
‘‘సక్సెస్ అవ్వాలనే దర్శకులు సినిమాలు తీస్తారు. కానీ, హిట్ అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. డైరెక్టర్‌గా సక్సెస్ కాలేకపోయాను. నెక్ట్స్ టైమ్ అవుతాను. డైరెక్టర్‌గా రాజమౌళితో పోటీ లేదు. నా దారిలో నేను సినిమాలు తీసుకుంటాను. నేను కథ రాసిన సినిమాలే టాప్‌లో ఉన్నాయంటే... అది దేవుడి దయ’’ అన్నారు విజయేంద్రప్రసాద్. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘మెర్సెల్’ తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదల కానుంది. ‘మగధీర, ఈగ, బాహుబలి, భజరంగీ భాయిజాన్’ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ‘మెర్సెల్’కు స్క్రీన్‌ప్లే అందించారు.
త్వరలో ‘అదిరింది’ విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మెర్సెల్’లో మేం మెడికల్ సిస్టమ్ గురించి చెప్పాలనుకున్నాం. వైద్యం అనేది సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ పాయింట్‌పై కథ చేద్దాం అన్నారు అట్లీ. నేను ఎగై్జట్ అయ్యాను. తమిళంలో ‘మెర్సల్’ హిటై్టంది. అందులో నా వంతు పాత్ర ఉన్నందుకు ఆనందం పొందే హక్కు నాకు ఉంది. సినిమాపై వివాద స్వరాలు వినిపిస్తున్నాయి. అది పబ్లిసిటీకి ఫ్లస్ అవుతుందనుకుంటున్నా. తమిళ్‌లో ‘బాహుబలి’ హయ్యస్ట్ కలెక్షన్స్ గ్రాస్ చేసిందని విన్నాను. ‘మెర్సెల్’ ఆ కలెక్షన్స్ దాటుతుందనుకుంటున్నా. కలెక్షన్స్ స్పీడ్‌గా ఉన్నాయి’’ అన్నారు.
ప్రస్తుతం రాస్తున్న కథల గురించి అడిగితే – ‘‘క్రిష్ తీస్తున్న ‘మణికర్ణిక’కు కథ ఇచ్చా. అస్సాంలో ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన రచిత్ కుల్‌బౌహిత్ జీవితం ఆధారంగా కథ రాస్తున్నా. అలాగే, ఆర్‌ఎస్‌ఎస్ మాజీ చీఫ్ గోల్ వాల్కర్‌గారి బయోపిక్ రాస్తున్నాను. ‘నాయక్’ అనే హిందీ సినిమాకు సీక్వెల్ రాస్తున్నా. విక్రమార్కుడు సినిమా ‘రౌడీ రాథోడ్’గా బాలీవుడ్‌లో విడుదలైంది. ఆ సినిమాకు సీక్వెల్ రాస్తున్నాను’’ అన్నారు. నెక్ట్స్ రాజమౌళికి తీయబోయే సినిమాకి ఎలాంటి కథ ఇస్తారు అనడిగితే– ‘‘రాజమౌళితో సినిమా స్క్రిప్ట్ కోసం ఇంకా వెతుకులాటలోనే ఉన్నాం. రాజమౌళి పరిగెత్తి పాలు తాగే రకం కాదు. సక్సెల్‌లో ఉన్నప్పుడే సినిమాలు తీయాలను కోడు. ‘ఫలానా హీరో అని కాదు. ఇలాంటి జోనర్ అని కాదు. మీరు కథ చెప్పగానే సినిమా చేయాలనిపించే కథ చెప్ప’మంటున్నాడు రాజమౌళి. సినిమాలో గ్రాఫిక్స్ అవసరం లేదు. సీజీ వర్క్ కోసం టెక్నీషియన్స్ ఇంటికి రాకూడదనే కండీషన్ కూడా పెట్టాడు. నా శాయశక్తులా ట్రై చేస్తున్నాను. ఫలానా హీరో కోసం కథ రాయాలని లేదు. కథను బట్టే హీరో’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment