hero vijay
-
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
సీఏఏ చట్టం.. దళపతి విజయ్ ఏమన్నారంటే?
2019లో ఆమోదం పొందిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. అయితే, సీఏఏ చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ హీరో, దళపతి విజయ్ తన పార్టీ ‘తమిళగ వెట్రి కగళం’ తరుపున స్పందించారు. ఎక్స్.కామ్ పోస్ట్‌లో సీఏఏపై కేంద్రం నిర్ణయం ఆమోద యోగ్యం కాదని ప్రకటన చేశారు. ‘దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA) వంటి ఏ చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు’ అని దళపతి విజయ్ తమిళంలో చేసిన ప్రకటనలో ఉంది. #CitizenshipAmendmentAct pic.twitter.com/4iO2VqQnv4 — TVK Vijay (@tvkvijayhq) March 11, 2024 అంతేకాదు తమిళనాడులో ఈ చట్టం అమలుకు నోచుకోకుండా నాయకులు చూసుకోవాలని కోరారు. విజయ్‌తో పాటు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా పౌరసత్వ (సవరణ) చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. -
క్రేజీ కాంబినేషన్
తమిళ హీరో విజయ్, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో సినిమా ఖరారైంది. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కల్పతి యస్. అఘోరం, యస్. గణేష్, యస్. సురేష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘బిగిల్’ చిత్రం తర్వాత విజయ్‌తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. పైగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ పేర్కొంది. కాగా విజయ్ ప్రస్తుతం ‘లియో’ సినిమా చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబరు 19న విడుదల కానుంది. -
రంజితమే సాంగ్.. కాలు కదిపిన కడుపులో బిడ్డ
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన సినిమా వారసుడు(వారిసు). నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమాలోని రంజితమే రంజితమే అంటూ సాగే సాంగ్ విజయ్ ఫ్యాన్స్‌తో పాటు థియేటర్లను ఓ రేంజ్లో ఊపేసింది. రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను సైతం షేక్ చేసింది. అయితే ఈ పాటకు తాజాగా ఓ మహిళ కడుపులోని బిడ్డ సైతం కదలడం వైరల్‌గా మారింది. రంజితమే సాంగ్ ప్లే చేస్తున్నప్పడు ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న కదలడం కనిపించింది. దీంతో ఆ మహిళ ఆనందంతో మురిసిపోయింది. తన బిడ్డ డ్యాన్స్ చేయడాన్ని చూసి ఆనందంతో పొంగిపోయింది. ఈ వీడియోను చూసిన సంగీత దర్శకుడు తమన్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఈ వీడియో చూస్తుంటే చాలా మధురానుభూతికి లోనవుతున్నా.. ఇది నా రోజును ఎంతో సంతోషంగా మార్చేసింది.' అని పోస్ట్ చేశారు. Such a divine feel How Cute this is made my day 🥹❤️ #Ranjithame 💃🤍🍭 https://t.co/3eRNztekDP — thaman S (@MusicThaman) January 14, 2023 -
'వారీసు' బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ అవుట్
తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వారీసు'. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రష్మిక, విజయ్‌ల ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. తమిళ వర్షన్లో విడుదలైన ఈ సాంగ్ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. (చదవండి: విజయ్, రష్మికల ‘వారీసు’ మూవీ ఎలా ఉంటుందంటే) తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారీసు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
దళపతి విజయ్‌కి విలన్‌గా సమంత?.. ఏ చిత్రమంటే..
నటుడు విజయ్‌తో సమంత ఢీకొన పోతున్నారా? అవుననే చర్చ కోలీవుడ్‌లో జరుగుతుంది. కోలీవుడ్‌లో విజయ్‌కు ఉన్న స్టార్డం అంతా ఇంతా కాదు. ఆయన చిత్రాలు జయాపజయాలకు అతీతంగా కలెక్షన్లు కొల్లగొడతాయి. ప్రస్తుతం ఈయన టాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న వారీసు(తెలుగులో వారసుడు) చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. మరో విషయం ఏమిటంటే ఇందులో నటి సమంత నటించనున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు తెరి, మెర్సల్, కత్తి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా నటి సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత చాలా బోల్డ్ పాత్రల్లో నటించడానికి సై అంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె పుష్ప చిత్రం కోసం చేసిన స్పెషల్ సాంగ్ కుర్రకారును గిలిగింతలు పెట్టే విషయం తెలిసిందే. ప్రస్తుతం శకుంతలం, యశోద వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. అలాంటిది విజయ్ 66 చిత్రంలో ఆయన్ని ఢీకొనే ప్రతినాయకి పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వైరల్ అవుతుంది. చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్‌లర్' హీరోయిన్.. -
అందుకే మీడియాకు దూరంగా ఉంటా: హీరో విజయ్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 13వ తేదీన బీస్ట్ చిత్రం తెర మీదకు రానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర హీరో విజయ్ తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు, ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటారు. అయితే తన తాజా చిత్రం 'బీస్ట్' ప్రచార కార్యక్రమాల్లో విజయ్ కనిపించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా 'బీస్ట్' చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడో తెలిపాడు. చాలా ఏళ్ల క్రితం తనకు జరిగిన ఓ సంఘటనతో తాను మీడియాకు దూరమయ్యానని వెల్లడించారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తాను ఒకటి మాట్లాడితే ఆ మీడియా వాళ్లు మరొకటి రాశారన్నాడు. అయితే మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నాడు. ఆ వ్యాఖ్యలు చేసింది అసలు నేనేనా అనుకునేలా నా మాటలు మార్చి రాసారన్నాడు. ఇక దాంతో నువ్విలా మాట్లాడావంటే మేము నమ్మలేకపోతున్నాం అంటూ తన సన్నిహితులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారని విజయ్ వెల్లడించారు. అలా నాడు తాను అనని మాటలు అన్నట్టుగా రాయడంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని తెలిపాడు. అయితే తన ఇంట్లో వాళ్లకు మాత్రం వాస్తవాలేంటో తెలుసు కానీ బయటి వాళ్లందరికీ తెలియవు. వారందరూ ఆ వార్తలను నమ్ముతారు. ఈ కారణంగా అప్పటి నుంచి తాను మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు విజయ్ స్పష్టం చేశారు. -
దళపతికి ఇన్నాళ్లకు తీరిందా..?
గత ఏడాది అక్టోబర్ 29న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 46ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించి అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు పునీత్. ముఖ్యంగా కన్నడిగులు అయితే తమను తన నటనతో ఇంతకాలం అలరించిన పవర్ స్టార్ ఒక్కసారిగా మరణించడంతో షాక్‌కు గురయ్యారు. చాలా రోజుల వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. నేటికీ పునీత్ సమాధిని తన అభిమానులు దర్శించుకుంటూనే ఉన్నారు. పునీత్ మృతి చెందిన సమయంలో యావత్ భారత సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో చివరి చూపు కోసం అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కూడా బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కన్నీళ్లు పెట్టుకుని మరీ పునీత్ అంతిమ సంస్కారాలను నిర్వహించిన సంగతి ప్రతి ఒక్కరికీ తెల్సిందే. అయితే తాజా విషయం ఏంటంటే.. పునీత్ సమాధిని తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ఘాట్‌ను సందర్శించి శ్రద్దాంజలి ఘటించాడు. అయితే దీనిపై సోషల్ మీడియాలో విజయ్ యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. పునీత్ చనిపోయిన ఇన్నాళ్లకు విజయ్‌కి సమయం దొరికిందా..? అంటూ కన్నడ మీడియా వర్గాలతో పాటు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయి ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటి దాకా తనకు తీరిక దొరక లేదా అంటూ విమర్శిస్తున్నారు. విజయ్ నిజంగానే అంత బిజీగా ఉన్నాడా ఇప్పటికి కానీ ఆయనకు కుదర్లేదా అంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో పని మీద బెంగళూరుకు వచ్చిన విజయ్ పనిలో పనిగా పునీత్ ఘాట్‌ను సందర్శించేందుకు వచ్చాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి కౌంటర్‌గా విజయ్ అభిమానులు తమ అభిమాన హీరోపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా విజయ్ పర్యటన వివాదాస్పదం అవ్వడం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. -
Thalapathy 65: దుమ్మురేపుతున్న ఫస్ట్‌లుక్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టిన రోజు(జూన్ 22) సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈ రోజు రానున్నట్లు సన్‌పిక్చర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే తాజాగా సన్ పిక్చర్స్ సోమవారం (జూన్ 21) సాయంత్రం 6 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. దీంతో విజయ్ కొత్తమూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ మూవీ టైటిల్‌ను ‘బీస్ట్’గా ఖారారు చేశారు. బీస్ట్ అని ఇంగ్లిష్‌లో రాసి ఉన్న ఈ పోస్టర్లో విజయ్ తుపాకి పట్టుకుని కనిపించాడు. ఇందులో విజయ్ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. దీంతో విజయ్ ఈ లుక్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నెల్సన్ ట్వీట్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ హీరో దళపతి కొత్త మూవీ ఫస్ట్‌లుక్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ సన్‌పిక్చర్స్, హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరూధ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. #Thalapathy65 is #BEAST@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja#BEASTFirstLook #Thalapathy65FirstLook pic.twitter.com/Wv7wDq06rh — Sun Pictures (@sunpictures) June 21, 2021 అంతేగాక ఈ సందర్భంగా హీరో విజయ్‌కి బర్త్‌డే విషెష్ కూడా తెలిపాడు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్ట బోమ్మ పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాతోనే పూజా హెగ్డే కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. నెల్సన్ డైరెక్షన్లో రూపోందుతున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా విజయ్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇప్పటికే కథను సిద్ధం చేసిన వంశీ.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. #BEAST it is 🔥 Happy to unveil the first look of this special film with my favourite and sweetest #thalapathy @actorvijay sir ♥️😘🤗 hearty thanks to @sunpictures 🙏♥️ @hegdepooja @anirudhofficial #HBDTHALAPATHYVijay pic.twitter.com/NcCmUGpZne — Nelson Dilipkumar (@Nelsondilpkumar) June 21, 2021 -
ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా?
చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జయం రవి ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్‌లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్ సైకిల్ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్ సైకిల్ ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్ కూడా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. శింబు ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ తిరిగిచ్చేశాడు. చదవండి: బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా.. -
అభిమానితో పెళ్లయ్యి 20 ఏళ్లు
ఆగస్ట్ 25న తమిళ సూపర్‌స్టార్ విజయ్ తన 21వ పెళ్లిరోజు జరుపుకున్నారు. అభిమానులను పెళ్లి చేసుకున్న కళాకారులు చాలామంది ఉన్నారు. విజయ్ కూడా తన కరడు గట్టిన అభిమాని సంగీతను పెళ్లి చేసుకోవడం విధి రాసిపెట్టి ఉండటం వల్లే సాధ్యమైందని భావిస్తారు. విజయ్, సంగీతాల పెళ్లి 1999లో జరిగింది. వారిద్దరికి పెళ్లి జరుగుతుందని వారికే తెలియదు. సంగీతా లండన్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. అయితే విజయ్ సినిమాలు చూసి అతడికి వెర్రి ఫ్యాన్‌గా మారింది. విజయ్‌ని చూడటానికే 1996లో లండన్ నుంచి చెన్నైకి వచ్చింది. ఎవరో తెలిసినవారి ద్వారా విజయ్‌ని కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్ నుంచి వచ్చారా’ అని విజయ్ ఆశ్చర్యపోయారు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతాను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన సంగీతాను విజయ్ తల్లిదండ్రులు (తండ్రి ప్రసిద్ధ సినీ దర్శకుడు చంద్రశేఖర్) గమనించి ఇష్టపడ్డారు. ‘ఈసారి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులతో రామ్మా’ అన్నారు. సంగీతా రెండు మూడేళ్లలో తల్లిదండ్రులతో విజయ్ ఇంటికి వచ్చింది. విజయ్ తల్లిదండ్రులే ‘అమ్మాయి లక్షణంగా ఉంది. పెళ్లి చేసుకోరా’ అని విజయ్‌కు చెప్పారు. విజయ్‌కు కూడా మెల్లగా సంగీతా అంటే అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి. సంగీతాకు ఎలాగూ తెగ ఇష్టమే. చివరకు మూడేళ్ల తర్వాత పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు జేసన్ సంజయ్. కుమార్తె దివ్య శాషా. సంగీతా ఎక్కువగా సినిమా వర్గాల మధ్య కనిపించరు. కుటుంబ బాధ్యత, పిల్లల పెంపకం గురించి శ్రద్ధ పెడతారు. గృహశాంతి ఉంటే మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉంటే విజయమూ ఉంటుంది. విజయ్ విజయాల వెనుక సంగీతా ఉన్నారు. -
ఒకే ఒక్కడు విజయ్
ఒక్కరోజు ముఖ్యమంత్రి అనే సరికొత్త కథాంశంతో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘ముదల్వన్’. తెలుగులో ‘ఒకే ఒక్కడు’గా విడుదలైంది. 1999లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌పై ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సంగతి ఏంటంటే.. విజయ్ హీరోగా ఈ సినిమా సీక్వెల్‌ని తెరకెక్కించనున్నారట శంకర్. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’(భారతీయుడు 2) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు శంకర్. కరోనా లాక్డౌన్ కాలంలో ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌కి కథ తయారు చేశారట ఆయన. ఇందులో విజయ్ హీరోగా నటించనున్నారని సమాచారం. -
కరోనా: హీరో విజయ్ ఇంటిలో ఆరోగ్యశాఖ తనిఖీ
సౌత్ స్టార్ హీరో విజయ్ తళపతి ఇంటిని ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి కరోనా వైరస్ బారిన పడ్డవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం గత రెండు, మూడు నెలల్లో విదేశాలకు వెళ్లిన వారి జాబితాను తీసుకుని వారందరి ఇళ్లను అధికారులు సందర్శిస్తున్నారు. (రెండు లక్షల వరకు కరోనా మృతులు) ఇక ఈ జాబితాలో హీరో విజయ్ కూడా ఉండటంతో చెన్నైలోని ఆయన నీలంకరి నివాసాన్ని కూడా అధికారులు సందర్శించారు. కాగా వైద్యులు విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి ఈ మహమ్మారి బారిన ఆయన కుటుంబ సభ్యులేవరు పడలేదని నిర్ధారించారు. అంతేగాక ఆరు నెలల ముందు విజయ్ మీనహా ఆయన కుటుంబ సభ్యులేవరు విదేశాలకు వెల్లలేదని నిర్థారించుకుని ఇంటిలో శానిటైజర్ స్ర్పే చేసి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా పేర్కొంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. (హైదరాబాద్‌లో కరోనా మరణం.. అంత్యక్రియలు పూర్తి) -
హీరో విజయ్‌కి షాకిచ్చిన ఐటీ అధికారులు
సాక్షి, చెన్నై : తమిళ హీరో విజయ్‌కి ఆదాయపన్ను శాఖ అధికారులు మరోసారి షాకిచ్చారు. గురువారం చెన్నైలోని విజయ్ నివాసంలో ఐటీ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. గత నెలలోనూ విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత దాడులకు కొనసాగింపుగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. (చదవండి : విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం ) గత నెలలో విజయ్ ఇంటిపై, ఆఫీసుపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారి దాడిలో ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని తెలిసింది. దీంతో విజయ్‌తో పాటు, సినీ వర్గాలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజగా ఐటీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఈనెల 15 వ తేదీన రిలీజ్ కాబోతుంది. -
విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం..
సాక్షి, పెరంబూరు: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు స్టార్ నటుల చుట్టూ తిరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అంతే కాదు ఈ స్టార్లతోనూ ఇతర పార్టీలకు చెక్ పెట్టాలని ద్రవిడ పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ నాయకులు వ్యూహ రచన చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మరో ఏడాదిలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేనే మళ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఈ సారి అధికారంలోకి రావడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. అందుకు నటుడు విజయ్‌ని పార్టీలో చేర్చుకునే విధంగా పావులను కదుపుతోంది. ఇక నటుడు కమల్‌హాసన్ సొంతంగా మక్కళ్ నీది మయ్యం పార్టీని ప్రారంభించి ఆ మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశాజనక ఓట్లను సంపాదించుకుని రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు రజనీకాంత్ కొత్తగా పార్టీని ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన రానున్న శాసనసభ ఎన్నికలపైనే గురిపెడుతున్నారు. రాష్ట్రంలోని 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తానని రజనీకాంత్ ఆరంభంలోనే వెల్లడించారన్నది గమనార్హం. కాగా ఈయన బీజేపీ మద్దతుదారుడిగా ముద్ర వేసుకున్నారనే ప్రచారం బాగానే జరుగుతోంది. చదవండి: విజయ్ పార్టీని ప్రారంభిస్తే వారికే లాభం.. విజయ్‌కి స్వాగతం కాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నటుడు విజయ్‌ని తమ పార్టీలోకి లాగాడానికి ప్రయత్నాలను ఇప్పటికే మొదలెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నటుడు విజయ్ అన్నాడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వాటికి అన్నాడీఎంకే నాయకులు గట్టిగానే బదులిచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు విజయ్‌కి మద్దతుగా నిలిచారు. కాగా ఇటీవల విజయ్ ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగినప్పుడూ కాంగ్రెస్ నాయకులు ఆ సోదాలను ఖండించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.అళగిరి రజనీకాంత్ విషయంలో రాయితీలు ఇచ్చిన ఆదాయపన్నుశాఖ నటుడు విజయ్‌కు ఒక్క రోజు కూడా సమయం ఇవ్వకుండా సోదాలు నిర్వహించడం ఏమిటని, రజనీకి ఒక న్యాయం, విజయ్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నంచారు. చదవండి: రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను.. దీంతో శుక్రవారం నటుడు విజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారా అని ఆ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరిని మీడియా ప్రశ్నంచగా విజయ్ తమ పార్టీలో చేరతానంటే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. అయితే ఆయన్ని పార్టీలో చేరమని కోరలేదని అన్నారు. కాగా 2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో నటుడు రజనీకాంత్‌కు పోటీగా విజయ్ను దింపడానికి వ్యూహం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ త్వరలో పార్టీని ప్రారంభించి రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈయన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సవాల్‌గా మారతారనే భావన వ్యక్తం అవుతోంది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా నటుడు విజయ్ను రంగంలోకి దింపితే రాష్ట్రంలో యథాతథంగా ద్రావిడ పార్టీలైన అన్నాడీఎంకే గానీ, డీఎంకే గానీ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చుననే వ్యూహం జరుగుతున్నట్లు తెలిస్తోంది. అదే విధంగా రజనీకాంత్‌కు కాషాయ ముద్ర వేసి, నటుడు విజయ్ బీజేపీకి వ్యతిరేకి అని ప్రచారం చేస్తే రజనీకాంత్‌ను సులభంగా ఓడించవచ్చుననే పథకాన్ని రచిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా ఇప్పటికే డీఎంకే వర్గం నటుడు విజయ్ను తమ పార్టీలోకి లాగడానికి ప్రయత్నించినట్లు ప్రచారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా? ఇవన్నీ కాకుండా తనే సొంతంగా పార్టీని పెడతారా? ప్రస్తుతానికి మౌనంగా ఉంటారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం.. కాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించి సందిగ్ధత నెలకొన్న పరిస్థితిలో ఆయన తండ్రి, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ కుమారుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని ప్రకటించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయ్‌కి వ్యతిరేకంగా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినిమాల్లో చెప్పినట్లుగానే ప్రజలకోసం పనిచేస్తారని అన్నారు. ఇంతకుముందు రజనీకాంత్, కమలహాసన్‌లకు మద్దతు తెలిపినందుకు ఇప్పుడు చింతిస్తున్నానని పేర్కొన్నారు. వారు రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచి జరుగుతుందని భావించానని, అయితే రజనీకాంత్ తమిళ ప్రజలను మోసం చేస్తున్నారని ఇప్పుడు తనకు అనిపిస్తోందన్నారు. తూత్తుక్కుడిలో పోలీసుల తుపాకీ గుళ్లకు బలైనవారిని రజనీకాంత్ సంఘవిద్రోహులుగా చిత్రీకరించి మాట్లాడారని,తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్న పౌరహక్కుల చట్టం బిల్లుకు ఆయన మద్దతు పలికారని, దీన్ని ఎవరూ అంగీకరించరని దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ అన్నారు. -
ఐటీ అధికారుల ముందుకు అర్చన
చెన్నై ,పెరంబూరు: ఆదాయపన్ను శాఖా అధికారుల ముందుకు ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు అర్చన కల్పత్తి బుధవారం హాజరయ్యారు. బిగిల్ చిత్ర వసూళ్ల వ్యవహారంలో ఐటీ శాఖకు పన్ను చెల్లించలేని కారణంగా ఆదాయశాఖ అధికారులు ఇటీవల ఈ చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయం, నిర్మాతల ఇళ్లు, నటుడు విజయ్‌కు చెందిన ఇళ్లు, ఫైనాన్సియర్ అన్బుచెలియన్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ ఇల్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అన్బుచెలియన్ ఇళ్లు, కార్యాలయంలో రూ.77 కోట్లు, రూ. 300 కోట్ల విలువైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ వ్యవహారంలో ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సినామా షూటింగ్లో బిజిగా ఉండడంతో ఆయన ఆడిటర్ మంగళవారం నుంగంబాక్కంలోని ఐటీశాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వివరణ ఇచ్చారు. కాగా బుధవారం ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు, ఆ సంస్థ అధినేత అఘోరం కల్పత్తి కూతురు అర్చన ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె బదులిచ్చినట్లు తెలిసింది. కాగా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ తరపున ఆయనకు సంబంధించిన వ్యక్తి హాజరయ్యారు. ఫైనాన్సియర్ అన్బుచెలియన్ మాత్రం ఇంకా ఐటీ అధికారుల ముందుకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అన్బుచెలియన్ లేదా ఆయన తరపు వ్యక్తి గురువారం ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: విజయ్‌కి ఐటీ శాఖ సమన్లు) -
‘పారాసైట్’ విజయ్ మూవీ కాపీనా..!
పారసైట్.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్లో ప్రస్తుతం ఈ కొరియన్ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కారణం.. తొలిసారి ఓ కొరియన్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలవడం. ఆస్కార్ అవార్డుల్లో ఓ దక్షిణ కొరియా సినిమా ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో కూడా పురస్కారం అందుకున్న చరిత్ర లేకపోగా.. ఈ చిత్రం ఏకంగా ఓవరాల్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్విభాగాల్లో కూడా అస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా దానికి ఈ అవార్డులు రావడంలో అతిశయోక్తి లేదంటారు. అయితే ఆస్కార్లు తెచ్చుకున్న ఈ మూవీ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ఓ చిత్రానికి కాపీ అంటున్నారు కొందరు నెటిజన్లు. విజయ్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించిన 'మిన్సార కన్నా' సినిమాతో 'పారసైట్'కు పోలికలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ‘మిన్సార కన్నా’కు, 'పారసైట్ ' కు చాలా సారూప్యతలు ఉన్నాయని .. బహుశా సౌత్ కొరియన్ డైరెక్టర్ ఈ సినిమా చూసి స్ఫూర్తి పొంది .. ఆ కథనే కొంచెం మార్చి, కొన్ని మలుపులు జోడించి 'పారసైట్ ' తీసి ఉండొచ్చని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బిలియనీర్ అయిన హీరో తన ప్రేమ కోసం హీరోయిన్ ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పనివాళ్లుగా పెడతాడు. చివరకు తన ప్రేమను అతడు ఎలా గెలిపించుకున్నాడు అనే కథాంశంతో ‘మిన్సార కన్నా’తెరకెక్కింది. పారసైట్ కథను మిన్సార కన్నా నుంచి తీసుకున్నారని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ‘పారసైట్’, ‘షాప్ లిఫ్టర్’ అనే చిత్రంను కూడా పోలి ఉందని మరికొంతమంది తమ కామెంట్లు వినిపిస్తున్నారు. ‘పారసైట్’ స్టోరీ ఏంటంటే.. ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేద కుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులన్న విషయం యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాల్లో ఉన్న వారిని మోసగించి, ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ గడుపుతుంటారు. అక్కడ ఉద్యోగాలు కోల్పోయినవారికి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసిపోతుంది. ఈలోపే విహారయాత్రకు వెళ్లిన యజమానులు తిరిగి వస్తున్నారనే వార్త ఆ కుటుంబీకుల చెవిన పడుతుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారనియజమానికి తెలిస్తే.. వాళ్ల ఉద్యోగాల పోతాయన్న భయంతో వారేం చేశారు? అన్నదే సినిమా ఇతివృత్తం. పేద, ధనిక అంతరాల వలన సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయో పారాసైట్ అనే చిత్రంద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. @khushsundar Today parasite movie got 4 oscar awards but after watching the movie I came to know the plot of the story which was taken from Minsara kanna. In minsara kanna all the family was employed for love help& the same here parasite all the family were employed for survival. — rajeshkannan (@rajesh7) February 10, 2020 So many thoughts running the head.. just finished watching #Parasite..Got me thinking about another movie I saw few months back - #Shoplifters... Both very good movies, similar yet different.. #aarootales — Aarti 🐾 (@talesfromaaroo) February 9, 2020 Watched korean movie #parasite lately & realized that the movie is inspired by @actorvijay 's tamil movie #minsarakanna directed by k.s.ravikumar.Parasite is a worldwide hit,but we made such films long back.#legendksravikumar#parasiteisminsarakanna#ThalapathyVijay#Thalapathy — Andrew Rajkumar (@iamrajdrew) February 5, 2020 -
విజయ్ పార్టీని ప్రారంభిస్తే వారికే లాభం..
పెరంబూరు: నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్. నిజం చెప్పాలంటే రజనీకాంత్ రెండు దశాబ్దాల క్రింతం నుంచి రాజకీయాల్లోకి వస్తానని అంటున్నా అందుకు కార్యాచరణను రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. ఇక అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసిన కమలహాసన్ కూడా రెండేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే. కానీ విజయ్ మాత్రం వీరిద్దరికంటే ముందే రాజకీయాలపై కన్నేశారు. తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చారు. అభిమానుల ద్వారా పలు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ వారి అభిమానాన్ని తన రాజకీయాలకు వాడుకోవాలని ప్రయత్నించారు. విజయ్ తండ్రీ, దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ కూడా విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో విజయ్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయం అయిపోయిందన్న తరుణంలో అనూహ్యంగా ఆయన సైలెంట్ అయ్యారు. అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత విజయ్ నటించిన చిత్రాల విడుదల సమయంలో ఇబ్బందులకు గురి చేయడమేనని ప్రచారం కూడా జరిగింది. ఏదేమైనా విజయ్ రాజకీయ రంగప్రవేశం మరుగున పడింది. ఆయన చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. అయితే విజయ్‌కు రాజకీయాలపై ఆసక్తి పోలేదని తన చిత్రాల ప్రచార సమయాల్లో బయట పెడుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం, సంఘ విద్రోహులపై హెచ్చరికలు చేయడం వంటి చర్చలతో వార్తల్లో ఉంటున్నారు. ఆ మధ్య సర్కార్ చిత్ర ఆడియో విడుదల వేదికపైనా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి చర్చల్లో నిలిచారు. ఇటీవల బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలోనూ అధికార పార్టిని విమర్శించేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఇళ్లపై ఐటీ సోదాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్ ప్రాంతంలో ఐటీ అధికారులు ఆయన్ను సుమారు 5 గంటల పాటు విచారించడం, ఆ తరువాత ఇంటిలో రెండు రోజుల పాటు విచారించడం, తాజాగా ఐటీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయడం వంటి పరిణామాలతో విజయ్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వ్యాఖ్యానించడం జరిగింది. ఆయనకు మద్దతుగా నిలవడం వంటి చర్యలతో విజయ్ రాజకీయ రంగప్రవేశం చేస్తారా? అన్న ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి రానున్న శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠంపై కన్నేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రజనీకాంత్ రేపోమాపో రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఆయన అన్నాడీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం బాగానే జరుగుతోంది. మరో పక్క అవసరం అయితే కమల్ పార్టీలో పొత్తు ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన అసలు పార్టీని పెడతారా? పెడితో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతారా? లేక ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు? అన్న అయోమయ పరిస్థితి రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో నెలకొన్నాయి. అసలు రజనీకాంత్ రాజకీయ పార్టీని పెట్టే సాహసం చేయరనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. ఒకవేళ తాను రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అంటే 2006లో విజయ్‌కాంత్ రాజకీయ ప్రవేశంతో డీఎంకే, అన్నాడీఎంకేకు ఏర్పడిన బాధింపే ఇప్పుడూ ఆ పార్టీలకు కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఓటు శాతాన్నే రాబట్టుకుందని, అదే విధంగా రజనీకాంత్ పార్టీని ప్రారంభిస్తే ఆయనకు కొంత ఓటు బ్యాంకు ఉంటుందని, అలాంటిది విజయ్ పార్టీని ప్రారంభిస్తే వీరి వల్ల లాభించేది డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలేనని కొందరు చర్చించుకుంటున్నారు. -
'రాశి'బాగుంది..
సినిమా : నటి రాశీఖన్నా రాశి బాగుంది. ఆమె రాశి బాగుండబట్టే కదా తెలుగు, తమిళ భాషల్లో నాయకిగా రాణిస్తోంది అని అంటారా? అదీ కరెక్టే కానీ కోలీవుడ్‌లో ఇప్పుడు ఆమె టైమ్ ఇంకా బాగుంది. కారణం ఇళయదళపతితో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇంతకు ముందు జయంరవికి జంటగా అడంగమరు, అధర్య సరసన ఇమైకా నొడిగళ్, విజయ్‌సేతుపతితో సంఘతమిళన్ వంటి చిత్రాల్లో రాశీఖన్నా నటించింది. ఆ చిత్రాలు మంచి సక్సెస్‌నే అందుకున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్‌కు జంటగా సైతాన్ కా బచ్చా, సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 3 చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో విజయ్‌దేవరకొండతో జత కట్టిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌తో నటించే అవకాశం రాలేదు. కాగా విజయ్ వంటి స్టార్‌తో నటించే అవకాశం వస్తే ఆ స్టార్డమ్నే వేరు. అలాంటి క్రేజీ ఆఫర్‌ను రాశీఖన్నా కొట్టేసిందన్నది తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం మాస్టర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మలయాళ నటి మాళవికామోహన్ నటిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఫైట్ సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. అదే విధంగా అరుణ్‌రాజ్ కామరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌కు జంటగా నటి రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. మరో ముఖ్య పాత్రలో ఐశ్వర్యరాజేశ్ నటించనున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె విజయ్‌కి చెల్లెలుగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే ఈ అమ్మడు ఎవరికి చెల్లెలిగానైనా నటిస్తాను కానీ విజయ్‌కు చెల్లెలిగా నటించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అలాంటి పాత్రనే విజయ్‌తో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి దీనికి ఏం చెప్పి సమర్ధించుకుంటుందో ఐశ్వర్యరాజేశ్. కాగా ఇంతకు ముందు కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఎంగవీట్టు పిళ్లై చిత్రంలో ఈ అమ్మడు శివకార్తీకేయన్‌కు చెల్లెలిగా నటించింది. మాస్టర్ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే తాజా చిత్రానికి విజయ్ రెడీ అవుతారని తెలిసింది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా విజయ్ నటించనున్న 65వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
విజయ్‌కి ఐటీ శాఖ సమన్లు
తమిళనాడు ,పెరంబూరు : హీరో విజయ్‌కి ఆదాయపన్ను శాఖ సోమవారం సమన్లు జారీ చేసింది. ఐటీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే సినిమా షూటింగ్లో బిజిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇందుకు హాజరు కాలేకపోయారు. ఇటీవల ఐటీ అధికారులు సుమారు 30 గంటల పాటు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని, అదనంగా ఏమీ లభించలేదనే ప్రచారం జరగడంతో విజయ్‌తో పాటు, ఆయన సినీ వర్గాలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజగా ఐటీ అధికారులు కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. గత ఏడాది అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్ సంస్థ నిర్మించిన బిగిల్ చిత్రంలో విజయ్ నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అధిక లాభాలు తెచ్చి పెట్టిందని ప్రచారం జరిగింది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం రూ.300 కోట్ల వరకూ లాభాలను తెచ్చి పెట్టిందని ప్రచారం జరిగింది. వీటిపై బిగిల్ చిత్ర వర్గాలు ఐటీశాఖకు చూపించకపోవడంతో ఆ శాఖ అధికారులు ఇటీవల విజయ్, ఏజీఎస్ అధినేత అఘోరం, ఫైనాన్సియర్ అన్బు చెలియన్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. మొత్తం 77 కోట్ల నగదు, పలు ఖరీదైన వజ్రాలు, బంగారంతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే విజయ్ ఇంటిలో ఏమీ దొరకలేదనే ప్రచారం జరిగింది. కాగా సోమవారం అనూహ్యంగా వీరందరికీ చెన్నైలోని ఆదాయశాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ముందు మూడు రోజుల్లోగా హాజరుకావాలని ప్రచారం జరిగింది. ఆ తరువాత సోమవారమే హాజరుకావాలని సమన్లలో పేర్కొనట్లు తెలిసింది. హాజరు కాని విజయ్ ఈ నేపథ్యంలో విజయ్ సోమవారం కూడా తాను నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ కారణంగా తాను ఆదాయశాఖ కార్యాలయానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపినట్లు సమాచారం. మంగళవారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అదే విధంగా ఏజీఎస్ సంస్థ అధినేత అఘోరం, ఫైనాన్సియర్ అన్బు చెలియన్ కూడా సోమవారం విచారణకు హాజరు కాలేదు. దీంతో ఐటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. విజయ్ అడ్డు పడతారనే భయంతోనే కాగా విజయ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు, ఆయన నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు, సీపీఎం నేతలు, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండించారు. తాజాగా దర్శకుడు, నటుడు అమీర్ సైతం ఐటీ దాడులను ఖండించారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు విజయ్ అడ్డం అవుతారనే భావనతోనే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న భావన కలుగుతోందన్నారు. వారి ఆటంకాలు విజయ్ ఎదుగుదలను అడ్డుకోగలవేమో గానీ, ఆయన్ని వెనుకడుగు వేయనీయవన్నారు. విజయ్ చిత్ర షూటింగ్లో ఆందోళనలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. విజయ్ రాజకీయాల్లో రావడాన్ని ఒక తమిళుడిగా తాను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు, విజయ్ తలచుకుంటే తన అభిమానులను షూటింగ్ ప్రాంతానికి రప్పించి ఆందోళన కారులను తరిమి కొట్టించి ఉండవచ్చునని అయితే ఆయన పరిపక్వతను ప్రదర్శించారని అన్నారు. బీజేపీ రజనీకాంత్‌తో రాజకీయం చేస్తుండటంతో విజయ్ ఎదుర్కొంటారనే భయంతోనే ఆయన ఇంటిపై ఈ ఐటీ దాడులని అమీర్ పేర్కొన్నారు. ఐటీ దాడుల వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ పెరంబూరు : నటుడు విజయ్ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాలు ఇప్పుడు తమిళనాడును దాటి పార్లమెంట్ వరకూ వెళ్లింది. విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్రం షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఆయన్ను ఐటీ అధికారులు సుమారు 5 గంటల పాటు విచారణ జరిపిన సంఘటన, ఆ తరువాత ఆయనకు చెందిన ఇళ్లల్లో రెండు రోజుల పాటు జరిపిన సోదాలు కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. విజయ్ ఇళ్లలో ఐటీ సోదాలను పలువురు రాజకీయ పార్టీ నాయకులు ఖండించారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్ వరకూ వెళ్లింది. డీఎంకే పార్లమెంట్ సభ్యుడు దయానిధి మారన్ నటుడు విజయ్‌కు మద్దతుగా లోక్‌సభలో ప్రశ్నను రైజ్ చేశారు. రజనీకాంత్‌కు ఇటీవల కోటి రూపాయలకు పన్ను రాయితీని ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ, నటుడు విజయ్‌పై ఐటీ సోదాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. రజనీకాంత్‌కు ఒక న్యాయం, విజయ్‌కు మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. కాగా దయానిధి మారన్ నటుడు రజనీకాంత్‌తో ఆయన 168వ చిత్రాన్ని నిర్మిస్తున్న కళానిధిమారన్ సోదరుడన్నది గమనార్హం. కాగా సోమవారం నటుడు విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్లో తనకు అండగా నిలిచిన అభిమానులతో సెల్పీ ఫోటో దిగి ధ్యాంక్యూ నైవేలి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆయన అబిమానులు ఖుషీ అవుతున్నారు. -
రచ్చరచ్చగా విజయ్ సినిమా షూటింగ్
పెరంబూరు: నటుడు విజయ్ చిత్ర షూటింగ్ రచ్చరచ్చగా మారింది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మాస్టర్. ఈ చిత్ర షూటింగ్ నైవేలిలోని ఎన్ఎల్సీ సొరంగం ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఐటీ అధికారులు అక్కడకు వచ్చి ఆయన్ని విచారించిన విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్ ఇంటిలోనూ అధికారులు విచారించారు. అలా రెండు రోజులు విచారణను ఎదుర్కొన్న నటుడు విజయ్ శుక్రవారం తిరిగి మాస్టర్ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. అయితే మాస్టర్ చిత్ర షూటింగ్‌ను ఎన్ఎల్సీ సొరంగం ప్రాంతంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చి యూనిట్ వర్గాలతో వివాదానికి దిగారు. షూటింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు పలువురు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా గొడవకు దారి తీసి రచ్చరచ్చగా మారింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పి వారిని అక్కడ నుంచి పంపించేశారు. ఈ సంఘటనతో విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్‌కు పోలీసుల భద్రతను పెంచారు. కాగా బిగిల్ చిత్ర ఫైనాన్సియర్ అన్భు చెలియన్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ దాడులు వరుసగా ఐదు రోజులు జరిగి ముగిశాయి. మద్దతు పెరుగుతోంది కాగా విజయ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయడంపై ఆయనకు రాజకీయ నాయకుల మద్దతు పెరుగుతోంది. ఈ ఐటీ దాడుల వెనుక ఉన్నది బీజేపీనేనని ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, నామ్‌తమిళర్ పార్టీ నేత సీమాన్ వంటి వారు విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఐటీ దాడులకు బీజేపీనే కారణం అంటూ విమర్శించారు. కాగా శనివారం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా విజయ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కే.బాలకృష్ణన్ శనివారం కోవైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియాలో కరోనా వైరస్ బీజేపీనేనని దండెత్తారు. నటుడు విజయ్ ఇంటిపై ఐటీ దాడుల గురించి స్పందిస్తూ ఆయన తన చిత్రాల్లో బీజేపీని విమర్శిస్తునందువల్లే, విజయ్ గొంతు నొక్కే ప్రయత్నమే ఈ ఐటీ దాడులు అని విమర్శించారు. ఈయన నటుడు రజనీకాంత్‌పైనా విమర్శలు చేశారు. ఆయన బీజేపీ గొంతుగా మారారని ఆరోపించారు. తమిళనాడులో బీజేపీకి వాయిస్ లేదని, దీంతో ఆ పార్టీ తాను అనుకున్నది నటుడు రజనీకాంత్ ద్వారా జరిపించుకునే చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అదేవిధంగా మనిద నేయ జననాయక కట్చి కార్యదర్శి తమిమున్ అన్సారి రజనీకాంత్‌పై విమర్శలు చేశారు. ఆయన ఇంతకు ముందు భారతీరాజా దర్శకత్వంలో నటించారని, ఇప్పుడు బీజేపీ దర్శకత్వంలో నటిస్తున్నారని విమర్శించారు. -
విజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం?
పెరంబూరు: చెన్నైలో గత మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటూ కలకలం సృష్టిస్తున్నాయి. నటుడు విజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం?.. కాదు ఆయనే ఈ వ్యవహారంపై కేసు పెట్టవచ్చు.. లాంటి ప్రచారాలు సాగుతున్నాయి. కాగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు నటుడు విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. విశేషం ఏమిటంటే విజయ్ ఇంట్లో ఐటీ సోదాలకు బీజేపీ పార్టీనే కారణం అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందుకు కారణం విజయ్ నటించిన మెర్శల్ చిత్రంలో ఉచిత వైద్యం, జీఎస్టీ వంటి సన్నివేశాలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. అప్పుట్లో వీటిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటుడు విజయ్ అన్నాడీఎంకే నాయకులకు వార్నింగ్ ఇచ్చే విధంగా మాట్లాడారు. తనను ఏమైనా అనండని, తన అభిమానులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు విజయ్‌పై ఐటీ దాడులతో బీజేపీ, అన్నాడీఎంకే వ్యతిరేక పార్టీల నాయకులకు విమర్శించే అవకాశం వచ్చింది. దాన్ని కొందరు బలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి లాంటి వారు విజయ్‌పై ఐటీ దాడులకు బీజేపీనే కారణం అని ఆరోపించారు. పుదుచ్చేరిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నటుడు విజయ్ను ఐటీ దాడులతో బెదిరించి తమ పక్కకు తిప్పు కోవాలని బీజేపీ పన్నాగం పన్నుతోందన్నారు. ఆయన నటుడు రజనీకాంత్‌నూ వదల లేదు. దేశంలో శాంతి భద్రతలు కొరవడ్డాయని, అలాంటిది నటుడు రజనీకాంత్ కూడా ఇవేవీ పట్టించుకోకుండా మోదీ, అమిత్‌షా గొంతుగా మారిపోయారని విమర్శించారు. ఇక నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ దాడులను ఖండించారు. ఇది రాజకీయ కుట్ర అని, నటుడు విజయ్‌కు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని అన్నారు. అందుకే ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా బీజేపీ ఈ దాడులను చేయించిందని ఆరోపించారు. అంతేకాకండా నటుడు విజయ్ కంటే అధిక పారితోషికం తీసుకుంటున్నవాళ్లూ ఉన్నారని, నటుడు రజనీకాంత్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరి కూడా స్పందించారు. విజయ్ ఇంట్లో ఐటీ సోదాలను ఖండించారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీని వ్యతిరేకిస్తున్న వారిని అణచివేయడానికి పలు విషయాలు జరుగుతున్నాయన్నారు. నటుడు విజయ్ మెర్శల్ చిత్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా కొన్ని సన్నివేశాల్లో నటించారని, అందుకే ఆయనపై ఈ ఐటీ దాడులని విమర్శించారు. అలాంటిది సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులెవరూ ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. ఇకపోతే ఐటీ దాడులను ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే ప్రచారం సంచలనంగా మారింది. బిగిల్ చిత్రానికి ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫైనాన్సియర్ అన్భు చెలియన్ వద్ద బారీగా డబ్బు, డాక్యుమెంట్లు లభించాయి. ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ కేసు నమోదు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా రెండు రోజుల పాటు ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొన్న నటుడు విజయ్ మాత్రం తనపై జరిగిన ఐటీ దాడుల గురించి స్పందించలేదు. శుక్రవారం ఆయన సైలెంట్‌గా తాను నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన అభిమానులు మాత్రం ఆందోళన, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. -
తమిళ హీరో విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి ప్రతిని«ధి, చెన్నై: కోట్లాది రూపాయల మేర పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై తమిళ హీరో విజయ్, ఏజీఎస్ నిర్మాణ సంస్థ అధినేత, సినీ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుసెళియన్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు బుధవారం చేసిన సోదాలు గురువారం కొనసాగాయి. అన్బుఇల్లు, ఆఫీస్‌లో రూ.77 కోట్ల నగదు, రూ.24 కోట్ల విలువైన కిలో వజ్రాలు, బంగారం, విజయ్, అన్బుసెళియన్ల వద్ద ఉన్న రూ.300 కోట్ల విలువైన స్థిరాస్తిపత్రాలు లభించాయని సమాచారం. రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ విభాగం అంచనా వేసినట్లు తెలుస్తోంది. -
ఈ సారి రాజకీయాలకు దూరంగా..
సినిమా: ఈ సారి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్నారు నటుడు విజయ్. ఏంటి? ఏదేదో ఊహించేసుకుంటున్నారా? రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో మీరలా ఊహించుకోవడంలో తప్పులేదుగానీ, ఇక్కడ విషయం మాత్రం అది కాదు. విజయ్ మాట్లాడుతున్నది మాత్రం తన సినిమా గురించే. ఇటీవల ఈయన నటించిన మెర్శల్, సర్కార్ వంటివి రాజకీయాలను టచ్ చేసినవే కావడంతో విజయ్ తాజా చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో తెరి, మెర్శల్ చిత్రాలు తెరకెక్కి విజయం సాధించాయి. దీంతో ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అదే విధంగా విజయ్ చిత్రం అనగానే రాజకీయ అంశాలు ఉంటాయని ఊహించుకోవడం సహజమే. అందుకే వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చే విధంగా నటుడు విజయ్ తన తాజా చిత్రం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ, అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం చాలా జాలీగా, అదే సమయంలో చాలా కలర్ఫుల్గా, అందరికీ నచ్చే విధంగా ఉంటుందని చెప్పారు. తన గత చిత్రాలు కాస్త సీరియస్‌గా, చిత్ర క్లైమాక్స్‌లో రాజకీయాలకు సంబంధించిన అంశాలు, అదే విధంగా మీడియా ముందు మాట్లాడడం వంటివి చోటుచేసుకున్నాయన్నారు. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం తనకే బోర్ అనిపిస్తోందన్నారు. అందుకే అలాంటి కథా చిత్రాలకు భిన్నంగా, రాజకీయాలకు దూరంగా ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో జాలీగా, కలర్ఫుల్గా ఉండే కథా చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో విజయ్ అభిమానులు భలే ఖుషీ అవుతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అగ్రనటి నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్లో ఈ బ్యూటీ ఇటీవలనే పాల్గొంది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
విజయ్ వారసుడి తెరంగేట్రం
నటుడు విజయ్ కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలిగిపోతున్న విషయం తెలి సిందే. దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్‌కు వారసుడిగా విజయ్ రంగప్రవేశం చేశారు. తాజాగా విజయ్ వారసుడు జెసన్ సంజయ్ రంగప్రవేశం చేశాడు. అయితే సంజయ్ ఇంతకు ముందే తండ్రితో కలిసి బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించాడన్నది తెలిసిందే. ఇతను ఇప్పుడు తాత ఎస్ఏ. చంద్రశేఖర్ దర్శకత్వ వారసత్వాన్ని, తండ్రి విజయ్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని తొలి ప్రయత్నంలోనే ఏకకాలంలో స్వీయ దర్శకత్వంలో నటించేశాడు. అయితే ఇతను తొలి ప్రయత్నంగా లఘు చిత్రాన్ని ఎంచుకున్నాడు. జంక్షన్ పేరుతో జెసన్ సంజయ్ తెరకెక్కించిన థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ లఘు చిత్రం బుధవారం యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. -
‘విజయ్‌కు పూలమాల వేస్తా’
తమిళనాడు, పెరంబూరు: ప్రజల్లో అధిక ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్కేనని, లంచగొండులను పట్టిస్తే హీరో విజయ్‌కు పూలమాల వేసి స్వాగతిస్తానని కేంద్రమంత్రి, బీజేపీ నేత పొన్రాధాకృష్టన్ అన్నారు. తన తాజా చిత్రం సర్కార్ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే వర్గాల్లో ప్రకంపనలు పట్టిస్తున్నాయి. అంతే కాదు విజయ్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ గురువారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన ఈ క్రింది విధంగా బదులిచ్చారు. ప్ర: హైడ్రోకార్బన్న పథకానికి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ పోరాటం చేయడంపై మీ స్పందన? జ: అది పనిలేని కార్యం. వారు ఏం కావాలో అడిగారా? డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు హైడ్రోకార్బన్ పథకం గురించి మాట్లాడే అర్హత లేదు, ప్ర: బీజేపీకి వ్యతిరేకంగా రెండవ స్వాతంత్య్ర పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యల గురించి? జ: వారికి స్వాతంత్య్రం రాదు, ఎప్పుడూ ఊహల్లోనే పోరాటం చేస్తారు. ప్ర: ఇటీవల నటుడు విజయ్ సీఎంనైతే నిజాయితీగా ఉంటా. నటించను అని అనడం గురించి మీ కామెంట్? జ: అందరూ ఎంజీఆర్, జయలలితలా కాలేరు. ఇప్పుడు ప్రజల మధ్య ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్ మాత్రమే. ప్ర: బీజేపీ రజనీకాంత్‌ను వెనకేసుకు రావడానికి కారణం? జ: ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. పలువురు నటులు, పత్రికల వాళ్లు వివిధ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. ఏదో తమిళనాడు దిక్కులేనిదిగా భావిస్తూ రాజకీయాల్లోకి రాకూడదన్నారు. నటుడు విజయ్ లంచం గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఆరోపణలు చేయాలని కాకుండా అలాంటి లంచగొండులను ఆయన పట్టిస్తే నేను ఆయన వద్దకు నేరుగా వెళ్లి పూలమాల వేసి స్వాగతిస్తాను. రజనీకాంత్‌కు మంచి మనిషి అని ప్రజల్లో పేరు ఉంది. ప్ర: రజనీకాంత్ భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తారా? జ: రజనీకాంత్ ఇంకా పార్టీనే స్థాపించలేదు. అయినా ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారా? అన్నది తెలియదు. ప్ర: పార్లమెంట్ ఎన్నికలకు మరో 6 నెలల కాలమే ఉంది. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జ: ఇప్పటి కంటే కూడా అధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. బీజేపీ 350 స్థానాలను, కూటమితో కలిసి 400లకు పైగా స్థానాలను గెలుచుకుని మళ్లీ గద్దెనెక్కుతుంది. -
రజనీకే ఆదరణ.. లంచగొండులను పట్టిస్తే ఆయనకు పూలమాల!
సాక్షి, పెరంబూరు : సూపర్‌స్టార్ రజనీకాంత్‌కే ప్రస్తుతం ప్రజల్లో అధిక ఆదరణ ఉందని కేంద్రమంత్రి, బీజేపీ నేత పొన్ రాధాకృష్టన్ అభిప్రాయపడ్డారు. లంచగొండులను పట్టిస్తే హీరో విజయ్‌కు పూలమాల వేసి స్వాగతిస్తాననీ చెప్పారు. విజయ్ తాజా చిత్రం ‘సర్కార్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని ఆయన పేర్కొనడం అన్నాడీఎంకే వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు బీజేపీ నేతలు సైతం విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ గురువారం ఉదయం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ప్ర: హైడ్రో కార్బన్ పథకానికి వ్యతిరేకంగా డీఎంకే పోరాటం చేయడంపై మీ స్పందన? జ: అది పనికిమాలిన పని.. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు హైడ్రో కార్బన్ పథకం గురించి మాట్లాడే అర్హత లేదు, ప్ర: బీజేపీకి వ్యతిరేకంగా రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల గురించి? జ: వారికి స్వాతంత్య్రం రాదు, ఎప్పుడూ ఊహల్లోనే పోరాటం చేస్తారు. ప్ర: నటుడు విజయ్ తాజాగా తాను సీఎంనైతే నిజాయితీగా ఉంటా. నటించనని అనడం గురించి మీ కామెంట్? జ: అందరూ ఎంజీఆర్, జయలలితలా కాలేరు. ఇప్పుడు ప్రజల మధ్య ఆదరణ ఉన్న నటుడు రజనీకాంత్ మాత్రమే. ప్ర: బీజేపీ రజనీకాంత్‌ను వెనుకేసుకురావడానికి కారణం? జ: ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. పలువురు నటులు, పత్రికల వాళ్లు వివిధ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నారు. విజయ్ లంచం గురించి మాట్లాడుతున్నాడు. ఏదో ఆరోపణలు చేయాలని కాకుండా.. అలాంటి లండగొండులను పట్టిస్తే నేను ఆయన వద్దకు నేరుగా వెళ్లి పూలమాల వేసి స్వాగతిస్తాను. రజనీకాంత్‌కు మంచి మనిషి అని ప్రజల్లో పేరు ఉంది. ప్ర: రజనీకాంత్ బీజేపీకి మద్దతునిస్తారా? జ: రజనీకాంత్ ఇంకా పార్టీనే స్థాపించలేదు. ఐనా ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతారా? లేదా అన్నది తెలియదు. ప్ర: లోక్‌సభ ఎన్నికలకు మరో 6 నెలల సమయం మాత్రమే ఉంది. మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జ: గత ఎన్నికల కంటే కూడా అధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది. బీజేపీ 350 స్థానాలను సొంతంగా.. కూటమితో కలిసి 400లకు పైగా స్థానాలను గెలుచుకుని మళ్లీ గద్దెనెక్కుతుంది. -
నేనే సీఎం అయితే..
నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను అని అన్నారు నటుడు విజయ్. ఈ స్టార్ నటుడికి రాజకీయాల్లోకి రావాలన్న ఆశ బలీయంగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకుచాలా కాలం క్రితమే తన సైన్యాన్ని (అభిమానుల్ని) బరిలోకి దింపారు. సామాజిక సేవ పేరిట సమావేశాలను నిర్వహించారు. ఆ తరువాత తన చిత్రాల విడుదల సమయంలో ఏర్పడ్డ అడ్డంకులు ఆయన రాజకీయ ఆశలపై నీళ్లు చల్లాయనే చెబుతారు. సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి అవ్వాలన్న తన కోరికను నటుడు విజయ్ మంగళవారం మరోసారి చెప్పకనే చెప్పారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ ఆడియో ఆవిష్కరణ మంగళవారం చెన్నై, తాంబరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించారు. ఆడియో ఆవిష్కరణ సందర్భంగా అందరి ప్రసంగం విజయ్ గురించి, రాజకీయాలపైనే సాగడం విశేషం. చివరకు విజయ్ కూడా రాజకీయాల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈయన ఏమన్నారో చూద్దాం. ‘అభిమానుల ఆదరణకు కృతజ్ఞతలు. ఈ వేడుకకు నాయకుడు ఏఆర్ రెహ్మాన్. ఆయన సంగీతం అందించడం ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించినట్లే. నేను, దర్శకుడు మురుగదాస్ కలిసి చేస్తే అది హిట్ చిత్రం అవుతుంది. సర్కార్ చిత్రంలో ప్రత్యేకత ఏమిటంటే మెర్శల్ చిత్రంలో కొంచెం రాజకీయం చోటుచేసుకుంది. ఇందులో రాజకీయం దుమ్మురేపుతుంది. సినిమాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ ఉత్తమ నటనను ప్రదర్శించారు. ఆమెకు అభినందనలు. నటి వరలక్ష్మి వద్దు అని ఎవరు అనలేని విధంగా ఈ చిత్రంలో ఆమె నటించారు. విజయం కోసం ఎంతగానైనా కష్టపడవచ్చు. అయితే మా చిత్రం విజయం సాధించకూడదని ఒక వర్గం త్రీవంగా శ్రమిస్తోంది. జీవితం అనే ఆటను చూసి ఆడండి. అసహ్యించుకునే వారిపై ఉమ్మేయండి. విసిగించేవారి వద్ద మౌనంగా ఉండండి. జీవితాన్ని జామ్‌జామ్‌గా గడిపేద్దాం అని అన్నది ఎవరో తెలియదు గానీ, ఆ వ్యాఖ్యలను నేను అనుసరిస్తున్నాను. మీరు అనుసరించండి. సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయనున్నాం. నేను చిత్రం గురించి చెబుతున్నాను. నచ్చితే ఈ చిత్రానికి ఓటేయండి. సర్కార్ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించలేదు. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను’ అని నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే రాజకీయాలపై ఉన్న ఆసక్తి తెలిసిపోతుంది కదూ! రాజకీయ ప్రకంపనలు సర్కార్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొందరు నాయకులు స్వాగతిస్తున్నా, మరి కొందరు, ముఖ్యంగా అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ విజయ్, అజిత్ లాంటి ప్రముఖ నటులు రాజకీయాల్లోకి రావాలన్నారు. రాష్ట్ర మంత్రి ఉదయకుమార్ స్పందిస్తూ సర్కార్ సినిమాను సర్కస్‌తో పోల్చారు. విజయ్ చిత్రాలు చేసుకోవడమే మంచిదని, రాజకీయాల్లో ఆయన రాణించలేరని ఎద్దేవా చేశారు. -
స్టార్ హీరోతో ఢీనా?
సాక్షి, చెన్నై : ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ నటి అంటే వరలక్ష్మీశరత్కుమార్నే. రకరకాల పాత్రలతో చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క సేవ్ శక్తి ద్వారా మహిళా సంరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇలా అరుదైన నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించడానికి సై అంటున్నారు. ప్రస్తుతం అలాంటి పాత్రతో ఇళయదళపతితో ఢీకొంటున్నారన్నది తాజా సమాచారం. విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో నటి కీర్తీసురేశ్ కథానాయకిగా నటిస్తున్నారు. భైరవా చిత్రం తరువాత తను విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న రెండవ చిత్రం ఇది. ఇందులో ఒక ముఖ్య పాత్రలో వరలక్ష్మీశరత్‌కుమార్ నటిస్తున్నారు. విజయ్ 62వ చిత్రంలో తన పాత్ర కీలకంగా ఉంటుందని వరలక్ష్మీశరత్‌కుమార్ చెప్పారు. దీంతో ఆమె పాత్ర ఏమిటన్నది చిత్ర పరిశ్రమలో ఆసక్తిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే విజయ్ 62వ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్ విజయ్‌తో ఢీకొనే రాజకీయ నాయకురాలిగా కొంచెం నెగిటివ్ చాయలున్న పాత్రలో నటిస్తున్నారని టాక్ స్ప్రెడ్ అవుతోంది. దీంతో ఈ చిత్రంలో ఆమె పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. చిత్రపరిశ్రమ సమ్మె కారణంగా బ్రేక్ పడ్డ ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలు కానుంది. అయితే చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఈ బ్రేక్ కారణంగా అనుకున్న తేదీకి చిత్ర నిర్మాణం పూర్తి అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
విజయ్ను స్టార్ చేసింది మేమే!
సాక్షి, చెన్నై: హీరో విజయ్ను స్టార్ చేసింది తామేనని ప్రముఖ ఎగ్జిబిటర్ అభిరామినామనాథన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఆరమ్ తిణై చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న అభిరామినామనాథన్ ప్రసంగించారు. అనంతరం ఇదే వేదికపై దివంగత అబ్దుల్ కలాం సలహాదారుడు పొన్రామ్ మాట్లాడుతూ.. థియేటర్ల యాజమాన్యం చిన్న చిత్రాలను కొల్లగొడుతున్నారని ఆరోపణలు చేశారన్నారు. తాను ఈ ఏడాది 50 చిత్రాలను ఎగ్జిబ్యూషన్ చేశానని ఆయన అన్నారు. వాటిలో 45 చిన్న చిత్రాలేనని తెలిపారు. ఒక్కోసారి థియేటర్లో ఐదారుగురు ప్రేక్షకులు కూడా ఉండరని, అలాంటప్పుడు తమకు ఏసీ ఖర్చు కూడా రాదని అలాంటి చిత్రాలను నిలిపేయకుండా ఎలా ప్రదర్శించమంటారని ప్రశ్నించారు. నటుడు విజయ్ ఆదిలో నటించిన చిత్రాలు చిన్నవేనని, అలాంటి ఆయన్ని స్టార్ నటుడిని చేసింది తామేనని అభిరామిరామనాథన్ వ్యాఖ్యానించారు. ఎంఆర్కేఎన్ఎస్ సినీ మీడియా పతాకంపై ఆర్.ముత్తుకృష్ణ, వేల్మణి కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని అరుణ్శ్రీ దర్శకత్వం వహించారు. విజయ్ టీవీ ఫేమ్ వైశాలిని హీరోయిన్గా నాన్‌కడవుల్ రాజేంద్రన్ హీరో నటించిన ఈ హర్రర్, థ్రిల్లర్, కామెడీ చిత్రానికి రాజన్ చోళన్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియోను దర్శక నటుడు కే.భాగ్యరాజ్ ఆవిష్కరించగా అభిరామి రామనాథన్ తొలి ప్రతిని అందుకున్నారు. -
హీరో విజయ్ మరో ఘనత..
సాక్షి, చెన్నై: ఇళయ దళపతిగా అభిమానులు నెత్తిన పెట్టుకుని మోస్తున్న హీరో విజయ్ తాజాగా వారికి ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని కలిగించారు. విజయ్ ఫొటో సీబీఎస్ఈ సిలబస్ పాఠ్యపుస్తకంలో చోటుచేసుకుంది. ఇలా పాఠ్యపుస్తకంలో నటుడి ఫొటో చోటుచేసుకోవడం అన్నది అరుదైన విషయమే అవుతుంది. అదీ విద్యార్థులకు ఒక పాఠంగా ఆ ఫొటో మారడం విశేషమే అవుతుంది. విషయం ఏమిటంటే.. విజయ్ తాజాగా నటించిన చిత్రం మెర్శల్లో ఆయన ఒక వైద్యుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆయన ఉత్తమ సేవలకుగానూ విదేశంలో అవార్డు ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఆ వేడుకకు విజయ్ తమిళ సంప్రదాయ దుస్తులు చొక్కా, దోవతి కట్టుకుని వెళ్తారు. అయితే ఆయన వేషధారణ చూసిన అక్కడి సెక్యూరిటీ అనుమానంతో సోదా చేస్తారు. ఆ తరువాత ఆయన ప్రముఖ వైద్యుడని తెలిసి క్షమాపణ చెప్పి గౌరవిస్తారు. ఈ సన్నివేశంలో తమిళ సంప్రదాయానికి గౌరవాన్ని ఆపాదించిన విజయ్ ఫొటోనూ మూడవ తరగతి సీబీఎస్ఈ పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. తమిళుల ఘనతను, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ఆ పాఠ్యపుస్తకంలోని పుటల్లో చొక్కా, పంచెతో కూడిన విజయ్ ఫొటోను పొందుపరిచారు. ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులు ఆనందంలో మునిగి పోతున్నారు. -
కట్ ముడియాదు
కుదరదంటే కుదరదు. కట్ కుదరదు. ముడియాదంటే ముడియాదు. కట్ ముడియాదు. జి.ఎస్.టి. ఎలాగూ కడుతున్నాం.. సినిమా టిక్కెట్లక్కూడా! వాక్ స్వాతంత్య్రానికి ఉన్న నాలుకను కోస్తానంటారా?! ముడియాదు. ముడియాదంటే ముడియాదు. టాలెంట్ ఉంది. డబ్బుల్లేవు. మెడికల్ సీటు రాలేదు. ఆ బాధ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో అర్జున్ ‘జంటిల్మన్’ చూస్తే తెలుస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళతాం. స్ట్రెయిట్‌గా వెళితే పని కాదు. ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు అంటాడు. కొట్టాల్సిన కాగితం కొడితే ఇంకే కాగితాలూ అక్కర్లేదు. ఇంత ఘోరమా! ఎంత ఘోరమో కమల్‌హాసన్ ‘భారతీయుడు’ చూస్తే తెలుస్తుంది. వైద్యో నారాయణ హరి. డాక్టర్ అంటే దేవుడు. కానీ, కార్పోరేట్ హాస్పిటల్లో వైద్యం దెయ్యం! శవాన్ని కూడా పీక్కుతింటుంది. చిరంజీవి ‘ఠాగూర్’ చూస్తే తెలుస్తుంది. బుద్ధుడు ప్రాపంచిక జ్ఞానం కోసం బోధి వృక్షం కిందికి వెళ్లాడు. ఇప్పుడా శ్రమ అక్కర్లేదు. వెళ్లి ఏసీ థియేటర్లో కూర్చుంటే చాలు. వ్యవస్థలోని మ్యాన్‌హోల్స్, లూప్‌హోల్స్ మొత్తం రెండున్న గంటల్లో తెలిసిపోతాయి. శంకర్ అవినీతిని చూపిస్తాడు. వర్మ అండర్‌వరల్డ్‌ను చూపిస్తాడు. మణీసార్ తీవ్రవాదాన్ని చూపిస్తాడు. భన్సాలీ చరిత్రను చూపిస్తాడు. సుకుమార్ లవ్వుని, పూరీజగన్నాథ్ కొవ్వునీ చూపిస్తారు. ఇవన్నీ సినిమాల్లోనే కాదు, సోషల్ స్టడీస్‌లోనూ ఉంటాయి. కానీ అవి చదివినా అర్థం కానివి, ఇవి చూస్తే అర్థమైపోతాయి. అదీ సినిమా పవర్. జి.ఎస్.టి. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని మాత్రమే మోదీ చెబుతాడు. జి.ఎస్.టి. అంటే అసలర్థం మన శ్రమలోంచి మరికొంత దోచుకోవడం అని తమిళ్ హీరో విజయ్ చెబుతాడు. అందుకే సినిమాలంటే గవర్నమెంట్లకు భయం.లేటెస్టుగా ఇప్పుడు తమిళ చిత్రం ‘మెర్సల్’ సెంట్రల్ గవర్నమెంట్‌ని ఠారెత్తిస్తోంది. అందులో జి.ఎస్.టి.కి యాంటీగా ఉన్న డైలాగ్స్‌ని కట్ చేయకపోతే సినిమాను ఆడనిచ్చేది లేదని బీజేపీ.. థియేటర్ల ముందు కాపుగాసింది. ఢిల్లీ నుంచి ఒక్క ఆజ్ఞ జారీ అయితే చాలు. మెర్సల్ బంద్ అయిపోతుంది. నిన్న తెలుగులో రిలీజ్ కాబోయి కూడా ‘అదిరింది’ (మెర్సల్) ఆగిపోయింది. ‘మెర్సల్’లో ఏముంది? అసలా టైటిల్లోనే ఉంది. మెర్సల్ అంటే విరుచుకుపడ్డం. చావుదెబ్బ కొట్టడం. కలెక్షన్లలో కూడా మెర్సల్ బాక్సు బద్దలు కొట్టింది. మొదటి మూడు రోజుల్లోనే మోర్ దేన్ హండ్రెడ్ క్రోర్స్! పిక్చర్ రిలీజ్ అయి, ఒక షో నడవగానే కాంట్రావర్సీలు రిలీజ్ అయ్యాయి. మోదీని తిట్టారని, హిందువుల్ని హర్ట్ చేశారని! ‘ఎవర్రాశార్రా ఆ డైలాగులు!’ ఇదే ఇప్పుడు తమిళనాడులో సూపర్ హిట్ డైలాగ్. కోర్టులో కేసులు వేశారు. విజయ్ ఇంటి మీదకు రాళ్లు విసిరారు. బీజేపీ లీడర్ హెచ్ రాజా.. ‘నీ అబ్బ రేయ్.. నీ సంగతి మాకు తెలీదా’ అనే మాటనే కాస్త సాఫ్ట్‌గా విజయ్ ఓటర్ ఐడీని ట్విట్టర్లో పోస్ట్ చేసి ‘ట్రూత్ ఈజ్ బిట్టర్’ అనే కామెంట్ పెట్టాడు. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ అని బయట పెట్టడం అతడి వ్యూహం. కమల్, రజనీ కలిశారు! ‘మెర్సల్ ’ రాజకీయంగా, మతపరంగా ఇప్పుడొక వేడివేడి పెసరట్టు. ఈ అట్టు వేసిన డైరెక్టర్ అట్లీ 31 ఏళ్ల వాడు. ఈ అట్టుకు తగినంత వేడి, నూనె, అల్లం జీలకర్ర, పచ్చిమిరప, ఉల్లిపాయ ముక్కలు జోడించిన విజయేంద్ర ప్రసాద్ 75 ఏళ్ల వాడు. ఆవేశం, అనుభవం కలిశాయి. ఇక సెంటర్‌కి సెగ తగలకుండా ఉంటుందా? జి.ఎస్.టి మీద, డిజిటల్ పేమెంట్ల మీద, దేవాలయాల మీద, డాక్టర్ల మీద సినిమాలో ఉన్న విసుర్లను తీసేయకపోతే సమాజానికి రాంగ్ మెసేజ్ పోతుందని తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందర్‌రాజన్.. పైకి లెటర్ పెట్టాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైలెంటుగా ‘మెర్సల్’ ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ని తొలగించింది. కలెక్షన్లను తగ్గించి, సినిమాను చంపేయడానికి పైరేటెడ్ సైట్లలో సినిమాను ముక్కలు ముక్కలుగా లింక్ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్, బీజేపీ లీడర్ జి.వి.ఎల్. నరసింహారావు మాటామాటా అనుకున్నారు. ‘వెరీ లో ఐక్యూ, వెరీ లో జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ సినిమా తీశారు’ అని నరసింహారావు టీవీ ఇంటర్వ్యూలో అంటే, అది చూసి ‘హౌ డేర్ యు!’ అని అఖ్తర్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ కూడా సీన్లోకి వచ్చారు. ‘మిస్టర్ మోడీ.. తమిళ్ సంస్కృతిని, స్వాభిమానాన్ని డీమోనిటైజ్ చెయ్యడానికి ట్రై చెయ్యకండి’ అని ట్వీట్ చేశారు. రజనీ, కమల్ కూడా నోరు తెరిచారు. సినిమా సూపర్ అన్నారు. పెద్ద హీరోలు ఆ మాత్రం అన్నా చాలు. పెద్ద సపోర్ట్. ఇప్పుడేం జరుగుతుంది? ‘మెర్సల్’ డైలాగ్స్‌ని కట్ చేస్తారా? కట్ చేస్తే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌నే కట్ చేసినట్లు! అయితే కొన్నిసార్లు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని కూడా కట్ చేయవలసి వస్తుంది. తప్పదు. రాజమౌళి ‘బాహుబలి 2’ తమిళ్ వెర్షన్లో ‘పగడాయ్’ అనే పదం ఆ రాష్ట్రంలోని ఒక సామాజిక వర్గాన్ని నొప్పించింది. పగడాయ్ అనేది దళితులలోని ‘సఖిలియార్’ అనే ఒక సబ్ కాస్ట్‌కు వాడుక మాట. అది అబ్యూజివ్గా ఉందని ఆ వర్గం మేధావులు అభ్యంతరం చెప్పారు. నిరసనకారులు మధురైలోని బాహుబలి 2 ఆడుతున్న ఒక థియేటర్‌పై పెట్రోల్ బాంబు వేశారు! డైలాగ్ రైటర్ కుర్రాడు. అతడు అపాలజీ చెప్పి, ఆ వర్డ్‌ను తొలిగించాక మాత్రమే సఖిలియార్లు శాంతించారు. గుండె ఆగి.. కొట్టుకుంది! ‘విశ్వరూపం’ రిలీజ్ ఆగిపోయినప్పుడు కమల్ హాసన్ కన్నీళ్లు పెట్టుకోవడం టీవీల్లో మీరు చూసే ఉంటారు. ప్రాణం పెట్టి తీశాడు మరి! అప్పులు తెచ్చాడు. ఇల్లు అమ్ముకున్నాడు. సొమ్మంతా కుమ్మరించాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చిత్రం రిలీజ్ అయితేనే బతుకు. విదేశాల్లో విడుదలైనా విశ్వరూపానికి తమిళనాడులో విముక్తి లభించలేదు. ఇక్కడ రిలీజ్ అయితేనే కమల్‌కి ఊపిరి. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని మత సంస్థలు అడ్డు చెప్తే రిలీజ్ ఆగిపోయింది. నయం కమల్ గుండె ఆగిపోలేదు. రెండు వారాలు ఆలస్యంగా ఒళ్లంతా‘కట్’లతో బతికి బట్టకట్టాడు. తమిళనాడులో ఫీలింగ్స్ అంత గట్టిగా ఉంటాయి. గవర్నమెంట్ వెంటనే దిగొస్తుంది. ‘జల్లికట్టు’ నిషేధానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడిన ప్రజలు వాళ్లు. అంత గట్టిగా మనమూ పోరాడి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని అప్పట్లో మన సినిమా యాక్టర్లు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. చూపుడు వేలుపై సెన్సార్! రజనీ ‘బాబా’ విడుదలకు ముందు ఓ పాటలో ‘పెరియార్’ పేరు వినిపించింది. పెరియార్ (పెరియార్ ఇ.వి.రామస్వామి) తమిళుల పందొమ్మిదో శతాబ్దపు తిరుగుబాటు నాయకుడు. వాళ్ల సెల్ఫ్‌రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది ఆయనే. ‘బాబా’ చిత్రంలోని పాటలో ఆయన గౌరవం తగ్గేలా రాశారని ‘ద్రవిడ కళగం’ (ద్రవిడుల తొలి రాజకీయ పార్టీ) నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చి సినిమా రీలీజ్‌కు ముందే పెరియార్ పేరును తీయించింది! ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పుడు పాటైనా, సీన్ అయినా.. డైలాగ్ ఫ్లోని బ్రేక్ చేసుకోవడం మంచిదే. కానీ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే వేలును కూడా కట్ చేసుకోమంటే ఎలా? ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని ప్రభుత్వం తీసేసుకున్నట్లే కదా. అంటే ప్రభుత్వమే పౌర హక్కుల్ని హరించినట్లు! తెలుగులోనూ డైలాగ్ అబార్షన్స్ మన దగ్గర పాటల్లో ఎక్కువ కట్స్ పడ్డాయి. ఆ మధ్య ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని ‘గుడిలో, బడిలో, మదిలో, ఒడిలో’ సాంగ్‌లోని నమకం, చమకం శివస్తోత్ర పదాలపై ‘అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య’ అభ్యంతరం చెప్పడంతో ఆఖరి నిముషంలో వాటిని తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’ చిత్రంలోని ‘చారీ’ పాటలో పంచెకట్టు, పిలకజుట్టు అనే పదాలు సినిమా రిలీజ్‌కు ముందే కట్ అయ్యాయి. ‘దేనికైనా రెడీ’ లో కూడా ఇదే ఇష్యూ. బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్న సీన్స్‌ని, డైలాగ్స్‌నీ కట్ చేశారు. ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ చిత్రంలో సెటైర్లకు ఆగ్రహించిన రాజకీయ పార్టీల కార్యకర్తలు దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటిని ధ్వసం చేశారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో కర్నాటక బీజేపీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డిని గుర్తుకు తెచ్చే సన్నివేశాలు ఉండడంతో ఆయన నాయకులు థియేటర్ల అద్దాలు పగలగొట్టారు. ఇక గౌతమ బుద్ధుడి ఎదురుగా రొమాంటిక్ సాంగ్‌ని తీసినందుకు ‘రచ్చ’పై పెద్ద చర్చే జరిగింది. ప్రభుత్వంతోనే ప్రాబ్లమ్! సినిమాల్లో ప్రైవేటు వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే కొంచెం రగడ అవుతుంది. తర్వాత చల్లారుతుంది. ప్రభుత్వంతో పెట్టుకుంటే మాత్రం పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. అందుకే చూడండి.. ఇండియాలో గవర్నమెంట్లపై సెటైర్లు వేసే సినీ దర్శకులు, నిర్మాతలు తక్కువ.భారత ప్రభుత్వం సాధారణంగా సినిమాలను బ్యాన్ చెయ్యదు. కట్లు సూచిస్తుంది. లౌకిక రాజ్యం కాబట్టి. కానీ దేశ సమగ్రతను దెబ్బతీస్తుందను కున్నప్పుడు, దేశ పాలనా వ్యవస్థమీద ప్రభావం చూపిస్తుందనుకున్నప్పుడు మాత్రమే సినిమాను బ్యాన్ చేస్తుంది. అలాంటివి బ్యాన్లు మన దగ్గర బాగా తక్కువ. కాంట్రావర్సీ మూవీలు మాత్రం ఎక్కువ. మంచి సినిమాలు ఆలోచన రేపుతాయి. ఆ ఆలోచనలను ప్రజల్లో రేపినంత కాలం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకం కలగదు. ప్రభుత్వంలో ఆలోచనలు రేగితేనే సినిమాలకు కట్ల గాట్లు పడతాయి. -
'జోసెఫ్' విజయ్ ప్రకటనలో ఆసక్తికర అంశం!
సాక్షి, చెన్నై: వివాదాల్లో చిక్కుకున్న తన తాజా సినిమా 'మెర్సల్'కు అండగా నిలిచి.. సూపర్‌హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ తమిళ సూపర్ స్టార్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో ప్రధాని నరేంద్రమోదీ మానస పథకాలైన జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై విమర్శలు ఉండటంపై బీజేపీ నేతలు విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా విజయ్ విడుదల చేసిన ఈ ప్రకటనలో పైభాగంలో 'జీసెస్ సేవ్స్' అని రాసి ఉండటంతోపాటు ఎడమవైపున సీ జోసెఫ్ విజయ్, కుడివైపున ఆయన చిరునామా రాసి ఉండటం గమనార్హం. మెర్సల్ సినిమా నేపథ్యంలో బీజేపీ నేతలు విజయ్ మతాన్ని కూడా వివాదంలోకి లాగిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ 'హిందువు' కాకపోవడంతోనే మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఏకంగా విజయ్ ఐడెంటిటీ కార్డును ట్వీట్ చేసి.. అందులో జోసెఫ్ విజయ్ అని ఉండటాన్ని ప్రస్తావించారు. ఇది 'చేదు నిజం' అంటూ కామెంట్ పెట్టారు. అయితే, 'మెర్సల్' సినిమాపై బీజేపీ నేతల దాడి పెద్దగా ఫలించలేదు. కోలీవుడ్ మొత్తం విజయ్‌కు అండగా నిలిచింది. ఇటు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతూ ఘనవిజయాన్ని అందించారు. సినిమా పట్ల ఓ వర్గం వ్యతిరేకత చూపిందని, దీనికి సమాధానం అన్నట్టుగా కోలీవుడ్‌లోని తన మిత్రులు, నటులు, నటీమణులు, వివిధ సంస్థలు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు అనేకమంది సినిమాకు మద్దతు పలికారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆయన తన ప్రకటనలో తెలిపారు. -
హీరో విజయ్ బహిరంగ లేఖ
సాక్షి, చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆయన నటించిన 'మెర్సల్' చిత్రానికి మద్దతు ఇచ్చిన అందరికీ విజయ్ కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సినిమా విజయం సాధించడం తనకు బలాన్ని ఇచ్చిందని తెలిపారు. మీ అందరి సహకారం తనను ఇంకా ముందుకు నడిపిస్తుందని వ్యాఖ్యానించారు. జీఎస్టీపై కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో విజయ్ నటించి మెర్సల్ చిత్రం వివాదాల్లోకి వెళ్లిన సంగతి తెల్సిందే. కాగా ఈ చిత్రం విడుదలకు ముందు సంచలనాలు, అనంతరం ప్రకంపనలు పుట్టిస్తోంది. చిత్రంలోని ఓ సన్నివేశంలో జీఎస్టీ, వైద్య విద్యావిధానంపై సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు, వైద్యులు మండిపడిన సంగతి తెలిసిందే. అభ్యంతరకర మాటలు, సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు చిత్ర నిర్మాత సమ్మతించినా పరిస్థితి చేయి దాటి వివాదం రాజకీయ రంగు పులుముకుని రచ్చరచ్చగా మారింది. అయితే చిత్ర పరిశ్రమతో పాటు బీజేపీయేతర రాజకీయ పార్టీలు మెర్శల్‌కు అండగా నిలుస్తున్నారు. -
ఆ సినిమాపై బీజేపీ ఆగ్రహం
సాక్షి, చెన్నై : ఇప్పటికే వివాదాలు ఎదుర్కొంటున్న తమిళ హీరో విజయ్ తాజా చిత్రం మెర్శల్‌పై బీజేపీ కన్నెర చేస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెర్శల్. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. పలు ఆటంకాలను ఎదురొడ్డి ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ అందుకుంటున్నా, మరోపక్క రాజకీయవాదుల ఆగ్రహానికి గురవుతోంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు మెర్శల్ చిత్రంపై దండెత్తుతున్నారు. ప్రభుత్వ ఉచిత వైద్యంపై ఒత్తిడి తెచ్చే విధంగా మెర్శల్ చిత్ర తుది ఘట్ట సన్నివేశాల్లో ఆ చిత్ర కథానాయకుడు విజయ్ సింగపూర్ లాంటి దేశాల్లో 7 శాతం జీఎస్టీ విధించి ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందిస్తోందని, మన దేశంలో 28 శాతం జీఎస్టీ పన్ను విధానాన్ని అమలు పరచి ఉచిత వైద్యాన్ని అందించలేకపోతోందని ఆవేశంగా చెప్పే సంభాషణలకు ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ లభిస్తోంది.అదే విధంగా పెద్ద నోట్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. దీంతో మెర్శల్ చిత్రంలో జీఎసీ, పెద్ద నోట్ల రద్దు విధానాలను వ్యతిరేకించేలా సన్నివేశాలు చోటు చేసుకోవడం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ మెర్శల్ చిత్రంలోని జీఎస్టీ పన్ను, పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన సన్నివేశాన్ని తొలగించాలని డిమండ్ చేశారు. తాజాగా కేంద్రమంత్రి పొన్‌రాధాకృష్ణన్ మెర్శల్ చిత్రంపై తీవ్రంగా ఖండన తెలిపారు. మెర్శల్ చిత్రంలో ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలన్నది తన అభిప్రాయం అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదని హితవు పలికారు. అలాగే ప్రముఖ నటుడు కమలహాసన్‌పైనా విమర్శలు సంధించారు. పెద్ద నోట్ల రద్దును మొదట స్వాగతించిన కమలహాసన్ ఇప్పుడు అందుకు బహిరంగ క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొనట్లు తెలిసిందని, ఆయన ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ముందు అనాలోచనతో వ్యాఖ్యలు చేసి ఆ తరువాత రాజకీయ కోణంలో వెనక్కు తీసుకోవడం నాగరికత కాదన్నారు. మెర్శల్ చిత్ర నిర్మాత వివాదాస్పదమైన ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
కట్టలు తెంచుకున్న అభిమానం.. థియేటర్లు బంద్!
