Mersal Movie
-
విజయ్‌కు ఐటీ అధికారుల షాక్..
చెన్నై : ఓ సినీ నిర్మాణ సంస్థ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి తమిళ హీరో విజయ్ను ఆదాయ పన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సినిమా షూటింగ్లో ఐదు గంటల పాటు ప్రశ్నించిన అనంతరం ఇంట్లోనూ విజయ్ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏజీఎస్ సినిమాస్ కార్యాలయాలు, ఆస్తులతో పాటు సినీ ఫైనాన్షియల్ అన్బు చెలియన్ మధురై కార్యాలయాలపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయ్ హీరోగా రూపొందిన బిజిల్ సినిమాను గత ఏడాది ఏజీఎస్ సినిమాస్ నిర్మించింది. కాగా గత ఏడాది అక్టోబర్‌లో విజయ్ మూవీ మెర్సెల్ జీఎస్టీ, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పలు సంభాషణలతో తెరకెక్కడంతో ఈ మూవీపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. జీఎస్టీ, డిజిటల్ ఇండియా ప్రచారంపై అవాస్తవాలను ప్రచారం చేసేలా మూవీలో ఉన్న కొన్ని డైలాగ్‌లను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. -
టాలీవుడ్ లో కోలీవుడ్ హిట్ డైరెక్టర్
రాజా రాణీ, తేరి, మెర్సల్ సినిమాలతో వరుస విజయాలు సాధించిన కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ. వరుసగా రెండు సినిమాలు స్టార్ హీరో విజయ్‌తో కలిసి చేసిన అట్లీ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ యువ దర్శకుడు తెరకెక్కించిన తేరి.. పోలీస్ పేరుతో మెర్సల్ అదిరింది పేరుతో తెలుగులో రిలీజ్ అయినా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోయాయి. దీంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకునేందుకు తెలుగు హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నారు అట్లీ. త్వరలో ఓ తెలుగు సినియా చేయబోతున్నట్టుగా అట్లీ స్వయంగా ప్రకటించారు. తెలుగులోనూ ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు అట్లీ. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
మెర్సల్‌కు ఇంటర్నేషనల్ అవార్డు
సాక్షి, చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం అరుదైన ఘనత సాధించింది. యూకే నేషనల్ ఫిల్మ్ అవార్డు వేడుకల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మెర్సల్‌కు అవార్డు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు కోసం ఏడు చిత్రాలు పోటీ పడగా.. జ్యూరీ మెర్సల్‌కే పట్టం కట్టింది. జీఎస్టీ డైలాగులతో ఈ చిత్రం అభ్యంతరాలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. మరోవైపు చిత్రంలో కొన్ని డైలాగులు తమను కించపరిచేలా ఉన్నాయంటూ ప్రైవేట్ వైద్య సంఘాలు సినిమా రిలీజ్ కాకుండా ఆందోళన చేపట్టాయి. అయినప్పటికీ అవన్నీ అధిగమించి విడుదలై మెర్సల్ హిట్ టాక్ కైవసం చేసుకుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ మూల కథను సమకూర్చారు. నిత్యామీనన్, కాజల్, సమంతలు హీరోయిన్ గా నటించిన మెర్సల్ తెలుగులో అదిరింది పేరుతో విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. -
మెర్శల్ చిత్రం మాదిరిగానే..
తమిళసినిమా: విజయ్ నటించిన మెర్శల్ చిత్రం ఎంతగా వివాదాలకు దారి తీసిందో తెలిసిందే. అలాంటి అంశాలు తమ చిత్రంలోనూ ఉంటాయంటున్నారు దర్శకుడు సుశీద్రన్. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం నెంజిల్తుణివిరిందాల్. సందీప్ కిషన్, నటి మెహరిన్ జంటగా నటించిన ఈ చిత్రంలో నటుడు విక్రాంత్ ప్రధాన పాత్రను పోషించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుశీద్రన్ మాట్లాడుతూ తన గత చిత్రాల తరహాలోనే నెంజిల్ తుణివిరిందాల్ చిత్రంలోనూ సోషల్ మేసేజ్ ఉంటుందన్నారు. ఇది విజయ్ నటించిన మెర్శల్ చిత్రం మాదిరిగానే చర్చనీయాంశం బలమై సామాజిక అంశాలతో సంచలన కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఇందులో నటుడు విక్రాంత్ నటన గురించి అందరూ చెప్పుకుంటారన్నారు. ఆయనకు ఈ చిత్రం తరువాత మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తన లైబ్రరీలో వెన్నెలా కబడ్డీకుళ్లు, అళగర్‌సామియిన్ కుదిరై, జీవా, మావీరన్ కిట్టు లాంటి చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఎక్కువగా చిన్న హీరోలతోనే చిత్రాలు చేస్తున్నారేమిటని చాలా మంది అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే స్టార్ హీరోలతో చేస్తే ఆ చిత్ర విజయాలు వారికే చేరుతాయన్నారు. అదే కొత్త వారితో చిత్రం చేస్తే ఆ విజయాలు దర్శకుడికి చెందుతాయని పేర్కొన్నారు. నెంజిల్ తుణివిరిందాల్ చిత్ర విజయంపై తనతో పాటు యూనిట్ అందరికీ నమ్మకం ఉందని సుశీద్రన్ పేర్కొన్నారు. -
మెర్శల్‌పై ఐటీ కన్ను..?
సాక్షి, చెన్నై: మెర్శల్ చిత్రానికి ముందు ముందు మరో ముప్పు పొంచి ఉందా? ఇందుకు అవుననే సమాధానమే వస్తోంది. హీరో విజయ్ నటించిన తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా గత నెల 18వ తేదీన విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ టాక్‌తో పాటు పలు వ్యతిరేకతలను ఎదుర్కొంది. ఈ గొడవ సద్దుమణిగిందనుకుంటే, తాజాగా ఆ చిత్రం సాధిస్తున్న వసూళ్లు ఇబ్బందులను తెచ్చి పెట్టేలా ఉన్నాయి. మెర్శల్ చిత్రం విడుదలైన రెండు వారాల్లో రూ.200 కోట్ల వసూల్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నట్లు సమాచారం. నిర్మాతలకు ఐటీ బెడద కాగా మెర్శల్ చిత్ర వసూళ్లపై ఆ చిత్ర నిర్మాత పెదవి విప్పడం లేదు. లెక్కలను సర్ధుబాటు చేసే పనిలో పడినట్లు సినీ వర్గాల సమాచారం. మెర్శల్ వసూళ్ల వివరాలు బయట పడితే పెద్ద మొత్తంలో ఆదాయ శాఖకు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ భయంతో చిత్రానికి పని చేసిన సాంకేతిక వర్గానికి సగం చెక్కు రూపంలోనూ, మరి కొంత రొక్కంగానూ చెల్లిస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా కొందరిని ఓచర్‌పై సంతకాలు తీసుకుని, మరికొందరికి అవి లేకుండా వేతనాలు చెల్లించి పన్ను పోటు నుంచి బయట పడటానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తమిళ పత్రికల కథనం. నిర్మాతే చెప్పాలి తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాధన్ మాట్లాడుతూ.. మెర్శల్ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్లు సాధించిందా ? అన్నది ఆ చిత్ర నిర్మాతే చెప్పాల్సి ఉంటుందనీ ఇతరులెవరూ చెప్పడం సరికాదని పేర్కొన్నారు. మెర్శల్ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోందని మాత్రం తాను చెప్పగలననీ అన్నారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వసూళ్ల విషయంలో కరెక్ట్ సమాచారం వచ్చే వరకూ తాము వేచి చూస్తామని ఆయన తెలిపారు. గమనిస్తున్నాం.. సోదాలుంటాయి మెర్శల్ చిత్ర వసూళ్ల వ్యవహారం గురించి ఆదాయ శాఖ అధికారి స్పందించారు. ఆ చిత్ర కలెక్షన్ల విషయం గురించి తాము పలు విధాలుగా సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. సరైన ఆధారాలు లభించినప్పుడు అందుకు తగ్గట్టుగా పన్నును వసూలు చేస్తామన్నారు. అందులో అవకతవకలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని, అవసరం అయితే ఐటీ దాడులు చేస్తామని ఆయన అన్నారు. విజయం మూడు రకాలు ఒక చిత్ర విజయాన్ని మూడు రకాలుగా భావిస్తారు. పెట్టన పెట్టుబడి, దానికి వడ్డీతో పాటు కొంచెం లాభాలు వస్తే ఆ చిత్రం హిట్ అయ్యినట్లు. ఇక పెట్టుబడి, వడ్డీతో పాటు అదనంగా 20 శాతం లాభాలు తెచ్చి పెడితే ఆ చిత్రం సూపర్ హిట్. మూడోరకం పెట్టుబడి, వడ్డీలతో పాటు ఆ మొత్తం మీద 40 శాతం లాభాలు వస్తే ఆ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ అయ్యినట్లు అని సినీ పండితులు అంటున్నారు. మరి మెర్శల్ ఈ మూడింటిలో ఏ రకానికి చెందుతుందో వేచి చూడాలి. -
వారెవ్వా 'మెర్సల్'.. కళ్లు చెదిరే వసూళ్లు!
విజయ్ తాజా సినిమా 'మెర్సల్'.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. బీజేపీ వాళ్లు ఎంత గగ్గోలు రేపినా.. ఈ సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు సరికదా.. ఈ వివాదాలు 'మెర్సల్' వరంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ అంచనాలతో విడుదలైన 'మెర్సల్' సినిమా తొలిరోజు ఏకంగా రూ. 43.50 కోట్లు వసూలు చేసి.. ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. దీపావళి కానుకగా విడుదలైన 'మెర్సల్' తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా అక్షరాల రూ. 170 కోట్లు వసూలు చేసిందని సమాచారం. వైద్య మాఫియాపై అస్త్రంగా తెరకెక్కిన 'మెర్సల్' సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియా పథకాలపై విమర్శలు ఉండటం బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఆ డైలాగులు తొలగించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదం మీడియాలో పతాకశీర్షికలకు ఎక్కడం, పలువురు సినీ ప్రముఖులు, జాతీయ నాయకులు సినిమాకు అండగా నిలబడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలో ఏముందో చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఒక్క తమిళ వెర్షన్లోనే విడుదలైన 'మెర్సల్' ప్రపంచవ్యాప్తంగా మొదటివారంలో అసాధారణ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు రూ. 43. 50 కోట్లు వసూలు చేసిన 'మెర్సల్'.. తొలిమూడురోజుల్లో రూ. 100 కోట్లు రాబట్టింది. మొత్తానికి తొలివారంలో ఈ సినిమా రూ. 170 కోట్లు రాబట్టిందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది. 'మెర్సల్' ఓవర్సీస్ వసూళ్లు కూడా కళ్లుచెదిరే రీతిలో ఉండటం గమనార్హం. తొలివారంలో ఈ సినిమా విదేశాల్లో రూ. 45 కోట్లు రాబట్టింది. కొన్నిరోజుల కిందట ఈ సినిమా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసినట్టు సినిమా యూనిట్ ధ్రువీకరించింది. మొత్తం తొలివారం వసూళ్ల గురించి చిత్ర నిర్మాత కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏదిఏమైనా 'మెర్సల్' విజయ్ కెరీర్లో రూ. 200 కోట్లు సాధించిన తొలి సినిమా రికార్డు దిశగా సాగుతోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. -
తెలుగు ‘మెర్సల్’ ; సెన్సార్ బోర్డుపై విమర్శలు దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : వారాలకు వారాలు వాయిదా పడుతూ వస్తోన్న ‘అదిరింది’(మెర్సల్ తెలుగు డబ్బింగ్) సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ‘మెర్సల్’ లోని ప్రభుత్వ వ్యతిరేక డైలాగులపై వివాదం చెలరేగిన దరిమిలా, సెన్సార్ బోర్డు కవాలనే సినిమాను అడ్డుకుంటోందని నిర్మాతలు ఆరోపించారు. దీంతో సెన్సార్ బోర్డు తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే, సినిమా ఆలస్యానికి తాము ఏమాత్రమూ కారణం కాదని, అనవసరంగా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి వాపోయారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘అదిరింది’ ఆలస్యంపై వివరణ ఇచ్చారు. ‘‘సెన్సార్ బోర్డు నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. ఏ రాజకీయ కారణమో, వాణిజ్యపరమైన అంశమో మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ‘మెర్సల్’ సినిమా తెలుగు డబ్బింగ్ ‘అదిరింది’ కి సర్టిఫికేట్ జారీ చేయడంలేదని మాపై విమర్శలు చేయడం దారుణం. తమిళ మాత్రుకకు ఎలాగైతే నిబంధనల ప్రకారమే సర్టిఫికేట్ ఇచ్చామో, తెలుగుకు కూడా అలానే ఇస్తాం. అయితే, మా పనిలో ఆలస్యం తలెత్తడం సహజం. నిజానికి సర్టిఫికేషన్‌కు గరిష్టంగా 68 రోజులు పడుతుంది. కానీ మేం సాధ్యమైనంత తొందరగానే పని పూర్తిచేసేస్తాం. కొన్నిసార్లు సెలవులు కూడా తీసుకోకుండా కష్టపడతాం. అలాంటిది మావల్లే సినిమా విడుదల ఆలస్యమవుతోందని విమర్శలు చేయడం సరికాదు’’ అని ప్రసూన్ జోషి వివరణ ఇచ్చారు. మెర్సల్‌కు ఊరట : వివాదాస్పద ‘మెర్సల్’ను నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీని విమర్శిస్తూ ‘మెర్సల్’లో డైలాగులు ఉండటాన్ని తమిళనాడు బీజేపీ తప్పుపట్టడంతో మొదలైన వివాదం క్రమంగా దేశాన్ని కుదిపేసే స్థాయికి వెళ్లింది. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ‘మెర్సల్’ మద్దతు పలికాయి. అంతలోనే విజయ్ క్రైస్తవుడు కాబట్టే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటూ కొందరు కాషాయ నేతలు వ్యాఖ్యానించడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. తమిళంలో రూపొందుకున్న ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో అనువదించారు. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినా, తెలుగులో అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది. -
మెర్సల్.. అంత ప్రమాదకరమైందా?
సాక్షి, చెన్నై : మెర్సల్ సినిమా మేకర్లకు పెద్ద ఊరట లభించింది. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. చిత్రంలో ప్రభుత్వాన్ని కించపరిచేలా డైలాగులు ఉన్నాయని.. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఆ పిటిషన్ బెంచ్ ముందుకు రాగా.. దానిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. మెర్సల్ అనేది ఓ చిత్రం కల్పితగాథేనని.. నిజ జీవితం కాదని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది సమాజంపై ప్రభావం చూపుతుందనటం అర్థరహితమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూమపానం, మద్యపానం హనికరమంటూ ప్రకటనలు జారీ చేసే చిత్రాలకంటే మెర్సల్ అంత ప్రమాదకరమైందా అంటూ న్యాయమూర్తి పిటిషనర తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. సినిమా నచ్చకపోతే చూడకండి.. అంతేగానీ ఇలా పిటిషన్లతో సమయాన్ని వృథా చేయకండి అంటూ మండిపడ్డారు. వివాదాలతో సినిమాకు ఫ్రీ పబ్లిసిటి లభించిందని జడ్జి వ్యాఖ్యానించారు. భావ ప్రకటన అనే స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉంటుందని ఆయన పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేశారు. అసత్య డైలాగులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అశ్వథామన్ అనే న్యాయవాది మెర్సల్ సెన్సార్ షిఫ్‌ను రద్దు చేయాలంటూ సోమవారం పిల్ దాఖలు చేశారు కూడా. ఇదిలా ఉండగా సినిమాలో డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొన్ని హిందుత్వ సంఘాలు రోడెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
'అదిరింది' ఆగింది
-
'అదిరింది' ఆగింది
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మెర్సల్ తెలుగు వెర్షన్ 'అదిరింది'కి బాలారిష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే ఈచిత్రం పలు సార్లు విడుదలకు సిద్ధమై వాయిదా పడుతూ వస్తోంది. తమిళం పాటు తెలుగులోను ఒకేసారి విడుదల చేయాల్సి ఉండగా డబ్బింగ్ సమస్యతో విడుదల కాలేదు. అయితే తాజాగా చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించినా బ్రేక్ పడింది. సినిమాకు సెన్సార్ పూర్తి కాలేదని, అందుచేతనే విడుదల చేయట్లేదని చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ సోషల్ మీడియాలో ప్రకటించింది. శుక్రవారం విడుదల నేపథ్యంలో గురువారం చిత్రం ప్రచార దృష్యాన్ని విడుదల చేశారు. కాగా ఆశ్చర్యకరంగా సెన్సార్ కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నార్త్‌స్టార్ ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. సెన్సార్‌లో భాగంగా తెలుగు వెర్షన్లో జీఎస్టీ పైన ఉన్న డైలాగ్స్ తొలగించనున్నట్లు సమాచారం. జీఎస్టీపై డైలాగ్ వచ్చే సమయంలో ఆడియోను తొలగించనున్నారు. కాగా, తమిళంలో ఇప్పటికే ఈచిత్రంపై వివాదాలు నడుస్తున్నాయి. -
మెర్సల్ ముందు ఎంతనుకుంటే...
సాక్షి, చెన్నై : ఓవైపు విజయ్ లాంటి బిగ్ స్టార్ సినిమా రిలీజ్. ఆ సమయంలో ఓ చిన్న సినిమా కూడా విడుదలకు సిద్ధమయ్యింది. అంతే సినిమా హీరో, దర్శకుడు మొత్తం చిత్ర యూనిట్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పడేశారు. తమ హీరో కలెక్షన్ల సునామీలో కొట్టుకుపోతారంటూ కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన దర్శకుడు రత్న కుమార్ తాను విజయ్‌కి పెద్ద ఫ్యాన్‌నని ప్రకటించుకున్నా.. పట్టించుకోలేదు. అయినా ధైర్యం చేసి సినిమాను విడుదల చేశారు. తొలి మూడు రోజులు థియేటర్ వైపు చూసే వారే కరువయ్యారు. కట్ చేస్తే... మెయ్యాద మాన్ ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. ఈ దీపావళికి విజయ్ మెర్సల్తోపాటు మెయ్యాద మాన్ కూడా విడుదలైంది. సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి తనయుడు వైభవ్ ఇందులో హీరోగా కనిపించాడు. ఓ స్టేజీషో సింగర్ ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రంలో ఇదయం మురళి(హృదయం మురళి) పాత్రలో వైభవ్ నటించాడు. మంచి ప్రేమకథకు దానికితోడు పాటలు(ముఖ్యంగా తంగచ్చి పాట) ఆకట్టుకోవటంతో నెమ్మదిగా మౌత్ టాక్ ద్వారా సినిమా పుంజుకుంది. ప్రస్తుతం చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా మెయ్యాద మాన్కు థియేటర్లను పెంచేశారు. మెర్సల్ ఉండగానే పోటీపడి మరీ కలెక్షన్లు కుమ్ముకుంటున్న ఈ చిన్న చిత్రం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను కూడా అందించటం మొదలుపెట్టేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక చిత్ర సక్సెస్ గురించి వైభవ్ స్పందిస్తూ.. విజయ్ సినిమా రిలీజ్ తో టెన్షన్ పడ్డామని.. ఆ సినిమా ముందు తామెంత అనుకున్నామని.. అయినా కంటెంట్ పై నమ్మకంతో ధైర్యం చేసినట్లు వైభవ్ చెప్పాడు. మెర్సల్ సినిమా రిలీజ్, ఇదయదళపతి ఫ్యాన్స్ నుంచి బెదిరింపుల గురించి వైభవ్ ప్రస్తావిస్తూ.. తాను అజిత్ కు పెద్ద ఫ్యాన్ అయినప్పటికీ విజయ్ను కూడా ఆరాధిస్తానని, ఈ విషయాన్ని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతిని వైభవ్ గుర్తు చేశాడు. అన్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ చిత్రం చూసి ప్రశంసలు కురిపించటం విశేషం. -
అందరికీ దండాలండోయ్!
తమిళసినిమా: మెర్శల్ చిత్రాన్ని ఆదరిస్తున్న వారికి, అండగా నిలిచిన వారికి దండాలండోయ్ అని అంటున్నారు ఇళయదళపతి విజయ్. ఈ స్టార్ నటుడు కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ మెర్శల్ దీపావళి సందర్భంగా విడుదలై ఎంత సంచలన విజయం దిశగా పరుగులెడుతుందో,అంతగా వివాదానికి తెరలేపింది. జాతీయ స్థాయిలో దుమారం రేపిన మెర్శల్ చిత్ర కథానాయకుడు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.అందులో సంచలన విజయాన్ని సాధిస్తున మెర్శల్ చిత్రం కొన్ని వ్యతిరేక సంఘటనలను ఎదుర్కొంది. అలాంటి చిత్రానికి ఘన విజయాన్ని కట్టబెట్టడంతో పాటు అండగా నిలిచిన నా చిత్రపరిశ్రమకు చెందిన మిత్రులకు, సన్నిహితులకు, నటీనటులకు, సినీ సంఘాలు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం, నిర్మాతలమండలి నిర్వాహకులకు, అభిమానులకు, ఇతర ప్రేక్షకులకు నా తరఫున, మెర్శల్ చిత్ర యూనిట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని విజయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
లక్కంటే ఇదే కాబోలు!
కాలం కలిసొస్తే అంతా మంచే జరుగుతుందని పెద్దలు అంటారు. అలాంటి టైమ్ ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు నడుస్తోందని చెప్పవచ్చు. విజయాలను బట్టి అవకాశాలు వరిస్తుంటాయి. అలానే హీరోయిన్ కాజల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి, తమిళంలో వివేగం, మెర్శల్ చిత్రాల సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ భామను ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రల్లోనే చూశాం. తాజాగా కోలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో చూడబోతున్నాం. ఈ విధమైన చిత్రాల్లో నయనతార నటిస్తున్నారు. ఇక కాజల్ కూడా నేను సైతం అంటున్నారు. ఇప్పటికే హిందీ భాషలోని ‘క్వీన్’ రీమేక్‌లో నటిస్తున్న ఈ భామను తాజాగా మరో అవకాశం తలుపు తట్టిందన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. దక్షిణాదిలో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పి. వాసు ఇటీవల శివలింగ చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ సుందరి ఐశ్వర్యరాయ్‌ను నటింపజేయాలని భావించారు. అందుకు ఆమెతో చర్చలు కూడా జరిగాయనే ప్రచారం జరిగింది. అయితే ఈ పాత్ర తాజాగా కాజల్‌ను వరించింది. ఐష్ స్థానాన్ని ఈ ముద్దుగుమ్మ భర్తీ చేస్తున్నారన్న మాట. లక్కంటే ఇదే కాబోలు మరి. -
హీరో విజయ్ బహిరంగ లేఖ
సాక్షి, చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆయన నటించిన 'మెర్సల్' చిత్రానికి మద్దతు ఇచ్చిన అందరికీ విజయ్ కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సినిమా విజయం సాధించడం తనకు బలాన్ని ఇచ్చిందని తెలిపారు. మీ అందరి సహకారం తనను ఇంకా ముందుకు నడిపిస్తుందని వ్యాఖ్యానించారు. జీఎస్టీపై కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో విజయ్ నటించి మెర్సల్ చిత్రం వివాదాల్లోకి వెళ్లిన సంగతి తెల్సిందే. కాగా ఈ చిత్రం విడుదలకు ముందు సంచలనాలు, అనంతరం ప్రకంపనలు పుట్టిస్తోంది. చిత్రంలోని ఓ సన్నివేశంలో జీఎస్టీ, వైద్య విద్యావిధానంపై సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు, వైద్యులు మండిపడిన సంగతి తెలిసిందే. అభ్యంతరకర మాటలు, సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు చిత్ర నిర్మాత సమ్మతించినా పరిస్థితి చేయి దాటి వివాదం రాజకీయ రంగు పులుముకుని రచ్చరచ్చగా మారింది. అయితే చిత్ర పరిశ్రమతో పాటు బీజేపీయేతర రాజకీయ పార్టీలు మెర్శల్‌కు అండగా నిలుస్తున్నారు. -
రాజకీయ తెరపై మరో సినీకెరటం
తమిళనాడు రాజకీయ తెరపై మరో సినీకెరటం ఎగిసిపడనుందా? హీరో విజయ్ తెరంగేట్రం నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయా?.. అవుననే అంటోంది తమిళనాడు ప్రజానీకం. సంచలనాత్మక విజయం సాధించిన మెర్శల్ చిత్రం పుణ్యమాని విజయ్‌కు ఇంటినుంచే రాజకీయ వాసనలు మొదలయ్యాయి. విజయ్ రాజకీయాల్లోకి రావాలి, రాష్ట్రంలో మార్పు తేవాలి అంటూ సాక్షాత్తు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన అభిప్రాయాన్ని మంగళవారం బహిరంగంగా ప్రకటించేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: మెర్శల్ చిత్ర వివాదం నేపథ్యంలో మరో కోణం వెలుగుచూసింది. తమిళనాట మార్పు కోసం హీరో విజయ్ రాజకీయాల్లో రావాలని ఆశిస్తున్న ఆయన తండ్రే ఓ ఇంటర్వూ్యలో అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయాలు, సినిపరిశ్రమను వేరువేరుగా చూడలేం. ఆనాటి ముఖ్యమంత్రి అన్నాదురై మొదలుకుని కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ ఇటీవల మరణించిన జయలలిత వరకు అందరూ సినీ నేపథ్యం ఉన్నవారే. సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారికి రాజకీయాల్లోకి వెళ్లడం అంటే రెడ్‌కార్పెట్ స్వాగతంలా భావిస్తారు. ఎంజీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై రెండు దశాబ్దాలుగా రాజకీయ ఒత్తిడి ఉంది. విముఖత ప్రదర్శిస్తూ వచ్చిన రజనీ ఇటీవల చూచాయగా తన రాజకీయ ఆసక్తిని చాటుకున్నారు. పార్టీ పెట్టడం ఖాయమనే పరిస్థితులు కల్పించిన రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబరు 12వ తేదీన తన పుట్టిన రోజున పార్టీని ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. రాజకీయాలకు దూరంగా మెలిగే కమల్‌హాసన్‌లో జయలలిత మరణం మార్పు తెచ్చింది. రాష్ట్రంలోని ప్రతి చిన్న అంశానికి స్పందించడం, అధికార అన్నాడీఎంకేను దుయ్యబట్టడం ద్వారా రాజకీయాల్లోకి రావడం ఖాయమని చాటారు. అయితే కమల్, రజనీ స్పష్టమైన ప్రకటన చేయకుండా రాజకీయ ప్రవేశాన్ని నాన్చుతూ వస్తున్నారు. మద్దతుల వెల్లువ రజనీకాంత్, కమల్‌హాసన్, నిర్మాత మండలి అధ్యక్షులు, నటులు విశాల్తోపాటూ తమిళ సినీపరిశ్రమ మద్దతుగా నిలవడంతో మెర్శల్ నిర్మాతలు కొన్ని సన్నివేశాలను తొలగించాలనే ఆలోచనను విరమించుకున్నారు. సినిమాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించడం భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది కాబట్టి ఫలానా సన్నివేశాలను తొలగించాలని కోరడం సమజసం కాదని అన్నారు. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిన తరువాత విడుదలైన చిత్రంపై పరిశీలనలు చేయడం సినిమా పరిశ్రమకే ముప్పు అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో చోటుచేసుకున్న సన్నివేశాలు వాస్తవమైనవి, వీటిని రాజకీయ పార్టీలు విమర్శించరాదని అభిమానులు పేర్కొంటున్నారు. విజయ్‌కు రాజకీయ రంగు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ సహా పలు రాజకీయ పార్టీల నేతలు మెర్సల్ సినిమాలోని డైలాగులకు హర్షం వెలిబుచ్చడంతో విజయ్‌కు రాజకీయరంగు అంటుకుంది. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఉన్న నేత విజయ్ అంటూ అభిమానులు చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో మద్దతు లభిస్తోంది. అంతేగాక, కమల్, రజనీలకు పోటీగా విజయ్ రాజకీయాల్లోకి రావాలనే కోరికను కొందరు వెలిబుచ్చుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మెర్శల్ చిత్రం ద్వారా విజయ్ తొలి అడుగు వేశాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విజయ్ రాకతో మార్పు : తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రాష్ట్రంలో మార్పుకోసం తన కుమారుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని నటుడు విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకులు ఎస్ఏ చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెర్శల్ వివాదం నేప«థ్యంలో చంద్రశేఖర్ ప్రముఖ తమిళ టీవీ చానల్ పుదియతలైమురైకి ఇచ్చిన ఇంటర్వూ్య మంగళవారం సాయంత్రం ప్రసారమైంది. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో మంచి సందేశం ఇచ్చినపుడు రాజకీయ నేతలు ఆదరిస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు పదేపదే చోటుచేసుకుంటే వారిలో రాజకీయ ప్రవేశ ఆలోచనలు రావడం సహజం. ఈ సత్యాన్ని తెలుసుకోకుండానే నేతలు, కార్యకర్తలు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఆ తరువాత అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు పోరాడుతున్నవారే రేపటి నాయకులు, ఈ పరిస్థితుల్లో తమ జీవితం గురించి ఆలోచించకూడదు. తన కోసం ఆలోచించేవాడు కాక సమాజం కోసం ఆలోచించే నాయకుడని ప్రజలే తయారు చేసుకోవాలి. ఇలాంటి నాయకులు వచ్చినపుడు వారి వెంట నడిచేందుకు నేను సిద్ధంగా ఉంటాను. ఎంజీ రామచంద్రన్‌ను ఎవరూ సినీనటుడిగా చూడలేదు. ఆయన స్థానంలో మరెవరినీ పోల్చిచూడలేం. ప్రజల్లో ఆయన ఆ స్థాయిలో నమ్మకం పెంచుకున్నారు. నేటి రాజకీయ నాయకులు రేపు ప్రభుత్వంలో ఉండవచ్చు, ఈరోజు బెదిరింపులకు గురవుతున్న నటుడు (విజయ్) రేపు అధికారంలోకి రావచ్చు. విజయ్ తనలోని కోపాన్ని వెలిబుచ్చేందుకే మెర్శల్ చిత్రంలో నటించాడు. విజయ్ ఒక గాంధేయవాది. గత మూడేళ్లకు పైగా అతను రాజకీయాలు మాట్లాడటం లేదు. అతను ఒక రాజకీయనేతగా మారి తనను నమ్ముకున్న వారికి ఒక మార్పును తీసుకురావాలి. విజయ్ రాజకీయాల్లోకి రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయ ప్రవేశంపై విజయ్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’అని అన్నారు. -
రాజకీయాల్లోకి రా.. హీరోకు తండ్రి సూచన
సాక్షి ప్రతినిధి, చెన్నై: సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లో అడుగుపెట్టాలని తమిళ నటుడు విజయ్‌కు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ సూచించారు. చంద్రశేఖర్ మంగళవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో... ప్రజల గురించి ఆలోచించే వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందన్నారు. ఈరోజు బెదిరింపులకు గురవుతున్న నటుడు(విజయ్) రేపు అధికారంలోకి రావచ్చన్నారు. ‘విజయ్ ఒక గాంధేయవాది. రాజకీయాలపై కొన్నేళ్లుగా అతను ఎలాంటి వ్యాఖ్యలు చేయ లేదు. విజయ్ రాజకీయాల్లోకి రావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని చెప్పారు. విజయ్ నటించిన ‘మెర్సల్’లోని పలు సన్నివేశాలపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. -
ఆ సినిమాకు ఎలా అనుమతిచ్చారో..
సాక్షి, చెన్నై: విజయ్ హీరోగా తెరకెక్కిన 'మెర్శల్' సినిమాను వివాదాలు వీడటం లేదు. తాజాగా ఈ సినిమాకు కేంద్ర ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్సీ) జారీచేసిన సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్థికరంగం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని కించపరిచేలా ఈ సినిమాలో చూపించారని, అంతేకాకుండా ఇటీవల ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) గురించి తప్పుడు వ్యాఖ్యలను చేశారని పిటిషనర్ అశ్వత్థామన్ పేర్కొన్నారు. ఈ సినిమా విడుదలకు సీబీఎఫ్సీ ఎలా అనుమతి ఇచ్చిందంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. సినిమా నిండా దేశం గురించి తప్పుడు ప్రచారం ఉందని, జీఎస్టీని అపార్థం చేసుకునేలా ఫేక్ డైలాగులు, తప్పుడు సీన్లు సినిమాలో ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జీఎస్టీ గురించి డైలాగులు చెప్పాల్సిన అవసరం సినిమాలో లేకపోయినా.. ఉద్దేశపూరితంగానే వాటిని పెట్టారని ఆరోపించారు. ఈ సినిమాలోని డైలాగులు చూసి యువత పెడదోవ పట్టే అవకాశముందని, ఇలాంటి సినిమాలకు సీబీఎఫ్సీ అనుమతి ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. -
జీఎస్టీ దాడులు.. ఏంటీ కన్ఫ్యూజన్?
సాక్షి, చెన్నై : నటుడు, తమిళ చలన చిత్ర నిర్మాత మండలి చైర్మన్ విశాల్ ఇళ్లు, ఆఫీస్లపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ సంస్థ దాడులు చేశాయన్న వార్త నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. మెర్సల్ చిత్రానికి మద్దతుగా బీజేపీ నేత రాజాకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయటంతోనే విశాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారంటూ కొన్ని ఛానెళ్లు తమ వంతుగా క్లారిటీ కూడా ఇచ్చేశాయి. చెన్నై, వడపళని, కుమరన్ కాలనీల్లోని విశాల్ కార్యాలయాలతో పాటు సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు టీడీ నాంగేంద్రకుమార్ బృందం తనీఖీలు చేసినట్లు చెప్పుకున్నారు. నటుడు, నడిఘర్ సంఘం ఉపాధ్యక్షుడు కరుణాస్తోపాటు.. తాను ప్రతీ పైసా సరిగ్గా చెల్లించానని స్వయంగా విశాల్ ఓ ప్రకటన ఇచ్చాడంటూ వార్తలు గుప్పుమనటంతో ఆ వార్త నిజమేనన్న నిర్ధారణకు మీడియా వచ్చింది. అయితే అత్యంత నాటకీయ పరిణామాలతో కోలీవుడ్ మీడియాలో చూపించిన ఈ పరిణామాలన్నీ ఉత్తవేనని చివరకు అధికారులు తెల్చేశారు. తాము విశాల్ కార్యాలయాల్లో ఎలాంటి తనిఖీలు చేయలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) జాయింట్ డైరెక్టర్ పీవీకే రాజశేఖర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా సీబీఈసీ విడుదల చేసింది. Clarification on reports by some news agencies that DGSTI conducted search on premises of Sh. Vishal, President TN Film Producers Council. pic.twitter.com/KGH3K34rjG — CBEC (@CBEC_India) 23 October 2017 -
విశాల్ టార్గెట్‌గా జీఎస్టీ దాడులు
తమిళసినిమా (చెన్నై): తమిళ చిత్రం మెర్సల్ వివాదం ముదురుతోంది. మెర్సల్ చిత్రానికి మద్దతుగా నిలిచిన తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ లక్ష్యంగా సోమవారం జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. చెన్నై, వడపళని, కుమరన్ కాలనీల్లోని విశాల్ కార్యాలయాలతో పాటు సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలోనూ తనిఖీలు చేసినట్లు సమాచారం. దీంతో రాజకీయ కుట్రతోనే విశాల్‌పై దాడులు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. విశాల్ జీఎస్టీ పన్నును సరిగ్గా చెల్లిస్తున్నారా? లేదా అనే విషయంపై అధికారులు దాదాపు 3 గంటల పాటు సోదాలు నిర్వహించారని సమాచారం. అయితే తాము విశాల్ కార్యాలయాల్లో ఎలాంటి తనిఖీలు చేయలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) జాయింట్ డైరెక్టర్ పీవీకే రాజశేఖర్ స్పష్టం చేశారు. -
విశాల్ కార్యాలయంలో జీఎస్టీ తనిఖీలు
-
విశాల్‌కు ఊహించని షాక్
సాక్షి, చెన్నై: మెర్శల్ సినిమాకు మద్దతుగా నిలిచిన హీరో విశాల్‌పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు హెచ్ రాజాపై విమర్శలు చేసి కొన్ని గంటలు గడవకముందే ఆయనకు షాక్ ఇచ్చింది. విశాల్ కార్యాలయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వడాపళనిలోని విశాల్ కార్యాలయానికి వచ్చిన అధికారులు ఆయన చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించిన చెల్లింపు వివరాలను పరిశీలించారు. వస్తు, సేవా పన్ను చెల్లింపుల్లో ఏదైనా ఎగవేత జరిగిందా అనే దాని గురించి శోధించేందుకు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల విడుదలైన మెర్శల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మెర్శల్ చిత్ర యూనిట్‌కు ప్రతిపక్షాలు దన్నుగా నిలిచాయి. కమల్‌హాసన్, రజనీకాంత్ సహా సినిమా ప్రముఖులు మెర్శల్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్ కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడి చేయడం సంచలనంగా మారింది. ‘మెర్శల్’కు అండగా నిలబడిన మిగతావారిపైనా దాడులు జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు పెట్టిన మెర్శల్ సినిమా పైరసీ కాపీని చూశానని హెచ్ రాజా ప్రకటించడంతో క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి పైరసీ సినిమా చూడటానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు. -
‘మెర్శల్’కు ముఖ్యమంత్రి మద్దతు
తమిళసినిమా (చెన్నై): మెర్శల్ చిత్రానికి రాజకీయ మద్దతు పెరుగుతోంది. విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెర్శల్. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇందులో జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలపై డైలాగ్‌లు ఉండటంతో బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా విమర్శించిన నేపథ్యంలో తాజాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మెర్శల్ వివాదంపై ఆదివారం ఓ ప్రకటనలో స్పందించారు. భారతదేశంలో పత్రికల స్వేచ్ఛను, భావస్వేచ్ఛను గత రాజకీయ పార్టీ నేతలు కాపాడుకుంటూ వచ్చారనీ, దాన్ని ఇప్పుడు బీజేపీ హరించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపై చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. -
పైరసీ చూస్తివా.. సిగ్గు లేదా?
సాక్షి, చెన్నై : మెర్సల్ సినిమాలో అభ్యంతరకర డైలాగులను తొలగించేందుకు నిర్మాతలు సిద్ధమైనప్పటికీ.. వివాదం ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఈ విషయంలో చిత్ర యూనిట్‌కు ఊహించని మద్దతు లభించింది. తమిళనాడుకే చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు మెర్సల్ డైలాగులు ఏ మాత్రం తప్పు కాదని వ్యాఖ్యానించారు. దక్షిణ చెన్నై బీజేపీ విభాగానికి చెందిన సీనియర్ నేత సిధార్త్ మణి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మెర్సల్‌లో జీఎస్టీ వ్యతిరేక డైలాగులు తప్పేం కాదని చెప్పారు. అది చిత్ర యూనిట్ అభిప్రాయం. సినిమా మూలంగా గౌరవం దెబ్బతింటుందన్న వాదన అస్సలు సరికాదు. అనవసరంగా పార్టీకి ఆపాదించి ఈ సమస్యను కొందరు పెద్దది చేశారు అంటూ ఆయన సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్ రాజాపై హీరో విశాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఓ ఇంటర్వ్యూలో రాజా.. తాను మెర్సల్ సినిమా పైరసీ కాపీని చూశానని, అందులోని డైలాగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాల్ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఓ జాతీయ నేత అయి ఉండి ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్న పైరసీని ప్రొత్సహించటం దారుణమన్నాడు. పైగా సినిమాను పైరసీలో చూశానని చెప్పటం మరింత ఘోరమని విశాల్ పేర్కొన్నాడు. ‘‘మీరోక బాధ్యతగల పదవిలో ఉన్నారు. పైగా సంఘంలో గౌరవం ఉన్న పెద్ద మనిషి. పైరసీ చూశానని చెబుతున్నారు. సిగ్గు లేదా?’’ అంటూ ఘాటుగా రాజాకు చురకలంటించాడు. తక్షణమే క్షమాపణలు తెలియజేసి, పైరసీ లింకులు తొలగించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని విశాల్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. మరో సీనియర్ నటుడు పార్తీబన్ కూడా రాజా చేసిన పనిని తప్పుబడుతూ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. மரியாதைக்குரிய எச்.ராஜா அவர்களுக்குரிய மரியாதையை குறைக்க வேண்டும்-அவர் களவாடி(யாய்) மெர்சல் கண்டிருந்தால்..! — R.Parthiban (@rparthiepan) October 22, 2017 It mUSt be created by some of US pic.twitter.com/44FzIlgi37 — R.Parthiban (@rparthiepan) October 23, 2017 -
‘మెర్సల్’కు రజనీకాంత్ మద్దతు
చెన్నై: బీజేపీ నేతల జోక్యంతో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న తమిళ చిత్రం మెర్సల్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతుగా నిలిచారు. ‘శభాష్.. ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. మెర్సల్ చిత్ర బృందానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. అయితే అది ఏ అంశమో రజనీ స్పష్టం చేయలేదు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై మెర్సల్ చిత్రంలో ఉన్న సంభాషణలపై తమిళనాడు బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా, రాష్ట్ర అధ్యక్షుడు సౌందరరాజన్, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌లు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, మెర్సల్ సినిమాను ఆన్లైన్లో చూసి బీజేపీ నేత రాజా పైరసీని ప్రోత్సహించారని తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ఆరోపించారు. మెర్సల్ చిత్ర బృందానికి తమిళ సినీపరిశ్రమతో పాటు సీనియర్ నటుడు కమల్‌హాసన్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మద్దతు పలికారు. -
మెర్సల్ వివాదం.. అసలు వాస్తవమేంటి?
సాక్షి, చెన్నై : బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేక డైలాగుల వివాదం కొనసాగుతుండగా.. అవసరమైతే వాటిని తొలగించేందుకు సిద్ధమని నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ థెనాందల్ స్టూడియో లిమిటెడ్ ఓ ప్రకటన వెలువరించింది. ప్రజా ఆరోగ్య విషయంలో భద్రత కోసమే ఆ డైలాగులు చేర్చామే తప్ప.. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడం వాటి ఉద్దేశం కాదు. అవసరమైతే వాటిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నాం అని నిర్మాత రామసామి ప్రకటించారు. 7శాతం జీఎస్టీ వసూలు చేసే సింగపూర్‌లో ఉచిత వైద్యసదుపాయాలు అందిస్తున్నారు. కానీ, ఇక్కడ 28 శాతం జీఎస్టీ వసూలు చేసే మన ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుంది. పైగా మందుల(ఔషధాల) 12 శాతం జీఎస్టీ విధించిన ఈ ప్రభుత్వం.. మన ఆడపడుచుల కాపురాలు కూల్చే మందు(మద్యం)పై మాత్రం జీఎస్టీ విధించలేదు అని విజయ్ మారన్ పాత్రలో డైలాగులు చెబుతాడు. దీంతో బీజేపీ మండిపడగా.. చిత్రం విడుదలైనప్పటికీ అది ముదిరి చివరకు రాజకీయాంశంగా మారిపోయింది. సింగపూర్‌లో ఫ్రీ వైద్యసదుపాయాలన్న మాట అవాస్తవమని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి చెబుతున్నారు. ఇన్సూరెన్స్ కోసం ఆదాయంలో 10 శాతం కోత విధించటం అక్కడ తప్పనిసరని.. అలాంటప్పుడు ఉచితం అనే పదం డైలాగుల్లో వాడటం సొంత పాలకులను కించపరిచినట్లే అవుతుందని నారాయణన్ అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటిదాకా విజయ్ పెదవి విప్పక పోయినప్పటికీ.. ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. చిత్రంలో తన కుమారుడు చెప్పిన డైలాగులు తప్పేం కాదని ఆయన అన్నారు. బీజేపీ సొంత నేతలే జీఎస్టీ, నోట్ల రద్దును తప్పు బట్టారని.. అలాంటప్పుడు చిత్రంలో వాటికి సంబంధించిన డైలాగులు ఉండటం తప్పేం కాదని చంద్రశేఖర్ చెబుతున్నారు. మరోపక్క రాజకీయ వర్గాలతోపాటు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోషియేషన్ కూడా మెర్సల్ కు మద్దతుగా నిలుస్తోంది. సెన్సార్ సమయంలోనే అలాంటి వాటికి కట్ చెప్పాలి. ఇప్పుడు రిలీజ్ అయ్యాక వాటిని వివాదం చేయటం సరికాదు. ఇది భావ స్వేచ్ఛ హక్కును హరించటమే అన్నది అసోషియేషన్ వాదన. -
'మెర్సల్' సినిమాపై పైరసీ దాడి..!
విజయ్ తాజా సినిమా 'మెర్సల్'ను పైరసీ భూతం వెంటాడుతోంది. తాజాగా విడుదలై భారీగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా డౌన్లోడ్ లింకులు టోరెంట్ సైట్లలో కుప్పులుతెప్పలుగా కనిపిస్తున్నాయి. సినిమా పైరసీ బారిన పడకుండా చిత్ర నిర్మాతలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయినా, విడుదల రోజు 'మెర్సల్' ఫుల్మువీ పైరసీ సైట్లలో కనిపించడం గమనార్హం. పైరేట్బే, తమిళ్‌రాకర్స్ వంటి టోరెంటో సైట్లలో ఈ సినిమా డౌన్లోడ్ లింక్స్ యథేచ్ఛగా దర్శనమిస్తున్నాయి. పైరేట్ బే వెబ్సైట్లో ఈ సినిమాను ఇప్పటికే 8వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక తమిళరాకర్స్ వెబ్సైట్ కొత్త హోస్ట్ సైట్‌ను క్రియేట్ చేసి.. ఈ సినిమా డౌన్లోడ్ లింక్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా మరో ప్రాక్సీ సర్వర్ (tamilrocker.fi) ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. మెర్సల్ వర్సెస్ మోదీ వివాదం తెరపైకి రావడంతో ఈ సినిమా డౌన్లోడ్లు బాగా పెరిగిపోయాయని తెలుస్తోంది. విజయ్ సరసన కాజోల్, సమంత, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా అవినీతి వైద్యులు, వైద్య వ్యవస్థ నేపథ్యంగా తెరకెక్కింది. దేశంలో అత్యధిక మొత్తంలో పన్ను వసూలు చేస్తున్నా.. ఎందుకు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం లేదని నిలదీస్తూ.. ఈ సినిమాలో విజయ్ చేసిన డైలాగులు సంచలనం రేపాయి. జీఎస్టీని ప్రశ్నిస్తూ.. సాగిన ఈ డైలాగులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేయడం రాజకీయ రంగు పులుముకుంది. ఇక, ఈ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియాలపై విమర్శలు చేస్తూ విజయ్ డైలాగులు చెప్పే సీన్లు సైతం ట్విట్టర్, ఫేస్బుక్లో లీక్ అయ్యాయి. -
‘మెర్సల్’కు రాజకీయ రంగు
న్యూఢిల్లీ/తమిళ సినిమా (చెన్నై): తాజా తమిళ చిత్రం ‘మెర్సల్’ చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. ఈ చిత్రంలో జీఎస్టీ, నోట్లరద్దుపై, భారత్‌లో వైద్య విధానంపై చిత్రీకరించిన కొన్ని సంభాషణలు వివాదాస్పదంగా మారాయి. దీంతో బీజేపీ, బీజేపీయేతర పక్షాల మధ్య వివాదం రాజుకుంది. చిత్రంలో జీఎస్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని.. వెంటనే వీటిని తొలగించాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే.. సంస్కృతితో మమేకమైన తమిళ సినిమాను అగౌరవపరచకూడదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ ట్వీటర్లో విమర్శించారు. చిత్రం లోని దృశ్యాలను తొలగించొద్దని కమల్ హాసన్ సూచించారు. వివాదం ముదురుతుండటంతో.. మెర్సల్ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్ ఫిలింస్ వెనక్కు తగ్గింది. బీజేపీ డిమాండ్‌లో న్యాయముందని అంగీకరించిం ది. అభ్యంతరకర దృశ్యాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ‘భారత్‌లోని వైద్య విధానంలో నాణ్యతాలోపాలు.. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూపించాలనే ఉద్దేశంతోనే చిత్రం నిర్మించాం. ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదు’ అని చిత్ర యూనిట్ సభ్యుడు ఎన్ రామస్వామి స్పష్టం చేశారు. అసత్యాలతో చిత్రాలు తీస్తారా?: బీజేపీ తమిళ నటుడు విజయ్ కథానాయకుడిగా, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటించిన మెర్సల్ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత బుధవారం విడుదలైంది. చిత్రం పతాక సన్నివేశాల్లో.. హీరో విజయ్ జీఎస్టీ, వైద్య విధానంపై మాట్లాడిన సంభాషణలు వివాదాన్ని రాజేశాయి. బీజేపీ నాయకులు ఈ సంభాషణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్టన్, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ, నోట్ల రద్దుపై అసత్య వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, దేశం పరువును తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలోని ఈ దృశ్యాలను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ తీరుపై విమర్శలు చిత్రంలోని ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు పలికారు. ‘తమిళ సంస్కృతితో మమేకమైన చిత్ర రంగాన్ని బీజేపీ అవమాన పరచొద్దు’ అని ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తూ చిత్రాలు తీయాలంటూ త్వరలోనే కొత్త చట్టం వస్తుంది’ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ఎద్దేవా చేశారు. అటు, తమిళ చిత్ర సెన్సార్ బోర్డు ఈ వ్యాఖ్యలకు ఆమోదం తెలిపిన తర్వాత బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తోందని కమల్ హాసన్ ప్రశ్నించారు. ‘చిత్రాన్ని రీ–సెన్సార్ చేయొద్దు. విమర్శలకు సరైన సమాధానం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. అటు, దక్షిణ భారత నటీనటుల సంఘం కూడా మెర్సల్ చిత్రానికి అండగా నిలిచింది. ‘సెన్సార్ బోర్డు ఆమోదం తర్వాత చిత్రంలోని దృశ్యాలను విమర్శించటం.. భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం’ అని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ భావస్వేచ్ఛ ఉంటుందని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. చిత్రాల్లోని సన్నివేశాలు, సంభాషణలు తొలగించాలని రాజకీయ నాయకులు శాసిస్తే.. ఇక సెన్సార్ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ఈ వివాదంపై హీరో విజయ్ స్పందించనప్పటికీ విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ బీజేపీ తీరును విమర్శించారు. వివాదం రేపిన డైలాగులు ఇవే! చిత్రం క్లైమాక్స్‌లో చేతికి బేడీలతో హీరో విజయ్ కుమార్.. ‘సింగపూర్‌లో 7 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నప్పటికీ ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ తీసుకున్నప్పటికీ ఉచితవైద్యం ఎందుకు ఇవ్వటం లేదు. మందులపై 12 శాతం జీఎస్టీ తీసుకుంటారు.. కానీ మన తల్లుల కాపురాల్లో చిచ్చుపెడుతున్న మద్యంపై మాత్రం జీఎస్టీ ఉండదు’ అని అన్నారు. ఈ డైలాగులపై బీజేపీ మండిపడింది. ‘సింగపూర్‌లో వైద్యం ఉచితం అనేది అబద్ధం. సింగపూర్ ప్రజల సంపాదనలో 10 శాతాన్ని సేవింగ్స్‌గా వెనక్కు తీసుకుంటారు. దీన్ని ఇన్సూరెన్స్ కోసం వినియోగిస్తారు. ఉచిత వైద్యం లేదు’ అని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి తెలిపారు. -
రాజమౌళి కండిషన్ పెట్టాడు!
‘‘సక్సెస్ అవ్వాలనే దర్శకులు సినిమాలు తీస్తారు. కానీ, హిట్ అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. డైరెక్టర్‌గా సక్సెస్ కాలేకపోయాను. నెక్ట్స్ టైమ్ అవుతాను. డైరెక్టర్‌గా రాజమౌళితో పోటీ లేదు. నా దారిలో నేను సినిమాలు తీసుకుంటాను. నేను కథ రాసిన సినిమాలే టాప్‌లో ఉన్నాయంటే... అది దేవుడి దయ’’ అన్నారు విజయేంద్రప్రసాద్. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘మెర్సెల్’ తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదల కానుంది. ‘మగధీర, ఈగ, బాహుబలి, భజరంగీ భాయిజాన్’ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ‘మెర్సెల్’కు స్క్రీన్‌ప్లే అందించారు. త్వరలో ‘అదిరింది’ విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మెర్సెల్’లో మేం మెడికల్ సిస్టమ్ గురించి చెప్పాలనుకున్నాం. వైద్యం అనేది సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ పాయింట్‌పై కథ చేద్దాం అన్నారు అట్లీ. నేను ఎగై్జట్ అయ్యాను. తమిళంలో ‘మెర్సల్’ హిటై్టంది. అందులో నా వంతు పాత్ర ఉన్నందుకు ఆనందం పొందే హక్కు నాకు ఉంది. సినిమాపై వివాద స్వరాలు వినిపిస్తున్నాయి. అది పబ్లిసిటీకి ఫ్లస్ అవుతుందనుకుంటున్నా. తమిళ్లో ‘బాహుబలి’ హయ్యస్ట్ కలెక్షన్స్ గ్రాస్ చేసిందని విన్నాను. ‘మెర్సెల్’ ఆ కలెక్షన్స్ దాటుతుందనుకుంటున్నా. కలెక్షన్స్ స్పీడ్‌గా ఉన్నాయి’’ అన్నారు. ప్రస్తుతం రాస్తున్న కథల గురించి అడిగితే – ‘‘క్రిష్ తీస్తున్న ‘మణికర్ణిక’కు కథ ఇచ్చా. అస్సాంలో ఔరంగజేబుకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన రచిత్ కుల్‌బౌహిత్ జీవితం ఆధారంగా కథ రాస్తున్నా. అలాగే, ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోల్ వాల్కర్‌గారి బయోపిక్ రాస్తున్నాను. ‘నాయక్’ అనే హిందీ సినిమాకు సీక్వెల్ రాస్తున్నా. విక్రమార్కుడు సినిమా ‘రౌడీ రాథోడ్’గా బాలీవుడ్లో విడుదలైంది. ఆ సినిమాకు సీక్వెల్ రాస్తున్నాను’’ అన్నారు. నెక్ట్స్ రాజమౌళికి తీయబోయే సినిమాకి ఎలాంటి కథ ఇస్తారు అనడిగితే– ‘‘రాజమౌళితో సినిమా స్క్రిప్ట్ కోసం ఇంకా వెతుకులాటలోనే ఉన్నాం. రాజమౌళి పరిగెత్తి పాలు తాగే రకం కాదు. సక్సెల్లో ఉన్నప్పుడే సినిమాలు తీయాలను కోడు. ‘ఫలానా హీరో అని కాదు. ఇలాంటి జోనర్ అని కాదు. మీరు కథ చెప్పగానే సినిమా చేయాలనిపించే కథ చెప్ప’మంటున్నాడు రాజమౌళి. సినిమాలో గ్రాఫిక్స్ అవసరం లేదు. సీజీ వర్క్ కోసం టెక్నీషియన్స్ ఇంటికి రాకూడదనే కండీషన్ కూడా పెట్టాడు. నా శాయశక్తులా ట్రై చేస్తున్నాను. ఫలానా హీరో కోసం కథ రాయాలని లేదు. కథను బట్టే హీరో’’ అన్నారు. -
నిర్మాతలకు ముఖ్య గమనిక
