హేయ్‌ మాగా..! 'దిల్‌ రూబా' కేసీపీడీ సాంగ్‌ వచ్చేసింది | KCPD Lyrical Video Out From Dilruba Movie | Sakshi
Sakshi News home page

హేయ్‌ మాగా..! 'దిల్‌ రూబా' కేసీపీడీ సాంగ్‌ వచ్చేసింది

Published Tue, Mar 11 2025 10:28 AM | Last Updated on Tue, Mar 11 2025 11:05 AM

KCPD Lyrical Video Out From Dilruba Movie

 కిరణ్‌ అబ్బవరం, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం ‘దిల్‌ రూబా’ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. విశ్వ కరుణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, రాకేశ్‌ రెడ్డి, సారెగమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది.  ‘దిల్‌ రూబా’ ప్యూర్‌ లవ్‌ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు.

ఈ చిత్రంలో ప్రేమకథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశామని దర్శకుడు విశ్వ కరుణ్‌ చెప్పారు. ఈ కథ గురించి ఆయన రెండు మాటల్లో ఇలా చెప్పారు 'ఓ రకంగా చెప్పాలంటే క్యారెక్టర్‌ డ్రివెన్‌ ఫిల్మ్‌ ఇది. ఊరికే ‘సారీ, థ్యాంక్స్‌’లు చెప్పటానికి హీరో ఇష్టపడడు. ఓ సందర్భంలో హీరో ‘సారీ’ చెప్పకపోవడం వల్ల అతని చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఇబ్బందులపాలవుతారు. ఈ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నదే కథ.' అంటూ హింట్‌ ఇచ్చారు.

అలాగే ఊరికే ఎవరికీ కోపం రాకూడదని,... కోపం వస్తే దాని వెనకాల సహేతుకమైన కారణం ఉండాలని హీరో భావిస్తాడని ఆయన అన్నారు. ఈ అంశం కూడా సినిమాలో ఉందని తెలిపారు. ‘క’ సినిమా విజయం సాధించడంతో, ‘దిల్‌ రుబా’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. అందుకే  కథలో కొన్ని మార్పులు చేశామని చెప్పారు. కానీ కథలోని ఆత్మ ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement