స్టార్‌ హీరోతో ఢీనా? | Vara Laxmi Sarath Kumar Acts In Vijay Movie | Sakshi
Sakshi News home page

ఇళయదళపతితో ఢీనా?

Published Sun, Apr 15 2018 11:14 AM | Last Updated on Sun, Apr 15 2018 11:14 AM

Vara Laxmi Sarath Kumar Acts In Vijay Movie - Sakshi

సాక్షి, చెన్నై : ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ నటి అంటే వరలక్ష్మీశరత్‌కుమార్‌నే. రకరకాల పాత్రలతో చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క సేవ్‌ శక్తి ద్వారా మహిళా సంరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇలా అరుదైన నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించడానికి సై అంటున్నారు. ప్రస్తుతం అలాంటి పాత్రతో ఇళయదళపతితో ఢీకొంటున్నారన్నది తాజా సమాచారం. విజయ్, దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో నటి కీర్తీసురేశ్‌ కథానాయకిగా నటిస్తున్నారు. భైరవా చిత్రం తరువాత తను విజయ్‌తో రొమాన్స్‌ చేస్తున్న రెండవ చిత్రం ఇది. ఇందులో ఒక ముఖ్య పాత్రలో  వరలక్ష్మీశరత్‌కుమార్‌ నటిస్తున్నారు.

విజయ్‌ 62వ చిత్రంలో తన పాత్ర కీలకంగా ఉంటుందని వరలక్ష్మీశరత్‌కుమార్‌ చెప్పారు. దీంతో ఆమె పాత్ర ఏమిటన్నది చిత్ర పరిశ్రమలో ఆసక్తిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. అదేమిటంటే విజయ్‌ 62వ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ విజయ్‌తో ఢీకొనే రాజకీయ నాయకురాలిగా కొంచెం నెగిటివ్‌ చాయలున్న పాత్రలో నటిస్తున్నారని టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. దీంతో ఈ చిత్రంలో ఆమె పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. చిత్రపరిశ్రమ సమ్మె కారణంగా బ్రేక్‌ పడ్డ ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే మళ్లీ మొదలు కానుంది. అయితే చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఈ బ్రేక్‌ కారణంగా అనుకున్న తేదీకి చిత్ర నిర్మాణం పూర్తి అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement