Director Venkat Prabhu
-
క్రేజీ కాంబినేషన్
తమిళ హీరో విజయ్, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో సినిమా ఖరారైంది. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కల్పతి యస్. అఘోరం, యస్. గణేష్, యస్. సురేష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘బిగిల్’ చిత్రం తర్వాత విజయ్‌తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. పైగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ పేర్కొంది. కాగా విజయ్ ప్రస్తుతం ‘లియో’ సినిమా చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబరు 19న విడుదల కానుంది. -
స్పెషల్ సాంగ్ అని.. ఐటమ్ సాంగ్ చేశారు..!
సాక్షి, చెన్నై: దర్శకుడు బాలాజీ శక్తివేల్ వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా మనీషాయాదవ్ హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ డైరెక్టర్ అలా చెప్పి ఉండాల్సింది కాదు. నన్ను ఆయన మోసం చేశారని నటి మనీషాయాదవ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మధ్య చెన్నై-28 సీక్వెల్లో ఐటమ్ సాంగ్‌కు చిందులేసింది. సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభుపై ఆరోపణలు గుప్పించింది. ఆమె మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట్‌ప్రభు నన్ను మోసం చేశారు. చెన్నై-28 చిత్ర సీక్వెల్లో నాకు ఒక పాటతో పాటు చిత్రాన్ని మలు తిప్పే కీలక సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. ముందుగా స్వప్నసుందరి పాటను చిత్రీకరించారు. అదీ స్పెషల్ సాంగ్ అని చెప్పారు. తీరా చిత్రం విడుదలైన తర్వాత చూస్తే అది ఐటమ్ సాంగ్ అని తెలిసింది. అందరూ స్వప్నసుందరి అని పిలుస్తున్నారు. దర్శకుడు ఆ పాటను స్పెషల్ అని చెప్పి ఉండకూడదు. అలా నన్ను వెంకట్ ప్రభు మోసం చేశారు. ఐటమ్ సాంగ్ గర్ల్ అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అని ఒక ఇంటార్య్వూలో పేర్కొంది. ఈ అమ్మడు మొదట్లో త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనతో అసభ్య సంభాషణలు చెప్పించారని, గ్లామరస్‌గా చూపించారని ఈ అమ్మడు ఆ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌పై ఫైర్ అయ్యి కలకలం సృష్టించింది. ఆ సినిమాకు ఆమె దాదాపుగా దూరం అయ్యింది. అయినా సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయిన తరువాత ఎప్పుడో మోసం చేశారని ఇప్పుడు గగ్గోలు పెట్టడంలో ప్రయోజనం ఏముంటుందో మనీషాయాదవ్‌నే చెప్పాలి. -
చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే విళిత్తిరు
చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా విళిత్తిరు ఉంటుందని ఆ చిత్ర దర్శక నిర్మాత మీరా కదిరవన్ అంటున్నారు. ఈయన తన మిత్రుడితో కలిసి హాయ మరియం ఫిలిం హౌస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం విళిత్తిరు.కృష్ణ, విదార్థ్, దర్శకుడు వెంకట్‌ప్రభు కథానాయకులుగా నటించిన ఈ చిత్రం గురించి దర్శకుడు మీరా కదిరవన్ తెలుపుతూ ఇది ఒక రాత్రిలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు.చెన్నై మహానగరానికి రెండు కోణాలున్నాయన్నారు. అందులో ఒకటి పగటి వేళ మనం నిత్యం చూసేది అయితే, రెండోది రాత్రుళ్లు అందుకు భిన్నంగా అసాంఘిక సంఘటనల ముఖం అన్నారు.దాన్నే తమ చిత్రం చూపిస్తుందన్నారు. ఒక రాత్రి నలుగురు యువకుల జీవితాలను ఎలా మార్చేసిందన్నదే విళిత్తిరు చిత్రం అన్నారు.రాత్రివేళల్లో పోలీసుల పెట్రోల్ వాహనాల హోరును వింటుంటామని, ఆ వాహనాలకు విళిత్తిరు చిత్ర కథకు సంబంధం ఉంటుందన్నారు.అదేమిటన్నది ప్రేక్షకులు థియేటర్లలో చూసి విస్తుపోతారన్నారు.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మీరాకదిరవన్ వెల్లడించారు. -
రజనీకాంత్ కి నోటీసులు
