప్రభుత్వం ఇళయరాజాను ‘పద్మభూషణ్‘, 2018లో ‘పద్మ విభూషణ్‘పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి. ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’, తమిళ చిత్రం ‘సింధుభైరవి’, మలయాళ ‘పళసి రాజా’చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. మధురైలోని పన్నైపురమ్‌లో జననం 1943 జూన్ 3న తమిళనాడులోని మధురైలో గల పన్నైపురమ్‌లో రామస్వామి, చిన్నతాయమ్మాళ్ దంపతులకు మూడవ సంతానంగా జ్ఞాన దేశిగన్ (ఇళయరాజా) జన్మించారు. స్కూల్లో చేర్చేటప్పుడు ‘రాసయ్యా’అని మార్చారు. 14వ ఏటనే ఇళయరాజాకి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. దాంతో సోదరుడు పావలార్ వరదరాజన్ నిర్వహించే సంగీత బృందంతో ఊరూరూ తిరుగుతూ కచేరీలు ఇచ్చేవారు. ఆ సమయంలోనే భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా తమిళ కవి కన్నదాసన్ రాసిన పాటకు బాణీ కట్టారు. తీవ్ర వేదనతో సాగే ఈ పాట ఎంతోమంది మనసుల్ని కదిలించింది. 1968లో మద్రాసులో ధన్‌రాజ్ మాస్టర్ వద్ద సంగీతం అభ్యసించారు. ధన్‌రాజ్ మాస్టర్ రాసయ్యా పేరుని ‘రాజా’గా మార్చారు. రాజ్యసభకు ‘కథ’ల బాహుబలి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో 1942 మే 27న జన్మించారు. ఆయన పూర్తిపేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్. కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్ణణంలో చదువుకున్న విజయేంద్ర ప్రసాద్ తన అన్నయ్యతో కలసి విశాఖపట్టణంలో కాంట్రాక్ట్ పనులు చేసేవారు. అక్కడే రాజనందినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న తన దగ్గరి బంధువు, అన్నయ్య అయిన పాటల రచయిత శివశక్తి దత్తా (సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) వద్దకు చేరారు. దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద విజయేంద్ర ప్రసాద్‌ని అసిస్టెంట్ రైటర్‌గా చేర్పించారు శివశక్తి దత్తా. మూడేళ్లు అసిస్టెంట్ రైటర్‌గా చేసిన ఆయన శివశక్తి దత్తాతో కలిసి ‘జానకి రాముడు’సినిమాకి తొలిసారి కథ రాశారు. ‘బంగారు కుటుంబం’, ‘బొబ్బిలి సింహం’సినిమాలకు కథలు రాశారు. ‘బొబ్బిలి సింహం’చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు కథలు అందించారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’చిత్రాలకు కథలు అందించారు. 1996లో అన్నయ్య శివశక్తి దత్తాతో కలిసి ‘అర్ధాంగి’, ‘శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ’చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రాజన్న’చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు అందుకున్నారు. హిందీ ‘బజరంగీ భాయీజాన్’సినిమాకి బెస్ట్ స్టోరీ విభాగంలో ‘ఫిల్మ్‌ఫేర్’తో పాటు, ‘ది ఐకానిక్ ట్రేడ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ 2015’, ‘సోనీ గిల్డ్ 2016’అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ సతీమణి రాజనందిని 2012 అక్టోబర్ 21న మరణించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు. ‘‘విజయేంద్రప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేశాయి. రాజ్యసభకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు’’అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవే శ్వాసగా.. లక్షల మందికి ఆరాధ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్గడే కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలోనూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన డాక్టర్ వీరేంద్ర హెగ్గడేను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఆయన 1948 నవంబర్ 25న దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్లో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమ్మ, రత్నవర్మ హెగ్గడే. వీరేంద్ర హెగ్గడేకు భార్య హేమావతి హెగ్గడే, కుమార్తె శ్రద్ధ హెగ్గడే ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం కేవలం 20 ఏళ్ల వయసులో 1968 అక్టోబర్ 24న ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా(పాలకుడు) బాధ్యతలు స్వీకరించారు. గత ఐదు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గ్రామీణాభివృద్ధి, ప్రజల స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రూరల్ డెవలప్మెంట్, సెల్ఫ్–ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఆర్డీఎస్ఈటీఐ)ని నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి తగిన శిక్షణ అందిస్తున్నారు. అలాగే కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 6 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. 49 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్టును డాక్టర్ హెగ్గడే నెలకొల్పారు. 25కు పైగా పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నారు. హెగ్గడేకు ధర్మరత్న, ధర్మభూషణ అనే పేర్లు కూడా ఉన్నాయి. లక్షలాది మందికి ఆరాధ్యుడిగా కొనసాగుతున్నారు. పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ఇళయరాజాపై అభినందనల వర్షం రాజ్యసభకు వెళ్లబోతున్న సంగీత దిగ్గజం ఇళయరాజాపై అభినందనల వర్షం కురుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, సూపర్‌స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. అసాధారణ సంగీత కళాకారుడు ఇళయరాజా వివిధ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారని రాజ్‌భవన్ ట్వీట్ చేసింది. ప్రియమైన మిత్రుడు ఇళయరాజాకు అభినందనలు అని రజనీకాంత్ పేర్కొన్నారు. ఇళయరాజాను ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ కూడా అభినందించారు. దేశాన్ని గర్వపడేలా చేశారు: అమిత్ షా ప్రముఖులు పీటీ ఉషా, ఇళయరాజా, డాక్టర్ వీరేంద్ర హెగ్గడే,విజయేంద్ర ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలియజేశారు. అంకితభావం, నిరంతర శ్రమతో వారు దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎగువ సభకు వెళ్లబోతున్న వారికి అభినందనలు తెలిపారు. Shri V. Vijayendra Prasad Garu is associated with the creative world for decades. His works showcase India's glorious culture and have made a mark globally. Congratulations to him for being nominated to the Rajya Sabha. — Narendra Modi (@narendramodi) July 6, 2022 Shri Veerendra Heggade Ji is at the forefront of outstanding community service. I have had the opportunity to pray at the Dharmasthala Temple and also witness the great work he is doing in health, education and culture. He will certainly enrich Parliamentary proceedings. pic.twitter.com/tMTk0BD7Vf — Narendra Modi (@narendramodi) July 6, 2022 The creative genius of @ilaiyaraaja Ji has enthralled people across generations. His works beautifully reflect many emotions. What is equally inspiring is his life journey- he rose from a humble background and achieved so much. Glad that he has been nominated to the Rajya Sabha. pic.twitter.com/VH6wedLByC — Narendra Modi (@narendramodi) July 6, 2022 The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc — Narendra Modi (@narendramodi) July 6, 2022 -
ప్రేక్షకులను మెప్పించడానికి వందశాతం కష్టపడతా : వీజే సన్నీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ కొత్త చిత్రం ప్రారంభమైంది. అన్‌స్టాపబుల్ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్), ఏ 2 బి ఇండియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్లో రంజిత్ రావ్.బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సప్తగిరి, పొసాని కృష్ణమురళి, పృద్వి, షకలక శంకర్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్ తదితరులు పాల్గొన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ హీరో వి.జె సన్నీ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత నటుడుగా నేను ప్రూవ్ చేసుకోవా లని వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమా చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను వందశాతం కష్టపడి పని చేస్తాను. రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఈ సినిమాకు త్రిమూర్తులు వంటి నిర్మాతల తో పాటు మంచి టీం దొరికారు. సీనియర్ నటులతో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అంకితం చేస్తున్నానని దర్శకుడు డైమండ్ రత్నబాబు అన్నారు. జూన్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ చేసి జూన్,జులై నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకొని దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ఇకపై తమ బ్యానర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేసే మంచి చిత్రాలను తీసుకొస్తామని అన్నారు నిర్మాత రంజన్ రావు బి. ఈ చిత్రానికి బీమ్స్ సంగీతం అందిస్తున్నారు. -
కాలం మారిన ఆ వ్యవస్థ మారట్లేదు: విజయేంద్ర ప్రసాద్
Vijayendra Prasad Unveils Sharapanjaram First Song: గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగింది ? ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘శరపంజరం’. నవీన్ కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. లయ హీరోయిన్‌కు యాక్ట్ చేస్తున్నారు. నవీన్ కుమార్, టి. గణపతి రెడ్డి, మల్లిక్ ఎంవీకే నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ఫస్ట్ గ్లింప్స్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, 4 నిమిషాల వీడియోను మామిడాల హరికృష్ణ, దర్శకుడు వేణు ఊడుగుల రిలీజ్ చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కాలం మారినా కొన్ని చోట్ల జోగిని వ్యవస్థ లాంటి దూరాచారాలు కొనసాగుతున్నాయి. వాటిని రూపు మాపే క్రమంలో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా 12 ఏళ్ల కల’’ అని పేర్కొన్నారు నవీన్ కుమార్ గట్టు. ‘‘మా సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు మల్లిక్, గణపతి రెడ్డి ఆశాభావం తెలిపారు. -
నటుడు బ్రహ్మాజీ కొడుకు హీరోగా మరో సినిమా..
Actor Brahmaji Son Sanjay Rao New Movie Shooting Launched: నటుడు బ్రహ్మాజీ తనయుడు, 'ఓ పిట్టకథ' ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రంతో ఏఆర్ శ్రీధర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీరామనవమి పండగ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సోహైల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ ఇచ్చారు. రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును యూనిట్‌కి అందించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ జె. రెడ్డి కెమెరా వర్క్ చేయగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. లైన్ ప్రొడ్యూసర్‌గా రమేష్ కైగురి, సహ నిర్మాతలుగా చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం వ్యహరించారు. చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ -
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉందా? విజయేంద్రప్రసాద్ ఏం చెప్పారంటే?
దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చగా, కథను విజయేంద్రప్రసాద్(రాజమౌళి తండ్రి) అందించాడు. మార్చి 25న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ రికార్డులే టార్గెట్‌గా దూసుకెళ్తోంది . జక్కన్న మ్యాజిక్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పవర్‌పుల్ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు 710 కోట్ల(గ్రాస్) రూపాయల వసూళ్ల రాబట్టి.. సరికొత్త రికార్డుని సృష్టించింది. ఆర్ఆర్ఆర్ కొనసాగింపు ఉంటే కూడా బాగుంటుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఓ రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి అడిగాడు. నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్, రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్ రావొచ్చు’అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక మహేశ్‌బాబు సినిమాను రూ.800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట కదా అని అడగ్గా.. ఇంకా కథే సిద్ధం చేయలేదు..అప్పుడే బడ్జెట్ ఎలా అంచానా వేస్తాం. అదంతా అబద్దమే. కథ సిద్ధం చేస్తున్నా’అని అన్నారు. -
ఆ కథ వేరేవాళ్లకు ఇవ్వడంతో రాజమౌళి ఏడ్చేశాడు!
తెలుగు ఇండస్ట్రీకి చిరకాలం గుర్తుండిపోయే హిట్లను అందించాడు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. తన కుమారుడు రాజమౌళి ప్రతి సినిమాకీ కథ అందిస్తున్న ఆయన రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్కు కూడా రచయితగా పని చేశారు. తాజాగా ఆయన మూవీ ప్రమోషన్లలో భాగంలో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తను రాసిన కథ వేరొకరికి ఇచ్చినప్పుడు రాజమౌళి బాధపడ్డాడని పేర్కొన్నారు. 'భజరంగీ భాయ్‌జాన్ కథ సల్మాన్‌కు చెప్పాననగానే రాజమౌళి కళ్లలో నీళ్లు తిరిగాయి. అతడు కంటనీరు పెట్టుకోవడం చూసి ఆ కథ నీకు ఉంచేయనా? అని అడిగాను. కానీ అతడు లేదు, వారికే ఇచ్చేయండి అని చెప్పాడు. చివరకు ఈ సినిమా రిలీజయ్యాక నా కొడుకు ఏమన్నాడంటే.. బాహుబలి పార్ట్ 1లో రెండు వేల మంది ఆర్టిస్టులతో ఫైట్ సీన్ జరుగుతోంది. అది రోహిణి కార్తె, ఎండలు మండిపోతున్నాయి. మంచి కాక మీదున్నప్పుడు అడిగారు. 15 రోజులు ముందో లేదా 15 రోజులు తర్వాతో అడిగినా ఆ కథ నేనే తీసేవాడిని అన్నాడు' అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. ఇక ఈ సినిమా మొదట ఆమిర్ ఖాన్‌కు వినిపించగా ఆయన కథ బాగుందన్నాడు కానీ పాత్రకు కనెక్ట్ కాలేకపోతున్నానని తిరస్కరించాడని తెలిపారు. ఆ తర్వాత ఇది సల్మాన్ దగ్గరకు వెళ్లిందని పేర్కొన్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్ రాకతో సైడ్ అయిపోయిన సినిమాలు, ఎన్ని స్క్రీన్లలో రిలీజంటే? -
వారిద్దరూ ఫైట్ చేస్తుంటే నాకు కన్నీళ్లొచ్చాయి..!
Vijayendra Prasad In RRR Movie Promotions: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్‌లో ఇన్నాళ్లూ అందరూ కనిపిస్తున్నారు కానీ ఈ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఎక్కడా కనిపించ లేదు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన కనిపించలేదు. ఇక ఇప్పుడు ఆయన కూడా 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా ఇంటర్వెల్‌పై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ కథలో చరణ్, తారక్‌లు ఇద్దరూ ప్రాణమిత్రులు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత మంచి స్నేహితులు కానీ ఇరువురి ఐడియాలజీ వేరు. సినిమా మొదట్లోనే ఇద్దరూ దక్షిణ ద్రువం, ఉత్తర ద్రువం అని ఎక్కడొకచోట క్లాష్ వస్తుందని తెలుసు కానీ రాకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ వచ్చిన తరువాత కొండల్లో రెండు సింహాలు దెబ్బలాడుకుంటూ ఉంటే చూసి ఎంజాయ్ చేయాలి కానీ నాకు ఏడుపొచ్చింది. ఇలా తాను 'ఆర్ఆర్ఆర్' సినిమా రష్ ఐదు సార్లు చూసానని కానీ చూసిన ప్రతిసారీ తనకు కన్నీళ్లొచ్చాయని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. -
క్రేజీ న్యూస్: రాజమౌళి దర్శకత్వంలో బన్ని..!
హీరో అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయా? అంటే అవుననే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రూల్’ గత ఏడాది థియేటర్స్‌లో మంచి విజయం సాధించింది. ‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్’ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈలోపు తన తర్వాతి సినిమాలకు సంబంధించిన పనులపై ఫోకస్ పెట్టినట్లున్నారు అల్లు అర్జున్. ఇందులో భాగంగానే ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని అల్లు అర్జున్ కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భన్సాలీ–బన్నీ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందనే టాక్ బీటౌన్‌లో మొదలైంది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త తెరపైకి వచ్చింది. అయితే రాజమౌళి తర్వాతి సినిమా మహేశ్‌బాబుతో చేయాల్సి ఉంది. ఈ సినిమా పూర్తయ్యాకే అల్లు అర్జున్‌తో సినిమా చేస్తారట. ఈలోపు ‘పుష్ప: ది రైజ్’, భన్సాలీతో సినిమాలను అల్లు అర్జున్ పూర్తి చేస్తారట. ఇలా అల్లు అర్జున్, రాజమౌళి వారి వారి కమిట్మెంట్స్ను పూర్తి చేసుకున్న తర్వాత వీరి కాంబినేషన్ సినిమా సెట్స్‌పైకి వెళుతుందనే టాక్ వినిపిస్తోంది. -
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుహాసిని ‘ఫోకస్’ ఫస్ట్‌లుక్
విజయ్ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలలో జి. సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫోకస్’. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథ-కథనాలతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, వేలంటైన్స్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫోకస్ మూవీ నుంచి సీనియర్ నటి సుహాసిని మణిరత్నం స్పెషల్ లుక్ పోస్టర్‌ను సినీ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్యతేజ తన డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై `ఫోకస్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌శంకర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడే టీజర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్రలు చాలా ఉన్నాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ.. ‘నేను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం `ఫోకస్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్‌ను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన విజయేంద్రప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. భాను చందర్, షియాజీ షిండే, జీవా, సూర్య భగవాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
శ్రీవారి ఫిలిమ్స్ కథా రచనలో విజయేంద్ర ప్రసాద్?
శ్రీవారి ఫిలిమ్స్ సంస్థ కోసం బాహుబలి వంటి పలు చిత్రాలకు కథను అందించిన ప్రఖ్యాత రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్దం చేయడానికి అంగీకరించారన్నది తాజా సమాచారం. ఈయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ చిత్రాలకు అందించిన కథలు అద్భుత విజయాలను సాధించాయి. కాగా అనేక చిత్రాలకు పంపీణీదారుడిగా వ్యవహరించిన పి. రంగనాథన్ నిర్మాతగా మారి తమిళంలో యోగిబాబు కథానాయకుడిగా ధర్మప్రభు, గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా ఆనందం విళైయాడు వీడు చిత్రాలను నిర్మించారు. తాజాగా మూడవ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనాలు అందించడానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అంగీకరించినట్లు పి.రంగనాథన్ మంగళవారం అదికారికంగా మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ భారీ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. Proud to announce that Legendary writer #KVVijayendraPrasad to pen Story & Screenplay for Our Next Production Venture. #SVFNext @onlynikil pic.twitter.com/EQFsCOFI2q — Sri Vaari Film (@srivaarifilm) January 18, 2022 -
సల్మాన్‌తో రాజమౌళి సినిమా? క్లారిటీ ఇచ్చిన సల్లూభాయ్
ముంబైలో ఇటీవల జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘భజరంగీ భాయిజాన్’ (2015) సీక్వెల్ కథను రచయిత విజయేంద్రప్రసాద్ (దర్శకుడు రాజమౌళి తండ్రి) తయారు చేస్తున్నట్లు హీరో సల్మాన్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘భజరంగీ భాయిజాన్’ సీక్వెల్‌కు ‘పవన్ పుత్ర భాయిజాన్’ టైటిల్‌ని విజయేంద్రప్రసాద్‌గారే చెప్పారు. (చదవండి: అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) నేను నటిస్తున్న ‘టైగర్ 3’ (షారుక్ ఖాన్ ఓ కీ రోల్ చేశారు) వచ్చే ఏడాది డిసెంబరులో విడు దల కావొచ్చు. ఈ చిత్రానికంటే ముందే నా స్నేహితుడు షారుక్ ఖాన్ చేస్తున్న ‘పఠాన్’ రిలీజ్ అవుతుందేమో! (‘పఠాన్’లో సల్మాన్ అతిథి పాత్ర చేశారు)’’ అన్నారు.‘‘నో ఎంట్రీ’ సినిమాకు సీక్వెల్ చేసే విషయం ఆలోచిస్తున్నాం. ఇక రాజమౌళివంటి గొప్ప దర్శకుడితో నా సినిమా ఖరారయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అన్నారు. -
ఆ డైరెక్టర్ కనబడుటలేదు.. ఆర్జీవీపై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఓ మూవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనకు ఆర్జీవీ ‘కనబడుటలేదు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘కనబడుటలేదు’. ఈ మూవీ ఆగస్టు 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు విజయేంద్రప్రసాద్, రామ్‌గోపాల్ వర్మలు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడిన విజయేంద్రప్రసాద్.. ఆర్జీవీలో తనకు మునుపటి దర్శకుడు ‘కనబడుటలేదు’ అని అన్నారు. ఈ మూవీ టైటిల్‌ను వర్మకు ఆపాదిస్తూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఒక మనిషి నాకు కనబడుట లేదు. సినిమా తీస్తానంటూ 1989లో ఓ యువ కెరటం వచ్చింది. ఎక్కడ పని చేసిన, సినిమా తీసిన అనుభవం లేదు. ప్యాషన్‌తో సినిమా తీశాడు. కాలేజీ కుర్రాళ్లతో సైకిల్ చెయిన్ పట్టించిన ఆ మనిషి నాకు కనబడటం లేదు. ఆ తర్వాత శ్రీదేవి అందాలను ఎవరూ చూపనంత గొప్పగా చూపించాడు. జామురాతిరి జాబిలమ్మ అనే పాటతో కుర్రకారుకు పిచ్చెక్కించిన ఆ డైరెక్టర్ నాకు కనబడటలేదు. అంతేగాక సత్య, రంగీలా లాంటి అద్భుతమైన సినిమాలు తీసి వందల మంది డైరెక్టర్లను, ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ వ్యక్తి నాకు కనబడుటలేదు. మళ్లీ అతన్ని చూడాలని ఉంది’ అంటూ ఆర్జీవీపై తనదైన కామెంట్స్ చేశారు. అయితే విజయేంద్రప్రసాద్ మాట్లాడుతున్నంత సేపు ఆర్జీవీ కింద కూర్చోని ముసిముసి నవ్వులు చిందించారు. -
భీమ్ గెటప్ ఓకే... మరి.. రామరాజు?
కొమురం భీమ్ ముస్లిమ్ గెటప్‌లో ఎందుకు కనిపించాడు? అసలు కథ ఏంటి? అనే చర్చకు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్స్టాప్ పడేలా చేశారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమాకీ కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా రచయిత. కాగా ఎన్టీఆర్ ముస్లిమ్ గెటప్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ‘‘నిజామ్ పోలీసులు తన కోసం గాలిస్తున్న సమయంలో తప్పించుకునే క్రమంలో భీమ్ తన వేషాన్ని మార్చుకుంటాడు. ముస్లిమ్ టోపీ పెట్టుకుంటాడు’’ అన్నారు విజయేంద్ర ప్రసాద్. దాంతో కొమురం భీమ్ ముస్లిమ్ గెటప్ గురించి అందరికీ స్పష్టత వచ్చేసింది. కానీ, అల్లూరి సీతారామరాజు పోలీస్ గెటప్‌లో ఎందుకు కనిపించాడు? అనే చర్చ మాత్రం కొనసాగుతోంది. సీతారామరాజు పాత్రను రామ్‌చరణ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి.. రామరాజు పోలీస్ గెటప్‌లోకి మారడానికి గల కారణం ఏంటీ? అంటే.. అదే ఇంటర్వ్యూలో ‘‘ఆ రహస్యం ప్రతి ప్రేక్షకుడినీ ఆశ్చర్యపరుస్తుంది’’ అన్నారు రచయిత. సో.. పోలీస్ గెటప్ గురించి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా అక్టోబరు 13న విడుదల కానుంది. -
మరో బాలీవుడ్ చిత్రానికి బాహుబలి రచయిత స్క్రిప్ట్
‘భజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’ వంటి బాలీవుడ్ హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి బాలీవుడ్లో ఒక బహుభాషా చిత్రానికి స్క్రిప్ట్ సమకూర్చుతున్నారు. ‘సీత... ది ఇన్కార్నేషన్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు. హ్యూమన్ బీయింగ్ స్డూడియోస్ సంస్థ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదలైన ‘సీత... ది ఇన్కార్నేషన్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీతాదేవి గురించి ఎవరికీ తెలియని విషయాల్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మనోజ్ ముంతాషీర్ మాటలు రాస్తున్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ చేయనున్నారట. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఇంకా ప్రకటించలేదు. అందుకే సీత పాత్రలో ఎవరు నటించనున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్ కథ అందించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. -
జాతీయ రహదారికి అవార్డులు రావాలి
‘‘నరసింహనంది మా దగ్గర చాలా సినిమాలకు పనిచేశాడు. అతని డెడికేషన్ నాకు చాలా ఇష్టం. తన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు పలు అవార్డులు గెలుచుకున్నాయి.. ‘జాతీయ రహదారి’ సినిమాకి కూడా అవార్డులతో పాటు రివార్డులు రావాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ముఖ్యపాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతీయ రహదారి’. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్‌ని విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘శతాధిక చిత్రనిర్మాతగా నాకు పేరున్నా తృప్తి కలగలేదు. నర సింహ నంది దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ‘జాతీయ రహదారి’ సినిమాతో నంది (ఆంధ్రప్రదేశ్), సింహ (తెలంగాణ ప్రభుత్వ పురస్కారం) అవార్డులు గెలుచుకోవడం ఖాయం’’ అన్నారు. నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు నేను 6 సినిమాలకు దర్శకత్వం వహించాను.. వాటిలో 4 సినిమాలకు జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డులు అందుకున్నాను. రామసత్యనారాయణగారికి ఈ కథ నచ్చి, నిర్మాణ బాధ్యతలు కూడా నా భుజంపై వేశారు. ఆయనతో మరో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకొంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంధ్య స్టూడియోస్, సంగీతం: సుక్కు, కెమెరా: మురళి మోహన్ రెడ్డి. -
యాక్షన్... కట్
కథానాయికగా తన ప్రతిభను చాటుకున్న కంగనా రనౌత్ ఇప్పుడు దర్శకురాలిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’లో టైటిల్ రోల్ చేసిన ఆమె ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘అపరాజిత అయోధ్య’ సినిమాతో పూర్తి స్థాయి దర్శకురాలిగా యాక్షన్, కట్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు కూడా. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. రామమందిరం కేసు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ సమాచారం. ఈ విషయంపై కంగనా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు ముందు నేను డైరెక్టర్‌గా ఉండాలనుకోలేదు. కేవలం కాన్సెప్ట్ లెవల్లో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాను. నేను నిర్మాతగా వేరొకరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాను. కానీ విజయేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు నాతో అసోసియేట్ అయినవారు నేను డైరెక్ట్ చేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. హిస్టారికల్ మూవీ ‘మణికర్ణిక’ చిత్రం డైరెక్షన్లో నా వంతు భాగం ఉంది. ‘అపరాజిత అయోధ్య’ను డైరెక్ట్ చేయడానికి ఆ అనుభవం ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు. ఇక నటిగా ‘తలైవి’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం), ‘థాకడ్’, ‘తేజస్’ అనే చిత్రాలు కంగనా చేతిలో ఉన్నాయి. -
తల్లిదండ్రుల ప్రేమను వెలకట్టలేం
నటుడు ఎం.ఎస్ చౌదరి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆది గురువు అమ్మ’. ‘సురభి’ ప్రభావతి, వేమూరి శశి, గోపరాజు విజయ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘దైవసమానులుగా భావించే తల్లిదండ్రుల ప్రేమను వెలకట్టలేం. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆమె తొలి గురువుగా బిడ్డకు అన్నీ నేర్పిస్తుంది. అలాంటి అమ్మపై రూపొందిన ‘ఆది గురువు అమ్మ’ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్ బాగుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ను విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్‌గారికి «ధ్యాంక్స్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు ఎం.ఎస్. చౌదరి. -
కామెడీ ఎంటర్టైనర్తో టాలీవుడ్ ఎంట్రీ
మళయాల సూపర్‌స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘1971బెయాండ్ బార్డర్స్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక అగర్వాల్ ఓ కామెడీ ఎంటర్టైనర్తో టాలీవుడ్‌కు స్ట్రయిట్ సినిమాతో పరిచయం అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. సప్తగిరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు స్వర్ణ సుబ్బారావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల తమిళనాడు కంచిలో ఈ సినిమాను పూజ కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కంచిలో షురూ
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, సమర్పిస్తున్న చిత్రం కంచిలో మంగళవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ‘హరేరామ్’ ఫేమ్ హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. రెయిన్బో మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శైలేష్ వసందాని నిర్మిస్తున్నారు. ప్రియాంక అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.శైలేష్ మాట్లాడుతూ–‘‘కామాక్షి అమ్మవారి దీవెనలతో కంచిలో మా సినిమాని లాంఛనంగా ప్రారంభించాం. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి, విజయేంద్రప్రసాద్, హర్షవర్థన్, శైలేష్‌తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సంతోష్ శానమొని. -
మోడ్రన్ దేవదాసుగా చైతూ
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మజిలీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు చైతూ. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు నాగచైతన్య ఓకె చెప్పాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడట. అంతేకాదు బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ నాగచైతన్య కోసం ఓ ప్రేమకథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా దేవదాసుకు మోడ్రన్ వర్షన్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కథా కథనాలు ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా సాగినా క్లైమాక్స్ మాత్రం దేవదాసు తరహాలోనే విషాదాంతమే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
నా కథ చూపిస్తా
ముక్కుసూటితనానికి మారు పేరు కంగనా.. వివాదాలకు చిరునామా కంగనా.. బాలీవుడ్లో కంగనా రనౌత్ గురించి ఇలానే చెప్పుకుంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కంగనా కొన్ని వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ముఖ్యంగా నెపోటిజమ్ (బంధుప్రీతి) పై ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో పెద్ద దుమారం రేపాయి. ఇక హీరో హృతిక్ రోషన్‌తో రచ్చ, ‘సిమ్రన్’ చిత్రంలో రచయితగా క్రెడిట్ తీసుకోవడం, తాజాగా ‘మణికర్ణిక’ చిత్రం డైరెక్షన్ క్రెడిట్ ఇష్యూ... ఇలా కంగనా జీవితంలో చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వీటన్నింటి కంటే ముందు ప్రతిభతో కంగనా బాలీవుడ్లో ఎదిగిన తీరు ప్రశంసనీయం. యువకథానాయికలకు స్ఫూర్తి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహించనుడటం విశేషం. ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారు. ‘‘నా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇండస్ట్రీలో ఏ పరిచయాలు లేకపోయినా ప్రతిభతో కష్టపడి పైకి ఎదిగి జీవితంలో విజయం సాధించిన ఓ అమ్మాయి కథ ఇది. ఇదేదో నా ప్రచారం కోసమో, నా గురించి గొప్పలు చెప్పుకోవడానికో తీస్తున్న సినిమా కాదు. నా నిజజీవితంలో ఉన్న కీలక పాత్రలు ఈ సినిమాలో ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు కంగనా. ప్రస్తుతం ‘పంగా’ సినిమాతో బిజీగా ఉన్నారామె. అలాగే ఆమె నటించిన ‘మెంటల్ హై క్యా’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ రెండు చిత్రాల పనులు పూర్తయ్యాక కంగనా బయోపిక్ మొదలవుతుందని టాక్. -
డైరెక్టర్ కంగనా
‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’.. కంగనా రనౌత్ నెక్ట్స్ రిలీజ్ ఇదే. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘పంగా’ అనే సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటించనున్నారు కంగనా రనౌత్. అశ్వనీ అయ్యర్ దర్శకురాలు. మరి.. ఆ తర్వాత కంగనా సినిమా ఏంటి? అంటే ఓ లవ్‌స్టోరీ అని బాలీవుడ్ తాజా టాక్. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి విభిన్నమైన లవ్‌స్టోరీతో ఈ చిత్రం రూపొందనుందట. ఇక హైలైట్ పాయింట్ ఎంటంటే... ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తారట. ఇటీవల ‘మణికర్ణిక’ సినిమా ప్యాచ్ వర్క్ కోసం కంగనా మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. -
మరో లోకంలో విహరిస్తారు
‘‘సంజీవని’ విజువల్స్ చూశా. రెండు సంవత్సరాలుగా యంగ్ బ్యాచ్ చాలా కష్టపడి మంచి అవుట్‌పుట్ సాధించారు. టైటిల్ ‘సంజీవని’ అని పెట్టడంలోనే వీరంతా సక్సెస్ సాధించేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ముఖ్య తారలుగా రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన చిత్రం ‘సంజీవని’. శ్రవణ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. రవి వీడే మాట్లాడుతూ –‘‘ఫస్ట్ టైమ్ భారత దేశంలో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో కలిసి రెండేళ్లు కష్టపడి తెరకెక్కించిన చిత్రం ‘సంజీవని’. తెలుగులో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి హాలీవుడ్ రేంజ్లో భారీ గ్రాఫిక్స్‌తో నిర్మించాం. మా సినిమాకి వచ్చిన ప్రేక్షకులు మరో లోకంలో విహరిస్తారని గ్యారంటీగా చెప్పగలను. జూన్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకడు కె.యం.రాధాకృష్ణ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ మామిడి హరికృష్ణ, ఆల్ ఇండియా రేడియో సీనియర్ ఎనౌన్సర్ శ్రీలక్ష్మీ ఐనంపూడి, లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ సినిమాకు బాహుబలి రచయిత
ప్రస్తుతం భారతీయ వెండితెర మీద రాజకీయ నేపథ్య చిత్రాల హవా కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దర్శక నిర్మాతలు రాజకీయ నేతలు, పార్టీల నేపథ్యంలో కథలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో యాత్ర, ఎన్టీఆర్ లాంటి సినిమాలు రెడీ అవుతుండగా ఇటీవల భరత్ అనే నేను రాజకీయ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించింది. త్వరలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చరిత్ర, సిద్ధాంతాలు, సాధించిన విజయాలను సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ పర్యవేక్షణలో దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాహుబలి, భజరంగీ బాయ్‌జాన్ సినిమాలతో జాతీయ స్థాయిలో స్టార్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. నటీనటుల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన నటీనటులను ఎంపిక చేయలాని నిర్ణయించారట. ప్రధాన పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. -
కామెడీ హీరో కోసం బాహుబలి రైటర్
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ త్వరలో ఓ కామెడీ హీరో సినిమాకు కథ అందించనున్నారట. బాహుబలి, భజరంగీ బాయ్‌జాన్ లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ తెలుగుతో పాటు పరభాషా చిత్రాలకు కూడా కథ అందిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ కామెడీ స్టార్ సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు ఆయన కథ అందించనున్నారట. ఈ సినిమాకు స్వర్ణ సుబ్బారావ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
జక్కన్న మైండ్‌లో ఇంకొక హీరో?
సాక్షి, సినిమా : టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్‌ను అనధికారికంగా ప్రకటించి.. ప్రేక్షకుల్లో దర్శకుడు రాజమౌళి పెంచిన ఆత్రుత అంతా ఇంతా కాదు. యంగ్ టైగర్-మెగా పవర్ స్టార్ కలయిక అనగానే ఆ వార్త సెన్సేషన్ అయి కూర్చుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి మరో హీరో కూడా వచ్చి చేరబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఈ కమర్షియల్ చిత్రంలో విలన్ పాత్ర కోసం ఓ హీరోను ఎంపిక చేసే ఆలోచనలో జక్కన్న ఉన్నాడంట. ‘‘రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతినాయకుడి పాత్రను కూడా కాస్త బలంగా ఉండేలా చూడాలని తండ్రిని జక్కన్న కోరాడంట. దీంతో విలన్ పాత్రను కూడా పాపులర్ నటుడితోనే చేయించాలన్న నిర్ణయానికి రాజమౌళి వచ్చాడు. అందుకోసం పేర్లును కూడా పరిశీలించటం మొదలుపెట్టేశాడు’’ అన్నది ఆ వార్త సారాంశం. ఏదిఏమైనా ఈ మల్టీస్టారర్‌పై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయని రాజమౌళి.. ఎన్ని వార్తలు వస్తున్నా అస్సలు స్పందించటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా స్క్రిప్ట్ పనులు చేసుకుంటూపోతూ ఏ క్షణంలోనైనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. -
రాజమౌళి కండిషన్ పెట్టాడు!
‘‘సక్సెస్ అవ్వాలనే దర్శకులు సినిమాలు తీస్తారు. కానీ, హిట్ అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. డైరెక్టర్‌గా సక్సెస్ కాలేకపోయాను. నెక్ట్స్ టైమ్ అవుతాను. డైరెక్టర్‌గా రాజమౌళితో పోటీ లేదు. నా దారిలో నేను సినిమాలు తీసుకుంటాను. నేను కథ రాసిన సినిమాలే టాప్‌లో ఉన్నాయంటే... అది దేవుడి దయ’’ అన్నారు విజయేంద్రప్రసాద్. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘మెర్సెల్’ తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదల కానుంది. ‘మగధీర, ఈగ, బాహుబలి, భజరంగీ భాయిజాన్’ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ‘మెర్సెల్’కు స్క్రీన్‌ప్లే అందించారు. త్వరలో ‘అదిరింది’ విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మెర్సెల్’లో మేం మెడికల్ సిస్టమ్ గురించి చెప్పాలనుకున్నాం. వైద్యం అనేది సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ పాయింట్‌పై కథ చేద్దాం అన్నారు అట్లీ. నేను ఎగై్జట్ అయ్యాను. తమిళంలో ‘మెర్సల్’ హిటై్టంది. అందులో నా వంతు పాత్ర ఉన్నందుకు ఆనందం పొందే హక్కు నాకు ఉంది. సినిమాపై వివాద స్వరాలు వినిపిస్తున్నాయి. అది పబ్లిసిటీకి ఫ్లస్ అవుతుందనుకుంటున్నా. తమిళ్లో ‘బాహుబలి’ హయ్యస్ట్ కలెక్షన్స్ గ్రాస్ చేసిందని విన్నాను. ‘మెర్సెల్’ ఆ కలెక్షన్స్ దాటుతుందనుకుంటున్నా. కలెక్షన్స్ స్పీడ్‌గా ఉన్నాయి’’ అన్నారు. ప్రస్తుతం రాస్తున్న కథల గురించి అడిగితే – ‘‘క్రిష్ తీస్తున్న ‘మణికర్ణిక’కు కథ ఇచ్చా. అస్సాంలో ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన రచిత్ కుల్‌బౌహిత్ జీవితం ఆధారంగా కథ రాస్తున్నా. అలాగే, ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోల్ వాల్కర్‌గారి బయోపిక్ రాస్తున్నాను. ‘నాయక్’ అనే హిందీ సినిమాకు సీక్వెల్ రాస్తున్నా. విక్రమార్కుడు సినిమా ‘రౌడీ రాథోడ్’గా బాలీవుడ్లో విడుదలైంది. ఆ సినిమాకు సీక్వెల్ రాస్తున్నాను’’ అన్నారు. నెక్ట్స్ రాజమౌళికి తీయబోయే సినిమాకి ఎలాంటి కథ ఇస్తారు అనడిగితే– ‘‘రాజమౌళితో సినిమా స్క్రిప్ట్ కోసం ఇంకా వెతుకులాటలోనే ఉన్నాం. రాజమౌళి పరిగెత్తి పాలు తాగే రకం కాదు. సక్సెల్లో ఉన్నప్పుడే సినిమాలు తీయాలను కోడు. ‘ఫలానా హీరో అని కాదు. ఇలాంటి జోనర్ అని కాదు. మీరు కథ చెప్పగానే సినిమా చేయాలనిపించే కథ చెప్ప’మంటున్నాడు రాజమౌళి. సినిమాలో గ్రాఫిక్స్ అవసరం లేదు. సీజీ వర్క్ కోసం టెక్నీషియన్స్ ఇంటికి రాకూడదనే కండీషన్ కూడా పెట్టాడు. నా శాయశక్తులా ట్రై చేస్తున్నాను. ఫలానా హీరో కోసం కథ రాయాలని లేదు. కథను బట్టే హీరో’’ అన్నారు. -
విజయేంద్ర ప్రసాద్‌తో సరదాగా కాసేపు
-
అది అతి పెద్ద యజ్ఞం
– విజయేంద్రప్రసాద్ ప్రస్తుత రోజుల్లో కొత్తవారితో సినిమా తీసి రిలీజ్ చేయడమే నా దృష్టిలో అతి పెద్ద యజ్ఞం. ఆ పనిని మా నిర్మాతలు విజయవంతంగా పూర్తిచేశారు. ముఖ్యంగా నాలాంటి తిక్కవాడితో సినిమా తీసి సక్సెస్ అయ్యారు’’ అని ప్రముఖ రచయిత, దర్శకులు విజయేంద్రప్రసాద్ అన్నారు. రజత్, నేహాహింగే జంటగా ఆయన దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ‘శ్రీవల్లీ’ విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీవల్లీ’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. రజత్ ఫేస్‌లో నెగటివ్ షేడ్స్ చూసి ఈ సినిమాలో హీరోగా అవకాశామిచ్చాను. మోహన్‌బాబు, చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు చాలా మంది విలన్‌గా మొదలై, గొప్ప నటులయ్యారు. వారి తరహాలోనే రజత్ అడుగులు వేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్ర విజయం మరిన్ని సినిమాల్ని రూపొందించడానికి మాలో ధైర్యాన్ని నింపింది’’ అన్నారు నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్. -
ఆ ఇద్దరికీ నేనే కథ రాయాలి.. రాజమౌళి తీయాలి!
‘ఇప్పటివరకూ నేను థ్రిల్లర్ కథ రాయలేదు. సరదాగా రాయాలనిపించి, ‘శ్రీవల్లీ’ రాశా. ఈ సినిమా చూసి, పరుచూరి గోపాలకృష్ణ ‘చాలా ట్విస్టులున్నాయి. ఒక్కదాన్నీ ముందే ఊహించ లేకపోయా. బాగుంది’ అన్నారు. ఆయన ప్రసంశ నాకు అవార్డులాంటిది’’ అన్నారు విజయేంద్రప్రసాద్. రజత్, నేహా హింగే జంటగా ఆయన దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ‘శ్రీవల్లీ’ ఈ శుక్రవారం రిలీజవుతోంది. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విశేషాలు. నాకు రమేశ్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. 2000 సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చాక మా ఫ్రెండ్షిప్ కట్ అయింది. ఓ వినాయక చవితి నాడు రమేశ్‌ని తలచుకున్నా. విజయవాడలో ఉన్నాడని తెలిసి వెళ్లా. తను చనిపోయాడని తెలిసింది. రమేశ్ కూడా నిన్ను చూడాలనుందంటూ వినాయక చవితిరోజే అనుకున్నాడని, డైరీలోనూ రాశాడని వాళ్ల అమ్మ నాకు చూపించారు. ఒకేరోజు మేం ఒకరిని ఒకరం తలచుకోవడం విచిత్రంగా అనిపించింది. అప్పుడు పుట్టిన కథ ‘శ్రీవల్లీ’. రాజమౌళి, క్రిష్, సుకుమార్, కోన వెంకట్‌లకు వినిపిస్తే, తర్వాత ఏం జరుగుతుంది? అని ఊహించలేకపోయారు. ∙‘మహాభారతం’ తీయాలన్నది రాజమౌళి లక్ష్యం. కనీసం ఐదారు పార్టులైతేనే న్యాయం జరుగుతుంది. ఆ సినిమా ఎప్పుడు తీస్తాడా? అని ఎదురు చూస్తున్నా. ∙చిరంజీవి, రామ్‌చరణ్ కలసి చేసే సినిమా కథ రాసే ఛాన్స్ నాకు రావాలి. ఆ సినిమాని రాజమౌళి తీయాలి. ‘శ్రీవల్లీ’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో చరణ్ బాగా మాట్లాడాడు. అందుకు తనకి థ్యాంక్స్. ∙మనకంటే తెలివైనోళ్లమని తమిళవాళ్ల ఫీలింగ్. ‘బాహుబలి’ తర్వాత ‘టాలీవుడ్‌లోనూ మంచి తెలివైనోళ్లు ఉన్నారు’ అంటున్నారు. తమిళంలో తొలిసారి ‘మెర్సల్’ అనే సినిమాకి స్టోరీ ఇచ్చా. ∙‘మణికర్ణిక’ కథ రాయమన్నప్పుడే నిర్మాతలకు క్రిష్ అయితేనే న్యాయం చేయగలడని చెప్పా. తెలుగులో ఒకటి, హిందీలో ఓ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నా. -
ఆ అవకాశం నాకూ రావాలి
– విజయేంద్రప్రసాద్ ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ అలనాడు దాశరథి నిజామాబాద్ కారాగారం సాక్షిగా నినదించారు. తెలంగాణది గొప్ప పోరాటాల చరిత్ర. తెలంగాణ తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకూ రావాలని కోరుకుంటున్నా’’ అని రచయిత–దర్శకుడు విజయేంద్రప్రసాద్ అన్నారు. ‘బందూక్’ ఫేమ్ లక్ష్మణ్ దర్శకత్వంలో లక్ష్మణ్ కొణతం నిర్మించనున్న ‘గులాల్’ మోషన్ పోస్టర్ని విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేశారు. ‘బందూక్’ లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి జీవిత క్రమాన్ని ఈ సినిమాలో ఐదు భాగాలుగా చూపించనున్నాం. కారణజన్ముడి జననం, బాల్యం మొదలుకొని ఉద్యమ ప్రస్థానం, బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పాలన ప్రధానాంశాలుగా ఈ చిత్రం ఉంటుంది. త్వరలో కేసీఆర్‌గారికి ఈ చిత్ర ఇతివృత్తాన్ని వివరించి, ఆయన అనుమతి తీసుకోవాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం అనేక మంది కవులు, మేధావులను కలుసుకున్నాం’’ అన్నారు లక్ష్మణ్ కొణతం. దర్శకుడు ఇ.నివాస్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, వల్లూరిపల్లి రమేష్, యుగంధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి కథలు ఇస్తుంటారు... రాజమౌళి మాటలు ఇచ్చారు!
దర్శకుడు రాజమౌళి చిత్రాలకు ఆయన తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ కథలు రాస్తుంటారు. తండ్రి దగ్గర కథలు తీసుకునే రాజమౌళి, ఇప్పుడు తండ్రికి మాటలు ఇచ్చారు. అంటే... ఆయన డైలాగులు ఏం రాయలేదు. తండ్రి సినిమా కోసం కొన్ని డైలాగులను చెప్పారు. అంటే.. వాయిస్ ఓవర్ ఇచ్చారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ‘శ్రీవల్లి’కి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ‘‘ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగంతో ఆమెకు గత జన్మ స్మృతులు గుర్తుకువస్తాయి. అప్పుడామె జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయ న్నది ఆసక్తికరం. ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. రాజీవ్ కనకాల, సత్యకష, హేమ నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్. శ్రీలేఖ. -
సూపర్ ఫాస్ట్
సప్తగిరి హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సప్తగిరి సూపర్‌ఫాస్ట్’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జొన్నాడ రమణమూర్తి సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు పి. కిరణ్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ రచయిత విజయేంద్రప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ –‘‘నా చిరకాల మిత్రుడు హర్షవర్ధన్ నాతో కలిసి చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఈ సినిమా కథను రెడీ చేసి, నాకు వినిపించి నా అనుమతి తీసుకున్నాడు. సప్తగిరికి సూట్ అయ్యే మంచి కథ ఇది. హీరోగా మరో మెట్టు పైకి ఎదుగుతాడు’’ అన్నారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ– ‘‘కొత్త నిర్మాతలిద్దరూ సినిమాపై మంచి ప్యాషన్‌తో ఉన్నారు’’ అన్నారు. ‘‘మా టీమ్‌ని నమ్మి సప్తగిరిగారు సినిమా చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు సప్తగిరి. -
బుల్లితెర దేవసేన కార్తీక
బాహుబలి.. భారతీయ సినిమా స్థాయిని పదింతలు చేసిన సినిమా. కలెక్షన్ల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ ఈ విజువల్ వండర్ హాలీవుడ్ సినిమాలతో పోటి పడింది. ఇప్పుడు ఇదే స్థాయిలో బుల్లితెర మీద కూడా ఓ భారీ ప్రాజెక్ట్ ప్రసారం కానుంది. బాహుబలి స్థాయిలో తెరకెక్కనున్న ఈ టీవీ సీరీస్ కు కూడా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సీరీస్ ఈ నెలాఖరు నుంచి టీవీలో ప్రసారమవుతోంది. ఆరంభ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ టీవీ సీరీస్ జూన్ 24 నుంచి స్టార్ నెట్ వర్క్‌లో ప్రసారం కానుంది. రెండు వైరి వర్గాలకు చెందిన వరుణ దేవ, దేవసేన ప్రేమకథలో ఈ భారీ సీరియల్ ను రూపొందిస్తున్నారు. వరుణ దేవగా రజనీష్ దుగ్గల్ నటిస్తుండగా దేవసేన పాత్రలో జోష్, దమ్ము సినిమాల హీరోయిన్ కార్తీక నటిస్తోంది. ఈ సీరియల్ కోసం భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో సెట్స్, విజువల్ గ్రాఫిక్స్ వినియోగిస్తున్నారు. ఈ భారీ సీరియల్ కు గోల్డీ బెహెల్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
మాట సాయం!
రాజమౌళి తీసే సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ ఇస్తారు. తనకెలాంటి కథలు కావాలో తండ్రికి రాజమౌళి చెబితే, ఆయన వెంటనే కథ రాసిచ్చేస్తారు. తండ్రి అంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు కాబట్టే, ఆయన తీసిన సినిమాకి తన వంతుగా ఏదైనా చేయాలని రాజమౌళి అనుకుని ఉంటారు. అందుకే మాట సాయం చేశారు. అదేనండీ... విజయేంద్ర ప్రసాద్ తీసిన తాజా చిత్రం ‘శ్రీవల్లీ’కి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఈ సినిమాలోని పాత్రలను రాజమౌళి పరిచయం చేస్తారట. కచ్చితంగా ఈ వాయిస్ సినిమాకి ఓ హైలైట్ అనొచ్చు. రజత్, నేహా హింగే జంటగా సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. -
‘బాహుబలి’తో మార్కెట్ పెరుగుతుందని..
– విజయేంద్రప్రసాద్ ‘‘బాహుబలి’ విడుదల తర్వాత రెండు ప్రశ్నలు నన్ను వెంటాడాయి. ఒకటి –‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని’. ‘బాహుబలి–2’తో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. రెండోది – ‘శ్రీవల్లీ’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామని’. చాలా రోజులుగా ఈ చిత్రబృందం రెండో ప్రశ్న అడుగుతున్నారు. ‘బాహుబలి–2’ తర్వాత ‘శ్రీవల్లీ’ విడుదల చేస్తే మార్కెట్ పెరుగుతుందనే ఆలోచనతో వెయిట్ చేశాం. జూన్‌లో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు విజయేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వంలో రజత్, నేహా హింగే జంటగా సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన చిత్రం ‘శ్రీవల్లీ’. మంగళవారం హైదరాబాద్‌లో ‘శ్రీవల్లీ’ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘‘ఇది ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ. మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది’’ అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ‘‘మా ధైర్యం, బలం అన్నీ విజయేంద్రప్రసాద్‌గారే. ఆయన కథ, దర్శకత్వంపై నమ్మకంతో మూడు భాషల్లో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు నిర్మాతలు. -
'పవన్ కోసం పవర్ ఫుల్ కథ రాస్తా'
బాహుబలి, భజరంగీ బాయ్ జాన్ సినిమాలతో జాతీయ స్థాయిలో స్టార్ రైటర్‌గా మారిపోయాడు రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు, బాలీవుడ్లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలకు విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. వీటితో పాటు బుల్లితెరపై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఆరంబ్ టీవీ సీరీస్‌కు కూడా ఆయనే కథ ఇస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ రైటర్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేయాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నిజాయితీ అంటే తనకెంతో ఇష్టమన్న విజయేంద్ర ప్రసాద్.. ఆ అంశాలతోనే ఆయన కోసం ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేస్తానని తెలిపాడు. త్వరలోనే ఆ కథ రెడీ అయ్యే ఛాన్స్ ఉందంటూ పవన్ అభిమానుల్లో జోష్ నింపాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలతో పాటు బయటి దర్శకులకూ కథలు అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్, పవన్ కోసం కథ రెడీ చేస్తే ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. -
వెయ్యి కోట్ల కథ
వెయ్యి కోట్లకు అడుగేసింది... ఇంకెన్ని కోట్లకు పడగలేస్తుందో! ఒక ఇండియన్ సినిమా.. అందులోనూ ఒక తెలుగు సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌కి నాందిపలికింది. ‘సాహో.. తెలుగు సినిమా’ అని అందరూ అనేట్లుగా ‘బాహుబలి’ మన ఖ్యాతిని పెంచింది. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి, పదిహేను వందల కోట్ల దిశగా దూసుకెళుతోంది. పిండి కొద్దీ రొట్టె. కథ కొద్దీ సినిమా. ‘బాహుబలి’కి బహు బలమైన కథ ఇచ్చిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్. ‘బాహుబలి’ ఆలోచన ఎప్పుడు వచ్చింది? 2012లో రాజమౌళి నాతో రాజుల కాలం నాటి సినిమా చేయాలని ఉందన్నాడు. క్యారెక్టర్స్ అన్నీ స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. మంచి వ్యక్తిగా ఉంటూ పరిస్థితుల ప్రభావంతో చెడుగా మారే పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. అప్పుడు కథ రాయడం మొదలుపెట్టాను. కథావస్తువు పెద్దది కాబట్టి క్లిష్టంగా అనిపించిందా? అస్సలు లేదు. అన్ని కథలు రాసినట్లుగానే ఇది కూడా సునాయాసంగానే రాసేశాను. మనం ఏం రాయాలనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉంటే రాయడం ఈజీ. కథ తయారు కావడానికి ఎన్ని నెలలు పట్టింది? మూడు నాలుగు నెలల్లో రాసేశాను. రెండు భాగాలుగా తీయాలనే రాయడం మొదలుపెట్టారా? ఒక సినిమానే అనుకున్నాం. కానీ, కథ రాయడం మొదలుపెట్టాక అది సాధ్యం కాదనిపించింది. పెద్ద కథ అయిపోయింది. అందుకని రెండు భాగాలు ప్లాన్ చేశాం. ‘బాహుబలి’ అని ఎందుకు టైటిల్ పెట్టాలనిపించింది? తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీసి, హిందీలో అనువదించాలనుకున్నాం. ‘బాహుబలి’ అంటే హిందీలో బలవంతుడు అని అర్థం. సౌత్వాళ్లకూ టైటిల్ అర్థం అవుతుంది. పవర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. కట్టప్ప, శివగామి తదితర పాత్రల పేర్లు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? కథ రాసుకున్నప్పుడే పెట్టాం. తమిళనాడు నుంచి ఇక్కడికొచ్చిన అమ్మాయిగా రమ్యకృష్ణ పాత్రను మలిచాం. అందుకే శివగామి అని పెట్టాం. శివగామి అంటే మధురై మీనాక్షి అమ్మవారు. శివగామితో పాటే వచ్చిన వ్యక్తి కట్టప్ప అన్నమాట. అందుకే తమిళవాళ్లు రిలేట్ చేసుకునేట్లు సత్యరాజ్ పాత్రకు కట్టప్ప అని పెట్టాం. తమిళ వాళ్ల పేర్లలో దాదాపు ‘అప్పా’ అని ఉంటుంది. అందుకే కట్టప్ప అయితే బాగుంటుందను కున్నాం. ప్రభాస్ చేసిన తండ్రీ కొడుకు పాత్రలకు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనుకున్నాం. భల్లాలదేవా, బిజ్జల దేవా, దేవసేన.. ఇవన్నీ కూడా కథ రాస్తునప్పుడే పెట్టాం. వెయ్యి కోట్ల సినిమా అవుతుందనుకున్నారా? భారీ సినిమా అవుతుందనుకున్నాను కానీ, ఈ స్థాయి ఊహించలేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. మీ అబ్బాయి రాజమౌళి కోట్ల ప్రాజెక్ట్ భుజాన వేసుకున్నందుకు ఎప్పుడైనా టెన్షన్‌గా అనిపించిందా? నాకేం అనిపించలేదు. నిజానికి టెన్షన్ మొత్తం నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలదే. కోట్ల రూపాయల బడ్జెట్ అంటే రిస్క్. కానీ, వాళ్ల ముఖాల్లో టెన్షన్ చూడలేదు. ఈ సినిమాకి వాళ్లే హీరోలు. వెయ్యి కోట్లకు నాంది పలికిన తొలి ఇండియన్ మూవీ మన తెలుగు సినిమా కావడం ఎలా అనిపిస్తోంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హద్దులు చెరిపేసింది. కథ, కథకు తగ్గ బడ్జెట్, టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్స్ వర్క్.. ఇవన్నీ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అందరూ చూస్తారని అర్థమైంది. కథ బాగుంటే సినిమా ఆదరణ పొందుతుందనే ధైర్యాన్ని ఇచ్చింది. బలమైన కథను నమ్మి, భారీగా ఖర్చు పెట్టవచ్చని నిరూపించింది. ఇంత భారీ కథ రాశాక.. వేరే కథ రాయడం అంటే ఓ సవాల్‌లా అనిపిస్తోందా? అలా ఏం లేదు. ఏ సినిమా కథ దానిదే. ఐడియా రావడం.. రాసేయడం. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఇవాళ ‘బాహుబలి’.. రేపు ఇంకోటి రావాలి. అప్పుడే బాగుంటుంది. పరిశ్రమ పచ్చగా ఉంటుంది. 2012లో రాజమౌళి నాతో రాజుల కాలం నాటి సినిమా చేయాలని ఉందన్నాడు. క్యారెక్టర్స్ అన్నీ స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. మంచి వ్యక్తిగా ఉంటూ పరిస్థితుల ప్రభావంతో చెడుగా మారే పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండాలన్నాడు. ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ ఓ మైలు రాయి. సినిమా రంగానికి చెందిన మా అందరికీ గర్వకారణం. టీమ్ వర్క్ బాగుంది. రాజమౌళి మాస్టర్ పీస్ తీశారు. అందరికీ శుభాకాంక్షలు. – ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ ‘బాహుబలి’ విజయం ఇండియన్ సెలబ్రేషన్. ఈ సినిమాను ఎక్కడెక్క షూట్ చేశారో తెలుసుకోవాలని ఉంది. ఈ సినిమా చూశాక.. సినిమా అనే ఈ వ్యాపారంలో నేనూ ఓ భాగమైనందుకు ఆనందంగా ఉంది. – ప్రముఖ నటుడు రిషీ కపూర్ రాజమౌళి నాకెందుకు నచ్చాడంటే.. ఎంతో దమ్మూ ధైర్యంతో తాను అనుకున్నది క్రియేట్ చేశాడు. అసమాన ప్రతిభ కనబర్చాడు. – దర్శక–నిర్మాత–నటుడు శేఖర్ కపూర్ నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా నుంచి బయటకు రాలేకపోయాను. విజువల్స్, లొకేషన్స్, బడ్జెట్ ఇలాంటి విషయాలతో ‘బాహుబలి’ సినిమాను కొలవలేం. ఈ సినిమా అంతకుమించి. రాజమౌళికి హ్యాట్సఫ్. – సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘బాహుబలి’ టీమ్ గొప్ప విజయం సాధించింది. రాజమౌళి, ప్రభాస్, అనుష్క, సత్యరాజ్ , నాజర్ వీరికే కాకుండా టీం అందరికీ శుభాకాంక్షలు. – నటుడు అరవింద్ స్వామి -
బుల్లితెర బాహుబలి 'ఆరంభ్'
బాహుబలి భారతీయ సినిమా స్థాయిని పదింతలు చేసిన సినిమా. కలెక్షన్ల విషయంలోనే కాదు, మేకింగ్ లోనూ ఈ విజువల్ వండర్ హాలీవుడ్ సినిమాలతో పోటి పడింది. ఇప్పుడు ఇదే స్థాయిలో బుల్లితెర మీద కూడా ఓ భారీ ప్రాజెక్ట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి స్థాయిలో తెరకెక్కనున్న ఈ టీవీ సీరీస్ కు కూడా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం. ఆరంభ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ టీవీ సీరీస్ ను స్టార్ నెట్ వర్క్ లో ప్రసారం కానుంది. రెండు వైరి వర్గాలకు చెందిన వరుణ దేవ, దేవసేన ప్రేమకథలో ఈ భారీ సీరియల్ ను రూపొందిస్తున్నారు. వరుణ దేవగా రజనీష్ దుగ్గల్ నటిస్తుండగా దేవసేన పాత్రలో జోష్, దమ్ము సినిమాల హీరోయిన్ కార్తీక నటిస్తోంది. ఈ సీరియల్ కోసం భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో సెట్స్, విజువల్ గ్రాఫిక్స్ వినియోగిస్తున్నారు. ఈ భారీ సీరియల్ కు గోల్డీ బెహెల్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
రాజమౌళి హింట్ ఇచ్చాడు..!
బాహుబలి ప్రస్తుతం ఇడియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న భారీ చిత్రం. ఉత్తరాది సినిమాలకు కూడా షాక్ ఇస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సీరీస్ లో మరో భాగం ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో యూనిట్ సభ్యులు ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒక సమయంలో బాహుబలి కథ ముగిసిందన్న రాజమౌళి, ఏదో ఒక రూపంలో బాహుబలి కొనసాగుతుందంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం లండన్ లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న జక్కన్న, అక్కడి బ్రిటీష్ ఫిలిం ఇన్సిస్టిట్యూట్ ను సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడిన రాజమౌళి మరోసారి బాహుబలి పార్ట్ 3 పై ఆశలు కలిగించాడు. బాహుబలి 3 ఉంటుందా అని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..' బాహుబలి 3 కోసం కథ రెడీగా లేకుండా ఆడియన్స్ ను మోసం చేయలేను. అదే సమయంలో నన్ను ఎగ్జైట్ చేసే ఐడియాతో నాన్నగారు(విజయేంద్ర ప్రసాద్) కథ రెడీ చేస్తే బాహుబలి 3 గురించి ఆలొచిస్తా' అంటూ సమాధానం ఇచ్చాడు. -
నాన్నతో దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా!