బెంగళూరు : అభిమానం కట్టలు తెంచుకునే పరిస్థితి ఎలా ఉంటుందంటే హీరోలు, దర్శకనిర్మాతలకు చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. అసలే వివాదాలు, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మరి చివరి సమయంలో విడుదలైన సినిమా మెర్శల్. అయితే బుధవారం ఈ మూవీ తమిళనాడు, కర్ణాటకలలో విడుదలకాగా.. అభిమానుల అత్యుత్సాహం కారణంగా బెంగళూరులో కొన్ని థియేటర్లలో షోలు నడవలేదని తెలుస్తోంది. బెంగళూరులో ఓ థియేటర్ ముందు నిల్చున్న స్థానికుడిపై విజయ్ అభిమానులు దాడి చేశారు. బాధితుడు కన్నడ మద్ధతుదారులతో అక్కడికి వచ్చి గొడవకుదిగగా, విజయ్ అభిమానులు(తమిళనాడు) కూడా తామేం తక్కువ తినలేదంటూ రెచ్చిపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయ్ అభిమానులు, బెంగళూరు వాసులకు మధ్య గొడవ పెద్దది కావడంతో కొన్ని షో ప్రదర్శనను రద్దు చేసి థియేటర్లను మూసివేసినట్లు సమాచారం. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లు నాయికలుగా నటించారు. చిత్రటైటిల్ వ్యవహారంలో సీఎం ఎడపాటి పళనిస్వామిని విజయ్ కలవడంతో జంతు సంక్షేమ శాఖాధికారులు ఎన్ఓసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇచ్చిన విషయం తెలిసిందే. -
అడ్డంకులను ఎదురొడ్డి వస్తున్న స్టార్ హీరో సినిమా
షరామామూలుగానే అడ్డంకులను ఎదురొడ్డి ఇళయదళపతి విజయ్ నటించిన మెర్శల్ చిత్రం వెండితరపైకి వచ్చేస్తోంది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ నిర్మించ్డిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను అందించారు. సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లు నాయికలుగా నటించిన ఈ భారీ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ముందుగానే వెల్లడించారు. అయితే ఆ మధ్య చిత్రటైటిల్ వ్యవహారంలో కోర్టుకెళ్లి సాధించుకున్న మెర్శల్‌కు విడుదల దగ్గర పడుతున్న సమయంలో జంతు సంక్షేమ శాఖాధికారులు ఎన్ఓసీ(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్)ను ఇవ్వడానికి నిరాకరించడంతో అటు చిత్ర వర్గాల్లోనూ, ఇటు విజయ్ అభిమానుల్లోనూ టెన్షన్ మొదలైంది. రాజకీయ హస్తం ఉందా? మెర్శల్ చిత్రానికి జంతు సంక్షేమ శాఖ నుంచి ఎన్ ఓసీ రాకపోవడంపై చిత్రవర్గాల్లో రకరకాల ప్రసారం జోరందుకుంది. దీనికి వెనుక రాజకీయ హస్తం ఉందంటూ కొందరు ఆరోపించడం కలకలానికి తెరలేపినట్లయ్యింది. ఈ సమయాల్లో విజయ్ ముఖ్యమంత్రులను కలవడం పరిపాటిగా మారింది. ఇంతకు ముందు కూడా తలైవా చిత్ర విడుదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. ఇప్పుడు ఎడపాటి పళనిస్వామిని కూడా కలిశారు. ఇలా ముఖ్యమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసుకోవలసిన పరిస్థితి విజయ్‌కు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. కాగా చిత్రం బుధవారం విడుదల కావలసి ఉంది. సోమవారం మధ్యాహ్నం వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చల్లో జంతు సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి ముంబై నుంచి వచ్చి పాల్గొన్నట్లు సమాచారం. మెర్శల్ చిత్రంలో జంతువులకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని, అందుకు తగిన ఆధారాలను చిత్ర వర్గాలు సమర్పించని కారణంగానే ఎ¯ŒSఓసీ ఇవ్వలేదనీ తెలిసింది. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మెర్శల్ చిత్రానికి జంతు సంక్షేమ శాఖ ఎ¯ŒSఓసీని అందించింది. మొత్తం మీద మెర్శల్ అన్ని అడ్డంకులను ఎదుర్కొని బుధవారం విడుదల కాబోతోందన్న విషయం విజయ్ అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. -
విజయ్ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్
సాక్షి, చెన్నై: మెర్శల్ చిత్రాని కి మద్రాసు హై కోర్టులో ఊరట లభించింది. దీంతో విజయ్ అభిమానులు ఉత్సాహంతో పండగ చేసుకుంటున్నా రు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ ముగ్గురు ముద్దుగుమ్మలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. ఇది ఈ సంస్థకు వందో చిత్రం అన్నది గమనార్హం. ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళికి విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైకి చెందిన రాజేంద్రన్ అనే నిర్మాత మెర్శల్ చిత్రంపై నిషేధం కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను మెర్శలాయిటేన్ అనే టైటిల్‌ను 2014లోనే రిజిస్టర్ చేశానని, ఆ పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నానని, కాగా మెర్శల్ అనే టైటిల్‌తో విజయ్ హీరోగా శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ చిత్రం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో తన చిత్రం మెర్శలాయిటేన్ వ్యాపార పరంగా బాధింపునకు గురవుతుందని, అందువల్ల విజయ్ చిత్ర టైటిల్ మెర్శల్‌పై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు స్వీరించిన న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ వరకూ విజయ్ చిత్రానికి మెర్శల్ టైటిల్‌ను ఉపయోగించరాదని స్టే ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా నిర్మాత రాజేంద్రన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, మెర్శల్ టైటిల్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. దీంతో మెర్శల్ చిత్ర దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే విజయ్ చిత్రం మెర్శల్ యూ ట్యూబ్, సోషల్ మీడియా అంటూ విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
కబాలి, బాహుబలి 2 తరువాత ‘అదిరింది’
సౌత్ సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ కీలకంగా మారింది. సొంత రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఓపెనింగ్ వసూళ్లు ఎలాగూ వస్తాయి. అదే సమయంలో ఓవర్ సీస్ మీద కాస్త ఎక్కువ దృష్టి పెడితే భారీ రికార్డ్ లు ఖాయం అని ఫీల్ అవుతున్నారు సినీ ప్రముఖులు. అందుకే మన సినిమాలను ఇతర దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు విదేశాల్లో మరింత ప్రచారం కల్పించేందుకు అక్కడి ప్రముఖ థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిస్ లోని 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్. దాదాపు రెండు వేల మంది ప్రేక్షకులు ఒకేసారి సినిమా చూసేందుకు అవకాశం ఉన్న ఈ థియేటర్లో ప్రదర్శనకు అర్హత సాధించటం భారతీయ చిత్రాలకు అరుదైన ఘనతే. ఇప్పటి వరకు మన దేశం నుంచి కబాలి, బాహుబలి 2 చిత్రాలను మాత్రమే ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా మెర్సల్ ను పారిస్ 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ లో ప్రదర్శించనున్నారట. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అదే రోజు రెక్స్ థియేటర్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో అదే రోజు రిలీజ్ అవుతోంది. -
మురుగదాస్ భారీ ప్రాజెక్టు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కించిన మురుగదాస్, తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచినా కోలీవుడ్ లో మాత్రం సత్తా చాటాడు. అయితే త్వరలో ఈ స్టార్ డైరెక్టర్ ఓ భారీ ప్రయోగానికి రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ విజయ్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన మురుగదాస్.. మహేష్ బాబు, విజయ్ ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్పైడర్ తమిళ ప్రమోషన్ సందర్భంగా మురుగదాస్ ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు వర్షన్ కోసం మహేష్ బాబు హీరోగా, విజయ్ విలన్ గా నటిస్తే, తమిళ వర్షన్ లో విజయ్ హీరోగా మహేష్ బాబు విలన్ గా నటిస్తారట. మరి ఈ భారీ ప్రయోగం నిజంగానే సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి. -
అనిత కుటుంబానికి హీరో విజయ్ పరామర్శ
పెరంబూరు: నీట్ కారణంగా వైద్య కళాశాల్లో సీటు రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనిత కుటుంబసభ్యులను నటుడు విజయ్ పరామర్శించారు. అనిత మరణాన్ని ఖండిస్తూ నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో విద్యాలోకం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అనిత మరణం చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులను స్పందింపజేసింది. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తో పాటు పలువురు అనిత భౌతికకాయానికి అంజలి ఘటించారు. వారంతా నీట్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రముఖ నటుడు కమలహాసన్ కూడా అనిత విషయంలో తీవ్రంగానే స్పందించారు. మరో విద్యార్థిని నీట్ కారణంగా బలి కాకూడదని, అందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని కమలహాసన్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ సోమవారం ఉదయం అనిత స్వగ్రామం కుళుముర్ వెళ్లి ఆమె తండ్రి షణ్ముగం, సోదరులను పరామర్శించారు. ముందుగా అనిత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన విజయ్ కాసేపు అనిత తండ్రితో మాట్లాడారు. ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించి, ఇతరత్రా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు భరోసా ఇచ్చారు. -
మహిళా జర్నలిస్టుకు హీరో ఫ్యాన్స్ అసభ్య మెసేజ్‌లు!
చెన్నై: తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ అభిమానం శ్రుతి మించారు. తన హీరో నటించిన సినిమా బాగోలేదని కామెంట్ పెట్టిన ఓ మహిళా జర్నలిస్టుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....బెంగళూరుకు చెందిన జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జబ్ హ్యారీ మెట్ సీజల్’ కి వెళ్లింది. అయితే ఆ సినిమా ఆమెకు అంతగా నచ్చకపోవడంతో ఇంటర్వెల్ కాకుండానే థియేటర్ నుంచి వచ్చేసింది. అదే విషయాన్ని ధన్య రాజేంద్రన్ శుక్రవారం ట్వీట్ చేస్తూ కొన్నేళ్ల క్రితం హీరో విజయ్ నటించిన ‘సురా’ సినిమా చూసినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ కలిగిందని, అయితే ఆ సినిమా కనీసం ఇంటర్వెల్ దాకా అయినా కూర్చోబెట్టిందని, షారుక్ సినిమా అంతకంటే దారుణంగా ఉందని పోస్ట్ చేసింది. దీంతో విజయ్ ఫాన్స్ ఆమెపై సోషల్‌మీడియాలో వల్గర్ కామెంట్లతో ప్రతిదాడికి దిగారు. అసభ్య పదజాలంతో రీ ట్వీట్ చేయటమే కాక బూతు మెసేజ్‌లు, ట్రోలింగ్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతేకాకుండా మహిళా జర్నలిస్టుపై బెదిరిస్తూ పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో గత మూడు రోజులుగా సుమారు 45వేలకు పైగా ట్విట్లు వచ్చాయి. దీంతో ధన్య రాజేంద్రన్ పోలీసుల్ని ఆశ్రయించారు. పక్కా ఫ్లాన్ ప్రకారం తనపై హీరో అభిమానులు ట్రాలింగ్ చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ధన్యా రాజేంద్రన్ ఫిర్యాదుపై విచారణ అధికారులు మాట్లాడుతూ... ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ నలుగురిని గుర్తించినట్లు తెలిపారు. అయితే అసభ్యంగా కామెంట్లు చేసిన పలువురు తమ ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేసినట్లు సీనియర్ అధికారి పేర్కొన్నారు. పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అసభ్యకర పదజాలం, చిహ్నాలు, ప్రతీకాత్మక చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు వంటివి పోస్ట్ చేసి సదరు వ్యక్తి పేరు, ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలిగించేలా చేసినా శిక్షార్హులే. అంతేకాదు, మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పదాలు, చిహ్నాలు వంటివి పెట్టినా ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం). కాగా ఈ వివాదంపై హీరో విజయ్ ఇంతవరకూ స్పందించలేదు. -
అభిమాని అత్యుత్సాహం : స్టార్ హీరోపై కేసు
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మితిమీరిన అభిమానం ఒక్కోసారి స్టార్స్ హీరోలకు తలనొప్పిగా మారుతుంటుంది. ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య జరిగే గొడవలు చాలా సార్లు ఆ హీరోలు ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఇలయదళపతి అభిమాని తన ఫేవరెట్ హీరో ఫోటోతో డిజైన్ చేసిన ఓ పోస్టర్ విజయ్‌పై కేసు నమోదయ్యేలా చేసింది. విజయ్ వీరాభిమాని అయిన ఓ యువకుడు తన ఫేవరెట్ హీరో త్రిశూలం పట్టుకున్నట్టుగా ఓ పోస్టర్‌ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో వైరల్ కావటంతో అందరి దృష్టి పోస్టర్‌పై పడింది. అయితే ఈ ఫోటోలో విజయ్ షూస్ వేసుకొని త్రిశూలం పట్టుకోవడం పై హిందూ మక్కల్ మున్నని పార్టీ అభ్యంతరం తెలిపింది. షూస్ వేసుకొని త్రిశూలం పట్టుకోవటం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం అని.. అలా చేసి విజయ్ తమ మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా విజయ్‌పై కేసు నమోదయ్యింది. -
విజయ్ రాజకీయ ప్రవేశం ఉంటుందా?
చెన్నై: తమిళ సినీప్రేక్షకుల మధ్య ఇళయ దళపతిగా అభిమానం పొందుతున్న ప్రముఖ నటుడు విజయ్. ఇటీవల కాలంలో చాలా మంది సినిమా తారలు రాజకీయ రంగప్రవేశం చేసి, కరుణాస్ లాంటి వారు శాసన సభ్యులుగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే చాలా కాలం క్రితమే నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి ఆ తరువాత వెనక్కు తగ్గారు. తమిళనాట ప్రస్తుత పరిణాల్లో విజయ్ రాజకీయ తెరంగేట్రం చేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ శుక్రవారం కన్యాకుమారిలో బదులిస్తూ నటుడు రాజకీయాల్లోకి రావడం సులభమేనన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారాయని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల క్రితం తాను విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ప్రయత్నించానన్నారు. అయితే ఇప్పటి రాజకీయ వ్యాపారం పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానన్నారు. త్వరలో జరగనున్న నిర్మాతల మండలి ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ చట్ట నిబంధనల ప్రకారం నటుడైనా, నిర్మాత అయినా నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చంద్రశేఖర్ అన్నారు. అయితే తమకున్న విధి విధానాల ప్రకారం ఒక సంఘానికి ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తూ, మరో సంఘంతో అదే స్థాయి పదవీ బాధ్యతల్ని నిర్వహించడం సాధ్యం కాదని పరోక్షంగా నటుడు విశాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో పైరసీని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు పోలీసు అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నాయని, తమిళ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. -
కాపీ ‘కత్తి’ హీరో పైనే మా పోరాటం!
‘‘దాదాపు 16 నెలల క్రితం నుంచే ‘కత్తి’ సినిమా వివాదం తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య నడుస్తోంది. మా పోరాటం తమిళ చిత్ర నిర్మాత ఆర్.బి.చౌదరి మీదో, లేకపోతే ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్ మీదో కాదు! కేవలం ఆ చిత్ర హీరో విజయ్ మీదే’’ అని ప్రముఖ రచయిత, తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. తమిళ చిత్రం ‘కత్తి’ కథ తనదేననీ, ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ అవుతున్నందున ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలనీ దర్శక, రచయిత నరసింహారావు పేర్కొన్న సంగతి తెలిసిందే. నరసింహరావుకు న్యాయం జరిగేంత వరకూ తెలుగు రీమేక్ నిర్మాణం నిలిపివేయాలంటూ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘంతో పాటు తెలుగు ఫిలిమ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య) ఇప్పటికే సహాయ నిరాకరణ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం చైర్మన్ - ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఉద్దేశపూర్వకంగానే చిరంజీవి 150వ చిత్రానికి అడ్డంకులు కల్పిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంత మంది హీరో రామ్‌చరణ్ అభిమానులమంటూ ‘దాసరి నారాయణరావుకు అశ్రునివాళి’ అంటూ పోస్ట్‌లు పెట్టడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. వీటన్నిటిపై వివరణనివ్వడానికి తె లుగు చలన చిత్ర దర్శకుల సంఘం, తెలుగు ఫిలిమ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయల సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ-‘‘చాలాకాలం క్రితమే దర్శక-రచయిత నరసింహారావు ‘కత్తి’ కథ చాలా మందికి చెప్పాడు. కానీ ఫైనల్‌గా తమిళ నటుడు విజయ్ హీరోగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు. తమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్, స్టోరీ సిట్టింగ్స్ జరిగాయి. కొంత కాలం పాటు ఈ కథతో ట్రావెల్ చేసిన హీరో విజయ్ సడన్‌గా ఈ కథకు ఓ అనుభవమున్న దర్శకుడైతే బాగుంటుందని తనకు ఇచ్చేయమన్నారు. కానీ నరసింహారావు దానికి అంగీకరించలేదు. ఇది జరిగిన ఏడాదికి అదే కథతో ‘కత్తి’ అనే సినిమాను స్వల్ప మార్పులతో దర్శకుడు మురుగుదాస్ తెరకెక్కించారు. ఇదీ జరిగింది. ఒకవేళ ఇది మురుగుదాస్ సొంత కథే అనుకుంటే, మురుగుదాస్ ఈ కథ చెప్పినప్పుడు గతంలో ‘ఇలాంటి కథ నేను విన్నానే’ అని మురుగుదాస్ దగ్గర చెప్పాల్సిన బాధ్యత విజయ్‌ది కాదా?’’ అని ఆయన ప్రశ్నించారు. అసలు కథా రచయిత అయిన నరసింహారావుకు న్యాయం చేయడం కోసమే రచయితల సంఘం సహా అన్ని సంఘాల ప్రయత్నమని పేర్కొన్నారు. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ -‘‘ఈ వివాదం చిరంజీవి గారు రీమేక్ చేద్దామని ప్రకటించాక మొదలుకాలేదు. చాలా నెలల నుంచి మేము పోరాటం చే స్తున్నాం. అయినా దీన్ని చిరంజీవి, దాసరి నారాయణరావుల మధ్య వివాదంగా మార్చడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. ‘దాసరి నారాయణరావుకు అశ్రునివాళి’ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని చెప్పారు. కాగా, కథాహక్కుల సంఘం వైస్-చైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘ఈ వివాదం గురించి చిరంజీవి గారిని అడిగాను. వివాదాలన్నిటినీ పరిష్కరించుకున్నాకే రీమేక్ హక్కులను అమ్మాలని తమిళ నిర్మాతలతో రామ్‌చరణ్ ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. మా సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే చిరంజీవి గారు ‘కత్తి’ రీమేక్ చేద్దామనుకొన్న తర్వాత ఏమీ ఈ కథపై వివాదం రేగలేదు. అంతకన్నా ముందే చాలా నెలలుగా ఈ కథాచౌర్యం సమస్య నలుగుతూ ఉంది. సామరస్యంగా పరిష్కరించాలన్నదే మా ప్రయత్నం’’ అన్నారు. దర్శకుడు త్రిపురనేని చిట్టి, నటుడు కాదంబరి కిరణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పులి.. ఆగిపోయింది!
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన పులి సినిమా గురువారం విడుదల కావాల్సి ఉన్నా, అది విడుదల కాలేదు. సినిమా తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్ల విడుదల కూడా అనుమానంలోనే పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి పులి హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతల అందరి ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడం వల్లే విడుదల ఆగిపోయిందా అని కోలీవుడ్ టాక్. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు, 5 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు. కానీ గురువారం ఇవేవీ ప్రదర్శించలేదు. సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధర్మపురి, సేలంలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళన చేశారు. మదురైలో బస్సులను ధ్వంసం చేశారు. ప్రీమియర్ షోలను ఎందుకు ఆపేయమన్నారో తమకు కూడా తెలియట్లేదని, సినిమా విడుదల విషయంలో క్యూబ్ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నామని ఓ థియేటర్ యజమాని తెలిపారు. సినిమాను డిజిటల్‌గా స్ట్రీమింగ్ చేసే క్యూబ్ సంస్థకు పులి నిర్మాతలు ఇంకా కొంత సొమ్ము చెల్లించలేదని, ఆ విషయం సెటిల్ కాగానే విడుదలకు అనుమతి రావొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఐటీ దాడుల కారణంగా ఎగ్జిబిటర్లకు చెల్లింపులు చేయడానికి ఆదాయపన్ను అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందని, అందువల్లే సినిమా ఆగిందని కూడా చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు, 9 గంటలకు ప్రదర్శించాల్సిన షోలను కూడా థియేటర్లు రద్దు చేసుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత అనుమతి రావచ్చని, అయితే అది కూడా కచ్చితంగా వస్తుందని చెప్పలేమని అంటున్నారు. అమెరికా కెనడాలలో కూడా ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అట్మస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ తెలిపింది. చింబు దేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక లాంటి పెద్ద హీరోయిన్లు నటించారు. -
బాహుబలి కంటే గొప్పగా గ్రాఫిక్స్
బాహుబలి చిత్రం కంటే గొప్పగా పులి చిత్రంలో గ్రాఫిక్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని ఆ చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం పులి చిత్రం పైనే ఇండస్ట్రీ దృష్టి అంతా. ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం పులి. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ విలన్‌గా నటించిన పులి చిత్రానికి శింబుదేవన్ దర్శకుడు. పీటీ.సెల్వకుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది.ఇది సోషియో ఫాంటసీ కథా చిత్రం. కాగా ఇందులో గ్రాఫిక్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉంటాయట. ఇటీవల తెరపైకి వచ్చిన సంచలన చిత్రం బాహుబలి చిత్రం గ్రాఫిక్స్‌కు చిరునామాగా పేరు తెచ్చుకుంది. అయితే దాన్ని మించిన గ్రాఫిక్స్ పులి చిత్రంలో చోటు చేసుకుంటాయంటున్నారు చిత్ర వర్గాలు. అంతకు ముందు వచ్చిన నాన్ఈ చిత్రంలో 1200 గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉండగా బాహుబలిలో 1400 గ్రాఫిక్స్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పులి చిత్రంలో 2400 గ్రాఫిక్స్ సన్నివేశాలు విస్మయపరచనున్నాయని అంటున్నారు. ఈ గ్రాఫిక్ సన్నివేశాలను ప్రపంచంలోని తొమ్మిది దేశాల్లో రూపొందించారట. వీటికి 1500 మంది సాంకేతిక నిపుణులు పని చేశారట. చైనాలో కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు విజయ్‌కు సంతృప్తి కలిగించకపోవడంతో మళ్లీ తిరిగి పంపించేయించామని అంటున్నారు చిత్ర వర్గాలు. అలాంటి పులి ఏపాటి గాండ్రిస్తుందో తెలియాలంటే మరొక్కరోజే ఆగాల్సిందే. అక్టోబర్ 1న పులి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
-
హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చెన్నై నగరంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల ఇళ్లలో బుధవారం తెల్లవారుజామునే ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. విజయ్ హీరోగా నటించిన పులి సినిమా గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ దాడులు మొదలైనట్లు తెలుస్తోంది. మొత్తం 32 చోట్ల ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. తమిళ సూపర్‌స్టార్ విజయ్ సహా.. పులి సినిమా హీరోయన్లు హన్సిక, శ్రుతిహాసన్ ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి. బాహుబలి సినిమాకు దీటుగా ఈ సినిమాను రూపొందించామని, దానికంటే ఎక్కువ కలెక్షన్లు రాబడతామని నిర్మాత ప్రకటించారు. దాంతో నిర్మాత ఇళ్లు, కళ్యాణమండపాలు, కార్యాలయాలలో సోదాలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఈమధ్య కాలంలో పెద్ద సినిమాల్లోను, హిట్ సినిమాల్లోను నటిస్తున్న సమంత, నయనతార తదితర హీరోయిన్ల ఇళ్ల మీద కూడా సోదాలు జరుగుతున్నాయి. కొంతమంది దర్శకుల ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి. ప్రధానంగా రోబో-2 సినిమా తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు పేరొందిన ఏజీఎస్ ఫిలింస్ సంస్థ ఏడాదికి దాదాపు 200-300 కోట్ల వరకు ఖర్చుపెడుతోంది. దాంతో ఆ సంస్థకు చెందిన నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. -
హాలీవుడ్ మూవీలో విజయ్?