ప్రపంచంలో ఏ చిత్రానికి ఒక రోజును కేటాయించలేదు. ఆ క్రెడిట్ కబాలికే దక్కింది. కబాలి చిత్ర విడుదల రోజు(జూలై 22)ను అభిమానులు ‘కబాలి డే’గా పేర్కొంటున్నారు. ఆ రోజున కొందరు చిత్ర షూటింగ్‌లను రద్దు చేసుకోవడం విశేషం. దర్శకుడు వెంకట్‌ప్రభు తన చిత్ర నిర్మాణ సంస్థ నిర్వాహకులకు కబాలి చిత్రం చూడడానికి జూలై 23న సెలవు ఇచ్చేశారు. కాగా జై, అంజలి జంటగా నటిస్తున్న బెలూన్ చిత్ర షూటింగ్‌ను కబాలి డే రోజున ఆ చిత్ర యూనిట్ రద్దు చేసుకుంది. అదే విధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆ రోజున సెలవు ప్రకటించడంతో పాటు, ఉద్యోగులకు కబాలి టిక్కెట్లను ఇచ్చి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుంచి పిల్లల వరకూ కబాలి చిత్రాన్ని విడుదలైన మొదటి ఆటనే చూడాలని కోరుకుంటున్నారంటే ఆ చిత్రం ఎంత సంచలనానికి కారణం అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కబాలి చిత్ర థియేటర్లలో టిక్కెట్ల విక్రయాలు చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి. రూ.500 నుంచి రూ.1500 వరకూ బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. థియేటర్ల యజమానులే రూ.500లకు విక్రయిస్తున్నారని కోర్టులో పిటిషన్ వేసినా ఫలితం లేకపోయింది. ఇలా కబాలిపై కొన్ని కేసులు కొట్టివేతకు గురైనా మరిన్ని కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తమిళసినిమా: కబాలి చిత్ర పండుగ ప్రపంచవ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రచారాలు అంబరాన్ని తాకడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో వీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కలైపులి ఎస్.ధాను నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కబాలి. పూజా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచే ఈ చిత్రంపై హైప్ మొదలైంది. కోట్లు ఖర్చు చేసినా రానంత ప్రచారం కబాలి చిత్రానికి దక్కింది. అందుకు ఏకైక కారణం స్టైల్ కింగ్ రజనీకాంత్ అన్నది చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. ఎందిరన్ చిత్రం తరువాత రజనీకాంత్‌కు సరైన విజయాలు లేవన్నది వాస్తవం. అయితే జయాపజయాలకు అతీతుడినని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నారు. రజనీ పడిలేచే తరంగం కాదు. ఎప్పుడూ ఎగసిపడే కెరటం లాంటి వారు. అందుకే భారతీయ సినీ నటుల్లో ఎవరికీ లేనంత క్రేజ్ ఆయన సొంతం. దుమ్ము రేపిన టీజర్ కబాలి చిత్ర టీజర్ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది. ఏ చిత్రానికి రానంత విశేష స్పందనను రాబట్టుకుంది. కబాలిడా అన్న ఒక్క డైలాగ్‌కే ఆయన అభిమానుల్లో ఉల్లాసం పొంగిపొరలింది. కబాలి కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు మరో రోజే ఆగాల్సిఉంది. వినూత్న ప్రచారం కబాలి చిత్రానికి కనీవిని ఎరుగని రీతిలో ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ గోడల మీద, భారీ కటౌట్‌తోనే పోస్టర్లను చూసిన ప్రజలు కబాలి పోస్టర్లను దేశ, విదేశీ విమానాలపై మెరవడంపై ఆశ్చర్యపోయారు. ఇక పెద్ద పద్ద కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సంస్థలు చిత్ర ప్రచారంలో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. తొలిసారిగా మళాయ్ భాషలో వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్న కబాలి మరో చరిత్రను నమోదు చేసుకుంది. మళాయ్ భాషలో అనువాదం అయిన తొలి చిత్రంగా రికార్డుకెక్కింది. తమిళ్, తెలుగు, హిందీ లాంటి భారతీయ భాషలతో పాటు మళాయ్ లో డబ్ అవుతున్న తొలి సినిమా కబాలి. వివాదంలో కబాలి పాట కబాలి చిత్రానికి థియేటర్లలో అధిక ధరలకు టిక్కెట్ల అమ్మకాలపై కలుగజేసుకోలేమని చెన్నై హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మధురై కోర్టులో కబాలి చిత్రంపై మరో పిటీషన్ దాఖలైంది. ఆ ప్రాంతానికి చెందిన మహారాజన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో కబాలి చిత్రంలోని ఒక పాటలో ఉలగం ఒరువనుక్కా అనే పదాలను తొలగించాలని పేర్కొన్నారు. ఆ పదాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్, జరనల్ కేటగిరికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ అందులో పేర్కొన్నారు. రజనీకి నోటీసులు కోవైకి చెందిన శుక్రా ఫిలింస్ భాగస్వామి మహాప్రభు చెన్నై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం 2014లో విడుదలయ్యిందన్నారు. ఆ చిత్ర కోవై డిస్ట్రిబ్యూషన్ హక్కులను తాము పొందామని తెలిపారు. ఆ చిత్రానికి తమకు భారీ నష్టం ఏర్పడిందన్నారు. అందుకు కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.ధాను,నటుడు రజనీకాంత్ రూ.89 లక్ష లు తమకు తిరిగి చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్లుకోలేదన్నారు. కబాలి చిత్రాన్ని ధాను విడుదల చేస్తున్నారని, తనకు రావలసిన రూ.89లక్షలు తిరిగి చెల్లించేవరకూ కబాలి విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన న్యాయమూర్తి సుందరేశ్ నిర్మాత, రజనీకాంత్ సహా ఏడుగురికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. -
లక్కీచాన్స్ కొట్టిన విజయలక్ష్మి
ఒక్కోసారి ఊహించనివి జరిగి థ్రిల్ చేస్తాయి. నటి విజయలక్ష్మీ విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఇటీవలే నిర్మాతగా మారారు. అంతేకాదు ఆ దర్శకుడు ఫిరోజ్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. వివాహానంతరం తన నటన కొనసాగుతుందని ప్రకటించిన విజయలక్ష్మికి వెంటనే నటించే అవకాశం తలుపు తట్టింది. ఇది సంతోషకరమైన విషయం అనుకుంటే మరో థ్రిలింగ్ అంశం ఆమె హీరోయిన్గా పరిచయం అయిన చిత్రానికి సీక్వెల్లోనే నటించే అవకాశం రావడం. నటి విజయలక్ష్మి దర్శకుడు అగస్థ్యిన్ కూతురన్న విషయం తెలిసిందే. ఈమె ఎన్నై-28 చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ రూపొందించడానికి వెంకట్‌ప్రభు సిద్ధమయ్యారు. ఇందులోనూ చెన్నై-28లో నటించిన జయ్, శివ, విజయలక్ష్మి, ప్రేమ్‌జీ, నితిన్ సత్యలను నటింపజేయాలని ఆయన భావించారు. ఇప్పుడు వారితోనే చెన్నై-28 రెండవ భాగాన్ని తెరకెక్కించనున్నారు. చెన్నై-28 చిత్రం 2007లో విడుదలైంది.తొమ్మిదేళ్ల తరువాత దానికి సీక్వెల్ తెరకెక్కనుండడం గమనార్హం. ఈ చిత్రం మే నెల చివరి వారంలో సెట్‌పైకి రానుందని సమాచారం. -
మాస్లో ప్రణీత
మాస్ చిత్రం గురించి ప్రస్తుతం ప్రచారం హాట్ హాట్‌గా జరుగుతోంది. కారణం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరుగా ఎంపికైన నటి ఎమిజాక్సన్ చిత్రం నుంచి వైదొలగడం, ఊహించని విధంగా ఆ అవకాశాన్ని నటి ప్రణీత దక్కించుకోవడం లాంటి ఆసక్తికరమైన అంశాలే. అంజాన్ చిత్రం తరువాత నటుడు సూర్య నటిస్తున్న చిత్రం మాస్. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నయనతార, ఎమిజాక్సన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అరుుతే తాజాగా ఈ చిత్రం నుంచి ఎమిజాక్సన్ వైదొలిగారు. ఇందుకు చిన్న కారణాలు ప్రచారంలో ఉన్నాయి. నటి నయనతార, ఎమిజాక్సన్తో కలిసి నటించనని చెప్పడంతో ఎమిజాక్సన్ను చిత్రం నుంచి తొలగించి ఆ పాత్రలో ప్రణీతను ఎంపిక చేసినట్లు , నయనతారకు అధిక ప్రాముఖ్యతనిచ్చి తన పాత్రను డమ్మీ చేసినందువల్లనే ఎమిజాక్సన్ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారంలో వుంది. ఏదేమైనా మాస్ చిత్రం షూటింగ్ నిరాటంకంగా సాగుతోంది. మరో విషయం ఏమిటంటే కార్తీ హీరోగా బిరియాని చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఆయన సోదరుడు సూర్యతో మాస్ చేస్తున్నారు. అదే విధంగా శకుని చిత్రంలో కార్తీతో రొమాన్స్ చేసిన నటి ప్రణీత ఇప్పుడు మాస్ సూర్యతో జోడీ కడుతున్నారు. దీన్ని సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.