సాక్షి, చెన్నై : మెర్సల్ చిత్ర డైలాగుల వివాదం రాజకీయ దుమారం రేగటం తెలిసిందే. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైద్యుడైన మారన్ పాత్రలో హీరో విజయ్ డైలాగులు చెప్పటం.. వెంటనే వాటిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనదైన స్పందించారు. ‘‘నిర్మాతలకు ముఖ్యగమనిక. కొత్త చట్టం వచ్చింది. ఇకపై ప్రభుత్వాన్ని.. వాటి పథకాలను పొగుడుతూ చిత్రాలు నిర్మించాలి. లేకపోతే అంతే’’... అంటూ ఆయన శనివారం తన ట్విట్టర్లో తెలిపారు. వారు మెర్సెల్ విషయంలోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఒకవేళ పరాశక్తి సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చిదంబరం పేర్కొన్నారు. 1950లో వచ్చిన హిందుత్వ సంప్రదాయాలను విమర్శిస్తూ పరాశక్తి సినిమా అనే సినిమా విడుదలై విజయం సాధించింది. ఇక ఇప్పుడు మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా విధానాలను వ్యతిరేకించేలా విజయ్ నోటి నుంచి డైలాగులు రావటం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. BJP demands deletion of dialogues in 'Mersal'. Imagine the consequences if 'Parasakthi' was released today. — P. Chidambaram (@PChidambaram_IN) October 21, 2017 Notice to film makers: Law is coming, you can only make documentaries praising government's policies. — P. Chidambaram (@PChidambaram_IN) October 21, 2017 -
ఆ సినిమాపై బీజేపీ ఆగ్రహం
సాక్షి, చెన్నై : ఇప్పటికే వివాదాలు ఎదుర్కొంటున్న తమిళ హీరో విజయ్ తాజా చిత్రం మెర్శల్‌పై బీజేపీ కన్నెర చేస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెర్శల్. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. పలు ఆటంకాలను ఎదురొడ్డి ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ అందుకుంటున్నా, మరోపక్క రాజకీయవాదుల ఆగ్రహానికి గురవుతోంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు మెర్శల్ చిత్రంపై దండెత్తుతున్నారు. ప్రభుత్వ ఉచిత వైద్యంపై ఒత్తిడి తెచ్చే విధంగా మెర్శల్ చిత్ర తుది ఘట్ట సన్నివేశాల్లో ఆ చిత్ర కథానాయకుడు విజయ్ సింగపూర్ లాంటి దేశాల్లో 7 శాతం జీఎస్టీ విధించి ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందిస్తోందని, మన దేశంలో 28 శాతం జీఎస్టీ పన్ను విధానాన్ని అమలు పరచి ఉచిత వైద్యాన్ని అందించలేకపోతోందని ఆవేశంగా చెప్పే సంభాషణలకు ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ లభిస్తోంది.అదే విధంగా పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. దీంతో మెర్శల్ చిత్రంలో జీఎసీ, పెద్ద నోట్ల రద్దు విధానాలను వ్యతిరేకించేలా సన్నివేశాలు చోటు చేసుకోవడం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ మెర్శల్ చిత్రంలోని జీఎస్టీ పన్ను, పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన సన్నివేశాన్ని తొలగించాలని డిమండ్ చేశారు. తాజాగా కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్ మెర్శల్ చిత్రంపై తీవ్రంగా ఖండన తెలిపారు. మెర్శల్ చిత్రంలో ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలన్నది తన అభిప్రాయం అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదని హితవు పలికారు. అలాగే ప్రముఖ నటుడు కమలహాసన్‌పైనా విమర్శలు సంధించారు. పెద్ద నోట్ల రద్దును మొదట స్వాగతించిన కమలహాసన్ ఇప్పుడు అందుకు బహిరంగ క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొనట్లు తెలిసిందని, ఆయన ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ముందు అనాలోచనతో వ్యాఖ్యలు చేసి ఆ తరువాత రాజకీయ కోణంలో వెనక్కు తీసుకోవడం నాగరికత కాదన్నారు. మెర్శల్ చిత్ర నిర్మాత వివాదాస్పదమైన ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
మెర్సల్’పై విమర్శలు వెల్లువ
-
మెర్సెల్పై కమల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్సల్’పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే సినిమాను తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా తాజాగా బీజేపీ కూడా ఈ జాబితాలో చేరింది. ప్రజా సంక్షేమం కోసం ప్రధాని చేపట్టిన కార్యక్రమాలపై ఈ వాఖ్యలు సరికాదంటూ బీజేపీ వర్గాలు నిరసన తెలుపుతున్నాయి. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో డిజిటల్ ఇండియా, జీఎస్టీ అమలుపై డైలాగులు కూడా వివాదస్పదమయ్యాయి. ఈ రెండు అంశాలపై అసత్య సమాచారం ఇచ్చారని బీజేపీ మండిపడింది. వీటిని తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే హీరో విజయ్‌కు, సినిమాకు మరో అగ్రనాయకుడు కమల్‌హాసన్ మద్దతుగా నిలిచారు. సినిమాను అన్నివిధాలుగా సెన్సార్ బోర్డు సెన్సార్ చేసిందన్నాడు. కాగా వివాదాస్పదంగా ఉన్న సన్నివేశాలను తీసేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. వ్యవస్థపై సరైన రీతిలో విమర్శలు చేయడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈనెల 18న విడుదలైన ‘మెర్శల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది. -
‘మెర్శల్’ వివాదం: డాక్టర్ల సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్శల్’పై వైద్యులు కన్నెర్ర చేశారు. ఈ సినిమాను బహిష్కరిస్తున్నట్టు తమిళ వైద్యులు ప్రకటించారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. తమను కించేపరిచేలా సినిమా తీశారని మండిపడ్డ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా పైరసీ లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నిర్ణయించారు. ‘మెర్శల్’పై మౌనపోరాటం చేస్తామని ప్రకటించారు. ‘ఈ వివాదంపై మీడియా, కోర్టును సంప్రదించకూడదని నిర్ణయించాం. ఎందుకంటే మేము కోర్టుకెళితే సినిమాకు మరింత పబ్లిసిటీ వస్తుంది. దీనికి బదులుగా ఈ సినిమా లింకులను వెబ్ పేజీల్లో పోస్ట్ చేస్తాం. దీంతో సినిమా కలెక్షన్లు తగ్గుతాయి. అప్పుడు ఈ సినిమా తీసినవాళ్లు కళ్లుతెరుస్తార’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ రవిశంకర్ అన్నారు. కాగా, ‘మెర్శల్’ ను బహిష్కరించాలని తమ సభ్యులకు, వారి కుటుంబసభ్యులకు ఇంటర్నెట్ ద్వారా ఐఎంఏ సందేశాలు పంపింది. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో డిజిటల్ ఇండియా, జీఎస్టీ అమలుపై డైలాగులు కూడా వివాదస్పదమయ్యాయి. ఈ రెండు అంశాలపై అసత్య సమాచారం ఇచ్చారని బీజేపీ మండిపడింది. ఈ డైలాగులు తొలగించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈనెల 18న విడుదలైన ‘మెర్శల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది. -
దుమ్మురేపుతున్న కలెక్షన్లు
సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్శల్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా భారీగా ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజు 31.3 కోట్ల వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. వివాదాలను దాటుకుని భారత్‌లో 2500 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా అటు విదేశాల్లోనూ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఒక్క చెన్నైలోనే తొలిరోజు రూ.1.52 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో రూ. 18-19 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలిపాయి. అమెరికా, ఆస్ట్రేలియా, మలేసియా, యూకేలోనూ విడుదలైన ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తోంది. అమెరికాలో 129 ప్రాంతాల్లో విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 2.25 కోట్లు వసూలు చేసినట్టు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మలేసియాలో రూ.90.31 లక్షలు, యూకేలో 81.08 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.68.01 లక్షలు రాబట్టినట్టు తెలిపారు. శ్రీతేనాండాళ్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను అందించారు. సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ నాయికలుగా నటించారు. -
కట్టలు తెంచుకున్న అభిమానం.. థియేటర్లు బంద్!
బెంగళూరు : అభిమానం కట్టలు తెంచుకునే పరిస్థితి ఎలా ఉంటుందంటే హీరోలు, దర్శకనిర్మాతలకు చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. అసలే వివాదాలు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మరి చివరి సమయంలో విడుదలైన సినిమా మెర్శల్. అయితే బుధవారం ఈ మూవీ తమిళనాడు, కర్ణాటకలలో విడుదలకాగా.. అభిమానుల అత్యుత్సాహం కారణంగా బెంగళూరులో కొన్ని థియేటర్లలో షోలు నడవలేదని తెలుస్తోంది. బెంగళూరులో ఓ థియేటర్ ముందు నిల్చున్న స్థానికుడిపై విజయ్ అభిమానులు దాడి చేశారు. బాధితుడు కన్నడ మద్ధతుదారులతో అక్కడికి వచ్చి గొడవకుదిగగా, విజయ్ అభిమానులు(తమిళనాడు) కూడా తామేం తక్కువ తినలేదంటూ రెచ్చిపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయ్ అభిమానులు, బెంగళూరు వాసులకు మధ్య గొడవ పెద్దది కావడంతో కొన్ని షో ప్రదర్శనను రద్దు చేసి థియేటర్లను మూసివేసినట్లు సమాచారం. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లు నాయికలుగా నటించారు. చిత్రటైటిల్ వ్యవహారంలో సీఎం ఎడపాటి పళనిస్వామిని విజయ్ కలవడంతో జంతు సంక్షేమ శాఖాధికారులు ఎన్ఓసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇచ్చిన విషయం తెలిసిందే. -
మెర్శల్ దీపావళికి వెలుగుతుందా?
