క్రేజీ కాంబినేషన్‌ | Thalapathy Vijay and Venkat Prabhu to join forces for new movie | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్‌

Published Mon, May 22 2023 3:45 AM | Last Updated on Mon, May 22 2023 3:45 AM

Thalapathy Vijay and Venkat Prabhu to join forces for new movie - Sakshi

తమిళ హీరో విజయ్, దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో సినిమా ఖరారైంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో మూవీని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కల్పతి యస్‌. అఘోరం, యస్‌. గణేష్, యస్‌. సురేష్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘బిగిల్‌’ చిత్రం తర్వాత విజయ్‌తో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది.

పైగా ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్‌ పేర్కొంది. కాగా విజయ్‌ ప్రస్తుతం ‘లియో’ సినిమా చేస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబరు 19న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement