
బెంగళూరు : అభిమానం కట్టలు తెంచుకునే పరిస్థితి ఎలా ఉంటుందంటే హీరోలు, దర్శకనిర్మాతలకు చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. అసలే వివాదాలు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మరి చివరి సమయంలో విడుదలైన సినిమా మెర్శల్. అయితే బుధవారం ఈ మూవీ తమిళనాడు, కర్ణాటకలలో విడుదలకాగా.. అభిమానుల అత్యుత్సాహం కారణంగా బెంగళూరులో కొన్ని థియేటర్లలో షోలు నడవలేదని తెలుస్తోంది.
బెంగళూరులో ఓ థియేటర్ ముందు నిల్చున్న స్థానికుడిపై విజయ్ అభిమానులు దాడి చేశారు. బాధితుడు కన్నడ మద్ధతుదారులతో అక్కడికి వచ్చి గొడవకుదిగగా, విజయ్ అభిమానులు(తమిళనాడు) కూడా తామేం తక్కువ తినలేదంటూ రెచ్చిపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయ్ అభిమానులు, బెంగళూరు వాసులకు మధ్య గొడవ పెద్దది కావడంతో కొన్ని షో ప్రదర్శనను రద్దు చేసి థియేటర్లను మూసివేసినట్లు సమాచారం.
అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లు నాయికలుగా నటించారు. చిత్రటైటిల్ వ్యవహారంలో సీఎం ఎడపాటి పళనిస్వామిని విజయ్ కలవడంతో జంతు సంక్షేమ శాఖాధికారులు ఎన్ఓసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment