మాస్‌లో ప్రణీత
మాస్ చిత్రం గురించి ప్రస్తుతం ప్రచారం హాట్ హాట్‌గా జరుగుతోంది. కారణం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరుగా ఎంపికైన నటి ఎమిజాక్సన్ చిత్రం నుంచి వైదొలగడం, ఊహించని విధంగా ఆ అవకాశాన్ని నటి ప్రణీత దక్కించుకోవడం లాంటి ఆసక్తికరమైన అంశాలే. అంజాన్ చిత్రం తరువాత నటుడు సూర్య నటిస్తున్న చిత్రం మాస్. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నయనతార, ఎమిజాక్సన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అరుుతే తాజాగా ఈ చిత్రం నుంచి ఎమిజాక్సన్ వైదొలిగారు.
ఇందుకు చిన్న కారణాలు ప్రచారంలో ఉన్నాయి. నటి నయనతార, ఎమిజాక్సన్‌తో కలిసి నటించనని చెప్పడంతో ఎమిజాక్సన్‌ను చిత్రం నుంచి తొలగించి ఆ పాత్రలో ప్రణీతను ఎంపిక చేసినట్లు , నయనతారకు అధిక ప్రాముఖ్యతనిచ్చి తన పాత్రను డమ్మీ చేసినందువల్లనే ఎమిజాక్సన్ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారంలో వుంది. ఏదేమైనా మాస్ చిత్రం షూటింగ్ నిరాటంకంగా సాగుతోంది. మరో విషయం ఏమిటంటే కార్తీ హీరోగా బిరియాని చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఆయన సోదరుడు సూర్యతో మాస్ చేస్తున్నారు. అదే విధంగా శకుని చిత్రంలో కార్తీతో రొమాన్స్ చేసిన నటి ప్రణీత ఇప్పుడు మాస్ సూర్యతో జోడీ కడుతున్నారు. దీన్ని సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.