తమిళసినిమా: కారణాలేమైనా కొంత కాలంగా విజయ్ చిత్రాలకు విడుదల సమయంలో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తలైవా చిత్రం ఎన్నో ఇబ్బందులను ఎదురొడ్డి తెరపైకి వచ్చింది. అదే విధంగా తుపాకీ, కత్తి చిత్రాలు తీవ్ర వివాదాలు, చర్చలనంతరం విడుదలయ్యాయి. తాజాగా విజయ్ నటించిన చిత్రం మెర్శల్. ఈ చిత్రానికి మొదటి నుంచి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే మెర్శల్ చిత్రం వరుసగా ఒక్కో సమస్యను వరుసగా ఎదురొడ్డి గెలుచుకుంటూ వస్తోంది. ఇటీవల మెర్శల్ టైటిల్‌ను విజయ్ చిత్రానికి ఇవ్వరాదంటూ చంద్రశేఖర్ అనే వ్యక్తి కోర్టుకెక్కారు. ఆ సమస్య నుంచి బయట పడడానికి చిత్ర వర్గాలు కోర్టు బోనెక్కి పోరాడాల్సి వచ్చింది. టైటిల్ సమస్య తొలగిందని ఊపిరి పీల్చుకుని చిత్ర విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్న సంతోష తరుణంలో తాజాగా సెన్సార్ సమస్య తలనొప్పిగా మారింది. ఈ చిత్రంలో జల్లికట్టు దృశ్యాలు చోటు చేసుకున్నాయి. అందుకు జంతుసంక్షేమ శాఖ నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. మెర్శల్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్‌బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర వర్గాలు మరో ఐదు రోజుల్లో, నాలుగు రోజుల్లో అంటూ ప్రచారం చేస్తున్నారే కానీ, ఇప్పటి వరకూ తేదీని వెల్లడించలేదు. మెర్శల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సారుకు వెళ్లిన మాట వాస్తవమే. అయితే సెన్సార్ సర్టిఫికెట్ మాత్రం ఇప్పటి వరకూ లాలేదు. దీపావళికి విడుదల అని చిత్ర వర్గాలు ప్రచారం చేయడంతో జంత సంక్షేమ శాఖ( యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మెర్శల్ చిత్రానికి తాము ఎన్ఓసీ సర్టిఫికెట్ అందించలేదట. సెన్సార్ సభ్యుల వివరణ ఈ విషయం గురించి సెన్సార్సభ్యుల వివరణ ఏమిటంటే మెర్శల్ చిత్రం ఈ నెల 6వ తేదీన సెన్సార్ స్క్రీనింగ్ వచ్చిన మాట నిజమేనని, అయితే చిత్రాన్ని చూసిన తాము ఎన్ఓసీ కోసం జంతు సంక్షేమ శాఖ అధికారులకు పంపామని, వారు ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత తాము సెన్సార్ సర్టిఫికెట్‌ను అందిస్తామని చిత్ర నిర్మాతలకు చెప్పామని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ వారికి జంతు సంక్షేమ శాఖ నుంచి ఎన్ఓసీ రాలేదని తెలిపారు. ఆరు నూరైనా మొన్నటి వరకూ వినోదపు పన్ను సమస్య కారణంగా కొత్త చిత్రాల విడుదల అయోమయంగా మారింది. అది కాస్త పరిష్కారం అయ్యిందనుకుంటే, మెర్శల్ చిత్రానికి జంత సంక్షేమ శాఖ ఆటంకంగా మారింది. పరిస్థితి ఇలా ఉంటే చిత్ర నిర్మాత శ్రీతేనాండాళ్ ఫిలింస్ అధినేత మాత్రం ఆరు నూరైనా మెర్శల్ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తామని అంటున్నారు. అందుకు ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాత అంటున్నారు.విశేషం ఏమిటంటే ఇది ఈ సంస్థలో రూపొందిన నూరవ చిత్రం.మరో పక్క మెర్శల్ చిత్ర అడ్వాన్స్ టిక్కెట్ల విక్రమణ సందడి శనివారం నుంచి మొదలైంది. తమిళ ప్రేక్షకులు కొత్త చిత్రాలను చూసి రెండు వారాలైంది. దీంతో మెర్శల్ చిత్రం చూడడానికి ప్రేక్షకులు ఆతృత పడుతున్నారు. -
విజయ్ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్
సాక్షి, చెన్నై: మెర్శల్ చిత్రాని కి మద్రాసు హై కోర్టులో ఊరట లభించింది. దీంతో విజయ్ అభిమానులు ఉత్సాహంతో పండగ చేసుకుంటున్నా రు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ ముగ్గురు ముద్దుగుమ్మలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. ఇది ఈ సంస్థకు వందో చిత్రం అన్నది గమనార్హం. ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళికి విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైకి చెందిన రాజేంద్రన్ అనే నిర్మాత మెర్శల్ చిత్రంపై నిషేధం కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను మెర్శలాయిటేన్ అనే టైటిల్‌ను 2014లోనే రిజిస్టర్ చేశానని, ఆ పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నానని, కాగా మెర్శల్ అనే టైటిల్‌తో విజయ్ హీరోగా శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ చిత్రం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో తన చిత్రం మెర్శలాయిటేన్ వ్యాపార పరంగా బాధింపునకు గురవుతుందని, అందువల్ల విజయ్ చిత్ర టైటిల్ మెర్శల్‌పై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు స్వీరించిన న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ వరకూ విజయ్ చిత్రానికి మెర్శల్ టైటిల్‌ను ఉపయోగించరాదని స్టే ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా నిర్మాత రాజేంద్రన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, మెర్శల్ టైటిల్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. దీంతో మెర్శల్ చిత్ర దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే విజయ్ చిత్రం మెర్శల్ యూ ట్యూబ్, సోషల్ మీడియా అంటూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
కబాలి, బాహుబలి 2 తరువాత ‘అదిరింది’
సౌత్ సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ కీలకంగా మారింది. సొంత రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఓపెనింగ్ వసూళ్లు ఎలాగూ వస్తాయి. అదే సమయంలో ఓవర్ సీస్ మీద కాస్త ఎక్కువ దృష్టి పెడితే భారీ రికార్డ్ లు ఖాయం అని ఫీల్ అవుతున్నారు సినీ ప్రముఖులు. అందుకే మన సినిమాలను ఇతర దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు విదేశాల్లో మరింత ప్రచారం కల్పించేందుకు అక్కడి ప్రముఖ థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిస్ లోని 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్. దాదాపు రెండు వేల మంది ప్రేక్షకులు ఒకేసారి సినిమా చూసేందుకు అవకాశం ఉన్న ఈ థియేటర్లో ప్రదర్శనకు అర్హత సాధించటం భారతీయ చిత్రాలకు అరుదైన ఘనతే. ఇప్పటి వరకు మన దేశం నుంచి కబాలి, బాహుబలి 2 చిత్రాలను మాత్రమే ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా మెర్సల్ ను పారిస్ 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ లో ప్రదర్శించనున్నారట. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అదే రోజు రెక్స్ థియేటర్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో అదే రోజు రిలీజ్ అవుతోంది. -
విజయ్ మెర్సల్ ట్రేడ్‌మార్క్ సంచలనం
సాక్షి, చెన్నై: సౌత్‌లో ఎమోజీల పేరిట మెర్సల్ చిత్రంతో సరికొత్త పంథాను క్రియేట్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అయిపోయాడు. ఈ చిత్ర టైటిల్‌కు ట్రేడ్ మార్క్ హక్కులను తీసుకుని ఆసక్తికర చర్చకు దారితీశాడు. మెర్సల్ ఇక ఈ పేరును ఎవరైనా వాడుకుంటే వాళ్లు చిత్ర నిర్మాతలకు రాయల్టీ కింద డబ్బులు చెల్లించాల్సిందే. ఉదాహరణకు ఏదైనా ఒక పాపులర్ సంస్థ మెర్సల్ అనే టైటిల్ ను వాడినా, లేక ఆ పేరుతో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించినా ఎంతో కొంత డబ్బు చెల్లించి నిర్మాతల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెర్సల్ తో సౌత్ సినిమాలో మరో ట్రెండ్ సెట్ చేశాడనే చెప్పుకుంటున్నారు. ఇక మెర్సల్ ట్రేడ్ మార్క్ హక్కుల ప్రక్రియకు ఆరు నెలల సమయం పట్టిందంట. దీంతో టైటిల్ తమదేనంటూ ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈ యేడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీగా ఉన్న మెర్సల్ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ కానుంది. కాజల్, నిత్యామీనన్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.