చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే విళిత్తిరు
చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా విళిత్తిరు ఉంటుందని ఆ చిత్ర దర్శక నిర్మాత మీరా కదిరవన్ అంటున్నారు. ఈయన తన మిత్రుడితో కలిసి హాయ మరియం ఫిలిం హౌస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం విళిత్తిరు.కృష్ణ, విదార్థ్, దర్శకుడు వెంకట్‌ప్రభు కథానాయకులుగా నటించిన ఈ చిత్రం గురించి దర్శకుడు మీరా కదిరవన్ తెలుపుతూ ఇది ఒక రాత్రిలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు.చెన్నై మహానగరానికి రెండు కోణాలున్నాయన్నారు.
అందులో ఒకటి పగటి వేళ మనం నిత్యం చూసేది అయితే, రెండోది రాత్రుళ్లు అందుకు భిన్నంగా అసాంఘిక సంఘటనల ముఖం అన్నారు.దాన్నే తమ చిత్రం చూపిస్తుందన్నారు. ఒక రాత్రి నలుగురు యువకుల జీవితాలను ఎలా మార్చేసిందన్నదే విళిత్తిరు చిత్రం అన్నారు.రాత్రివేళల్లో పోలీసుల పెట్రోల్ వాహనాల హోరును వింటుంటామని, ఆ వాహనాలకు విళిత్తిరు చిత్ర కథకు సంబంధం ఉంటుందన్నారు.అదేమిటన్నది ప్రేక్షకులు థియేటర్లలో చూసి విస్తుపోతారన్నారు.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మీరాకదిరవన్ వెల్లడించారు.