– దర్శకుడు రాజమౌళి ‘‘తాతగారు సంపాదించిన ఆస్తులన్నీ పోయిన తర్వాత పెదనాన్నగారు (శివశక్తి దత్తా), నాన్నగారు (విజయేంద్రప్రసాద్) ఘోస్ట్ రైటర్స్‌గా డబ్బులు సంపాదించేవారు. రైటర్స్‌గా వారి పేర్లు ఎప్పుడు తెరపై పడతాయా? అని ఎదురు చూసేవాణ్ణి. చాలా సంవత్సరాల తర్వాత ‘జానకిరాముడు’ సినిమాకు వారి పేర్లు తెరపై పడ్డప్పుడు నాకు గర్వంగా అనిపించింది’’ అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన చిత్రం ‘శ్రీవల్లీ’. ఎం.ఎం. శ్రీలేఖ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రాజమౌళి విడుదల చేసి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రెండు వారాల గ్యాప్‌లో ‘బాహుబలి’, ‘భజరంగీ భాయ్‌జాన్’ వంటి హిట్స్ ఇచ్చిన రచయితగా నాన్నగారికి పేరు వచ్చినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. రైటర్‌గా నాన్న ఎంత గొప్పవారో తెలుసు. డైరెక్టర్‌గా సినిమాను అంత గొప్పగా తీసినప్పుడు కొడుకుగా గర్వపడతా. నా సినిమాల్లో నాన్న తప్పలు వెతుకుతుంటారు. ‘శ్రీవల్లీ’ విషయంలో కొడుకుగా గర్వపడ్డా, డైరెక్టర్‌గా నాన్నతో దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘మా చిత్రంలో స్టార్ట్స్, డ్యాన్సులు, ఫైట్స్ లేకున్నా మంచి కథ, గ్రాఫిక్స్ ఉన్నాయి. ఏ వ్యక్తీ పుట్టుకతో చెడ్డవాడు కాదు. పరిస్థితుల ప్రభావంతో మారతాడు. దానికి కారణం మనసే. ఆ మనసును మనం చూడగలిగితే మనలోని ఎన్నో సిండ్రోమ్స్, ఫోబియోలను దూరం చేయవచ్చు. మానవాళిని గొప్పగా మార్చవచ్చు అనే నేపథ్యంలో ఉంటుందీ చిత్రం. ఓ మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు విజయేంద్ర ప్రసాద్. దర్శకుడు కొరటాల శివ, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, శివశక్తి దత్తా, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
రాజమౌళి అయినా.. తండ్రికి కొడుకే కదా..!
-
రాజమౌళి అయినా.. తండ్రికి కొడుకే కదా..!
రాజమౌళి, తెలుగు సినీ రంగంలో ఓ బ్రాండ్. ప్రాంతీయ సినిమా మార్కెట్ పరిథులను చెరిపేసి రీజినల్ సినిమా కూడా జాతీయ స్థాయి సినిమాలతో పోటి పడగలదని ప్రూవ్ చేసిన దర్శకుడు. ఆర్థిక వనరులు అనుకూలించాలే గాని హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయగల సాంకేతిక నిపుణులు మన దగ్గరా ఉన్నారని ప్రూవ్ చేసిన దర్శకుడు. అలాంటి రాజమౌళిని శ్రీవల్లి ఆడియో ఫంక్షన్లో చూసిన వారు అవాక్కయ్యారు. రాజమౌళి తండ్రి, బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి చిత్రాల కథా రచయిత అయిన.. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్రీవల్లి. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకకు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో జరిగిన ఓ సంఘటన రాజమౌళి స్థాయిని అభిమానుల హృదయాల్లో మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆడియో వేడుక జరుగుతుండగా వేదిక మీద ఉన్న విజయేంద్ర ప్రసాద్ షూ లేస్ ఊడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రాజమౌళి వెంటనే స్వయంగా ఆయనే కింద కూర్చొని తండ్రి షూ లేస్‌ను కట్టారు. జాతీయ స్థాయిలో భారీ ఇమేజ్ ఉన్న దర్శకుడిని అలా చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎన్ని విజయాలు సాధించిన రాజమౌళి అయినా.. తండ్రికి కొడుకే కదా..! -
కన్ఫర్మ్: రాజమౌళి నెక్స్ట్ సినిమా అది కాదు!
ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ’బాహుబలి’ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమా రెండోపార్టు తర్వాత ఆయన తీయబోయే సినిమాపై భారీ అంచనాలు, ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ మహాభారత గాథను సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచన ఉందని చెప్పారు. దీంతో రాజమౌళి తదుపరి సినిమా మహాభారతమేనని ఊహాగానాలు, కథనాలు వస్తున్నాయి. అయితే, రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత కే విజయేంద్రప్రసాద్ మాత్రం ఈ ఊహాగానాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇవి కేవలం సెన్సేషనల్ రూమర్సే తప్ప మరేమీ కావన్నారు. ’నేను కానీ, రాజమౌళి కానీ ఈ కథ రాయడం ఎవరైనా చూశారా? నేను సూటిగా చెప్తున్నా. ప్రస్తుతం మహాభారతం తీసే ఆలోచనే లేదు. బాహుబలి రెండోపార్టును సమగ్రంగా తీర్చిదిద్ది.. అనుకున్న తేదీ ప్రకారం ఏప్రిల్ 28న విడుదల చేయడానికి నిరంతరం మేం కృషి చేస్తున్నాం’ అని ఆయన అన్నారు. -
విజయ విహారం - 'జాగ్వార్' టీంతో చిట్ చాట్
-
బయోపిక్ రాస్తున్న బాహుబలి రైటర్
ఒకే సమయంలో బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి రెండు భారీచిత్రాలను అందించి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాలకు కూడా కథ అందిస్తున్న ఆయన, తొలిసారిగా ఓ బయోపిక్‌ను రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఎక్కువగా క్రీడాకారుల బయోపిక్‌లు మాత్రమే వచ్చాయి. కానీ విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఓ పర్వతారోహకుడి కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెస్ట్ సహా ఎన్నో పర్వతాలను అధిరోహించిన.., నేపాల్ కు చెందిన సాహసోపేత పర్వతారోహకుడు టెన్జింగ్ నార్గే కథను సినిమాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. 20 శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ కొనియాడిన టెన్జింగ్ సాహసాలు సినిమా కథకు ఏ మాత్రం తీసిపోవన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఒకే ఒక్కడు సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్లో తెరకెక్కిన నాయక్, విక్రమార్కుడు రీమేక్‌గా తెరకెక్కిన రౌడీ రాథోడ్ చిత్రాలకు సీక్వల్స్ను కూడా రెడీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. -
మరో కథ అందిస్తున్న బాహుబలి రచయిత
ముంబయి: బజరంగీ భాయ్‌జాన్ చిత్రానికి కథ అందించి ఉత్తరాదిన సత్తా చాటిన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో బాలీవుడ్ సినిమా కోసం తన కలానికి పని చెబుతున్నారు. 2001లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'నాయక్' చిత్రం సీక్వెల్‌కు ఆయన కథ అందించబోతున్నారు. దీపక్ ముకుత్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్లో కూడా అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సందర్భంగా ఈరోస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ... తాజా రాజకీయాల నేపథ్యంలో నాయక్ సినిమా సీక్వెల్‌కు ఇది మంచి తరుణమన్నారు. దీంతో కథ కోసం విజయేంద్ర ప్రసాద్‌ను సంప్రదించడం జరిగిందన్నారు. కాగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ 2015లో 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలకు కథ అందించారు. 2015లో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాకు కథ అందించినందుకుగాను ఉత్తమ కథకుడిగా ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక 'నాయక్' చిత్రానికి వస్తే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా 'ఒకే ఒక్కడు' తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్‌హిట్ అయింది. ఆ సినిమా హిందీ వెర్షన్లో అనిల్ కపూర్, రాణీముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించారు. పదిహేనేళ్ల తర్వాత ఈ సినిమాకి హిందీలో సీక్వెల్ తీస్తున్నారు. -
బాహుబలి.. కట్టప్ప.. ఓ ట్విస్ట్..!
హైదరాబాద్: ఈ దశాబ్దం ప్రశ్నగా మారిన 'బాహుబలి హత్య'ను రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో మలుపు తిప్పారు. 'బాహుబలి' బతికే ఉండొచ్చని చెప్పి మరింత ఆసక్తి రేకెత్తించారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బాహుబలి'కి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. భీష్ముడి స్ఫూర్తితో కట్టప్ప పాత్రకు ప్రాణం పోసినట్టు చెప్పారు. శివగామిలో కైకేయి, గాంధారి, కుంతి పాత్రల తాలూకు ఛాయలు కన్పిస్తాయన్నారు. బిజ్జలదేవ పాత్రకు శకుని, భల్లాలదేవ పాత్రకు రావణ, దుర్యోధనులు, బాహుబలి పాత్రకు రాముడు, అర్జునుడు స్ఫూర్తి అని వెల్లడించారు. 'బాహుబలి' ఘన విజయంతో సీక్వెల్ ఎటువంటి మార్పులు చేయడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'బాహుబలి' విడుదలకు ముందే పూర్తి స్క్రిప్ట్ రాయడం పూర్తి చేశానని పేర్కొన్నారు. 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడని ప్రశ్నించగా తనదైన శైలిలో జవాబిచ్చారు. 'బాహుబలి' హత్యకు గురైయ్యాడని ఎందుకు భావిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు. 'బాహుబలి' బతికివుండే అవకాశం కూడా ఉందని చెప్పి సస్పెన్స్ మరింత పెంచారు. ఇప్పటివరకు బాహుబలిని కట్టప్ప చంపేశాడని భావిస్తున్న వారంతా ఇప్పుడు అతడు బతికివున్నాడా, లేదా అనే ప్రశ్న ఎదుర్కొంటున్నారు. దీనికి సమాధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న లభించనుంది. -
సత్తా చాటిన టాలీవుడ్ టాప్ రైటర్
ముంబై: ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్లో భారీ విజయాలు సాధించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి అయిన ఈయన 2015లో 'బాహుబలి', 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాలకు కథ అందించారు. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల కుంభవృష్టి కురిపించి బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్‌ను మరో మెట్టు పైకి ఎక్కించాయి. ఆయన ప్రతిభకు తాజాగా ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ పురస్కారం లభించింది. 2015లో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమాకు కథ అందించినందుకుగాను ఉత్తమ కథకుడిగా ఆయన ఫిలింఫేర్ అవార్డును పొందారు. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి భారత్ వచ్చిన మూగ, చెవిటి బాలికను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చే కథతో 'బజరంగీ భాయ్‌జాన్' సినిమా తెరకెక్కింది. ఇందులో కథాకథనలు, సల్మాన్ నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకొని రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. -
గతజన్మ స్మృతులతో..!
‘బాహుబలి’, ‘బజ్రంగీ భాయ్‌జాన్’ చిత్రాలతో ఈ ఒక్క ఏడాదే వెయ్యి కోట్ల రచయిత అనిపించుకున్నారు విజయేంద్ర ప్రసాద్. కొంత విరామం తర్వాత ఆయన ‘వల్లీ’ పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ డైరెక్ట్ చేస్తున్నారు. నేహా హింగే, రజత్ కృష్ణ, అర్హా ముఖ్యతారలుగా రాజ్‌కుమార్ బృందావన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ గురువారం జరిగింది. ‘‘మనిషి మనసు చదవగలిగే యంత్రం కనిపెట్టడా నికి జీవితాన్ని ధారపోసే ఓ సైంటిస్ట్ కూతురు వల్లి. ఆమె తన తండ్రి లక్ష్యాన్ని సాధించా లనుకుంటుంది. ఆ క్రమంలోనే తన గురువు అశోక్ మల్హోత్రా చేసే ప్రయోగాలకు ఆధారమవు తుంది. ఫలితంగా ఆమెకు తన గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి. అప్పుడే తను లైలా అని తెలుస్తుంది. ఈ లైలా ప్రేమ కోసం వేయి సంవ త్సరాలుగా ఎదురుచూస్తున్న మజ్ను, ఇంకో పక్క వల్లిని ప్రేమించే యువకుడు, మరో పక్క ఆమెను ఇబ్బందిపెట్టే లెస్బియన్... మధ్య కథ నడుస్తుంది’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. షూటింగ్ పూర్తయిందనీ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ నిర్మాత చెప్పారు. వేడుకలో రాజీవ్ కనకాల, రజత్‌కృష్ణ, అర్హాన్ తదితరులు పాల్గొన్నారు. -
'బాహుబలి-3'లో ప్రభాస్ ఉండడు'
'బాహుబలి' సినిమాకు సంబంధించిన పరిణామం ఒకటి సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 'బాహుబలి' సిరీస్ లో రానున్న మూడో సినిమా కోసం తాను స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభించనట్టు ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. అయితే, 'బాహుబలి' తొలి రెండు సినిమాల్లో హీరోగా ఉన్న ప్రభాస్ మూడో పార్టులో కనిపించే అవకాశం లేకపోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. అనుకున్నది అనుకున్న ప్రకారం జరిగితే 'బాహుబలి-3' పూర్తిగా సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కిస్తామని, సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర కూడా మూడో పార్టులో ఉండకపోవచ్చునని చెప్పారు. ఎపిక్ డ్రామాగా తెరకెక్కిన 'బాహుబలి' బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దాయాదుల వైరం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా తన సత్తా చాటింది. 'బాహుబలి' రెండోపార్టు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. -
రాజమౌళి తండ్రిపై చెక్‌బౌన్స్ కేసు కొట్టివేత
యలమంచిలి: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్‌కు చెక్‌బౌన్స్ కేసు నుంచి విముక్తి లభించింది. విజయేంద్రప్రసాద్‌పై పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు దాఖలుచేసిన చెక్‌బౌన్స్ కేసును కొట్టివేస్తూ యలమంచిలి ఏజేఎఫ్సీఎం కోర్టు న్యాయమూర్తి యజ్ఞనారాయణ గురువారం తీర్పు వెల్లడించారు. సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు 2011 మే 16న విజయేంద్రప్రసాద్ రూ.30 లక్షలకు ఇచ్చిన ఆంధ్రాబ్యాంకు చెక్కు చెల్లకపోవడంతో యలమంచిలి ఏజెఎఫ్‌సీఎం కోర్టులో కేసు దాఖలు చేశారు. నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారణ ఇక్కడ కోర్టులో జరిగింది. వాదోపవాదనల అనంతరం సరైన ఆధారాలు లేనికారణంగా విజయేంద్రప్రసాద్‌ను నిర్దోషిగా న్యాయమూర్తి ప్రకటించారు. బుధవారమే ఈ కేసులో తీర్పు వెల్లడిస్తారని అంతా భావించారు. అయితే విజయేంద్రప్రసాద్ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి తీర్పును గురువారానికి రిజర్వ్ చేశారు. విజయేంద్రప్రసాద్ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించడంతో స్థానిక న్యాయవాదులతో పాటు హైకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాదులతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్‌తో... రచనా ‘బాహుబలి’
‘బాహుబలి’, ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రాల కథా రచయితగా విజయేంద్రప్రసాద్ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఈ రె ండు చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించాయి. అర్ధాంగి, శ్రీకృష్ణ, రాజన్న తదితర చిత్రాలు డెరైక్ట్ చేసిన ఈ రచయిత మళ్లీ మెగాఫోన్ పట్టి, ఓ సైంటిఫిక్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. రజత్‌కృష్ణ, నేహ జంటగా రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ బృందావన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ వైవిధ్యమైన కథాంశంతో విజయేంద్ర ప్రసాద్ బాగా తెరకెక్కిస్తున్నారు. ఆయన టేకింగ్ సూపర్బ్. రాజీవ్ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. -
బాహుబలి కథకుడి దర్శకత్వంలో రజనీకాంత్
ప్రపంచ సినిమా అంతా వహ్వా అంటున్న చిత్రం బాహుబలి. భారతీయ సినీ చరిత్రలోనే *500 కోట్లు వసూలు చేసి ఇప్పట్లో ఏ చిత్రం దాని దరిదాపుల్లో రానంత రికార్డులను బద్దలు కొడుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రానికి ప్రభాస్,రాణా,అనుష్క, తమన్న తదితరులు తారాగణం. దర్శకుడు రాజమౌళి. ఇదంతా తెలిసిన విషయమే. అయితే ఈ చిత్ర విజయానికి ప్రదాన కారణాల్లో ఒకటి కథ. ఆ కథ సృష్టికర్త తెలుగులో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈయన దర్శకుడు రాజమౌళి తండ్రి. ఇప్పటి వరకు ఇతర భాషల్లో పెద్దగా ప్రచారం పొందని ఈయన ఇప్పుడు మరింత ప్రాచుర్యం పొందుతున్నారు. ఇటు బాహుబలి బ్రహ్మాండ విజయం, బాలీవుడ్లో ఈయన కథతో తెర కెక్కి సూపర్ హిట్ అయిన భజ్రంగీ భైజాన్ చిత్రాలు విజయేంద్రప్రసాద్‌కు బహుళ ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి.తాజా సమాచారం ఏమిటంటే ఈ ప్రఖ్యాత రచయిత సూపర్‌స్టార్ రజనీకాంత్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారట. ఆ కథను ఇటీవల ఒక కార్యక్రమంలో కలిసిన రజనీకాంత్‌కు చెప్పగా ఆయనకు విపరీతంగా నచ్చేసిందట.అంతేకాదు ఈ కథలో విజయేంద్రప్రసాద్ దర్శకత్వంతో నటించడానికి అంగీకారం తెలిపారని సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నరు. ఈ చిత్రం తరువాత శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2లో నటించనున్నారు. 2016లో విజయేంద్రప్రసాద్, రజనీకాంత్‌ల చిత్రం ప్రారంభం అవుతుందని కోలీవుడ్ సమాచారం. -
'ఆ సీన్‌తో ప్రారంభించి కథ పూర్తి చేశా..'
చెన్నై: బాహుబలి చిత్ర విజయం భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నిదర్శనం అని ప్రముఖ కథా రచయిత, దర్శకుడు, ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఒక చిత్రాన్ని ఒక భాషకు, ఒక ఇండస్ట్రీకి పరిమితం చేయాల్సిన అవసరం లేదని బాహుబలి విజయం తర్వాత తనకు అనిపిస్తోందని చెప్పారు. దేశంలోని అన్ని భాషల్లో ఒక చిత్రాన్ని అనువాదం చేసి విడుదల చేయోచ్చని బాహుబలి నిరూపించిందని తెలిపారు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.350 కోట్లు వసూళ్లు చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోని రికార్డులన్నీ తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక నదీ ప్రవాహం సీన్‌తో బాహుబలి కథ ప్రారంభించి పూర్తి చేశానని చెప్పారు. బాహుబలి ఇంతటి ఘన విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని, ఈ సినిమా ప్రారంభించేముందు తన కుమారుడు ఎస్ఎస్ రాజమౌళికి కూడా అలాంటి ఆలోచన కలగలేదని అన్నారు. మహాభారతాన్ని తీయడానికి బాహుబలి ఒక నమునాలాంటిదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే, తాను అందించిన కథ ఆధారంగా విడుదలైన బాలీవుడ్ చిత్రం బజరంగీ బైజాన్ చిత్రం కూడా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశంలో వైద్య ఖర్చు భరించలేక భారత్ వచ్చి తమ కూతురుకి గుండె ఆపరేషన్ చేయించుకున్న పాక్ దంపతుల గురించి తాను విన్నానని, ఆపరేషన్ పూర్తయ్యాక భారతీయుల గొప్పతనం గురించి వారు మాట్లాడలేకుండా ఉండిపోయారని, ఆ సందర్భం తనను ఎంతో ఆలోచింపజేసిందని వెంటనే కథరాయాలని ఆలోచించి బజరంగీ బైజాన్ కథ సిద్ధం చేశానని తెలిపారు. బాహుబలి చిత్రం విజయానికి ప్రేక్షకులే కారణమని చెప్పారు. వారు లేకుండా అసలు ఇంత విజయాన్ని ఊహించలేమని అన్నారు. ఒక చిత్ర భవిష్యత్తును తేల్చేది ప్రేక్షకులేనని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. -
దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్
విశాఖపట్నం: దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు యలమంచిలి కోర్టులో చుక్కెదురైంది. చెక్ బౌన్స్ కేసులో విజయేంద్ర ప్రసాద్ కు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమా కోసం నిర్మాత చెంగల వెంకట్రావ్ వద్ద 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే ఆ సినిమా విషయంలో వెంకట్రావ్, విజయేంద్ర ప్రసాద్ కు విభేదాలు తలెత్తడంతో ఇచ్చిన పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే బకాయి పడ్డ డబ్బు చెల్లింపు కోసం ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో యలమంచిలి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో తాజాగా విజయేంద్ర ప్రసాద్ కు కోర్టు వారంట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
దర్శకుడు రాజమౌళి తండ్రికి నాన్ బెయిలబుల్ వారెంట్!
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు నాంపల్లి క్రిమినల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. నిర్మాత చెంగల వెంకట్రావు దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు గైర్హాజరు కావడంతో వారెంట్ ను జారీ చేసింది. ఓ సినిమా కథ కోసం చెంగల వెంకట్రావు వద్ద విజయేంద్ర ప్రసాద్ 41 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అయితే తమ మధ్య ఒప్పందంను ఉల్లంఘించడం జరగడం, సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేశారు. ఆంధ్ర బ్యాంక్ కు చెందిన రెండు చెక్కులను విజేంద్ర ప్రసాద్.. చెంగల కు ఇచ్చారని.. అవి బౌన్స్ కావడంతో .. విజయేంద్ర ప్రసాద్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు.